అండాకారముగ (గ్రుడ్డువలెనుండు) బ్రహ్మ.
“పురాకిల న కించినాసీ,న్నద్యౌః నాంతరిక్షం, న పృధివీ కేవలం జ్యోతిరూపం, అనాద్యనంతమనణ్వ మ స్థూల రూపమరూపం, రూపవద విజ్ఞేయం, జ్ఞానరూపమానందమయం ఆసీత్. తదనన్యత్; తద్ద్వేథాభూత్ - హరిత మేకం, రక్తమపరం; తత్రయద్రక్తం తత్పుంసో రూపమభూత్; యద్ధరితం తన్మాయాయాః; తౌ సమాగచ్చతః. తయోర్వీర్యామేవ మనం దత్. తదవర్థత; తదండమభూత్ హైమం”
(అవ్యక్తోపనిషత్)
(పూర్వము - సృష్టికి పూర్వము - ఏదియులేదు - స్వర్గము లేదు ఆకాశములేదు, భూమిలేదు. కేవలము జ్యోతీరూపము - (ప్రకాశమే రూపముగా గలది) ఒకటి యుండెను - అది జన్మ లేనిది (ఎట్లు ఎచ్చటనుండి కలిగినదో తెలియనిది), అంతములేనిది, (అంతటను నిండియున్నది; చిన్నదికాదు, పెద్దది కాదు; రూపముకలది,రూపములేనిది (రూపమున్నట్లు తెలుసుకొనుటకు వీలులేనిది; జ్ఞానరూపమైనది, ఆనందమయ మైనది, ఇటువంటిది ఇది ఒకటే యుండెను - దానికంటె వేరైన వస్తువేదీ లేకుండెను - అది రెండుగా ఆయెను - ఒకటి హరితము, రెండవది రక్తము - ఎఱ్ఱనిది. వాటిలో రక్తము పురుషరూపము. హరితము మాయ. ఆ రెండు దగ్గరకువచ్చి ఒకదానితోనొకటి కలిసెను - వీటి వీర్యము వృద్ధిపొందెను - అదియే అండాకార ముగా ఆయెను - ఆ అండము హేమమయమైనది - (ప్రపంచమును సృష్టించగల వీర్యము - శక్తి గలది).
(పంచీకరణము కానటువంటి పంచమహాభూతాత్మకమైన హిరణ్యగర్భ తత్వము - సృష్టిని చేయు చైతన్యశక్తిగల తత్వము - ప్రకృతి - అండాకారముగా నుండునది బ్రహ్మాండము. అన్నింటికన్న చాలా పెద్ద్దదిగా పెరిగి అండరూపముగానున్న తత్వము - గుడ్డులోనుండి పిల్ల పైకి వచ్చినట్లు ప్రపంచాకారముగా వృద్ధి పొంది మార్పు చెందిన తత్వము - ఇందులోనుండి సమస్త వస్తువులు రూపము చెందునుకనుక ఇది హిరణ్యగర్భుడు - చతుర్ముఖ బ్రహ్మ అని కూడ చెప్పబడుచున్నది. దీని లోపల లోకములన్నియు సూక్ష్మరూపములో నున్నవి. ఈ అండము పగిలినపుడు అందులోని సూక్ష్మవస్తువులు ఆకాశములో విరజిల్లుకుపోయి లోకములుగా తర్వాత రూపము చెందినవి. వివిధములైన అనేకరూపములతో నున్న అనేక వస్తువులు దీనిలో కలిసి ఒకే వస్తువుగా నుండుటచేత ఇది విరాడ్రూపమని (వివిధం రాజతే = అనేక విధములుగా ప్రకాశించు వాడు) - అని చెప్పబడుచున్నది).
(ఈ అండములో - బ్రహ్మాండములో - లోకములన్నియు, సప్తద్వీపములు భూమి ఉన్నవి. ఆ అండము పేలిపోగా దానిలోనుండి - గుడ్డులోనుండి పిల్ల పుట్టినట్టు - ఇవన్నియు పైకి వచ్చి చెల్లాచెదరైనవి).
“సీ.”గురు శక్తియే విరాట్పురుషుండు సంభవంబయ్యె“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 26 - 893., 894)
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 5 - 86)
తదండమభవత్, హైమం సహస్రాంశు సమప్రభం |“.
ఇతి మనుః “.
