← Back to బ · Booklets 31–40 (digitized file 4)

బ్రహ్మానందము brahmānaṃdamu

Original — తెలుగు
  1. బ్రహ్మానుభవమువలన, బ్రహ్మ సాక్షాత్కారము వలన కలుగు ఆనందము -

  2. జీవ బ్రహ్మలు ఒకటే - “అహం బ్రహ్మస్మి” (నేనే బ్రహ్మ అయితిని) అను మహావాక్యార్థమును తత్వరీత్యా తెలుసుకొనుటవలన కలిగిన ఆనందము - అది స్వరూపజ్ఞానమువలన కలుగును.

  3. “ప్రజ్ఞానమానందం బ్రహ్మ” అని శ్రుతివాక్యము - పరబ్రహ్మ జ్ఞాన మయుడు - సర్వజ్ఞుడు - చిన్మయుడు, ఆనందమయుడు. పరబ్రహ్మమే పరమ పదము, లేక మోక్షము, మోక్షమే అత్యంత సుఖమును కలుగచేయునది. అందుచేత దాని వలన కలుగు సుఖము బ్రహ్మానందము -

  4. “సచ్చిదానందం బ్రహ్మ” అని శ్రుతి వాక్యము - పరబ్రహ్మ సద్రూపుడు, చిద్రూపుడు (చిన్మాత్రుడు), ఆనందరూపుడు - మోక్షరూపుడగుటవలన పరమానందమయుడు. పరమాత్ముడు అంతము లేనివాడు కనుక మోక్ష రూపమైన బ్రహ్మానందము కూడా అంతము లేనిదే.

  5. “సకల ఉపాధులున్నూ తొలంగి నిజస్వరూపమై, తనకు కూటస్థ స్వరూపమైన సహజ సుఖమే బ్రహ్మానందమనిపించికొనును”.

(బ్రహ్మ విద్యాసుధార్ణవము)

  1. క్షుద్రానందా స్సమస్తాస్తే బ్రహ్మానందలవాః యతః |

అవిద్యా కల్పితోపాధి తారతమ్యాదనేక థా |

బ్రహ్మానందస్తు సర్వత్రి వ్యాపకః సత్య ఆంతరః |

జడదుఃఖానృతాకారే ప్రపంచే కుత్రవా సుఖం |

సచ్చిదానందమద్వైత సుఖం బ్రహ్మైవ సర్వగం |

తథాచ శుద్ధచిత్తస్యతవ నిష్కామకర్మభిః |

ఆత్మజ్ఞానోదయే బ్రహ్మానంద ప్రాప్తిః స్వతో భవేత్ ||“. (గీతాభావప్రకాశము - 2 - 491 to 494)

(సమస్తమైన క్షుద్రానందములు - క్షుద్ర వస్తువులవలన కలిగెడి ఆనందములు - బ్రహ్మానందము యొక్క లేశము - అవి అవిద్యచేత కల్పింపబడిన ఉపాధుల తారతమ్యమువలన అనేక ప్రకారములు - బ్రహ్మానందము అంతటా వ్యాపించియున్నది, మూడుకాలములందుండునది, ఆంతరము, జడము, దుఃఖమయము, అనృతరూపము అయిన ఈ ప్రపంచమందు సుఖమెక్కడిది? సచ్చిదానందమైన అద్వైతసుఖము బ్రహ్మానందమే - ఆ బ్రహ్మానందము అంతటను వ్యాపించి యున్నది. ఆ ప్రకారముగా చిత్తశుద్ధికలిగిన నీకు (కలిగినవానికి) నిష్కామకర్మలచేత - నిష్కామకర్మ యోగముచేత ఆత్మజ్ఞానోదయము కలుగగానే బ్రహ్మానందప్రాప్తి తానంతట అదే కలుగును).

