← Back to బ · Booklets 31–40 (digitized file 4)

బ్రహ్మజిజ్ఞాసా brahmajijñāsā

Original — తెలుగు
  1. బ్రహ్మణః జిజ్ఞాసా బ్రహ్మజిజ్ఞాస, జ్ఞాతుం ఇచ్చ జిజ్ఞాస.

(బ్రహ్మను తెలుసుకొనవలెనను కోరిక).

  1. జ్ఞాతుమిచ్చా జిజ్ఞాసా, అవగతి పర్యంతం జ్ఞానం సన్వాచ్యాయా ఇచ్ఛాయాః కర్మఫలవిషయత్వాత్ ఇచ్చాయాః జ్ఞానేన హి ప్రమాణే నావగంతుం ఇష్టం బ్రహ్మ. బ్రహ్మావగతిర్హి పురుషార్థః నిశ్శేష సంసారబీజాద్యనర్థ నిబర్హణాత్ - తస్మాత్ బ్రహ్మ జిజ్ఞాసి తవ్యః

(శ్రీ శంకరః - బ్రహ్మసూత్రభాష్యే - 1 - 1 - 1)

(తెలుసుకొనుటకు ఇచ్ఛ - కోరిక - జిజ్ఞాసయని చెప్పబడును. జ్ఞానము (బ్రహ్మజ్ఞానము) అవగాహన చేసుకొను పర్యంతము ఉండు కోరిక జిజ్ఞాస. అట్లు చేయుటవలన (బ్రహ్మజిజ్ఞాసవలన) ఫలమున్నది, కనుక. “జ్ఞానే నైవతు కైవల్యం” (జ్ఞానమువలననే మోక్షము కలుగుచున్నది అని చెప్పియుండుటవలన బ్రహ్మను పొందుటకు జ్ఞానమే ప్రమాణమగుట వలన - బ్రహ్మప్రాప్తియే పరమపురుషార్థము. సంసారమునకు బీజమగు అవిద్యను - అజ్ఞానమును శేషములేకుండ పోగొట్టునది కనుక. అందుచేత బ్రహ్మ జిజ్ఞాస (బ్రహ్మను తెలుసుకొనుటకు ఇచ్ఛ) కావలెను - అవసరము).

  1. “బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి” తస్మాత్ బ్రహ్మ జిజ్ఞాసా కర్తవ్యా.

(బ్రహ్మభావము జ్ఞానము గలవాడు బ్రహ్మమే యగును అని చెప్పబడినది. అందుచేత ఆ బ్రహ్మజ్ఞానము కలుగుటకు జిజ్ఞాస (ఇచ్ఛాపూర్వక ప్రయత్నము) చేయవలెను).

  1. “యతో నారాయణ ప్రసాదం ఋతే నమోక్షః, న చ జ్ఞానంవినా అత్యర్థ ప్రసాదః. అతో బ్రహ్మ జిజ్ఞాసో కర్తవ్యా”

(భగవంతుడైన శ్రీమన్నారయణుని అనుగ్రహము లేనిదే మోక్షము లేదు - అట్లే బ్రహ్మజ్ఞానము లేనిదే అతని అత్యర్థ ప్రసాదమగు మోక్షము లేదు. అందుచేత బ్రహ్మజిజ్ఞాస చేయవలసినదే)

  1. అపరోక్ష జ్ఞానస్య చ బ్రహ్మజిజ్ఞాసాం వినానుదయాత్ అత్యర్థ ప్రస్దాదద్వారా మోక్ష సాధనా పరోక్ష జ్ఞానోత్పాదికా బ్రహ్మ జిజ్ఞాసా కర్తావ్యా“.

(బ్రహ్మ జిజ్ఞాస లేకున్న అపరోక్ష జ్ఞానము కలుగదు. బ్రహ్మ అనగా ఏమిటి? అతని తత్వమేమిటి? యను దానిని గుఱించి విచారములేనిదే దాని గుఱించి జ్ఞానము కలుగదు. భగవంతుని కటాక్షము ద్వారా మోక్షమునకు సాధనము అయిన అపరోక్షజ్ఞానము కలిగించునది బ్రహ్మ జిజ్ఞాస. అందుచేత బ్రహ్మ జిజ్ఞాస చేయవలసినదే - బ్రహ్మ జిజ్ఞాసకు బ్రహ్మ జ్ఞానము ఫలము, బ్రహ్మజ్ఞానమునకు బ్రహ్మప్రాప్తిలేక మోక్షము ఫలము - అందుచేత బ్రహ్మ జిజ్ఞాస చేయవలసినదే.

  1. “యస్మాత్ వేద ఏవాగ్నిహోత్రాదీనాం శ్రేయస్సాధనానా మనిత్య ఫలతా, దర్శయతి -”: తథ్య యధేహ కర్మ చితో లోకః క్షీయతే,.ఏవ మేవా ముత్ర పుణ్య చితో లోకః క్షీయతే”

ఇత్యాది - తథా బ్రహ్మ విజ్ఞానాదపి పరం పురుషార్థం దర్శయతి - “బ్రహ్మ విదాప్నో తిపరం” ఇత్యాది. తస్మాద్యధోక్తసాధన సంపత్య నంతరం బ్రహ్మ జిజ్ఞాసా కర్తవ్యా” (శ్రీశంకరః - బ్రహ్మసూత్రభాష్యే - 1 - 1 - 11)

(అగ్నిహోత్రము. యాగము మొదలగు శ్రేయస్కరములగు కర్తలవలన కలుగు ఫలమునిత్యముకాదు అని వేదము చెప్పుచున్నది. కర్మము చేత యీ లోకములో సంపాదించిన ఫలము క్షీణించును, శాశ్వతముకాదు - శాస్వతముగ అనుభవించుటకుండదు. ఆ ప్రకారముగానే బ్రహ్మజ్ఞానమువలన మోక్షము కలుగునని చెప్పబడినది. ఆ ప్రకారముగానే యజ్ఞ యాగాదులవలన సంపాదించిన పరలోకసుఖములు - స్వర్గలోక భోగములు - కూడా క్షీణించినవెనుకను మరల జన్మ కలుగును. ఆ వేదమే బ్రహ్మజ్ఞానమువలన మోక్షము కలుగునని చెప్పుచున్నది. ఎట్లనగా: - బ్రహ్మమును తెలుసుకొనినవాడు - బ్రహ్మజ్ఞానము కలవాడు - పరమాత్మను పొందును. (మోక్షమును పొందును) - మఱి జన్మలుండవు. అందుచేత, ఇట్లు బ్రహ్మజ్ఞానముచేత శాశ్వతసుఖము పొందవచ్చును గనుక శాస్త్రోక్తముగా సాధన సంపత్తి కుదిరిన తర్వాత బ్రహ్మజిజ్ఞాస చేయవలయును).