(భగవంతుడు సృష్టిచేయ కోరికగలవాడై మొదట జలమును సృజించెను. దానిలో వీర్యమును సృజించెను. అదియే సహస్రాంశుడైన సూర్యునివలె కాంతి కలిగిన హేమమయమైన అండమాయెను - హేమమనగా దానిలోనుండి జగములను పుట్టింపచేయు భగవచ్ఛక్తి - చైతన్య శక్తి - దీనిని బట్టియే చతుర్ముఖ బ్రహ్మకు హిరణ్యగర్భుడని పేరు కలిగినది).
(పదునాలుగు లోకములు తన కడుపులోగల బ్రహ్మాండం - బ్రహ్మాండములో పదునాలుగు లోకములుగా పరిణమించగల వస్తువులు సూక్ష్మరూపములో నున్నవి). “చతుర్దశ భువనోపలక్షితానంత కోటి బ్రహ్మాండాని”.(పదునాలుగు లోకములు తనలోగల బ్రహ్మాండము అని చెప్పుటవలన అటువంటి అనంతకోటి బ్రహ్మాండములు చెప్పబడినవి).
(నీటిలోనుండు సూక్ష్మప్రాణుల అండములు రాశులుగా (అండరాశులుగా) నీటిలో ఎట్లున్నవో ఆ ప్రకారముగా భగవతియైన దేవియందు అనంతములైన బ్రహ్మాండములున్నవి).
డుండి జగంబులకు దీప్తి నొసగెడి క్రియ బ్ర
హ్మాండము లోపల నచ్యుతు
డుండుచు బహిరంతముల నొగి దెలిగించున్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 26 - )
అతః ఊర్థ్వంచ వైకుంఠో బ్రహ్మాండాద్బహిరేవ సః|
తతః ఊర్థ్వంచ గోలోకః పంచాశత్కోటి యోజనాః ||“. (దేవీభాగవతము)
(పాతాళము మొదలు బ్రహ్మలోకం వరకు గలదంతయు బ్రహ్మాండమని చెప్పబడుచున్నవి. ఈ బ్రహ్మాండము మీదను వైకుంఠమున్నది. ఇది బ్రహ్మాండమునకు వెలుపల నున్నది. వైకుంఠమునకు మీదను గోలోకమున్నది).
(బ్రహ్మవిద్యాసుధార్ణవము - 7)
“ఇప్పుడు నీకెఱింగించిన వెల్లను (భూద్వీపవర్ష సరిదద్రి నభస్సముద్ర పాతాళా ఙ్నరక తారాగణ లోకము) బ్రహ్మాండ కోశంబునం గలవని పురాణంబులు పలుకుచుండు, అట్టి బ్రహ్మాండంబు శ్రీమన్నారాయణుని స్థూల శరీరంబగుటంజేసి బ్రహ్మాండంబెవ్వరు వర్ణింతురు ఎవ్వరు విందురు వారలకు సకల శ్రేయస్సులం గలుగును - - - భూద్వీప వర్షసరిదద్రి నభ స్సముద్ర పాతాళ దిఙ్నరక తారాగణ లోక సంస్థితంబయి సకల జీవనికాయ్యంబైన శ్రీహరి స్థూలశరీరంబు వినిపించితిని”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 5 - 2 - 162)
ఏకస్మిన్న విద్యాపాదే అనంతకోటి బ్రహ్మాండాని సావరణాని శ్రూయంతే – తస్మిన్నే కస్మిన్నండే బహవశ్చ లోకాశ్చ బహవో వైకుంఠాశ్చ అనంత విభూతయశ్చ సంత్యేవ. సర్వాండేషు అనంతలోకాశ్చ అనంత వైకుంఠాశ్చ సంతీతి సర్వేషాం ఖల్వభిమతం.
(ఒకే అవిద్యాపాదమందే ఆవరణములతో కూడిన అనంతకోటి బ్రహ్మాండములున్నవి అని శ్రుతులలో వినవచ్చుచున్నది. వాటిలో ఒక్కొక్క అండములో అనేకమైన లోకములు, అనేకమైన వైకుంఠములు, లెక్కలేనన్ని భగవంతుని విభూతులు (భగవంతుని అనేక విధములైన రూపములు) ఉన్నవి.అన్ని బ్రహ్మాండములలోను లెక్కకు మించిన లోకములు, వైకుంఠములు ఉన్నవని అందఱూ అభిప్రాయ పడుచున్నారు).
