← Back to బ · Booklets 31–40 (digitized file 4)

బ్రహ్మనిర్వాణము brahmanirvāṇamu

Original — తెలుగు
  1. బ్రహ్మణి నిర్వాణం లయం.

(పరబ్రహ్మమందు లయమైపోవుట, లీనమగుట, కలిసిపోవుట).

  1. “బ్రహ్మణి నిర్వృతిః మోక్షం” (శ్రీశంకరః)

(బ్రహ్మమందు మోక్షమును పొందుట).

  1. “బ్రహ్మణి నిర్వాణం నిర్వృతిం, బ్రహ్మరూపం నిర్వాణమితివా” (మధుసూదనీవ్యాఖ్య)

(బ్రహ్మమందు నిర్వాణమును పొందుట, లేక బ్రహ్మరూపమైన నిర్వాణము).

  1. “బ్రహ్మైవ నిర్వాణం ఇతివా” (వేదాంతదేశికః)

(బ్రహ్మమే నిర్వాణమైనది)

  1. బ్రహ్మణి పరిపూర్ణే నిర్వృతిం, సర్వానర్థ శిర్వృత్యుపలక్షితాం స్థితిం. అనతిశయానందావిర్భావ లక్షణం.

(ప్రపంచమంతటిలోను పూర్తిగా నిండియుండుటవలన పూర్ణుడైన బ్రహ్మమందు నిర్వృతిని పొందుట - సమస్తమైన అనర్థముల నిర్వృత్తియగు స్థితి - అత్యుత్తమమైన ఆనందము - (సుఖము) కలుగచేయు లక్షణములుకలది).

  1. “బ్రహ్మ నిర్వృతిం బ్రహ్మానంద ఇతియావత్” (భాష్యోత్కర్షదీపికా) (బ్రహ్మానందము)

  2. బ్రహ్మణినిర్వాణం, లయోమోక్షః, తదాత్మకం సుఖం.

(బ్రహ్మమందు నిర్వాణము, లయము పొందుట, లీనమగుట, మోక్షము, మోక్షమను సుఖము).

  1. నిర్వాణమయం బ్రహ్మ, సుఖైకతానం, ఆత్మానందం,, బ్రహ్మానందం.

(బ్రహ్మనిర్వాణమనగా నిర్వాణమయమగు - ఆనందమయమగు - బ్రహ్మ; సుఖరూపమైనది; బ్రహ్మానందము, ఆత్మ, మోక్షము - బ్రహ్మమే మోక్షము, మోక్షమే బ్రహ్మ. మోక్షమును పొందుట యనగా బ్రహ్మను పొందుట).

  1. “ఆత్మానుభవసుఖం” (శ్రీరామానుజః)

(పరమాత్మానుభవమను సుఖము).

  1. మోక్షః (మోక్షము).

  2. బ్రహ్మ సాయుజ్యం (బ్రహ్మతో ఐక్యమగుట).

  3. “బ్రహ్మ పరమానందరూపం కల్పిత ద్వైతోపశమరూపత్వేన నిర్వాణం, తదేవ కల్పితా భావస్య అధిష్టానాత్మకత్వాత్”

(బ్రహ్మ ఆనందరూపుడు, ఆనందమయుడు, అట్టి పరమానందరూపము. కల్పితమైన - యదార్థముగా లేనటువంటి - రెండవ వస్తువు - బ్రహ్మకంటె వేఱగు వస్తువు - కలదనుభావము లేకుండుటచేత నిర్వాణము అని చెప్పబడినది. లేని ప్రపంచము కల్పితమగుటకు, బ్రహ్మమే దానికధిష్ఠానముగనుక ఒకవస్తువైన బ్రహ్మమే నిర్వాణమని చెప్పబడినది).

  1. యోంతస్సుఖో (అ)oతరారామస్తధాంతర్జ్యోతిరేవ యః |

స యోగీ బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూతో అధిగచ్ఛతి ||.

