“శ్లో.|| పరిపూర్ణమనాద్యంతం అప్రమేయ మవిక్రియం |
సద్ఘనం, చిద్ఘనం,నిత్యం ఆనందఘనమవ్యయం |
ప్రత్యగేకరసం పూర్ణం, అనంతం సర్వ్తోముఖం |
అహేయమనుపాదేయం అనాదేయం అనాశ్రయం |
నిర్గుణం, నిష్క్రియం, సూక్ష్మం, నిర్వికల్పం నిరంజనం |
నిరూప్య స్వరూపం యన్మనోవాచామగోచరం |
సత్ సమృద్ధం, స్వతస్సిద్ధం శుద్ధ బుద్ధ మనీశ్వరం |
ఏకమేవా ద్వయం బ్రహ్మనేహ నానాస్తి కించన ||“. (అధ్యాత్మోనిషత్)
(బ్రహ్మ అనునది ఒకటేయున్నది. అదితప్ప మఱియొకవస్తువు సృష్టిలో లేనేలేదు. సృష్టి అంతయు, సృష్టిలోనున్న వస్తువులన్నియు బ్రహ్మమే - బ్రహ్మ రూపములే - అందుచేత బ్రహ్మ అద్వయుడు - తనుగాక రెండవ వస్తువేదియు లేనివాడు. ఎందుచేతననగా - బ్రహ్మ పరిపూర్ణుడు (ప్రపంచమంతటిలోను - లోన, పైన - పూర్తిగా వ్యాపించి నిండియున్నవాడు); ఆద్యంతములు (జననమరణములు) లేనివాడు, అప్రమేయుడు (ఇంతటివాడే, ఇంతకన్న మించినవాడు కాడు అను పరిమితి లేనివాడు; అవిక్రియుడు (మార్పులు చెందనివాడు - మొదటినుండి ఏ విధమైన మార్పులు లేనివాడు); (ఒకే రీతిగా ఎల్లపుడు నుండువాడు); సద్ఘనము (మూడుకాలములందుండువాడు, ఘనీభవించిన సత్పదార్థమైనవాడు - ఎన్నటికినీ తరగని సత్పదార్థమైనవాడు); చిద్ఘనము (చైతన్యశక్తి ఘనీభవించినవాడు) (మొదటినుండి ఇప్పటివరకు ఎన్ని పర్యాయములు సృష్టి చేయుచున్నను వాటిలోనుండు సమస్త వస్తువులకు తన చైతన్యశక్తినిచ్చి వాటిని నిర్ణీతమైన విధమున నడిపించుటలో తరగని చైతన్యశక్తిని - చిచ్ఛక్తిని - ఇచ్చువాడు); నిత్యుడు (ఎల్లకాలము లందుండువాడు, నశించనివాడు), ఆనందఘనుడు. (పరమానందమును, పరమసుఖమును, పరమ శాంతిని కలుగచేయు మోక్షమే తనరూపమైనవాడు), (అందుచేత ఎడతెగని ఆనందము నిచ్చువాడు); అవ్యయుడు (క్షీణించనివాడు - ఏ విధముగా చూచినను తనశక్తిలో తరుగు లేనివాడు), ప్రత్యగేకరసము - చైతన్యమను ఒకే రసము (శక్తి) గలవాడు); (అన్నింటిలోను ఒకే విధమైన రసము - శక్తి - గలవాడు); పూర్ణుడు (సృష్టిలోని వస్తువులన్నింటిలోను పూర్తిగా వ్యాపించియుండువాడు); అనంతుడు (కాలముచేత గాని, వస్తువుచేతగాని, దేశముచేతగాని అంతము - పరిమితి - లేనివాడు), అంతములేని శక్తి, అంతములేని రూపములు, అంతములేని నామములు గలవాడు); సర్వతోముఖుడు (అన్ని దిక్కుల వ్యాపించు వాడు); హేయోపాదేయములు లేనివాడు (ఇది మంచిది, ఇది చెడ్డది. ఇది శ్రేష్టమైనది, ఇది నీచమైనది; అను విచక్షణలేక అన్నిటియడల పక్షపాతములేక ఒకే రీతిగా ప్రవర్తించువాడు); అనాశ్రయము (దేని మీదనైనను ఆధారపడి యుండనివాడు); నిర్గుణుడు (సత్వరజస్తమో గుణములు లేనివాడు); నిష్క్రియుడు (సృష్టి చేయుచున్నప్పటికీ అది ప్రకృతి చేత చేయించువాడు కనుక తాను ఏక్రియయు చేయనివాడు), (అందుచేత