(బ్రహ్మాండమనునది కోడి గ్రుడ్డు ఆకారముగానుండి, మహత్తత్వము మొదలగువాటి సమష్ట్యాకారం (తత్వములన్నియు ఒకే ఆకారముగా కలిసియుండు స్థితి) ఎల్లపుడు తపింపబడుచుండునది (భగవంతుడు దానిలో తన చైతన్య శక్తితో దానిలో ప్రవేశించియుండి - పాలలోనుండి వెన్నవలె, పాలసముద్రములో నుండి విషము, అమృతము, శ్రీలక్ష్మి మొదలగు వాటినావర్భింపచేసినట్లు - ఆ అండమునుండి మహత్తత్త్వము మొదలగు తత్వములను ఆవిర్భవింపచేయుటకు వలసిన తపనము (మధినము) చేయుట వలన నిత్యము తపింప చేయబడి నదానివలె నుండునది, మరుగుచున్న జాంబూనవముతో సమానమైన కాంతిగలది, కోటిసూర్యులు ఉదయించినపుడు కలుగు కాంతిగలది, చతుర్విధమైన సృష్టికి (అండజములు, స్వేదజములు, జరాయుజములు మొదలగు వాటి సృష్టికి ఉపలక్షితమైనది, అయిదు మహాభూతముల చేత ఆవరింప బడినది; మహత్తత్త్వము, అహంకారము,తమస్సు మూలప్రకృతి అనువాటిచేత పరివేష్టింపబడినది; శ్రీమన్నారాయణుని క్రీడకు బంతివలెనుండునది, కనివిని యెఱుగనట్టి అనేక విచిత్రములకు, విశేషములకు ఉపలక్షితమైనది. ఇట్టి బ్రహ్మాండము వంటివి ఆవరణలతో కూడియుండునవి, అనంతకోటి బ్రహ్మాండములు (లెక్కలేనన్ని కోట్లసంఖ్యలో) ఉన్నవి, చతుర్ముఖ బ్రహ్మాండమని, పంచముఖ బ్రహ్మాండమని, షణ్ముఖబ్రహ్మాండమని, సప్తముఖబ్రహ్మాండమని, అష్టముఖబ్రహ్మాండమని - యీ ప్రకారముగా వేయి ముఖములుగలవి వరకు బ్రహ్మాండములు కలవు - ఇవన్నియు నారాయణాంశములు, రజోగుణము ప్రధానముగా గలవి, ఒక్కొక్కదానికి ఒక్కొక్క సృష్టికర్త అధిష్టించి యుండును - నారాయణాంశ లైన విష్ణు మహేశ్వరులు, సత్వ, తమోగుణములు ప్రధానముగా గలవారు, సృష్టి స్థితి సంహారములు చేయువారు అయిన వారిచే అధిష్టింపబడియున్నవి. క్రీడాసక్తులైన వారియొక్క అరచేతిలోని అమలకమువలె మహావిష్ణుని చేతిలో ఈ అనంతకోటి బ్రహ్మాండములున్నవి).
(ఈ బ్రహ్మాండమనుదానినే ఆధినిక శాస్త్రజ్ఞులు cosmic egg అని చెప్పుదురు - దాని భేధనమును - బ్రహ్మాండముపేలుటను వారు Big Bang అని చెప్పుదురు - అండాకారముగానున్న బ్రహ్మ - బ్రహ్మ అనగా మున్ముందు ప్రపంచములుగాను, జీవకోటిగాను మారుటకు - వృద్ధి పొందుటకు తగిన సూక్ష్మస్థితిలోనున్న వస్తువులు - అవి భగవంతుని శక్తి గలవై ఒకదానినొకటి ఆకర్షించి ఒక పెద్ద వస్తువుగా అయి, లోన వేడిమి పట్టలేకపోయినపుడు - చుంచుబుడ్డు పేలిపోయినప్పుడువలె - కలుగు రవము - (శబ్దము) Big Bang అని చెప్పబడు చున్నది. అదియే సృష్టిలోని మొదటి శబ్దము - అట్లు పేలినపుడు అపరిమితమైన శక్తి (Energy) (An enoromous amount of energy must have been released) అంతట విరజిమ్ముకొనిపోయి అన్ని వస్తువులలోను పూర్తిగా వ్యాపించి అంతర్గతమై వాటిని శక్తివంతములుగా చేయును - ఇందువలననే సృష్టిలోని ప్రతివస్తువులోను పెద్దదైనను చిన్నదైనను భగవంతుని చైతన్య శక్తి యున్నది - భగవతుడు తన శక్తిరూపములో నున్నాడు –
“క. ఇందుగలడందులేడని
సందేహమువలదు, చక్రి సర్వోపగతుం
డెందెందు వెతకి చూచిన
నందందే గలడు, దానవాగ్రణి, వింటే“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 8 - 275)
(Every particle of matter contains ENERGY). (చూడుము - “మార్తాండుడు - అండము - సృష్టి”).