  1. యధా వేదః కర్మఫలానిత్యత్వం దర్శయతి తథా బ్రహ్మజ్ఞానాత్ ప్రశాంత శోకానలం అపారం స్వయంజ్యోతిరానందం దర్శయతి.

(వేదము కర్మఫలము నిత్యమైనది కాదని చెప్పుచున్నట్లే బ్రహ్మజ్ఞానము వల్ల సర్వ దుఃఖములును ఉపశమించుకొని అనంతమైన స్వయంజ్యోతియు ఆనందమయుడు (మోక్షరూపుడు) అయిన పరబ్రహ్మను పొందవచ్చునని కూడ వేదములు చెప్పుచున్నవి).

  1. మీమాంసా పూర్వ భాగ జాతస్య కర్మణో(అ)ల్పాస్థిర ఫలత్వాత్ ఉపరితన భాగావసే యస్య బ్రహ్మజ్ఞానస్యానంతాక్షయ ఫలత్వాచ్చ పూర్వ వృత్తాత్ కర్మజ్ఞానాత్ అనంతరం తత ఏవహేతోర్బ్రహ్మ జ్ఞాతస్య మిత్యుక్తం భవతి. (శ్రీమాన్ రామానుజః)

(పూర్వ మీమాంసలో చెప్పబడిన కర్మ చేయుటవలన కలుగు ఫలము అల్పము, అనర్థము అని చెప్పబడియుండుటవలనను, ఉత్తరమీమాంసలో (ఉపనిషత్తులలో) చెప్పబడిన బ్రహ్మజ్ఞానము అనంతమైనది, అక్షయమైన ఫలము కలదని చెప్పబడియుండుటచేతను - ముందు కర్మకాండ తర్వాత జ్ఞానకాండ చెప్పబడియుండుటవలన బ్రహ్మను తెలుసుకోవలసినది - బహ్మ జిజ్ఞాస చేయవలసినది).

  1. “జిజ్ఞాస్యం బ్రహ్మోక్తం, తత్త్రిలోక ప్రసిద్ధం? ఇతరద్వా? యది లోక ప్రసిద్ధం నిస్సందేహం, తదా న జిజ్ఞాస్యం. యది చా ప్రసిద్ధమే తత్తత్ తత్ జిజ్ఞాస్యం కథం? ఇతీహనా శంక్యం సత్యం జ్ఞానమనంతం శ్రుతివచనేషూపలభ్యతే బ్రహ్మ.వైనాశికాది సమయే ష్వతథా భూతో నిరూప్యతే హ్యాత్మ. అతః ఉపపన్నః సంశయః వేదాంతవాక్యనిచయై ర్న్యాయోపేతైర్వి చ రితే తత్వే వాద వివాదోప చితస్సందేహో నాశమేతి నిక్షేపం”.

(భాష్యార్థరత్నమాల - 1 - 1 - 1)

(బ్రహ్మను తెలుసుకోవలెను. బ్రహ్మను తెలుసుకొనుటకు ఇచ్ఛకలుగవలెను - అయిన, బ్రహ్మలోక ప్రసిద్ధమా). (లోకమంతటికి తెలిసినవాడా? లేక, తెలియనివాడా? లోకమందఱికి తెలిసినవాడే అయిన నిస్సందేహముగా, తెలిసినవాడే అయిన ఇక తెలుసుకోవలసిన పనిలేదు - అవసరము లేదు. బ్రహ్మ గుఱించి జిజ్ఞాస అవసరము లేదు -లోకమందఱికి తెలియనివాడైతే అతనిని గుఱించి జిజ్ఞాస చేయవలసినదే, అయితే, అదెట్లు చేయవలయును? అని సంశయమక్కరలేదు - బ్రహ్మ సత్పదార్థమని జ్ఞానరూపుడని, ఏ విధముగా చూచినా అంతము లేనివాడని శ్రుతి చెప్పుచున్నది. కొన్ని చోట్ల అది అట్లుకాదు అని కూడ చెప్పబడుచున్నది. అందుచేత సందేహము కలుగును. న్యాయశాస్త్రముతో ఉపనిషత్తుల బోధను సమన్వయించి పరతత్వమును విచారించిన యడల బ్రహ్మ గుఱించి జరుగు వాదోపవాదములతో కూడిన సందేహము పూర్తిగా తొలగిపోవును - అందుకని బ్రహ్మ జిజ్ఞాస చేయవలసినది).

  1. “తద్విజిజ్ఞాసస్వ”; “సో(అ)న్వేష్టవ్యః, స విజిజ్ఞాసితవ్యః,” ఆత్మా. వా. అరేద్రష్టవ్యః, శ్రోతవ్యః “ఇతి శ్రవణ విధి రుపలభ్యతే. తస్యార్థః అమృతత్వ కామేనా ద్వైతాత్మ విచార ఏవ వేదాంత వాక్యః కర్తవ్యః ఇతి”.

(“ఆ పరబ్రహ్మను తెలుసుకొనుము”; “అతనే అన్వేష్టింపతగినవాడు” - ప్రయత్నముచేత తెలుసుకొనతగినవాడు). “ఆత్మ చూడతగినవాడు - సాక్షాత్కరించుకోవలసిన వాడు - అతని గుఱించి వినతగినవాడు” అని శాస్త్రము విధించుచున్నది (చేయవలసినదని చెప్పుచున్నది. ఆ శాస్త్ర వాక్యముల అర్థమేమనగా - వేదాంతవాక్యముల ద్వారా మోక్షమును కోరువాడు అద్వయుండైనవాడు (తనుకాక మఱియొక వస్తువులేనివాడు, అంతా తానే, అన్నీ తానే అయినవాడు). అయిన ఆత్మగుఱించి విచారణ చేయవలసినది).

