(సమస్తమైన కర్మ బ్రహ్మాత్మకమే యగుటవల్ల - (అంతా బ్రహ్మమే యగుటవల్ల) - బ్రహ్మ మయము - సర్వము బ్రహ్మకార్యమే - బ్రహ్మ చేసినదే -. బ్రహ్మ శరీరమున్నూ, బ్రహ్మమే యగుటవల్ల తత్ అని చెప్పబడునదంతయు బ్రహ్మమే –
క. “హరిమయము విశ్వమంతయు
హరి విశ్వ మయుండు సంశయము పనిలేదా
హరిమయము కాని ద్రవ్యము
పరమాణువు లేదు వంశపావన వింటే“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 1 - 17)
సృష్టి అంతటిలోను బ్రహ్మ తప్ప మఱియొక వస్తువు లేదు - అందుచేతనే బ్రహ్మ అద్వితీయుడు. “అంతా రామమయం బీ జగమంతా రామమయం”, “సర్వం ఖిల్విదం బ్రహ్మ”.
(samastamaina karma brahmātmakamē yaguṭavalla - (aṃtā brahmamē yaguṭavalla) - brahma mayamu - sarvamu brahmakāryamē - brahma cēsinadē -. brahma śarīramunnū, brahmamē yaguṭavalla tat ani ceppabaḍunadaṃtayu brahmamē –
ka. “harimayamu viśvamaṃtayu
hari viśva mayuṃḍu saṃśayamu panilēdā
harimayamu kāni dravyamu
paramāṇuvu lēdu vaṃśapāvana viṃṭē”. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 1 - 17)
sṛṣṭi aṃtaṭilōnu brahma tappa maṟiyoka vastuvu lēdu - aṃducētanē brahma advitīyuḍu. “aṃtā rāmamayaṃ bī jagamaṃtā rāmamayaṃ”, “sarvaṃ khilvidaṃ brahma”.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.