భవనాకృతితోడనుండు బ్రహ్మాండం బున్
వివరముతో బదునాలుగు
వివరంబులుగా నొనర్చె విశదంబు లుగన్“.
“మ. బహుపాదోరు భుజాననేక్షణ శిరః సాల శ్రవోపేతుడై
విహరించున్ బహుదేహి దేహగతుడై విద్వాంసులూహించి త
ద్బహురూపావయవంబులన్ భువన పంక్తిన్ విచారింతురు - - - “.
“సీ. జీవాదృష్టపరుడు మాయాయుక్త పురుషవరుడు
గాలాత్మకుడునను కారణంబున నిర్వికారుడైనట్టి జగన్నివాసు
డాదిజాతక్షోభుడయ్యె, నమ్మేటివలనను గుణత్రయంబును జనించె
నాగుణత్రయంబునందయ్యె మహత్తత్త్వమిది రజోగుణ హేతువైన, దాని
యందహంకార నెలగి ద్రిగుణాత్మకమున
బొడమె; మఱిదానివలన బ్రభూతమయ్యె
బంచ తన్మాత్రలందు సంభవము నొందె
భూతపంచకమీ సృష్టిహేతువగుచు
“వ. అవియును దమలోన బ్రత్యేకంబ భువన నిర్మాణంబునకు సమర్థంబులుగాక, యన్నింటి సంఘాతంబున బాంచ భౌతికంబైన హిరణ్మయాండంబు సృజియించె. అదియును జలాంతర్వర్తియై వృద్ధిబొందుచుండె”.
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 19 -717; 718).(చూడుము - బ్రహ్మాండభేధనము)
aṃḍākāramuga (gruḍḍuvalenuṃḍu) brahma.
“purākila na kiṃcināsī,nnadyauḥ nāṃtarikṣaṃ, na pṛdhivī kēvalaṃ jyōtirūpaṃ, anādyanaṃtamanaṇva ma sthūla rūpamarūpaṃ, rūpavada vijñēyaṃ, jñānarūpamānaṃdamayaṃ āsīt. tadananyat; taddvēthābhūt - harita mēkaṃ, raktamaparaṃ; tatrayadraktaṃ tatpuṃsō rūpamabhūt; yaddharitaṃ tanmāyāyāḥ; tau samāgaccataḥ. tayōrvīryāmēva manaṃ dat. tadavarthata; tadaṃḍamabhūt haimaṃ”
(avyaktōpaniṣat)
(pūrvamu - sṛṣṭiki pūrvamu - ēdiyulēdu - svargamu lēdu ākāśamulēdu, bhūmilēdu. kēvalamu jyōtīrūpamu - (prakāśamē rūpamugā galadi) okaṭi yuṃḍenu - adi janma lēnidi (eṭlu eccaṭanuṃḍi kaliginadō teliyanidi), aṃtamulēnidi, (aṃtaṭanu niṃḍiyunnadi; cinnadikādu, peddadi kādu; rūpamukaladi,rūpamulēnidi (rūpamunnaṭlu telusukonuṭaku vīlulēnidi; jñānarūpamainadi, ānaṃdamaya mainadi, iṭuvaṃṭidi idi okaṭē yuṃḍenu - dānikaṃṭe vēraina vastuvēdī lēkuṃḍenu - adi reṃḍugā āyenu - okaṭi haritamu, reṃḍavadi raktamu - eṟṟanidi. vāṭilō raktamu puruṣarūpamu. haritamu māya. ā reṃḍu daggarakuvacci okadānitōnokaṭi kalisenu - vīṭi vīryamu vṛddhipoṃdenu - adiyē aṃḍākāra mugā āyenu - ā aṃḍamu hēmamayamainadi - (prapaṃcamunu sṛṣṭiṃcagala vīryamu - śakti galadi).
