← Back to బ · Booklets 31–40 (digitized file 4)

బ్రహ్మధర్మః brahmadharmaḥ

Original — తెలుగు
  1. సర్వాధారత్వానం దత్వాదిః బ్రహ్మధర్మః.

(అన్నింటికి ఆధారమై యుండుట మొదలగునవి, ఆనందత్వము మొదలగునవి బ్రహ్మధర్మము).

  1. “బ్రహ్మ స్వరూప ప్రతిపాదిన పరాసు శ్రుతిషు ఆనంద రూపత్వం, విజ్ఞాన ఘనత్వం, సర్వగతత్వం, సర్వాత్మకత్వం ఇత్యేవం జాతీయకాః బ్రహ్మణో ధర్మాఃకృచిత్కేచిత్ శ్రూయంతే ఆనందాదయః ప్రథానస్య బ్రహ్మణో ధర్మాః సర్వే సర్వత్ర ప్రతిపత్తవ్యాః కస్మాత్? - సర్వాబాధాదేవ సర్వత్ర తదేవైకం ప్రథానం విశేష్యం బ్రహ్మన భిద్యతే”.

“ఆనందత్వ, సత్యత్వ, జ్ఞానత్వాదయః సామాన్యేన బ్రహ్మణి కల్పితాధర్మాః - తేషాం సర్వశాఖాసు ఉపసంహారోనామ తద్వాచకానందాది పదానాం ఏకవాక్యతయోచ్చాణం ఆనందః సత్యం జ్ఞానం అనంతంబ్రహ్మ శుద్ధమద్వయమాత్మా ఇతి. తాని చ సమానాధి కరణాని పదాని విరుద్ధధర్మ త్యాగేన సర్వాధిష్ఠానభూతం ఏకాం అఖండ వ్యక్తింలక్షయంతి - -”ఆనందో బ్రహ్మ” ఇత్యుక్తే దుఃఖత్వాల్పత్వ భ్రాంతినిరాసే అప్య సత్వ జడత్వాదిభ్రమో భవేత్. అతః తన్నిరాసార్థం సత్యజ్ఞానాదిపదాని ప్రయోక్తవ్యాని. సచ్చిదానందాత్మకం సర్వధర్మశూన్యం అద్వయమవికల్పం బ్రహ్మహమితి విశేషదర్శినే సర్వభ్రమనిరాసాత్“.

(బ్రహ్మ స్వరూపమును ప్రతిపాదించు శ్రుతులలో ఆనందరూపమనిన్నీ, విజ్ఞానఘనమనిన్నీ, సర్వగతుడనిన్నీ (అన్నింటిలోను ప్రవేశించియుండువాడనిన్నీ) సర్వాత్ముడనిన్నీ (అన్నింటికి ఆత్మ అయినవాడనిన్నీ) ఈ మొదలగునవి బ్రహ్మధర్మములని అక్కడక్కడ కొన్ని వినబడుచున్నవి (చెప్పబడినవి). ఆనందము మొదలగు ధర్మములు బ్రహ్మయొక్క ముఖ్యమైన ధర్మములు అని అన్ని చోట్ల శ్రుతులు చెప్పుచున్నవి - ఎందుచేతననగా, అన్నింటిలోనూ ఈ విషయము గుఱించి భేదములేదుకనుక. అన్నింటిలోను అది ఒక్కటే ప్రథానమైన విశేషముగా చెప్పబడినది - బ్రహ్మ గుఱించి యిట్లు చెప్పుటలో భేదములేదు కనుక).

(సత్యజ్ఞానానందములు బ్రహ్మమందు సాధరణముగా కల్పితమైన ధర్మములు. వాట్లలో అన్ని శాఖలందు ఉపసంహారము చేయునపుడు బ్రహ్మవాచకములైన ఆనందము మొదలగు పదములు ఒకే వాక్యముక్రింద ఉచ్చరించబడుచున్నది. ఎట్లంటే - “ఆనందం సత్యజ్ఞానమనంతం బ్రహ్మ” (బ్రహ్మ ఆనందము, సత్యము. జ్ఞానము అనంతము) అనిన్నీ, “శుద్ధమద్వయమాత్మా” (ఆత్మ అనగా బ్రహ్మ శుద్ధమనిన్నీ, అద్వయమనిన్నీ - ఇవి సమానాదికరణ పదములు. వాట్లలోని విరుద్ధ ధర్మములను విడిచిపెట్టి, అన్నింటికీ అధిష్ఠానభూతమైన ఒకే వస్తువు గుఱించి లక్ష్యముచేసి చెప్పునవి. “ఆనందో బ్రహ్మ” (ఆనందమే బ్రహ్మ) బ్రహ్మ ఆనందరూపుడు) అని చెప్పుటవలన దుఃఖత్వము, అల్పత్వము, భ్రాంతిలేవని చెప్పినంతమాత్రమున అసత్యము, జడత్వము, మొదలగు భ్రమ కలుగవచ్చును అని - అనగా, అసత్యము, జడత్వము మొదలగునవి లేనిదే బ్రహ్మయని చెప్పుటకే సత్యం, జ్ఞానం మొదలగు పదములు వాడుక చేయబడినవి. సచ్చిదానందాత్మక మైననవి, ఏవిధముగు ధర్మములు లేనివి, అద్వయము, అవికల్పము, అయిన బ్రహ్మమే నేను అను భావము కలిగియుండుటవలన అన్ని విధములైన భ్రమలు తీరిపోవునుకనుక -).