“తద్య ధేహ కర్మచితో లోకః -” ఇతి శ్రుత్యా యత్కృతం. తదనిత్యమితి న్యాయవత్యా “నజాయతే మ్రియతేవా వివశ్చిత్” - - - యో వైభూమా తదమృతమన్యదార్త “మిత్యాది శ్రుత్యాచ భూత్వా నిత్యస్తతో (అ)న్యద నిత్యమితి వివేకో లభ్యతే, కర్మణా కృష్యాదినా చితః సంపాదితః సస్యాదిర్లోకో భోగ్య ఇత్యర్థః - విపశ్చిత్ నిత్యజ్ఞాన స్వరూపః. పరీక్షలోకాన్ కర్మ చితాన్ బ్రాహ్మణో నిర్వేదమా యాన్నాస్త్య కృతః కృతేన”. కర్మణానాస్తి ఇతి కర్మ తత్ఫలేభ్యః వైరాగ్యం ప్రాప్తవాన్ - “శాంతో దాంతః ఉపరతః, తితక్షః సమాహిత శ్రద్ధావిత్తో భూత్వా ఆత్మన్యేవాత్మానం పశ్యేదితి” శ్రుత్యా శమాదిషట్కం లభ్యతే. ఇతి స్వయం జ్యోతిరానందాత్మక మోక్షస్య నిత్యత్వ శ్రుత్యా ముముక్షౌ లభ్యతే. తథాచ వివేకాది విశేషణ అధికారీ ఇతి జ్ఞాతుం శక్యం. ప్రమాణం చాద్వై తాత్మని వేదాంత ఏవ - “తం త్వేపనిషదం పురుషం”, “వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః” ఇతి చ శ్రుతేః - వేదాంతానాం చ ప్రత్యగ్బ్రహ్మైక్యం విషయః, “తత్వమసి”, “అహం బ్రహ్మస్మి” ఇతి శ్రుతేః - ఏవం విచార విధేః ఫలమపి జ్ఞానద్వారా ముక్తిః - “తరతి శోకమాత్మవిత్”, - “బ్రహ్మవిదో బ్రహ్మైవ భవతి” ఇతి శ్రుతేః. (కర్మచేత సంపాదించినవి (యీ లోకములో) - భోగరూపమైన ఫలములు - ఏ ప్రకారముగా నశించునవియో, ఆ ప్రకారముగానే ఇక్కడ చేసిన కర్మలకు కలుగు పరలోకసుఖములు - స్వర్గములో కలుగునవి - కూడ క్షీణించును అని చెప్పు శ్రుతి వాక్యమును బట్టి, ఏది చేయబడినదో - ఏ కర్మ చేయబడినదో - దానివలన అది నిత్యముకానిది - శాశ్వతముగా నుండదు - అను న్యాయము ననుసరించియు, దేనికి జన్మలేదో, దేనికి మరణములేదో, ఏది భూమియో, అది అమృతము. అదికానిది నశించునది అని శ్రుతి చెప్పుచున్నది. ఈ ప్రకారము కర్మఫలమనిత్యమని తెలిసి, నిత్యజ్ఞానస్వరూపడైనవాడు నిర్వేదమును పొందును. ఆత్మ గుఱించియే అన్నియు ప్రియమైన వస్తువులగుచున్నవి అని తెలుసుకొని అనాత్మ వస్తువులందు (ఆత్మగాని వస్తువులందు)వైరాగ్యమును పొందును - ” వాస్తి అకృతః కృతేన ” (కర్మవలన మోక్షములేదు, కలుగదు) అని తెలుసుకొని, కర్మలయందు, దాని వలనకలుగు ఫలములందు వైరాగ్యమును పొందినవాడగును - శాంతుడు, దాంతుడు, ఉపరితుడు, తితిక్షకలవాడు, సమాహిత చిత్తముకలవాడు, శ్రద్ధ కలవాడు తనలోనే పరమాత్మను చూచును అని శ్రుతి చెప్పుటచేత శమము, దమము మొదలగు శమాదిషట్కము చెప్పబడినది. ఉపరతి యనగా సన్యాసము - “నచ పునరా వర్తతే” (తిరిగి మరలరాడు, మరల జన్మించడు) అనగా స్వయంజ్యోతిస్వరూపము, పరమానందరూపము అయిన మోక్షము నిత్యమైనదగుటవలన మోక్షమునుపొందును - (సంసారమునుండి మోక్షమునుపొందును - మరల జన్మ లేకుండును). పైనచెప్పిన విశేషములను బట్టి నిత్యానిత్య వస్తువివేకము మొదలగు శమాదిషట్కము గలవాడే ఈ బ్రహ్మజిజ్ఞాసకు అధికారి యని తెలియుచున్నది. అద్వయుడైన ఆత్మను తెలుసుకొనుటలో -బ్రహ్మజిజ్ఞాస చేయుటకు - ప్రమాణము వేదాంతమే, ఉపనిషత్తులే. ఉపనిషత్తులెట్లు ప్రమాణమనగా - “ఉపనిషత్తులలో తెలియచేయబడిన పురుషుడు” (“తంత్వౌపనిషదం పురుషం”) అనిన్నీ, “వేదాంతవిజ్ఞాన వినిశ్చితార్థాః” (ఉపనిషత్తులద్వారా కలుగు జ్ఞానము చేత బాగుగా అర్థమైన భగవంతుని నిశ్చయముగా తెలుసుకొనినవారు) అనిన్నీ చెప్పుటవలన ఉపనిషత్తులలో చెప్పబడిన విషయమైన వాడు ప్రత్యగాత్మకంటె వేరుకానివాడు - పరబ్రహ్మ - ఇద్దరూ ఒక్కటే యని చెప్పుటయు; “ఆ బ్రహ్మనీవే”, “నేనే ఆ బ్రహ్మను” అను మహావాక్యములను ఉపనిషత్తులు చెప్పుటవలనను - వేదమే ప్రమాణము - పైన చెప్పిన వాటి వలన ఆ ప్రకారముగా ఆ ప్రకారముగా పరబ్రహ్మ గుఱించి విచారణ చేయుట - తెలుసుకొనుటకు ఇచ్ఛ కలిగి ప్రయత్నించుట - వలన ఫలమేమనగా జ్ఞానముద్వారా ముక్తి కలుగును. ఈ సంగతి శ్రుతిలోనిట్లు చెప్పబడినది -: ఆత్మజ్ఞానముకలవాడు శోకమునొందడు - ముక్తిని పొందును” అనిన్నీ “బ్రహ్మజ్ఞానము కలవాడు బ్రహ్మమేయగును - బ్రహ్మలో లీనమగును, ముక్తిని పొందును”).