(paṃcīkaraṇamu kānaṭuvaṃṭi paṃcamahābhūtātmakamaina hiraṇyagarbha tatvamu - sṛṣṭini cēyu caitanyaśaktigala tatvamu - prakṛti - aṃḍākāramugā nuṃḍunadi brahmāṃḍamu. anniṃṭikanna cālā pedddadigā perigi aṃḍarūpamugānunna tatvamu - guḍḍulōnuṃḍi pilla paiki vaccinaṭlu prapaṃcākāramugā vṛddhi poṃdi mārpu ceṃdina tatvamu - iṃdulōnuṃḍi samasta vastuvulu rūpamu ceṃdunukanuka idi hiraṇyagarbhuḍu - caturmukha brahma ani kūḍa ceppabaḍucunnadi. dīni lōpala lōkamulanniyu sūkṣmarūpamulō nunnavi. ī aṃḍamu pagilinapuḍu aṃdulōni sūkṣmavastuvulu ākāśamulō virajillukupōyi lōkamulugā tarvāta rūpamu ceṃdinavi. vividhamulaina anēkarūpamulatō nunna anēka vastuvulu dīnilō kalisi okē vastuvugā nuṃḍuṭacēta idi virāḍrūpamani (vividhaṃ rājatē = anēka vidhamulugā prakāśiṃcu vāḍu) - ani ceppabaḍucunnadi).
(ī aṃḍamulō - brahmāṃḍamulō - lōkamulanniyu, saptadvīpamulu bhūmi unnavi. ā aṃḍamu pēlipōgā dānilōnuṃḍi - guḍḍulōnuṃḍi pilla puṭṭinaṭṭu - ivanniyu paiki vacci cellācedarainavi).
“sī.”guru śaktiyē virāṭpuruṣuṃḍu saṃbhavaṃbayye”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 26 - 893., 894)
(śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 5 - 86)
tadaṃḍamabhavat, haimaṃ sahasrāṃśu samaprabhaṃ |“.
iti manuḥ “.
(bhagavaṃtuḍu sṛṣṭicēya kōrikagalavāḍai modaṭa jalamunu sṛjiṃcenu. dānilō vīryamunu sṛjiṃcenu. adiyē sahasrāṃśuḍaina sūryunivale kāṃti kaligina hēmamayamaina aṃḍamāyenu - hēmamanagā dānilōnuṃḍi jagamulanu puṭṭiṃpacēyu bhagavacchakti - caitanya śakti - dīnini baṭṭiyē caturmukha brahmaku hiraṇyagarbhuḍani pēru kaliginadi).
(padunālugu lōkamulu tana kaḍupulōgala brahmāṃḍaṃ - brahmāṃḍamulō padunālugu lōkamulugā pariṇamiṃcagala vastuvulu sūkṣmarūpamulō nunnavi). “caturdaśa bhuvanōpalakṣitānaṃta kōṭi brahmāṃḍāni”.(padunālugu lōkamulu tanalōgala brahmāṃḍamu ani ceppuṭavalana aṭuvaṃṭi anaṃtakōṭi brahmāṃḍamulu ceppabaḍinavi).
(nīṭilōnuṃḍu sūkṣmaprāṇula aṃḍamulu rāśulugā (aṃḍarāśulugā) nīṭilō eṭlunnavō ā prakāramugā bhagavatiyaina dēviyaṃdu anaṃtamulaina brahmāṃḍamulunnavi).
ḍuṃḍi jagaṃbulaku dīpti nosageḍi kriya bra
hmāṃḍamu lōpala nacyutu
ḍuṃḍucu bahiraṃtamula nogi deligiṃcun”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 26 - )
ataḥ ūrthvaṃca vaikuṃṭhō brahmāṃḍādbahirēva saḥ|
tataḥ ūrthvaṃca gōlōkaḥ paṃcāśatkōṭi yōjanāḥ ||“. (dēvībhāgavatamu)
(pātāḷamu modalu brahmalōkaṃ varaku galadaṃtayu brahmāṃḍamani ceppabaḍucunnavi. ī brahmāṃḍamu mīdanu vaikuṃṭhamunnadi. idi brahmāṃḍamunaku velupala nunnadi. vaikuṃṭhamunaku mīdanu gōlōkamunnadi).
