← Back to బ · Booklets 31–40 (digitized file 4)

బ్రహ్మదర్శనము brahmadarśanamu

Original — తెలుగు
  1. బ్రహ్మ ప్రకాశకం - (బ్రహ్మ సాక్షాత్కారము).

  2. బ్రహ్మసాక్షాత్కారము పొందుట చాల కష్టము - ఎందుచేత ననగా –

“నాహం ప్రకాశస్సర్వస్య యోగమాయాసమావృతః |

మూఢో(అ)యం నా భిజానాతి లోకో మామజమవ్యయం ||“. (శ్రీమద్భగవద్గీత - 7 - 25)

(ప్రతి వస్తువులోను భగవంతుడున్నాడు - ప్రకృతి యొక్క అండచేత - యోగమాయచేత - కప్పబడియున్నాడు - అందుచేత అందఱికి కనబడడు - ఈ సంగతి మూఢులైన లోకులు తెలియలేరు).

స్వేనరూపేణ సర్వస్య ప్రకటో నభవామ్యహం |

- - - కింతు కేషాం చి దే వైవం మద్భక్తానాం భవామ్యహం |.

నా స్వస్వరూపముతో నేను అందఱికి కానరాను - ఎందుచేతననగా –

“గుణానాం ఘటనం యోగః |

సైవ మాయా తయా హ్యహం |

సంభన్నో లోకదృష్ట్యా ద్ధేత్యర్థో భాష్య కృతాం మతః |“.

(త్రిగుణములలో కూటమి యోగము - అదియే మాయ. ఆ మాయచేతనేను కప్పబడియున్నాను - అందుచేత నా భక్తులు కానివారికి నేను కనబడను - నా భక్తులు కానివారు, అజ్ఞానులు నన్ను మనుష్యమాతృడుగనే తలంచెదరు. వారి జ్ఞానము నా మాయచేత కప్పబడియుండును - అందుచేత వారు నన్ను - నా స్వస్వరూపమును - చూడలేరు - లోకములో ప్రతివస్తువులోను భగవంతును అంశ, దానితో కలిసి, దానిని పూర్తిగా ఆవరించుకొని, ప్రకృతి, లేక, దాని పరిణామవస్తువులు - ఉన్నవి. ప్రతివస్తువులోను భగవంతుడు పూర్తిగా వ్యాపించియున్నాడు - అందుచేత, ప్రతి వస్తువులోను భగవంతుడుండి పూర్తిగా వ్యాపించియుండుటచేత దానిలోని భగవదంశ సాధారణ జనులకు కానరాదు, భక్తులకు కాన వచ్చును –

“ఏష సర్వేషు భూతేషు గూఢాత్మ్నా న ప్రకాశతే |

దృశ్యతే త్వగ్ర్యయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభిః”

(ఈ పరబ్రహ్మ సమస్త భూతములందు దాగియుండు రూపముతో నుండి, అట్లున్నట్లు పైకి కనబడడు - కట్టెలో అగ్ని యున్నట్లు దర్భకొన ఎంత సూక్ష్మముగానుండునో అంత సూక్ష్మమైన బుద్ధిగలవారు, సూక్ష్మాతి సూక్ష్మమైన వస్తువులను చూడగలశక్తిగలవారు. అట్టి భగవంతుని చూచెదరు - చూడగలుగుచున్నారు)

” అన్నమవనియందు అమృతంబు గోవులందు, వహ్ని సమిధలందు - యోగవశత నుండునో జ|నగుణు నిన్నుగాంతురాత్మవిదులు “.