  1. “శ్రుత్యర్థాభ్యాం సాధన చతుష్టయ సంపన్నస్య అధికారిణః మోక్షసాధన బ్రహ్మ పరోక్ష జ్ఞానాయ వేదాంత వాక్య విచారః కర్త్వ్యః”.

(సాధన చతుష్టయ సంపత్తి గలిగిన అధికారికి శ్రుతిలో చెప్పిన వాక్యముల ప్రకారము మోక్షమునకు సాధనమైన బ్రహ్మపరోక్షజ్ఞానము సంపాదించుటకు వేదాంతవాక్యములవిచారణ (బ్రహ్మ జిజ్ఞాస) చేయవలసియున్నది. ఎందుచేతననగా –

“శాంతో దాంతః ఉపరతిస్థి తిక్ష సమాహితః |

శ్రద్ధావిత్తో భూత్వా ఆత్మన్యేవాత్మానం పశ్యేత్ |“)

శాంతుడు, దాంతుడు, ఉపరతిగలవాడు, తితిక్షగలవాడు (వాతాతపములు మొదలగు వాటిని సహించువాడు), సమాహిత చిత్తుడు, శ్రద్ధకలవాడు, తనలోనే ఆత్మను చూడగలడు. అని యున్నది కనుక ఆ గుణములుకలవాడె బ్రహ్మజిజ్ఞాసకు అధికారి (అర్హుడు).

  1. “యది జన్మాంతరకృతైః కర్మభిశ్శుద్ధం చిత్తం తదా బ్రహ్మచర్యాదేవ నన్యస్య బ్రహ్మ జిజ్ఞాసి తవ్యం, యది న శుద్ధమితి రాగేణ జ్ఞాయతే, తదా గృహిభావేత్ తత్రాప్య శుద్ధౌ వనీభవేత్, తత్రాప్యశుద్ధౌ తదైవ కాలమాకలయేత్, వనే శుద్ధౌ ప్రవ్రజేత్”.

(మొదటి జన్మలలో చేసిన కర్మలవలన చిత్తశుద్ధి కలిగియున్నయడల బ్రహ్మచర్యములో నుండియే సన్యసించి బ్రహ్మ జిజ్ఞాస చేయవలెను - చిత్తశుద్ధి లేనియడల గృహస్థాశ్రమమును స్వీకరించవలెను - ఆ గృహస్థాశ్రమములో కూడ చిత్తశుద్ధి కలుగనియడలవానప్రస్థాశ్రమము నాశ్రయించవలెను - ఆ ఆశ్రమములో కూడ చిత్తశుద్ధి కలుగనియడల ఆ ఆశ్రమములోనే చాలాకాలముండి సన్యసించవలయును).

శాంతో దాంత ఉపరతి స్తితిషుస్సమాహితః |

శ్రద్ధావిత్తోభూత్వా ఆత్మన్యేవాత్మానం పశ్యేత్ ||“.

(శాంతుడు, దాంతుడు ఉపరతిగలవాడు తితిక్షువు - వాతాతపములు మొదలగువాటిని సహించువాడు), సమాహిత చిత్తుడు తనలోనే ఆత్మను చూడగలడు అని ఉన్నది కనుక ఆ గుణములు కలవాడు బ్రహ్మ జిజ్ఞాసకు అధికారి (అర్హుడు).

  1. “సర్వస్యాత్మ త్వాచ్చ బ్రహ్మస్థిత్వ ప్రసిద్ధిః - సర్వస్య లోకస్య యో అయమాత్మ, తద భేదాత్ బ్రహ్మణః.ప్రసిద్ధిః - - - - ఆత్మాచ బ్రహ్మ యదిలోకే బ్రహ్మ ఆత్మత్వేన ప్రసిద్ధమస్తి తతో జ్ఞాతమేవ ఇత్య జిజ్ఞాసత్వం. దేహమాత్ర చైతన్య విశిష్టమాత్మా ఇతి ప్రాకృతాః జనాః లోకాయతి కాశ్చ ప్రతిపన్నాం - ఇంద్రియాణ్యేవ చేతనాని ఆత్మా ఇత్యపరే, మనః ఇత్యన్యే; విజ్ఞానమాత్రం క్షణికం ఇత్యేకే; శూన్యమిత్యపరే, అస్తి దేహాది వ్యతిరిక్త స్సంసారీ కర్తా భోక్తా ఇత్యపరే; భోక్తైవ కేవలం నకర్తా ఇత్యకే, అస్తితద్వ్యతిరిక్త ఈశ్వరః; సర్వజ్ఞః సర్వశక్తిః ఇతి కేచిత్; ఆత్మా సభోక్తః ఇత్యపరః; ఏవం బహవో విప్రతిపన్నాః, యుక్తివాక్య తదాభాస సమాశ్రయాస్సంతః. తత్రావిచార్య యత్ కించిత్ప్రతిపద్యమానో నిశ్రేయసాత్ ప్రతిహన్యేతానర్థం చేయాత్. తస్మాత్ బ్రహ్మ జిజ్ఞాసోపన్యాస ముఖేన వేదాంత వాక్య మీమాంసా తదవిరోధి తర్కోపకరణా నిశ్శ్రేయస ప్రయోజనా ప్రస్తూయతే” (శ్రీశంకరః)