(brahmavidyāsudhārṇavamu - 7)
“ippuḍu nīkeṟiṃgiṃcina vellanu (bhūdvīpavarṣa saridadri nabhassamudra pātāḷā ṅnaraka tārāgaṇa lōkamu) brahmāṃḍa kōśaṃbunaṃ galavani purāṇaṃbulu palukucuṃḍu, aṭṭi brahmāṃḍaṃbu śrīmannārāyaṇuni sthūla śarīraṃbaguṭaṃjēsi brahmāṃḍaṃbevvaru varṇiṃturu evvaru viṃduru vāralaku sakala śrēyassulaṃ galugunu - - - bhūdvīpa varṣasaridadri nabha ssamudra pātāḷa diṅnaraka tārāgaṇa lōka saṃsthitaṃbayi sakala jīvanikāyyaṃbaina śrīhari sthūlaśarīraṃbu vinipiṃcitini”. (śrīmadāṃdhramahābhāgavatamu - 5 - 2 - 162)
ēkasminna vidyāpādē anaṃtakōṭi brahmāṃḍāni sāvaraṇāni śrūyaṃtē – tasminnē kasminnaṃḍē bahavaśca lōkāśca bahavō vaikuṃṭhāśca anaṃta vibhūtayaśca saṃtyēva. sarvāṃḍēṣu anaṃtalōkāśca anaṃta vaikuṃṭhāśca saṃtīti sarvēṣāṃ khalvabhimataṃ.
(okē avidyāpādamaṃdē āvaraṇamulatō kūḍina anaṃtakōṭi brahmāṃḍamulunnavi ani śrutulalō vinavaccucunnadi. vāṭilō okkokka aṃḍamulō anēkamaina lōkamulu, anēkamaina vaikuṃṭhamulu, lekkalēnanni bhagavaṃtuni vibhūtulu (bhagavaṃtuni anēka vidhamulaina rūpamulu) unnavi.anni brahmāṃḍamulalōnu lekkaku miṃcina lōkamulu, vaikuṃṭhamulu unnavani aṃdaṟū abhiprāya paḍucunnāru).
(brahmāṃḍamanunadi kōḍi gruḍḍu ākāramugānuṃḍi, mahattatvamu modalaguvāṭi samaṣṭyākāraṃ (tatvamulanniyu okē ākāramugā kalisiyuṃḍu sthiti) ellapuḍu tapiṃpabaḍucuṃḍunadi (bhagavaṃtuḍu dānilō tana caitanya śaktitō dānilō pravēśiṃciyuṃḍi - pālalōnuṃḍi vennavale, pālasamudramulō nuṃḍi viṣamu, amṛtamu, śrīlakṣmi modalagu vāṭināvarbhiṃpacēsinaṭlu - ā aṃḍamunuṃḍi mahattattvamu modalagu tatvamulanu āvirbhaviṃpacēyuṭaku valasina tapanamu (madhinamu) cēyuṭa valana nityamu tapiṃpa cēyabaḍi nadānivale nuṃḍunadi, marugucunna jāṃbūnavamutō samānamaina kāṃtigaladi, kōṭisūryulu udayiṃcinapuḍu kalugu kāṃtigaladi, caturvidhamaina sṛṣṭiki (aṃḍajamulu, svēdajamulu, jarāyujamulu modalagu vāṭi sṛṣṭiki upalakṣitamainadi, ayidu mahābhūtamula cēta āvariṃpa baḍinadi; mahattattvamu, ahaṃkāramu,tamassu mūlaprakṛti anuvāṭicēta parivēṣṭiṃpabaḍinadi; śrīmannārāyaṇuni krīḍaku baṃtivalenuṃḍunadi, kanivini yeṟuganaṭṭi anēka vicitramulaku, viśēṣamulaku upalakṣitamainadi. iṭṭi brahmāṃḍamu vaṃṭivi āvaraṇalatō kūḍiyuṃḍunavi, anaṃtakōṭi brahmāṃḍamulu (lekkalēnanni kōṭlasaṃkhyalō) unnavi, caturmukha brahmāṃḍamani, paṃcamukha brahmāṃḍamani, ṣaṇmukhabrahmāṃḍamani, saptamukhabrahmāṃḍamani, aṣṭamukhabrahmāṃḍamani - yī prakāramugā vēyi mukhamulugalavi varaku brahmāṃḍamulu kalavu - ivanniyu nārāyaṇāṃśamulu, rajōguṇamu pradhānamugā galavi, okkokkadāniki okkokka sṛṣṭikarta adhiṣṭiṃci yuṃḍunu - nārāyaṇāṃśa laina viṣṇu mahēśvarulu, satva, tamōguṇamulu pradhānamugā galavāru, sṛṣṭi sthiti saṃhāramulu cēyuvāru ayina vāricē adhiṣṭiṃpabaḍiyunnavi. krīḍāsaktulaina vāriyokka aracētilōni amalakamuvale mahāviṣṇuni cētilō ī anaṃtakōṭi brahmāṃḍamulunnavi).