ఆనందభేదాః - “మానుషానందః, మనుష్యగంధర్వవానందః, దేవగంధర్వానందః, చిరలోకా నందః, అజానజానందః కర్మదేవానందః దేవానందః, ఇంద్రానందః, బృహస్పతేరానందః, ప్రజాపతే రానందః, బ్రహ్మానందః. ఏవం పూర్వస్యాః పూర్వస్యాః భూమేః ఉత్తరస్యాం ఉత్తరస్యాం భూమే ప్రసాగ విశేషతః శతగుణేవ ఆనందోత్కర్షః ఉపపద్యతే. యత్ర ఏతే ఆనందభేదాః ఏకతాం గచ్ఛంతి ధర్మశ్చ తన్నిమిత్తం జ్ఞానంచ తద్విషయం అకామహ తత్వంచ నిరతిశయం, యత్రస్వష హిరణ్యగర్భః బ్రహ్మ తస్య ఏష ఆనందః బ్రహ్మానందః శ్రోత్రియేణ ఆవృజినేన అకామహతేన చ సర్వతః ప్రత్య్క్షం ఉపలభ్యతే, తస్మాత్ ఏతాని త్రీణి సాధనాని ఇత్యవగమ్యతే”.

(ఆనందము అనేక విధములుగా చెప్పబడినది : - మానుషానందము మొదలు బ్రహ్మానందము వరకు గలవి పైన (సంస్కృతమూలములో) చెప్పబడినవి. వాటిలో ముందు చెప్పినదానికంటె తర్వాత తర్వాత చెప్పబడినవి ఒకదానికంటె ఒకటి ప్రసాద విశేషమువలన నూరు రెట్లు హెచ్చు ఆనందము కలవి. ఈ ఆనంద భేదములన్నియు నెచ్చట యెకమగునో (కలిసియుండునో), ధర్మము జ్ఞానము ఎక్కడ హెచ్చుగనుండునో అవియే హురణ్య గర్భుడు, బ్రహ్మ. ఆ హిరణ్యగర్భుడైన బ్రహ్మయొక్క ఆనందమే బ్రహ్మానందము - ఇట్టి బ్రహ్మానందము శ్రోత్రియుడైనవానికి (శ్రుతులను యదార్థముగా నర్థము చేసుకొని వాటిలో విధించిన ప్రకారము ఆచరించువానికి) కోరికలు లేనివానికి, ఎక్కడపడితే అక్కడే దొరుకును - (అనుభవమగును), అందుచేత నీ మూడు బ్రహ్మానందమునకు సాధనములు).

Transliteration
  1. brahmānubhavamuvalana, brahma sākṣātkāramu valana kalugu ānaṃdamu -

  2. jīva brahmalu okaṭē - “ahaṃ brahmasmi” (nēnē brahma ayitini) anu mahāvākyārthamunu tatvarītyā telusukonuṭavalana kaligina ānaṃdamu - adi svarūpajñānamuvalana kalugunu.

  3. “prajñānamānaṃdaṃ brahma” ani śrutivākyamu - parabrahma jñāna mayuḍu - sarvajñuḍu - cinmayuḍu, ānaṃdamayuḍu. parabrahmamē parama padamu, lēka mōkṣamu, mōkṣamē atyaṃta sukhamunu kalugacēyunadi. aṃducēta dāni valana kalugu sukhamu brahmānaṃdamu -

  4. “saccidānaṃdaṃ brahma” ani śruti vākyamu - parabrahma sadrūpuḍu, cidrūpuḍu (cinmātruḍu), ānaṃdarūpuḍu - mōkṣarūpuḍaguṭavalana paramānaṃdamayuḍu. paramātmuḍu aṃtamu lēnivāḍu kanuka mōkṣa rūpamaina brahmānaṃdamu kūḍā aṃtamu lēnidē.

  5. “sakala upādhulunnū tolaṃgi nijasvarūpamai, tanaku kūṭastha svarūpamaina sahaja sukhamē brahmānaṃdamanipiṃcikonunu”.