“సృష్టిలోనున్న వాటిన్నింటికీ బ్రహ్మయే ఆత్మ అని ప్రసిద్ధికెక్కినది. సమస్త లోకమునకు ఆత్మ అయినదేది కలదో అది బ్రహ్మకంటె వేఱుకాదు. ఆత్మయే బ్రహ్మమే లోకమంతటికి ఆత్మ యని ప్రసిద్ధి పొందుటచేత తెలియతగినదే. అందుచేత దానిని గుఱించి జిజ్ఞాస చేయవలసినదే; తెలుసుకోవలసినదే. ఆత్మ అనగా ఏమిటి? బ్రహ్మ యనగా ఏమిటి? అను విషయము గుఱించి అనేకులు అనేకవిధములుగా చెప్పుచున్నారు. ఎట్లంటే - చైతన్యముగల యీ దేహమే యాత్మ అని లోకాయతికులు చెప్పుచున్నారు. చేతనములైన - చైతన్యవంతములైన - ఇంద్రియములే ఆత్మయని కొందఱు చెప్పుచున్నారు - మనస్సే ఆత్మయని ఇంకొకరి అభిప్రాయము - క్షణికమైన విజ్ఞానమే ఆత్మయని మఱికొందఱి అభిప్రాయము - దేహముకంటె వేరైనవాడు, కర్తా, భోక్తా అయి సంసారములోనుండువాడు ఆత్మయని ఇంకొకరి మతము - ఆ జీవుడు భోక్తయేకాని కర్తకాడు అని మఱికొందఱు చెప్పుచున్నారు. ఈ జీవుని కంటె వేరైన సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు అయిన ఈశ్వరుడనువాడున్నాడు అని కొందఱు చెప్పుచున్నారు, ఈ ప్రకారము వారి వారి యుక్తిని బట్టి అనేకరీతులుగా ఆత్మానునది (బ్రహ్మ) చెప్పబడుచున్నది. వీరి మతములన్నియు - వీరి అభిప్రాయములన్నియు జాగ్రత్తగా విచారించి ఏది నిశ్శ్రేయస్సు కలుగచేసి అనర్థములను పోగొట్టునో అది తెలుసుకొనవలెను - అందుకొఱకు బ్రహ్మజిజ్ఞాసద్వారా, ఉపనిషద్వాక్యముల మీమాంసను, వాటికి విరోధముగా చెప్పు తర్కములను త్రోసివేసి, నిశ్శ్రేయసకరమగు ప్రయోజనముకలది కనుక బ్రహ్మజిజ్ఞాస చేయవలసినది).

  1. బ్రహ్మజిజ్ఞాసకు అధికారులెవరు? ఎప్పుడు చెయవలెననగా: -

“వివేకినో విరక్తస్య శమాది గుణశాలినః |

ముముక్షోరేవహి బ్రహ్మ జిజ్ఞాసా యోగ్యతామతి ||

(ఆత్మానాత్మ వివేకముగలవాడు, వైరాగ్యము పొందినవాడు, శమము, దమము మొదలగు గుణములు కలవాడు, మోక్షము కోరువాడు బ్రహ్మ జిజ్ఞాసకు అధికారులు).

  1. “శా. అజ్ఞుల్ కొందఱు నేముదామనుచు మాయం జెంది సర్వాత్మకున్

బ్రజ్ఞాలభ్యుదురన్వయక్రమణునిన్ భాషింపగానేరరా

జిజ్ఞాసా పథమందు మూఢులుగదా చింతింప బ్రహ్మాది వే

దజ్ఞుల్ తత్పరమాత్ము విష్ణు నితరుల్ దర్శింపగా నేర్తురే “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 5 - 148)

Transliteration
  1. brahmaṇaḥ jijñāsā brahmajijñāsa, jñātuṃ icca jijñāsa.

(brahmanu telusukonavalenanu kōrika).

  1. jñātumiccā jijñāsā, avagati paryaṃtaṃ jñānaṃ sanvācyāyā icchāyāḥ karmaphalaviṣayatvāt iccāyāḥ jñānēna hi pramāṇē nāvagaṃtuṃ iṣṭaṃ brahma. brahmāvagatirhi puruṣārthaḥ niśśēṣa saṃsārabījādyanartha nibarhaṇāt - tasmāt brahma jijñāsi tavyaḥ

(śrī śaṃkaraḥ - brahmasūtrabhāṣyē - 1 - 1 - 1)

(telusukonuṭaku iccha - kōrika - jijñāsayani ceppabaḍunu. jñānamu (brahmajñānamu) avagāhana cēsukonu paryaṃtamu uṃḍu kōrika jijñāsa. aṭlu cēyuṭavalana (brahmajijñāsavalana) phalamunnadi, kanuka. “jñānē naivatu kaivalyaṃ” (jñānamuvalananē mōkṣamu kalugucunnadi ani ceppiyuṃḍuṭavalana brahmanu poṃduṭaku jñānamē pramāṇamaguṭa valana - brahmaprāptiyē paramapuruṣārthamu. saṃsāramunaku bījamagu avidyanu - ajñānamunu śēṣamulēkuṃḍa pōgoṭṭunadi kanuka. aṃducēta brahma jijñāsa (brahmanu telusukonuṭaku iccha) kāvalenu - avasaramu).

  1. “brahmavid brahmaiva bhavati” tasmāt brahma jijñāsā kartavyā.

(brahmabhāvamu jñānamu galavāḍu brahmamē yagunu ani ceppabaḍinadi. aṃducēta ā brahmajñānamu kaluguṭaku jijñāsa (icchāpūrvaka prayatnamu) cēyavalenu).

  1. “yatō nārāyaṇa prasādaṃ ṛtē namōkṣaḥ, na ca jñānaṃvinā atyartha prasādaḥ. atō brahma jijñāsō kartavyā”

(bhagavaṃtuḍaina śrīmannārayaṇuni anugrahamu lēnidē mōkṣamu lēdu - aṭlē brahmajñānamu lēnidē atani atyartha prasādamagu mōkṣamu lēdu. aṃducēta brahmajijñāsa cēyavalasinadē)

  1. aparōkṣa jñānasya ca brahmajijñāsāṃ vinānudayāt atyartha prasdādadvārā mōkṣa sādhanā parōkṣa jñānōtpādikā brahma jijñāsā kartāvyā”.

(brahma jijñāsa lēkunna aparōkṣa jñānamu kalugadu. brahma anagā ēmiṭi? atani tatvamēmiṭi? yanu dānini guṟiṃci vicāramulēnidē dāni guṟiṃci jñānamu kalugadu. bhagavaṃtuni kaṭākṣamu dvārā mōkṣamunaku sādhanamu ayina aparōkṣajñānamu kaligiṃcunadi brahma jijñāsa. aṃducēta brahma jijñāsa cēyavalasinadē - brahma jijñāsaku brahma jñānamu phalamu, brahmajñānamunaku brahmaprāptilēka mōkṣamu phalamu - aṃducēta brahma jijñāsa cēyavalasinadē.

