← Back to బ · Booklets 31–40 (digitized file 4)

బ్రహ్మలోకపదము brahmalōkapadamu

Original — తెలుగు

“దేశకాల వస్తు పరిచ్ఛేద శూన్యం, తదవలోక్యతే ఆత్మత్వేన ఇతి బ్రహ్మలోకః, ప్రత్యగభిన్నం బ్రహ్మతత్ పద్యతే యేన సాక్షాత్కారేణ తద్బ్రహ్మలోకపదం -”.

(దేశముచేతగాని, కాలముచేత గాని, వస్తువుచేతగాని పరిచ్ఛేదము - పరిమితి - లేనిది, - అనగా అన్నిప్రదేశములలోను, అన్నికాలములందును, అన్నివస్తువులందును విచక్షణలేక యుండువాడు బ్రహ్మ. అది ఆత్మయనుభావముతో చూడబడుచున్నది కనుక బ్రహ్మలోకము (లోకము = లోక్యతే, ఆలోక్యతే ఇతి లోకః) (చూడబడుచున్నదికనుక లోకము -). ప్రత్యగాత్మకంటె వేఱుగానిదైన తత్పదలక్ష్యార్థమైన పరబ్రహ్మ సాక్షాత్కరించుటచేత పొందబడుచున్నది. కనుక బ్రహ్మలోకపదము (పద్యతే గమ్యతే ఇతి పదం - లోకం = పొందబడుచున్నది కనుక పదము) అని చెప్పబడుచున్నది).

Transliteration

“dēśakāla vastu paricchēda śūnyaṃ, tadavalōkyatē ātmatvēna iti brahmalōkaḥ, pratyagabhinnaṃ brahmatat padyatē yēna sākṣātkārēṇa tadbrahmalōkapadaṃ -”.

(dēśamucētagāni, kālamucēta gāni, vastuvucētagāni paricchēdamu - parimiti - lēnidi, - anagā annipradēśamulalōnu, annikālamulaṃdunu, annivastuvulaṃdunu vicakṣaṇalēka yuṃḍuvāḍu brahma. adi ātmayanubhāvamutō cūḍabaḍucunnadi kanuka brahmalōkamu (lōkamu = lōkyatē, ālōkyatē iti lōkaḥ) (cūḍabaḍucunnadikanuka lōkamu -). pratyagātmakaṃṭe vēṟugānidaina tatpadalakṣyārthamaina parabrahma sākṣātkariṃcuṭacēta poṃdabaḍucunnadi. kanuka brahmalōkapadamu (padyatē gamyatē iti padaṃ - lōkaṃ = poṃdabaḍucunnadi kanuka padamu) ani ceppabaḍucunnadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.