బంధము లేక నిత్యముక్తుడైనవాడు); సూక్ష్ముడు (సృష్టిలోనున్న వస్తువు లన్నింటికంటె సూక్ష్మమైన పరమాణువులో ప్రవేశించుటవలన దానికంటె సూక్ష్మమైన వాడు) నిర్వికల్పుడు (వికల్పములేనివాడు); నిరంజనుడు (దేనిలోనున్నను దానితోసంబంధములేనివాడు - దాని దోషములనంటనివాడు); అనిరూప్యము - (ఇతను ఇటువంటి రూపముగలవాడు అని రూపించుటకు అవకాశము లేనివాడు); మనోవాగ గోచరుడు ఇట్టివాడని మనసులో అలోచించుటకుగాని, మాటలచే చెప్పుటకుగాని వీలుపడేనివాడు, సత్పదార్థము సమృద్ధిగా గలవాడు - తరగనివాడు); స్వతస్సిద్ధుడు (తనంతట తానే ఆవిర్భవించ గలవాడు). శుద్ధుడు (నిర్మలమైన - ఏ దోషములు లేనివాడు); బుద్ధుడు (జ్ఞానము కలవాడు - సర్వ జ్ఞుడు); అనీశ్వరుడు (తనను నియమించు ఈశ్వరుడు లేనివాడు); ఇటువంటి శక్తులు కలిగియుండువాడు తానొక్కడే అయినవాడు, తనుకాక ఇతర వస్తువు ఏదియు లేనివాడు, (అన్ని వస్తువులు తానే అయినవాడు) ఈ లక్షణములుగలవాడు ఇంకొకడు లేడుకనుక బ్రహ్మ అద్వయుడు - అతను కానిది సృష్టిలో ఏదియు లేదు - సృష్టిలో అనేక వస్తువులు లేవు - ఉన్నదంతా బ్రహ్మ ఒక్కడే).
“ślō.|| paripūrṇamanādyaṃtaṃ apramēya mavikriyaṃ |
sadghanaṃ, cidghanaṃ,nityaṃ ānaṃdaghanamavyayaṃ |
pratyagēkarasaṃ pūrṇaṃ, anaṃtaṃ sarvtōmukhaṃ |
ahēyamanupādēyaṃ anādēyaṃ anāśrayaṃ |
nirguṇaṃ, niṣkriyaṃ, sūkṣmaṃ, nirvikalpaṃ niraṃjanaṃ |
nirūpya svarūpaṃ yanmanōvācāmagōcaraṃ |
sat samṛddhaṃ, svatassiddhaṃ śuddha buddha manīśvaraṃ |
ēkamēvā dvayaṃ brahmanēha nānāsti kiṃcana ||“. (adhyātmōniṣat)
(brahma anunadi okaṭēyunnadi. aditappa maṟiyokavastuvu sṛṣṭilō lēnēlēdu. sṛṣṭi aṃtayu, sṛṣṭilōnunna vastuvulanniyu brahmamē - brahma rūpamulē - aṃducēta brahma advayuḍu - tanugāka reṃḍava vastuvēdiyu lēnivāḍu. eṃducētananagā - brahma paripūrṇuḍu (prapaṃcamaṃtaṭilōnu - lōna, paina - pūrtigā vyāpiṃci niṃḍiyunnavāḍu); ādyaṃtamulu (jananamaraṇamulu) lēnivāḍu, apramēyuḍu (iṃtaṭivāḍē, iṃtakanna miṃcinavāḍu kāḍu anu parimiti lēnivāḍu; avikriyuḍu (mārpulu ceṃdanivāḍu - modaṭinuṃḍi ē vidhamaina mārpulu lēnivāḍu); (okē rītigā ellapuḍu nuṃḍuvāḍu); sadghanamu (mūḍukālamulaṃduṃḍuvāḍu, ghanībhaviṃcina satpadārthamainavāḍu - ennaṭikinī taragani satpadārthamainavāḍu); cidghanamu (caitanyaśakti ghanībhaviṃcinavāḍu) (modaṭinuṃḍi ippaṭivaraku enni paryāyamulu sṛṣṭi cēyucunnanu vāṭilōnuṃḍu samasta vastuvulaku tana caitanyaśaktinicci vāṭini nirṇītamaina