(శ్రీమదాంధ్రమహాభాగవతము -)

(ప్రాణులకు కావలసిన సమస్తమైన ఆహారము భూమిలోనే యున్నది - భూమినుండి యే పండుచున్నది - భూమి మట్టి అయినను మిగిలిన నాలుగు భూతములతో కలిసి సస్యములు మొలచి, వృద్ధి పొంది పండునట్లు చేవ్సి ప్రాణులకందిచ్చును - అందుచేత అన్నము - అన్ని విధములైన ఆహారము - భూమిలోనున్నదని (పైకి కనబడకపోయినను) గడ్డి తిని, నీరు త్రాగు గోవులు పాలిచ్చును - ఆ నీరు ఆహారమే యోగవశమున -పంచభూతములు కలియుటవలన - పాలుగా మారును. అట్లే కట్టెలలో పైకి కనబడకుండ అగ్ని యున్నది. అట్లే నిర్గుణుడువైన - సత్వరజస్తమోగుణముల కతీతుడవైన, అందుచేత కంటికి కనబడనివాడవైన, నిన్ను, ఆత్మవిదులు -ఆత్మయాదాత్మ్యము -బ్రహ్మయాదాత్మ్యము తెలిసినవారు - చూతురు).

“సీ. అఖిలభూతములందు నాత్మరూపంబున ఈశుండు హరియుండు నెల్లప్రొద్దు

బుద్ధ్యాదిలక్షణంబుల గానబడును ---

--- “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 2 - 36)

  1. శ్రీకృష్ణుడు తన విశ్వరూపమును అర్జునునకు చూపించెను - ప్రపంచమే - అందులోనున్న సమస్త వస్తువులు కలిసి ఒకేరూపముగా - ఒకే వస్తువుగానున్నట్లు - కనపఱచెను –

“సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ|

దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శన కాంక్షిణః |

నాహం వేదైర్న తపసా న దానేన న చేజ్యయా |

శక్యం ఏవంవిధో ద్రష్టుం దృష్టవానసిమాం యథా |

భక్త్యా త్వనన్యయా శక్య అహమేవంవిధోఅర్జున |

జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప |

మత్కర్మకృత్ మత్పరమః మద్భక్తః సంగ వర్జితః |

నిర్వైరః సర్వభూతేషు యః సమామేతి పాండవ ||. (శ్రీమద్భగవద్గీత - 11 - 52 to 55)

(నీ విప్పుడు చూచిన నా విశ్వరూపము దేవతలకు కూడా చూడ శక్యముకానిది. దేవతులు ఈ నా రూపమును చూచుటకు ఎంతయో కోరిక కలవారైనను ఇప్పటివరకెన్నడును చూచియుండలేదు – వేదాధ్యయనము వలనకాని, తపస్సుచేతగాని, దానముచేసికాని, యజ్ఞముచేతగాని నివ్విప్పుడు చూసిన యీ నారూపము చూచుటకు, నన్ను తెలుసుకొనుటకుగాని శక్యముకాదు - అనన్య భక్తి చేతనే నన్నిట్లు చూచుటకు శక్యమగును - ఈ విశ్వరూపం సగుణరూపము - సత్వరజస్తమోగుణములచేత కలిగినరూపము - నిరాకారుడైన పరబ్రహ్మకు త్రిగుణములతో - ప్రకృతితో - సంపర్కము కలుగుటచేతనే ఆకారము కలుగును).

  1. నారదుడు శ్రీకృష్ణుని చూచి నీరూపమును దర్శించితిని అని సంతోషించగా శ్రీకృష్ణభగవానుడిట్లనెను - “నీవు చూచుచున్నది నారూపముకాదు - నాకు రూపము లేదు - నా మాయయైన ప్రకృతిని ప్రపంచములోని వస్తువులు అన్నింటిగా - అన్నిరూపములుగా - అగుటకు సృష్టించితిని. అట్లే ప్రకృతి నాకెప్పుడే రూపము కావలెననగా ఆ రూపము తయారుచేసి యిచ్చును - ఇప్పుడు నీవు చూచుచున్నది అట్టిరూపమే. అవతారములలోని రూపములన్నియు నిట్టివే - సాకారములే, సగుణములే, సవిశేషములే” - అని చెప్పెను. మనముపాసనచేయు పరబ్రహ్మరూపమే - ఆకారముతోను, విశేషములతోను కలిగియున్నదే - భక్తులు చూడగలిగినది యీ రూపమే).
Transliteration
  1. brahma prakāśakaṃ - (brahma sākṣātkāramu).