Transliteration
  1. sarvādhāratvānaṃ datvādiḥ brahmadharmaḥ.

(anniṃṭiki ādhāramai yuṃḍuṭa modalagunavi, ānaṃdatvamu modalagunavi brahmadharmamu).

  1. “brahma svarūpa pratipādina parāsu śrutiṣu ānaṃda rūpatvaṃ, vijñāna ghanatvaṃ, sarvagatatvaṃ, sarvātmakatvaṃ ityēvaṃ jātīyakāḥ brahmaṇō dharmāḥkṛcitkēcit śrūyaṃtē ānaṃdādayaḥ prathānasya brahmaṇō dharmāḥ sarvē sarvatra pratipattavyāḥ kasmāt? - sarvābādhādēva sarvatra tadēvaikaṃ prathānaṃ viśēṣyaṃ brahmana bhidyatē”.

“ānaṃdatva, satyatva, jñānatvādayaḥ sāmānyēna brahmaṇi kalpitādharmāḥ - tēṣāṃ sarvaśākhāsu upasaṃhārōnāma tadvācakānaṃdādi padānāṃ ēkavākyatayōccāṇaṃ ānaṃdaḥ satyaṃ jñānaṃ anaṃtaṃbrahma śuddhamadvayamātmā iti. tāni ca samānādhi karaṇāni padāni viruddhadharma tyāgēna sarvādhiṣṭhānabhūtaṃ ēkāṃ akhaṃḍa vyaktiṃlakṣayaṃti - -”ānaṃdō brahma” ityuktē duḥkhatvālpatva bhrāṃtinirāsē apya satva jaḍatvādibhramō bhavēt. ataḥ tannirāsārthaṃ satyajñānādipadāni prayōktavyāni. saccidānaṃdātmakaṃ sarvadharmaśūnyaṃ advayamavikalpaṃ brahmahamiti viśēṣadarśinē sarvabhramanirāsāt”.

(brahma svarūpamunu pratipādiṃcu śrutulalō ānaṃdarūpamaninnī, vijñānaghanamaninnī, sarvagatuḍaninnī (anniṃṭilōnu pravēśiṃciyuṃḍuvāḍaninnī) sarvātmuḍaninnī (anniṃṭiki ātma ayinavāḍaninnī) ī modalagunavi brahmadharmamulani akkaḍakkaḍa konni vinabaḍucunnavi (ceppabaḍinavi). ānaṃdamu modalagu dharmamulu brahmayokka mukhyamaina dharmamulu ani anni cōṭla śrutulu ceppucunnavi - eṃducētananagā, anniṃṭilōnū ī viṣayamu guṟiṃci bhēdamulēdukanuka. anniṃṭilōnu adi okkaṭē prathānamaina viśēṣamugā ceppabaḍinadi - brahma guṟiṃci yiṭlu ceppuṭalō bhēdamulēdu kanuka).

(satyajñānānaṃdamulu brahmamaṃdu sādharaṇamugā kalpitamaina dharmamulu. vāṭlalō anni śākhalaṃdu upasaṃhāramu cēyunapuḍu brahmavācakamulaina ānaṃdamu modalagu padamulu okē vākyamukriṃda uccariṃcabaḍucunnadi. eṭlaṃṭē - “ānaṃdaṃ satyajñānamanaṃtaṃ brahma” (brahma ānaṃdamu, satyamu. jñānamu anaṃtamu) aninnī, “śuddhamadvayamātmā” (ātma anagā brahma śuddhamaninnī, advayamaninnī - ivi samānādikaraṇa padamulu. vāṭlalōni viruddha dharmamulanu viḍicipeṭṭi, anniṃṭikī adhiṣṭhānabhūtamaina okē vastuvu guṟiṃci lakṣyamucēsi ceppunavi. “ānaṃdō brahma” (ānaṃdamē brahma) brahma ānaṃdarūpuḍu) ani ceppuṭavalana duḥkhatvamu, alpatvamu, bhrāṃtilēvani ceppinaṃtamātramuna asatyamu, jaḍatvamu, modalagu bhrama kalugavaccunu ani - anagā, asatyamu, jaḍatvamu modalagunavi lēnidē brahmayani ceppuṭakē satyaṃ, jñānaṃ modalagu padamulu vāḍuka cēyabaḍinavi. saccidānaṃdātmaka mainanavi, ēvidhamugu dharmamulu lēnivi, advayamu, avikalpamu, ayina brahmamē nēnu anu bhāvamu kaligiyuṃḍuṭavalana anni vidhamulaina bhramalu tīripōvunukanuka -).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.