లభంతే బ్రహ్మనిర్వాణం మృషయః క్షీణకల్మషాః |

భిన్నధ్వైధా యతాత్మానః సర్వభూతహితే రతాః ||

కామక్రోధనియుక్తానాం యతీనాం యతచేతసాం |

అభితో బ్రహ్మనిర్వాణం వర్తతే, విదితాత్మనాం ||“. (శ్రీమద్భగవద్గీత - 5 - 24 to 28)

“ఆత్మద్యంతం సుఖం యస్య క్రీడా యస్యాంతరాత్మని |

యస్యాత్మన్యేవ విజ్ఞానం న బాహ్యేంద్రియైర్జడే |

వైషయికం సుఖం తస్య సాధనం తన్మతిస్తథా |

ఏతత్రయం పరిత్యక్తం యన్య స్వాభావికం మలం |

న సమాహిత ధీర్బ్రహ్మ సచ్చిదానందమ ద్వయం |

అధ్యస్త ద్వైత శూన్యత్వాత్ నిర్వాణమగతాగతం |

అవిద్యావృత్తి భావేన ప్రాప్తం ప్రాప్నోతి తద్వపుః ||” (గీతాభావప్రకాశము - 5 - 207 to 210)

(తనలోనే, తన్మాత్మలోనే సుఖించువాడు తన అంతరాత్మతో క్రీడసలుపువాడు, బాహ్యేంద్రియములచేతకాక తన ఆత్మలోనే జ్ఞానము పొందువాడు, విషయములవలన కలుగు సుఖము, దానికి అగు సాధనము, దానిని గుఱించి తలంపు, ఈ మూడును వదలివేసి, సమాహిత చిత్తముగలవాడు నిర్వాణమును పొందును).

“ఆదౌక్షీణమలా యజ్ఞైశ్చిత్త శుద్థ్యాత్మదర్శనే |

సమర్థాస్తత ఆత్మైక్యాచ్ఛిన్న సంశయాః |

నిధిధ్యాసన దార్డ్యేన బ్రహ్మణైకాగ్ర చేతసః |

అద్వైతాత్మధియా ధీరాః సర్వభూతహితే రతాః |

హింసా శూన్యాః బ్రహ్మవిధో లభంతే బ్రహ్మ నిర్వృతిం“||. (గీతాభావప్రకాశము - 5 - 212 to 214)

(యజ్ఞములచేత కల్మషములు క్షీణింపచేసుకున్నవారును, చిత్తశుద్ధి కలుగుటచేత ఆత్మసాక్షాత్కారమందు సమర్థులగు వారును, ఆత్మ అనునది అన్నింటిలోను, అంతటా ఉన్నది ఒకటే యని తలంచుటచేత,సంశయములేని వారున్నూ, బ్రహ్మము, ప్రపంచము రెండూ ఒకటే - అంతా ఒక్క బ్రహ్మమే అనుజ్ఞానము కలిగియుండుటచేత సమస్త భూతములకు హితమునే కోరుచు హింస యనునది చేయనివారును, - ఈ ప్రకారము బ్రహ్మజ్ఞానము కలిగియున్న ఋషులు బ్రహ్మ నిర్వృతిని - (బ్రహ్మ నిర్వాణమును) - పొందుదురు).

  1. “విహాయ కామాన్యః సర్వాన్ పుమాంశ్చ రతి నిస్ప్రుహం |

నిర్మమో నిరహంకారఃస శాంతిమధిగచ్ఛతి |

ఏషా బ్రాహ్మీ స్థితిః, పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి |

స్థిత్వా (అ)స్యా మంతకాలే (అపి) బ్రహ్మనిర్వాణమృచ్ఛతి ||’ (శ్రీమద్భగవద్గీత - 2 - 71,72)

“ఏషా యధోక్తా బ్రాహ్మీ యా బ్రహ్మాద్వైతైక గోచరా |

నిష్ఠా యా కర్మ సన్యాసపూర్వికా జ్ఞాన లక్షణా |

ఏనాం బ్రాహ్మీం స్థితిం ప్రాప్య యః కోపి న విముహ్యతి |

మోహహేతో రవిద్యయాః బాధి తత్వాన్న సంభవః |

మోహహేతోర విద్యాయాః బాధితత్వాన్న సంబహవః |

అస్యా మంత్యేపి వయసి స్థితౌ స్థిత్వాతి నిశ్చలాం |

బ్రహ్మాత్మ నిర్వృతిం నిత్యాం మోక్షాభ్యా మధి గచ్ఛతి ||“. (గీతాభావప్రకాశము - 2 - 673 - 676)

(నిష్కామకర్మయోగము నవలంభించిన తర్వాత జ్ఞాన యోగమందు నిష్ఠకలిగియుండుట బ్రాహ్మీస్థితి యని చెప్పబడును - ఈ స్థితిని పొందినవాడు మోహమునకు కారణమైన అవిద్య పోవుటవలన మోహము చెందడు. మరణకాలమందు కూడ నిటువంటి స్థితిలో నిశ్చలముగా నుండువాడు నిత్యసుఖమును కలుగచేయు మోక్షమని చెప్పబడు బ్రహ్మనిర్వాణమును (బ్రహ్మ నిర్వృతిని) పొందును).