  2. brahmasākṣātkāramu poṃduṭa cāla kaṣṭamu - eṃducēta nanagā –

“nāhaṃ prakāśassarvasya yōgamāyāsamāvṛtaḥ |

mūḍhō(a)yaṃ nā bhijānāti lōkō māmajamavyayaṃ ||“. (śrīmadbhagavadgīta - 7 - 25)

(prati vastuvulōnu bhagavaṃtuḍunnāḍu - prakṛti yokka aṃḍacēta - yōgamāyacēta - kappabaḍiyunnāḍu - aṃducēta aṃdaṟiki kanabaḍaḍu - ī saṃgati mūḍhulaina lōkulu teliyalēru).

svēnarūpēṇa sarvasya prakaṭō nabhavāmyahaṃ |

- - - kiṃtu kēṣāṃ ci dē vaivaṃ madbhaktānāṃ bhavāmyahaṃ |.

nā svasvarūpamutō nēnu aṃdaṟiki kānarānu - eṃducētananagā –

“guṇānāṃ ghaṭanaṃ yōgaḥ |

saiva māyā tayā hyahaṃ |

saṃbhannō lōkadṛṣṭyā ddhētyarthō bhāṣya kṛtāṃ mataḥ |“.

(triguṇamulalō kūṭami yōgamu - adiyē māya. ā māyacētanēnu kappabaḍiyunnānu - aṃducēta nā bhaktulu kānivāriki nēnu kanabaḍanu - nā bhaktulu kānivāru, ajñānulu nannu manuṣyamātṛḍuganē talaṃcedaru. vāri jñānamu nā māyacēta kappabaḍiyuṃḍunu - aṃducēta vāru nannu - nā svasvarūpamunu - cūḍalēru - lōkamulō prativastuvulōnu bhagavaṃtunu aṃśa, dānitō kalisi, dānini pūrtigā āvariṃcukoni, prakṛti, lēka, dāni pariṇāmavastuvulu - unnavi. prativastuvulōnu bhagavaṃtuḍu pūrtigā vyāpiṃciyunnāḍu - aṃducēta, prati vastuvulōnu bhagavaṃtuḍuṃḍi pūrtigā vyāpiṃciyuṃḍuṭacēta dānilōni bhagavadaṃśa sādhāraṇa janulaku kānarādu, bhaktulaku kāna vaccunu –

“ēṣa sarvēṣu bhūtēṣu gūḍhātmnā na prakāśatē |

dṛśyatē tvagryayā buddhyā sūkṣmayā sūkṣmadarśibhiḥ”

(ī parabrahma samasta bhūtamulaṃdu dāgiyuṃḍu rūpamutō nuṃḍi, aṭlunnaṭlu paiki kanabaḍaḍu - kaṭṭelō agni yunnaṭlu darbhakona eṃta sūkṣmamugānuṃḍunō aṃta sūkṣmamaina buddhigalavāru, sūkṣmāti sūkṣmamaina vastuvulanu cūḍagalaśaktigalavāru. aṭṭi bhagavaṃtuni cūcedaru - cūḍagalugucunnāru)

” annamavaniyaṃdu amṛtaṃbu gōvulaṃdu, vahni samidhalaṃdu - yōgavaśata nuṃḍunō ja|naguṇu ninnugāṃturātmavidulu “.