(brahma vidyāsudhārṇavamu)

  1. kṣudrānaṃdā ssamastāstē brahmānaṃdalavāḥ yataḥ |

avidyā kalpitōpādhi tāratamyādanēka thā |

brahmānaṃdastu sarvatri vyāpakaḥ satya āṃtaraḥ |

jaḍaduḥkhānṛtākārē prapaṃcē kutravā sukhaṃ |

saccidānaṃdamadvaita sukhaṃ brahmaiva sarvagaṃ |

tathāca śuddhacittasyatava niṣkāmakarmabhiḥ |

ātmajñānōdayē brahmānaṃda prāptiḥ svatō bhavēt ||“. (gītābhāvaprakāśamu - 2 - 491 to 494)

(samastamaina kṣudrānaṃdamulu - kṣudra vastuvulavalana kaligeḍi ānaṃdamulu - brahmānaṃdamu yokka lēśamu - avi avidyacēta kalpiṃpabaḍina upādhula tāratamyamuvalana anēka prakāramulu - brahmānaṃdamu aṃtaṭā vyāpiṃciyunnadi, mūḍukālamulaṃduṃḍunadi, āṃtaramu, jaḍamu, duḥkhamayamu, anṛtarūpamu ayina ī prapaṃcamaṃdu sukhamekkaḍidi? saccidānaṃdamaina advaitasukhamu brahmānaṃdamē - ā brahmānaṃdamu aṃtaṭanu vyāpiṃci yunnadi. ā prakāramugā cittaśuddhikaligina nīku (kaliginavāniki) niṣkāmakarmalacēta - niṣkāmakarma yōgamucēta ātmajñānōdayamu kalugagānē brahmānaṃdaprāpti tānaṃtaṭa adē kalugunu).

ānaṃdabhēdāḥ - “mānuṣānaṃdaḥ, manuṣyagaṃdharvavānaṃdaḥ, dēvagaṃdharvānaṃdaḥ, ciralōkā naṃdaḥ, ajānajānaṃdaḥ karmadēvānaṃdaḥ dēvānaṃdaḥ, iṃdrānaṃdaḥ, bṛhaspatērānaṃdaḥ, prajāpatē rānaṃdaḥ, brahmānaṃdaḥ. ēvaṃ pūrvasyāḥ pūrvasyāḥ bhūmēḥ uttarasyāṃ uttarasyāṃ bhūmē prasāga viśēṣataḥ śataguṇēva ānaṃdōtkarṣaḥ upapadyatē. yatra ētē ānaṃdabhēdāḥ ēkatāṃ gacchaṃti dharmaśca tannimittaṃ jñānaṃca tadviṣayaṃ akāmaha tatvaṃca niratiśayaṃ, yatrasvaṣa hiraṇyagarbhaḥ brahma tasya ēṣa ānaṃdaḥ brahmānaṃdaḥ śrōtriyēṇa āvṛjinēna akāmahatēna ca sarvataḥ pratykṣaṃ upalabhyatē, tasmāt ētāni trīṇi sādhanāni ityavagamyatē”.

(ānaṃdamu anēka vidhamulugā ceppabaḍinadi : - mānuṣānaṃdamu modalu brahmānaṃdamu varaku galavi paina (saṃskṛtamūlamulō) ceppabaḍinavi. vāṭilō muṃdu ceppinadānikaṃṭe tarvāta tarvāta ceppabaḍinavi okadānikaṃṭe okaṭi prasāda viśēṣamuvalana nūru reṭlu heccu ānaṃdamu kalavi. ī ānaṃda bhēdamulanniyu neccaṭa yekamagunō (kalisiyuṃḍunō), dharmamu jñānamu ekkaḍa heccuganuṃḍunō aviyē huraṇya garbhuḍu, brahma. ā hiraṇyagarbhuḍaina brahmayokka ānaṃdamē brahmānaṃdamu - iṭṭi brahmānaṃdamu śrōtriyuḍainavāniki (śrutulanu yadārthamugā narthamu cēsukoni vāṭilō vidhiṃcina prakāramu ācariṃcuvāniki) kōrikalu lēnivāniki, ekkaḍapaḍitē akkaḍē dorukunu - (anubhavamagunu), aṃducēta nī mūḍu brahmānaṃdamunaku sādhanamulu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.