← Back to బ · Booklets 31–40 (digitized file 4)

బ్రహ్మాహమస్మి brahmāhamasmi

Original — తెలుగు
  1. ఉదకరూపం ఆర్ద్రం స్వాధిష్ఠాన చైతన్య రూపేణ జ్వలతి ప్రకాశతే, తచ్చ అధిష్ఠానరూపం జ్యోతిః అహమస్మి దేహేంద్రియాదిభ్యో వివౌచితస్య మమతదేవాధిష్ఠాన చైతన్యం స్వరూపం ఇత్యర్థః. జ్యోతిర్జ్వలతి ఇత్యుక్తం తత్ జ్యోతిః బ్రహ్మైవ. అతో జ్యోతిరహమస్మి ఇతివాక్యేన బ్రహ్మా హమస్మి ఇత్యుక్తం భవతి - న చ పూర్వసిద్ధం జీవాత్మనస్స్వరూపం వినాస్యరూపాంతరస్య బృహత్వ లక్షణస్య ప్రాప్తిర్భవతి. కింతు యోహం పురా జీవోస్మి స ఏవ ఇదానీం అహం బ్రహ్మస్మి, వస్తుతః బ్రహ్మణ్యవ,మయి పూర్వం అజ్ఞానాత్ జీవత్వం ఆరోపితం ఆసీత్. తస్మిన్ అజ్ఞానే వివేకేన అపనీతే సతి వస్తుతః పూర్వసిద్ధమేవ బ్రహ్మస్వరూపం ఇదానీం అనుభవితాస్మి, నతు నూతనం కించిత్ బ్రహ్మత్వం ఆగతం. తస్మాదహమేవ అహం బ్రహ్మభావానుభవవేళాయాం అపి పూర్వసిద్ధో అహమేవ.

(నేను బ్రహ్మను అయితిని. ఉదకరూపమైన హృదయము స్వాధిష్ఠానపద్మమందు అధిష్టించియుండు చైతన్యముగా ప్రకాశించును, అట్లు అధిష్టించియుండు జ్యోతియే నేను. అధిష్టాన చైతన్యమే దేహేంద్రియములకంటె వేరైన నాయొక్క స్వరూపము. జ్యోతియనగాజ్వలించునది - వెలుగునది, ప్రకాశించునది. ఆ జ్యోతి బ్రహ్మమే. అందుచేత ఆ జ్యోతినేనే అని చెప్పుటచేత నేను బ్రహ్మమునయితిని అని చెప్పబడినది. ఇట్లు చెప్పుటచేత నిదివరకున్న జీవాత్మ స్వరూపము నశించి బ్రహత్వలక్షణములుగల మఱియొక రూపము (బ్రహ్మ లక్షణములుగల మఱియొకరూపము) కలుగలేదు. కాని పూర్వము నేను ఏ జీవుడనైతినో అదే యిప్పుడు బ్రహ్మము అయితిని. వాస్తవముగా - వాస్తవ స్థితిలో - బ్రహ్మమే అయిన నాయందు అజ్ఞానమువలన జీవత్వమారోపింపబడినది. ఆ అజ్ఞానము వివేకమువలన పోవగా, వాస్తవికముగా ఇంతకు పూర్వమున్న బ్రహ్మ స్వరూపమునే ఇప్పుడు అనుభవించుచున్నాను. అంతేగాని, క్రొత్తగా కొంచెమైనను బ్రహ్మత్వము రాలేదు - అందుచేత నేనే నేను. ఇదివరకు నేను బ్రహ్మను. ఇప్పుడు జీవత్వముపోయి బ్రహ్మనయితిని. అందుచేత ఇదివరకు నేనే ఇప్పుడు నేను. బ్రహ్మభావము ననుభవించు సమయమందు కూడా ఇదివరకు ఏ నేను (బ్రహ్మను) అనియుంటినో ఆ నేనే ఇప్పుడు కూడా అయితిని).

Transliteration
  1. udakarūpaṃ ārdraṃ svādhiṣṭhāna caitanya rūpēṇa jvalati prakāśatē, tacca adhiṣṭhānarūpaṃ jyōtiḥ ahamasmi dēhēṃdriyādibhyō vivaucitasya mamatadēvādhiṣṭhāna caitanyaṃ svarūpaṃ ityarthaḥ. jyōtirjvalati ityuktaṃ tat jyōtiḥ brahmaiva. atō jyōtirahamasmi itivākyēna brahmā hamasmi ityuktaṃ bhavati - na ca pūrvasiddhaṃ jīvātmanassvarūpaṃ vināsyarūpāṃtarasya bṛhatva lakṣaṇasya prāptirbhavati. kiṃtu yōhaṃ purā jīvōsmi sa ēva idānīṃ ahaṃ brahmasmi, vastutaḥ brahmaṇyava,mayi pūrvaṃ ajñānāt jīvatvaṃ ārōpitaṃ āsīt. tasmin ajñānē vivēkēna apanītē sati vastutaḥ pūrvasiddhamēva brahmasvarūpaṃ idānīṃ anubhavitāsmi, natu nūtanaṃ kiṃcit brahmatvaṃ āgataṃ. tasmādahamēva ahaṃ brahmabhāvānubhavavēḷāyāṃ api pūrvasiddhō ahamēva.

(nēnu brahmanu ayitini. udakarūpamaina hṛdayamu svādhiṣṭhānapadmamaṃdu adhiṣṭiṃciyuṃḍu caitanyamugā prakāśiṃcunu, aṭlu adhiṣṭiṃciyuṃḍu jyōtiyē nēnu. adhiṣṭāna caitanyamē dēhēṃdriyamulakaṃṭe vēraina nāyokka svarūpamu. jyōtiyanagājvaliṃcunadi - velugunadi, prakāśiṃcunadi. ā jyōti brahmamē. aṃducēta ā jyōtinēnē ani ceppuṭacēta nēnu brahmamunayitini ani ceppabaḍinadi. iṭlu ceppuṭacēta nidivarakunna jīvātma svarūpamu naśiṃci brahatvalakṣaṇamulugala maṟiyoka rūpamu (brahma lakṣaṇamulugala maṟiyokarūpamu) kalugalēdu. kāni pūrvamu nēnu ē jīvuḍanaitinō adē yippuḍu brahmamu ayitini. vāstavamugā - vāstava sthitilō - brahmamē ayina nāyaṃdu ajñānamuvalana jīvatvamārōpiṃpabaḍinadi. ā ajñānamu vivēkamuvalana pōvagā, vāstavikamugā iṃtaku pūrvamunna brahma svarūpamunē ippuḍu anubhaviṃcucunnānu. aṃtēgāni, krottagā koṃcemainanu brahmatvamu rālēdu - aṃducēta nēnē nēnu. idivaraku nēnu brahmanu. ippuḍu jīvatvamupōyi brahmanayitini. aṃducēta idivaraku nēnē ippuḍu nēnu. brahmabhāvamu nanubhaviṃcu samayamaṃdu kūḍā idivaraku ē nēnu (brahmanu) aniyuṃṭinō ā nēnē ippuḍu kūḍā ayitini).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.