  1. “yasmāt vēda ēvāgnihōtrādīnāṃ śrēyassādhanānā manitya phalatā, darśayati -”: tathya yadhēha karma citō lōkaḥ kṣīyatē,.ēva mēvā mutra puṇya citō lōkaḥ kṣīyatē”

ityādi - tathā brahma vijñānādapi paraṃ puruṣārthaṃ darśayati - “brahma vidāpnō tiparaṃ” ityādi. tasmādyadhōktasādhana saṃpatya naṃtaraṃ brahma jijñāsā kartavyā” (śrīśaṃkaraḥ - brahmasūtrabhāṣyē - 1 - 1 - 11)

(agnihōtramu. yāgamu modalagu śrēyaskaramulagu kartalavalana kalugu phalamunityamukādu ani vēdamu ceppucunnadi. karmamu cēta yī lōkamulō saṃpādiṃcina phalamu kṣīṇiṃcunu, śāśvatamukādu - śāsvatamuga anubhaviṃcuṭakuṃḍadu. ā prakāramugānē brahmajñānamuvalana mōkṣamu kalugunani ceppabaḍinadi. ā prakāramugānē yajña yāgādulavalana saṃpādiṃcina paralōkasukhamulu - svargalōka bhōgamulu - kūḍā kṣīṇiṃcinavenukanu marala janma kalugunu. ā vēdamē brahmajñānamuvalana mōkṣamu kalugunani ceppucunnadi. eṭlanagā: - brahmamunu telusukoninavāḍu - brahmajñānamu kalavāḍu - paramātmanu poṃdunu. (mōkṣamunu poṃdunu) - maṟi janmaluṃḍavu. aṃducēta, iṭlu brahmajñānamucēta śāśvatasukhamu poṃdavaccunu ganuka śāstrōktamugā sādhana saṃpatti kudirina tarvāta brahmajijñāsa cēyavalayunu).

  1. yadhā vēdaḥ karmaphalānityatvaṃ darśayati tathā brahmajñānāt praśāṃta śōkānalaṃ apāraṃ svayaṃjyōtirānaṃdaṃ darśayati.

(vēdamu karmaphalamu nityamainadi kādani ceppucunnaṭlē brahmajñānamu valla sarva duḥkhamulunu upaśamiṃcukoni anaṃtamaina svayaṃjyōtiyu ānaṃdamayuḍu (mōkṣarūpuḍu) ayina parabrahmanu poṃdavaccunani kūḍa vēdamulu ceppucunnavi).

  1. mīmāṃsā pūrva bhāga jātasya karmaṇō(a)lpāsthira phalatvāt uparitana bhāgāvasē yasya brahmajñānasyānaṃtākṣaya phalatvācca pūrva vṛttāt karmajñānāt anaṃtaraṃ tata ēvahētōrbrahma jñātasya mityuktaṃ bhavati. (śrīmān rāmānujaḥ)

(pūrva mīmāṃsalō ceppabaḍina karma cēyuṭavalana kalugu phalamu alpamu, anarthamu ani ceppabaḍiyuṃḍuṭavalananu, uttaramīmāṃsalō (upaniṣattulalō) ceppabaḍina brahmajñānamu anaṃtamainadi, akṣayamaina phalamu kaladani ceppabaḍiyuṃḍuṭacētanu - muṃdu karmakāṃḍa tarvāta jñānakāṃḍa ceppabaḍiyuṃḍuṭavalana brahmanu telusukōvalasinadi - bahma jijñāsa cēyavalasinadi).

  1. “jijñāsyaṃ brahmōktaṃ, tattrilōka prasiddhaṃ? itaradvā? yadi lōka prasiddhaṃ nissaṃdēhaṃ, tadā na jijñāsyaṃ. yadi cā prasiddhamē tattat tat jijñāsyaṃ kathaṃ? itīhanā śaṃkyaṃ satyaṃ jñānamanaṃtaṃ śrutivacanēṣūpalabhyatē brahma.vaināśikādi samayē ṣvatathā bhūtō nirūpyatē hyātma. ataḥ upapannaḥ saṃśayaḥ vēdāṃtavākyanicayai rnyāyōpētairvi ca ritē tatvē vāda vivādōpa citassaṃdēhō nāśamēti nikṣēpaṃ”.

(bhāṣyārtharatnamāla - 1 - 1 - 1)

(brahmanu telusukōvalenu. brahmanu telusukonuṭaku icchakalugavalenu - ayina, brahmalōka prasiddhamā). (lōkamaṃtaṭiki telisinavāḍā? lēka, teliyanivāḍā? lōkamaṃdaṟiki telisinavāḍē ayina nissaṃdēhamugā, telisinavāḍē ayina ika telusukōvalasina panilēdu - avasaramu lēdu. brahma guṟiṃci jijñāsa avasaramu lēdu -lōkamaṃdaṟiki teliyanivāḍaitē atanini guṟiṃci jijñāsa cēyavalasinadē, ayitē, adeṭlu cēyavalayunu? ani saṃśayamakkaralēdu - brahma satpadārthamani jñānarūpuḍani, ē vidhamugā cūcinā aṃtamu lēnivāḍani śruti ceppucunnadi. konni cōṭla adi aṭlukādu ani kūḍa ceppabaḍucunnadi. aṃducēta saṃdēhamu kalugunu. nyāyaśāstramutō upaniṣattula bōdhanu samanvayiṃci paratatvamunu vicāriṃcina yaḍala brahma guṟiṃci jarugu vādōpavādamulatō kūḍina saṃdēhamu pūrtigā tolagipōvunu - aṃdukani brahma jijñāsa cēyavalasinadi).

  1. “tadvijijñāsasva”; “sō(a)nvēṣṭavyaḥ, sa vijijñāsitavyaḥ,” ātmā. vā. arēdraṣṭavyaḥ, śrōtavyaḥ “iti śravaṇa vidhi rupalabhyatē. tasyārthaḥ amṛtatva kāmēnā dvaitātma vicāra ēva vēdāṃta vākyaḥ kartavyaḥ iti”.

(“ā parabrahmanu telusukonumu”; “atanē anvēṣṭiṃpataginavāḍu” - prayatnamucēta telusukonataginavāḍu). “ātma cūḍataginavāḍu - sākṣātkariṃcukōvalasina vāḍu - atani guṟiṃci vinataginavāḍu” ani śāstramu vidhiṃcucunnadi (cēyavalasinadani ceppucunnadi. ā śāstra vākyamula arthamēmanagā - vēdāṃtavākyamula dvārā mōkṣamunu kōruvāḍu advayuṃḍainavāḍu (tanukāka maṟiyoka vastuvulēnivāḍu, aṃtā tānē, annī tānē ayinavāḍu). ayina ātmaguṟiṃci vicāraṇa cēyavalasinadi).