(śrīmadāṃdhramahābhāgavatamu -)

(prāṇulaku kāvalasina samastamaina āhāramu bhūmilōnē yunnadi - bhūminuṃḍi yē paṃḍucunnadi - bhūmi maṭṭi ayinanu migilina nālugu bhūtamulatō kalisi sasyamulu molaci, vṛddhi poṃdi paṃḍunaṭlu cēvsi prāṇulakaṃdiccunu - aṃducēta annamu - anni vidhamulaina āhāramu - bhūmilōnunnadani (paiki kanabaḍakapōyinanu) gaḍḍi tini, nīru trāgu gōvulu pāliccunu - ā nīru āhāramē yōgavaśamuna -paṃcabhūtamulu kaliyuṭavalana - pālugā mārunu. aṭlē kaṭṭelalō paiki kanabaḍakuṃḍa agni yunnadi. aṭlē nirguṇuḍuvaina - satvarajastamōguṇamula katītuḍavaina, aṃducēta kaṃṭiki kanabaḍanivāḍavaina, ninnu, ātmavidulu -ātmayādātmyamu -brahmayādātmyamu telisinavāru - cūturu).

“sī. akhilabhūtamulaṃdu nātmarūpaṃbuna īśuṃḍu hariyuṃḍu nellaproddu

buddhyādilakṣaṇaṃbula gānabaḍunu ---

--- “. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 2 - 36)

  1. śrīkṛṣṇuḍu tana viśvarūpamunu arjununaku cūpiṃcenu - prapaṃcamē - aṃdulōnunna samasta vastuvulu kalisi okērūpamugā - okē vastuvugānunnaṭlu - kanapaṟacenu –

“sudurdarśamidaṃ rūpaṃ dṛṣṭavānasi yanmama|

dēvā apyasya rūpasya nityaṃ darśana kāṃkṣiṇaḥ |

nāhaṃ vēdairna tapasā na dānēna na cējyayā |

śakyaṃ ēvaṃvidhō draṣṭuṃ dṛṣṭavānasimāṃ yathā |

bhaktyā tvananyayā śakya ahamēvaṃvidhōarjuna |

jñātuṃ draṣṭuṃ ca tatvēna pravēṣṭuṃ ca paraṃtapa |

matkarmakṛt matparamaḥ madbhaktaḥ saṃga varjitaḥ |

nirvairaḥ sarvabhūtēṣu yaḥ samāmēti pāṃḍava ||. (śrīmadbhagavadgīta - 11 - 52 to 55)

(nī vippuḍu cūcina nā viśvarūpamu dēvatalaku kūḍā cūḍa śakyamukānidi. dēvatulu ī nā rūpamunu cūcuṭaku eṃtayō kōrika kalavārainanu ippaṭivarakennaḍunu cūciyuṃḍalēdu – vēdādhyayanamu valanakāni, tapassucētagāni, dānamucēsikāni, yajñamucētagāni nivvippuḍu cūsina yī nārūpamu cūcuṭaku, nannu telusukonuṭakugāni śakyamukādu - ananya bhakti cētanē nanniṭlu cūcuṭaku śakyamagunu - ī viśvarūpaṃ saguṇarūpamu - satvarajastamōguṇamulacēta kaliginarūpamu - nirākāruḍaina parabrahmaku triguṇamulatō - prakṛtitō - saṃparkamu kaluguṭacētanē ākāramu kalugunu).

  1. nāraduḍu śrīkṛṣṇuni cūci nīrūpamunu darśiṃcitini ani saṃtōṣiṃcagā śrīkṛṣṇabhagavānuḍiṭlanenu - “nīvu cūcucunnadi nārūpamukādu - nāku rūpamu lēdu - nā māyayaina prakṛtini prapaṃcamulōni vastuvulu anniṃṭigā - annirūpamulugā - aguṭaku sṛṣṭiṃcitini. aṭlē prakṛti nākeppuḍē rūpamu kāvalenanagā ā rūpamu tayārucēsi yiccunu - ippuḍu nīvu cūcucunnadi aṭṭirūpamē. avatāramulalōni rūpamulanniyu niṭṭivē - sākāramulē, saguṇamulē, saviśēṣamulē” - ani ceppenu. manamupāsanacēyu parabrahmarūpamē - ākāramutōnu, viśēṣamulatōnu kaligiyunnadē - bhaktulu cūḍagaliginadi yī rūpamē).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.