vidhamuna naḍipiṃcuṭalō taragani caitanyaśaktini - cicchaktini - iccuvāḍu); nityuḍu (ellakālamu laṃduṃḍuvāḍu, naśiṃcanivāḍu), ānaṃdaghanuḍu. (paramānaṃdamunu, paramasukhamunu, parama śāṃtini kalugacēyu mōkṣamē tanarūpamainavāḍu), (aṃducēta eḍategani ānaṃdamu niccuvāḍu); avyayuḍu (kṣīṇiṃcanivāḍu - ē vidhamugā cūcinanu tanaśaktilō tarugu lēnivāḍu), pratyagēkarasamu - caitanyamanu okē rasamu (śakti) galavāḍu); (anniṃṭilōnu okē vidhamaina rasamu - śakti - galavāḍu); pūrṇuḍu (sṛṣṭilōni vastuvulanniṃṭilōnu pūrtigā vyāpiṃciyuṃḍuvāḍu); anaṃtuḍu (kālamucēta gāni, vastuvucētagāni, dēśamucētagāni aṃtamu - parimiti - lēnivāḍu), aṃtamulēni śakti, aṃtamulēni rūpamulu, aṃtamulēni nāmamulu galavāḍu); sarvatōmukhuḍu (anni dikkula vyāpiṃcu vāḍu); hēyōpādēyamulu lēnivāḍu (idi maṃcidi, idi ceḍḍadi. idi śrēṣṭamainadi, idi nīcamainadi; anu vicakṣaṇalēka anniṭiyaḍala pakṣapātamulēka okē rītigā pravartiṃcuvāḍu); anāśrayamu (dēni mīdanainanu ādhārapaḍi yuṃḍanivāḍu); nirguṇuḍu (satvarajastamō guṇamulu lēnivāḍu); niṣkriyuḍu (sṛṣṭi cēyucunnappaṭikī adi prakṛti cēta cēyiṃcuvāḍu kanuka tānu ēkriyayu cēyanivāḍu), (aṃducēta baṃdhamu lēka nityamuktuḍainavāḍu); sūkṣmuḍu (sṛṣṭilōnunna vastuvu lanniṃṭikaṃṭe sūkṣmamaina paramāṇuvulō pravēśiṃcuṭavalana dānikaṃṭe sūkṣmamaina vāḍu) nirvikalpuḍu (vikalpamulēnivāḍu); niraṃjanuḍu (dēnilōnunnanu dānitōsaṃbaṃdhamulēnivāḍu - dāni dōṣamulanaṃṭanivāḍu); anirūpyamu - (itanu iṭuvaṃṭi rūpamugalavāḍu ani rūpiṃcuṭaku avakāśamu lēnivāḍu); manōvāga gōcaruḍu iṭṭivāḍani manasulō alōciṃcuṭakugāni, māṭalacē ceppuṭakugāni vīlupaḍēnivāḍu, satpadārthamu samṛddhigā galavāḍu - taraganivāḍu); svatassiddhuḍu (tanaṃtaṭa tānē āvirbhaviṃca galavāḍu). śuddhuḍu (nirmalamaina - ē dōṣamulu lēnivāḍu); buddhuḍu (jñānamu kalavāḍu - sarva jñuḍu); anīśvaruḍu (tananu niyamiṃcu īśvaruḍu lēnivāḍu); iṭuvaṃṭi śaktulu kaligiyuṃḍuvāḍu tānokkaḍē ayinavāḍu, tanukāka itara vastuvu ēdiyu lēnivāḍu, (anni vastuvulu tānē ayinavāḍu) ī lakṣaṇamulugalavāḍu iṃkokaḍu lēḍukanuka brahma advayuḍu - atanu kānidi sṛṣṭilō ēdiyu lēdu - sṛṣṭilō anēka vastuvulu lēvu - unnadaṃtā brahma okkaḍē).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.