“tadya dhēha karmacitō lōkaḥ -” iti śrutyā yatkṛtaṃ. tadanityamiti nyāyavatyā “najāyatē mriyatēvā vivaścit” - - - yō vaibhūmā tadamṛtamanyadārta “mityādi śrutyāca bhūtvā nityastatō (a)nyada nityamiti vivēkō labhyatē, karmaṇā kṛṣyādinā citaḥ saṃpāditaḥ sasyādirlōkō bhōgya ityarthaḥ - vipaścit nityajñāna svarūpaḥ. parīkṣalōkān karma citān brāhmaṇō nirvēdamā yānnāstya kṛtaḥ kṛtēna”. karmaṇānāsti iti karma tatphalēbhyaḥ vairāgyaṃ prāptavān - “śāṃtō dāṃtaḥ uparataḥ, titakṣaḥ samāhita śraddhāvittō bhūtvā ātmanyēvātmānaṃ paśyēditi” śrutyā śamādiṣaṭkaṃ labhyatē. iti svayaṃ jyōtirānaṃdātmaka mōkṣasya nityatva śrutyā mumukṣau labhyatē. tathāca vivēkādi viśēṣaṇa adhikārī iti jñātuṃ śakyaṃ. pramāṇaṃ cādvai tātmani vēdāṃta ēva - “taṃ tvēpaniṣadaṃ puruṣaṃ”, “vēdāṃta vijñāna suniścitārthāḥ” iti ca śrutēḥ - vēdāṃtānāṃ ca pratyagbrahmaikyaṃ viṣayaḥ, “tatvamasi”, “ahaṃ brahmasmi” iti śrutēḥ - ēvaṃ vicāra vidhēḥ phalamapi jñānadvārā muktiḥ - “tarati śōkamātmavit”, - “brahmavidō brahmaiva bhavati” iti śrutēḥ. (karmacēta saṃpādiṃcinavi (yī lōkamulō) - bhōgarūpamaina phalamulu - ē prakāramugā naśiṃcunaviyō, ā prakāramugānē ikkaḍa cēsina karmalaku kalugu paralōkasukhamulu - svargamulō kalugunavi - kūḍa kṣīṇiṃcunu ani ceppu śruti vākyamunu baṭṭi, ēdi cēyabaḍinadō - ē karma cēyabaḍinadō - dānivalana adi nityamukānidi - śāśvatamugā nuṃḍadu - anu nyāyamu nanusariṃciyu, dēniki janmalēdō, dēniki maraṇamulēdō, ēdi bhūmiyō, adi amṛtamu. adikānidi naśiṃcunadi ani śruti ceppucunnadi. ī prakāramu karmaphalamanityamani telisi, nityajñānasvarūpaḍainavāḍu nirvēdamunu poṃdunu. ātma guṟiṃciyē anniyu priyamaina vastuvulagucunnavi ani telusukoni anātma vastuvulaṃdu (ātmagāni vastuvulaṃdu)vairāgyamunu poṃdunu - ” vāsti akṛtaḥ kṛtēna ” (karmavalana mōkṣamulēdu, kalugadu) ani telusukoni, karmalayaṃdu, dāni valanakalugu phalamulaṃdu vairāgyamunu poṃdinavāḍagunu - śāṃtuḍu, dāṃtuḍu, uparituḍu, titikṣakalavāḍu, samāhita cittamukalavāḍu, śraddha kalavāḍu tanalōnē paramātmanu cūcunu ani śruti ceppuṭacēta śamamu, damamu modalagu śamādiṣaṭkamu ceppabaḍinadi. uparati yanagā sanyāsamu - “naca punarā vartatē” (tirigi maralarāḍu, marala janmiṃcaḍu) anagā svayaṃjyōtisvarūpamu, paramānaṃdarūpamu ayina mōkṣamu nityamainadaguṭavalana mōkṣamunupoṃdunu - (saṃsāramunuṃḍi mōkṣamunupoṃdunu - marala janma lēkuṃḍunu). painaceppina viśēṣamulanu baṭṭi nityānitya vastuvivēkamu modalagu śamādiṣaṭkamu galavāḍē ī brahmajijñāsaku adhikāri yani teliyucunnadi. advayuḍaina ātmanu telusukonuṭalō -brahmajijñāsa cēyuṭaku - pramāṇamu vēdāṃtamē, upaniṣattulē. upaniṣattuleṭlu pramāṇamanagā - “upaniṣattulalō teliyacēyabaḍina puruṣuḍu” (“taṃtvaupaniṣadaṃ puruṣaṃ”) aninnī, “vēdāṃtavijñāna viniścitārthāḥ” (upaniṣattuladvārā kalugu jñānamu cēta bāgugā arthamaina bhagavaṃtuni niścayamugā telusukoninavāru) aninnī ceppuṭavalana upaniṣattulalō ceppabaḍina viṣayamaina vāḍu pratyagātmakaṃṭe vērukānivāḍu - parabrahma - iddarū okkaṭē yani ceppuṭayu; “ā brahmanīvē”, “nēnē ā brahmanu” anu mahāvākyamulanu upaniṣattulu ceppuṭavalananu - vēdamē pramāṇamu - paina ceppina vāṭi valana ā prakāramugā ā prakāramugā parabrahma guṟiṃci vicāraṇa cēyuṭa - telusukonuṭaku iccha kaligi prayatniṃcuṭa - valana phalamēmanagā jñānamudvārā mukti kalugunu. ī saṃgati śrutilōniṭlu ceppabaḍinadi -: ātmajñānamukalavāḍu śōkamunoṃdaḍu - muktini poṃdunu” aninnī “brahmajñānamu kalavāḍu brahmamēyagunu - brahmalō līnamagunu, muktini poṃdunu”).

  1. “śrutyarthābhyāṃ sādhana catuṣṭaya saṃpannasya adhikāriṇaḥ mōkṣasādhana brahma parōkṣa jñānāya vēdāṃta vākya vicāraḥ kartvyaḥ”.

(sādhana catuṣṭaya saṃpatti galigina adhikāriki śrutilō ceppina vākyamula prakāramu mōkṣamunaku sādhanamaina brahmaparōkṣajñānamu saṃpādiṃcuṭaku vēdāṃtavākyamulavicāraṇa (brahma jijñāsa) cēyavalasiyunnadi. eṃducētananagā –

“śāṃtō dāṃtaḥ uparatisthi tikṣa samāhitaḥ |

śraddhāvittō bhūtvā ātmanyēvātmānaṃ paśyēt |“)

śāṃtuḍu, dāṃtuḍu, uparatigalavāḍu, titikṣagalavāḍu (vātātapamulu modalagu vāṭini sahiṃcuvāḍu), samāhita cittuḍu, śraddhakalavāḍu, tanalōnē ātmanu cūḍagalaḍu. ani yunnadi kanuka ā guṇamulukalavāḍe brahmajijñāsaku adhikāri (arhuḍu).