(ī brahmāṃḍamanudāninē ādhinika śāstrajñulu cosmic egg ani ceppuduru - dāni bhēdhanamunu - brahmāṃḍamupēluṭanu vāru Big Bang ani ceppuduru - aṃḍākāramugānunna brahma - brahma anagā munmuṃdu prapaṃcamulugānu, jīvakōṭigānu māruṭaku - vṛddhi poṃduṭaku tagina sūkṣmasthitilōnunna vastuvulu - avi bhagavaṃtuni śakti galavai okadāninokaṭi ākarṣiṃci oka pedda vastuvugā ayi, lōna vēḍimi paṭṭalēkapōyinapuḍu - cuṃcubuḍḍu pēlipōyinappuḍuvale - kalugu ravamu - (śabdamu) Big Bang ani ceppabaḍu cunnadi. adiyē sṛṣṭilōni modaṭi śabdamu - aṭlu pēlinapuḍu aparimitamaina śakti (Energy) (An enoromous amount of energy must have been released) aṃtaṭa virajimmukonipōyi anni vastuvulalōnu pūrtigā vyāpiṃci aṃtargatamai vāṭini śaktivaṃtamulugā cēyunu - iṃduvalananē sṛṣṭilōni prativastuvulōnu peddadainanu cinnadainanu bhagavaṃtuni caitanya śakti yunnadi - bhagavatuḍu tana śaktirūpamulō nunnāḍu –
“ka. iṃdugalaḍaṃdulēḍani
saṃdēhamuvaladu, cakri sarvōpagatuṃ
ḍeṃdeṃdu vetaki cūcina
naṃdaṃdē galaḍu, dānavāgraṇi, viṃṭē”. (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 8 - 275)
(Every particle of matter contains ENERGY). (cūḍumu - “mārtāṃḍuḍu - aṃḍamu - sṛṣṭi”).
bhavanākṛtitōḍanuṃḍu brahmāṃḍaṃ bun
vivaramutō badunālugu
vivaraṃbulugā nonarce viśadaṃbu lugan”.
“ma. bahupādōru bhujānanēkṣaṇa śiraḥ sāla śravōpētuḍai
vihariṃcun bahudēhi dēhagatuḍai vidvāṃsulūhiṃci ta
dbahurūpāvayavaṃbulan bhuvana paṃktin vicāriṃturu - - - “.
“sī. jīvādṛṣṭaparuḍu māyāyukta puruṣavaruḍu
gālātmakuḍunanu kāraṇaṃbuna nirvikāruḍainaṭṭi jagannivāsu
ḍādijātakṣōbhuḍayye, nammēṭivalananu guṇatrayaṃbunu janiṃce
nāguṇatrayaṃbunaṃdayye mahattattvamidi rajōguṇa hētuvaina, dāni
yaṃdahaṃkāra nelagi driguṇātmakamuna
boḍame; maṟidānivalana brabhūtamayye
baṃca tanmātralaṃdu saṃbhavamu noṃde
bhūtapaṃcakamī sṛṣṭihētuvagucu
“va. aviyunu damalōna bratyēkaṃba bhuvana nirmāṇaṃbunaku samarthaṃbulugāka, yanniṃṭi saṃghātaṃbuna bāṃca bhautikaṃbaina hiraṇmayāṃḍaṃbu sṛjiyiṃce. adiyunu jalāṃtarvartiyai vṛddhiboṃducuṃḍe”.
(śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 19 -717; 718).(cūḍumu - brahmāṃḍabhēdhanamu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.