Transliteration
  1. brahmaṇi nirvāṇaṃ layaṃ.

(parabrahmamaṃdu layamaipōvuṭa, līnamaguṭa, kalisipōvuṭa).

  1. “brahmaṇi nirvṛtiḥ mōkṣaṃ” (śrīśaṃkaraḥ)

(brahmamaṃdu mōkṣamunu poṃduṭa).

  1. “brahmaṇi nirvāṇaṃ nirvṛtiṃ, brahmarūpaṃ nirvāṇamitivā” (madhusūdanīvyākhya)

(brahmamaṃdu nirvāṇamunu poṃduṭa, lēka brahmarūpamaina nirvāṇamu).

  1. “brahmaiva nirvāṇaṃ itivā” (vēdāṃtadēśikaḥ)

(brahmamē nirvāṇamainadi)

  1. brahmaṇi paripūrṇē nirvṛtiṃ, sarvānartha śirvṛtyupalakṣitāṃ sthitiṃ. anatiśayānaṃdāvirbhāva lakṣaṇaṃ.

(prapaṃcamaṃtaṭilōnu pūrtigā niṃḍiyuṃḍuṭavalana pūrṇuḍaina brahmamaṃdu nirvṛtini poṃduṭa - samastamaina anarthamula nirvṛttiyagu sthiti - atyuttamamaina ānaṃdamu - (sukhamu) kalugacēyu lakṣaṇamulukaladi).

  1. “brahma nirvṛtiṃ brahmānaṃda itiyāvat” (bhāṣyōtkarṣadīpikā) (brahmānaṃdamu)

  2. brahmaṇinirvāṇaṃ, layōmōkṣaḥ, tadātmakaṃ sukhaṃ.

(brahmamaṃdu nirvāṇamu, layamu poṃduṭa, līnamaguṭa, mōkṣamu, mōkṣamanu sukhamu).

  1. nirvāṇamayaṃ brahma, sukhaikatānaṃ, ātmānaṃdaṃ,, brahmānaṃdaṃ.

(brahmanirvāṇamanagā nirvāṇamayamagu - ānaṃdamayamagu - brahma; sukharūpamainadi; brahmānaṃdamu, ātma, mōkṣamu - brahmamē mōkṣamu, mōkṣamē brahma. mōkṣamunu poṃduṭa yanagā brahmanu poṃduṭa).

  1. “ātmānubhavasukhaṃ” (śrīrāmānujaḥ)

(paramātmānubhavamanu sukhamu).

  1. mōkṣaḥ (mōkṣamu).

  2. brahma sāyujyaṃ (brahmatō aikyamaguṭa).

  3. “brahma paramānaṃdarūpaṃ kalpita dvaitōpaśamarūpatvēna nirvāṇaṃ, tadēva kalpitā bhāvasya adhiṣṭānātmakatvāt”

(brahma ānaṃdarūpuḍu, ānaṃdamayuḍu, aṭṭi paramānaṃdarūpamu. kalpitamaina - yadārthamugā lēnaṭuvaṃṭi - reṃḍava vastuvu - brahmakaṃṭe vēṟagu vastuvu - kaladanubhāvamu lēkuṃḍuṭacēta nirvāṇamu ani ceppabaḍinadi. lēni prapaṃcamu kalpitamaguṭaku, brahmamē dānikadhiṣṭhānamuganuka okavastuvaina brahmamē nirvāṇamani ceppabaḍinadi).