  1. “yadi janmāṃtarakṛtaiḥ karmabhiśśuddhaṃ cittaṃ tadā brahmacaryādēva nanyasya brahma jijñāsi tavyaṃ, yadi na śuddhamiti rāgēṇa jñāyatē, tadā gṛhibhāvēt tatrāpya śuddhau vanībhavēt, tatrāpyaśuddhau tadaiva kālamākalayēt, vanē śuddhau pravrajēt”.

(modaṭi janmalalō cēsina karmalavalana cittaśuddhi kaligiyunnayaḍala brahmacaryamulō nuṃḍiyē sanyasiṃci brahma jijñāsa cēyavalenu - cittaśuddhi lēniyaḍala gṛhasthāśramamunu svīkariṃcavalenu - ā gṛhasthāśramamulō kūḍa cittaśuddhi kaluganiyaḍalavānaprasthāśramamu nāśrayiṃcavalenu - ā āśramamulō kūḍa cittaśuddhi kaluganiyaḍala ā āśramamulōnē cālākālamuṃḍi sanyasiṃcavalayunu).

śāṃtō dāṃta uparati stitiṣussamāhitaḥ |

śraddhāvittōbhūtvā ātmanyēvātmānaṃ paśyēt ||“.

(śāṃtuḍu, dāṃtuḍu uparatigalavāḍu titikṣuvu - vātātapamulu modalaguvāṭini sahiṃcuvāḍu), samāhita cittuḍu tanalōnē ātmanu cūḍagalaḍu ani unnadi kanuka ā guṇamulu kalavāḍu brahma jijñāsaku adhikāri (arhuḍu).

  1. “sarvasyātma tvācca brahmasthitva prasiddhiḥ - sarvasya lōkasya yō ayamātma, tada bhēdāt brahmaṇaḥ.prasiddhiḥ - - - - ātmāca brahma yadilōkē brahma ātmatvēna prasiddhamasti tatō jñātamēva itya jijñāsatvaṃ. dēhamātra caitanya viśiṣṭamātmā iti prākṛtāḥ janāḥ lōkāyati kāśca pratipannāṃ - iṃdriyāṇyēva cētanāni ātmā ityaparē, manaḥ ityanyē; vijñānamātraṃ kṣaṇikaṃ ityēkē; śūnyamityaparē, asti dēhādi vyatirikta ssaṃsārī kartā bhōktā ityaparē; bhōktaiva kēvalaṃ nakartā ityakē, astitadvyatirikta īśvaraḥ; sarvajñaḥ sarvaśaktiḥ iti kēcit; ātmā sabhōktaḥ ityaparaḥ; ēvaṃ bahavō vipratipannāḥ, yuktivākya tadābhāsa samāśrayāssaṃtaḥ. tatrāvicārya yat kiṃcitpratipadyamānō niśrēyasāt pratihanyētānarthaṃ cēyāt. tasmāt brahma jijñāsōpanyāsa mukhēna vēdāṃta vākya mīmāṃsā tadavirōdhi tarkōpakaraṇā niśśrēyasa prayōjanā prastūyatē” (śrīśaṃkaraḥ)

“sṛṣṭilōnunna vāṭinniṃṭikī brahmayē ātma ani prasiddhikekkinadi. samasta lōkamunaku ātma ayinadēdi kaladō adi brahmakaṃṭe vēṟukādu. ātmayē brahmamē lōkamaṃtaṭiki ātma yani prasiddhi poṃduṭacēta teliyataginadē. aṃducēta dānini guṟiṃci jijñāsa cēyavalasinadē; telusukōvalasinadē. ātma anagā ēmiṭi? brahma yanagā ēmiṭi? anu viṣayamu guṟiṃci anēkulu anēkavidhamulugā ceppucunnāru. eṭlaṃṭē - caitanyamugala yī dēhamē yātma ani lōkāyatikulu ceppucunnāru. cētanamulaina - caitanyavaṃtamulaina - iṃdriyamulē ātmayani koṃdaṟu ceppucunnāru - manassē ātmayani iṃkokari abhiprāyamu - kṣaṇikamaina vijñānamē ātmayani maṟikoṃdaṟi abhiprāyamu - dēhamukaṃṭe vērainavāḍu, kartā, bhōktā ayi saṃsāramulōnuṃḍuvāḍu ātmayani iṃkokari matamu - ā jīvuḍu bhōktayēkāni kartakāḍu ani maṟikoṃdaṟu ceppucunnāru. ī jīvuni kaṃṭe vēraina sarvajñuḍu, sarvaśaktimaṃtuḍu ayina īśvaruḍanuvāḍunnāḍu ani koṃdaṟu ceppucunnāru, ī prakāramu vāri vāri yuktini baṭṭi anēkarītulugā ātmānunadi (brahma) ceppabaḍucunnadi. vīri matamulanniyu - vīri abhiprāyamulanniyu jāgrattagā vicāriṃci ēdi niśśrēyassu kalugacēsi anarthamulanu pōgoṭṭunō adi telusukonavalenu - aṃdukoṟaku brahmajijñāsadvārā, upaniṣadvākyamula mīmāṃsanu, vāṭiki virōdhamugā ceppu tarkamulanu trōsivēsi, niśśrēyasakaramagu prayōjanamukaladi kanuka brahmajijñāsa cēyavalasinadi).

  1. brahmajijñāsaku adhikārulevaru? eppuḍu ceyavalenanagā: -

“vivēkinō viraktasya śamādi guṇaśālinaḥ |

mumukṣōrēvahi brahma jijñāsā yōgyatāmati ||

(ātmānātma vivēkamugalavāḍu, vairāgyamu poṃdinavāḍu, śamamu, damamu modalagu guṇamulu kalavāḍu, mōkṣamu kōruvāḍu brahma jijñāsaku adhikārulu).

  1. “śā. ajñul koṃdaṟu nēmudāmanucu māyaṃ jeṃdi sarvātmakun

brajñālabhyuduranvayakramaṇunin bhāṣiṃpagānērarā

jijñāsā pathamaṃdu mūḍhulugadā ciṃtiṃpa brahmādi vē

dajñul tatparamātmu viṣṇu nitarul darśiṃpagā nērturē “. (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 5 - 148)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.