  1. yōṃtassukhō (a)otarārāmastadhāṃtarjyōtirēva yaḥ |

sa yōgī brahmanirvāṇaṃ brahmabhūtō adhigacchati ||.

labhaṃtē brahmanirvāṇaṃ mṛṣayaḥ kṣīṇakalmaṣāḥ |

bhinnadhvaidhā yatātmānaḥ sarvabhūtahitē ratāḥ ||

kāmakrōdhaniyuktānāṃ yatīnāṃ yatacētasāṃ |

abhitō brahmanirvāṇaṃ vartatē, viditātmanāṃ ||“. (śrīmadbhagavadgīta - 5 - 24 to 28)

“ātmadyaṃtaṃ sukhaṃ yasya krīḍā yasyāṃtarātmani |

yasyātmanyēva vijñānaṃ na bāhyēṃdriyairjaḍē |

vaiṣayikaṃ sukhaṃ tasya sādhanaṃ tanmatistathā |

ētatrayaṃ parityaktaṃ yanya svābhāvikaṃ malaṃ |

na samāhita dhīrbrahma saccidānaṃdama dvayaṃ |

adhyasta dvaita śūnyatvāt nirvāṇamagatāgataṃ |

avidyāvṛtti bhāvēna prāptaṃ prāpnōti tadvapuḥ ||” (gītābhāvaprakāśamu - 5 - 207 to 210)

(tanalōnē, tanmātmalōnē sukhiṃcuvāḍu tana aṃtarātmatō krīḍasalupuvāḍu, bāhyēṃdriyamulacētakāka tana ātmalōnē jñānamu poṃduvāḍu, viṣayamulavalana kalugu sukhamu, dāniki agu sādhanamu, dānini guṟiṃci talaṃpu, ī mūḍunu vadalivēsi, samāhita cittamugalavāḍu nirvāṇamunu poṃdunu).

“ādaukṣīṇamalā yajñaiścitta śudthyātmadarśanē |

samarthāstata ātmaikyācchinna saṃśayāḥ |

nidhidhyāsana dārḍyēna brahmaṇaikāgra cētasaḥ |

advaitātmadhiyā dhīrāḥ sarvabhūtahitē ratāḥ |

hiṃsā śūnyāḥ brahmavidhō labhaṃtē brahma nirvṛtiṃ”||. (gītābhāvaprakāśamu - 5 - 212 to 214)

(yajñamulacēta kalmaṣamulu kṣīṇiṃpacēsukunnavārunu, cittaśuddhi kaluguṭacēta ātmasākṣātkāramaṃdu samarthulagu vārunu, ātma anunadi anniṃṭilōnu, aṃtaṭā unnadi okaṭē yani talaṃcuṭacēta,saṃśayamulēni vārunnū, brahmamu, prapaṃcamu reṃḍū okaṭē - aṃtā okka brahmamē anujñānamu kaligiyuṃḍuṭacēta samasta bhūtamulaku hitamunē kōrucu hiṃsa yanunadi cēyanivārunu, - ī prakāramu brahmajñānamu kaligiyunna ṛṣulu brahma nirvṛtini - (brahma nirvāṇamunu) - poṃduduru).

  1. “vihāya kāmānyaḥ sarvān pumāṃśca rati nispruhaṃ |

nirmamō nirahaṃkāraḥsa śāṃtimadhigacchati |

ēṣā brāhmī sthitiḥ, pārtha naināṃ prāpya vimuhyati |

sthitvā (a)syā maṃtakālē (api) brahmanirvāṇamṛcchati ||’ (śrīmadbhagavadgīta - 2 - 71,72)

“ēṣā yadhōktā brāhmī yā brahmādvaitaika gōcarā |

niṣṭhā yā karma sanyāsapūrvikā jñāna lakṣaṇā |

ēnāṃ brāhmīṃ sthitiṃ prāpya yaḥ kōpi na vimuhyati |

mōhahētō ravidyayāḥ bādhi tatvānna saṃbhavaḥ |

mōhahētōra vidyāyāḥ bādhitatvānna saṃbahavaḥ |

asyā maṃtyēpi vayasi sthitau sthitvāti niścalāṃ |

brahmātma nirvṛtiṃ nityāṃ mōkṣābhyā madhi gacchati ||“. (gītābhāvaprakāśamu - 2 - 673 - 676)

(niṣkāmakarmayōgamu navalaṃbhiṃcina tarvāta jñāna yōgamaṃdu niṣṭhakaligiyuṃḍuṭa brāhmīsthiti yani ceppabaḍunu - ī sthitini poṃdinavāḍu mōhamunaku kāraṇamaina avidya pōvuṭavalana mōhamu ceṃdaḍu. maraṇakālamaṃdu kūḍa niṭuvaṃṭi sthitilō niścalamugā nuṃḍuvāḍu nityasukhamunu kalugacēyu mōkṣamani ceppabaḍu brahmanirvāṇamunu (brahma nirvṛtini) poṃdunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.