← Back to బ · Booklets 31–40 (digitized file 4)

బ్రహ్మనిష్ట brahmaniṣṭa

Original — తెలుగు
  1. బ్రహ్మధ్యానమందు నిలకడ కలిగియుండుట.

  2. సాక్షాత్కృత పరమ పురుష నిష్ఠః -

(పరబ్రహ్మను సాక్షాత్కరించుకో కలిగిన నిష్ఠ)

  1. బ్రహ్మానుభవం -

(బ్రహ్మ దర్శనమును - బ్రహ్మభావమును - అనుభవించుట)

  1. బ్రహ్మణి తదాత్మనా స్థితిః.

(బ్రహ్మ ధ్యానమునందు బ్రహ్మ తానే అయితిని అనుభావముతోనుండుట).

  1. “సర్వభూతస్థితం యోమాం భజత్యేకత్వమాస్థితః |

సర్వథా వర్తమానోపి స యోగీ మయి వర్తతే ||“. (శ్రీమద్భగవద్గీత - 6 - 31)

(సమస్త భూతములందుండువాడనైనప్పటికీ, వేఱు వేఱు ఆత్మలుగాక అన్నింటిలోనున్న భగవంతుడు - బ్రహ్మ - ఒకడే అయి యున్నాడు అని నన్ను తెలుసుకొని భజించువాడు - ఎల్లపుడు ఏపని చేయుచున్నను అతను నాయందే ధ్యాననిష్ఠ కలిగియున్నవాడు).

  1. వేదాంతార్థనిష్ఠః -

(ఉపనిషత్తులలోని చెప్పబడిన భగవంతుని గుఱించి అయిన నిష్ఠ - వేదాంతములలోని విషయమైన (subject) బ్రహ్మయందు నిష్ఠగలవాడు) (వేదాంతములలో విషయమైన బ్రహ్మను తెలుసుకొనుటలో నిష్ఠ గలిగియుండుట).

  1. “పరబ్రహ్మాన్వేషమాణాః, కిం తత్ యన్నిత్యం విజ్ఞేయం ఇతి తత్ప్రాత్యర్థం యథా కామం యతిష్యామః ఇత్యేవం తదన్వేషణం కుర్వంతః”

(శ్రీశంకరః)

(పరబ్రహ్మ అనగా ఏమిటి అని బ్రహ్మ గుఱించి అన్వేషించువారు పరబ్రహ్మ ప్రాప్తి గుఱించి నిత్యము యత్నముచేయువారు - అట్టి నిష్ఠలోనున్నవారు).

  1. వేదార్థ తాత్పర్యవంతః; యద్వా బ్రహ్మజ్ఞానే తత్పరాః.

(వేదముల అర్థమును తాత్పర్యముతో తెలిసినవారు, లేక, బ్రహ్మజ్ఞానమును తెలుసుకొనుటలో తత్పరులైనవారు)

  1. ఉత్కృష్టం నిరుపచితం బ్రహ్మ స్వరూపతః గుణతశ్చ బృహద్భూతం వస్త్వేన్వేషమాణాః; జిజ్ఞాస,మానాః ఇత్యర్థః.

(ఉత్కృష్టమైనటువంటిన్నీ, ఉపచయము లేనటువంటిన్నీ, రూపమువలనగాని, గుణములవలనకాని, అన్నింటికంటె పెద్దది (పెద్దదిగా పెరుగునది) అయిన వస్తువగు పరబ్రహ్మను అన్వేషించువారు - వెతికి తెలుసుకొనగోరువారు - (బ్రహ్మజ్ఞానమందు జిజ్ఞాస గలవారు).

  1. హిత్వాసర్వకర్మాణి కేవలే అద్వయే బ్రహ్మణి నిష్ఠా యస్య సో (అ)యం బ్రహ్మ నిష్ఠః - తపోనిష్ఠ ఇతి యద్వత్ - నహి కర్మణః బ్రహ్మనిష్టా సంభవతి - కర్మాత్మజ్ఞాన యోర్విరోధాత్ (శ్రీశంకరః)

(సమస్తమైన కర్మలను వదలి, అద్వయుడు, కేవలుడు ఒక్కడే అయిన పరబ్రహ్మమందే నిష్ఠకలవాడు - తపోనిష్టుడు వలెనే కర్మయోగమునకు జ్ఞానయోగమునకు విరోధముండుటవలన కర్మలందు జ్ఞాననిష్ఠ కుదరదు).

  1. “తపోనిష్ఠాః - వేదస్తత్వం తపో బ్రహ్మ” ఇత్యుక్తేః. (శ్రీరంగరామానుజః)

(వేదము తత్వము - తపస్సే బ్రహ్మ అని చెప్పబడుటచేత తపస్సు చేయుటలో నిష్ఠకలవాడు).

  1. “బ్రహ్మ నిష్ఠ మనుష్యులకు నాశా నివారిణి యగుటంజేసి యేనందు తత్పరుండనై యాహార నిద్రాది యోగంబుల బరిహరించెద”

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 9 -)

  1. నిర్గుణ నిరాకార నిర్ద్వందమైన పరబ్రహ్మమందు సర్వకర్మసన్యాసము చేసి మనస్సును బ్రహ్మమందు ఏకాగ్రతచేసి ధ్యానించుటయందు నిష్ఠ కలిగియుండుట - జపనిష్ఠ, తపోనిష్ఠవలె.
Transliteration
  1. brahmadhyānamaṃdu nilakaḍa kaligiyuṃḍuṭa.

  2. sākṣātkṛta parama puruṣa niṣṭhaḥ -

(parabrahmanu sākṣātkariṃcukō kaligina niṣṭha)

  1. brahmānubhavaṃ -

(brahma darśanamunu - brahmabhāvamunu - anubhaviṃcuṭa)

  1. brahmaṇi tadātmanā sthitiḥ.

(brahma dhyānamunaṃdu brahma tānē ayitini anubhāvamutōnuṃḍuṭa).

  1. “sarvabhūtasthitaṃ yōmāṃ bhajatyēkatvamāsthitaḥ |

sarvathā vartamānōpi sa yōgī mayi vartatē ||“. (śrīmadbhagavadgīta - 6 - 31)

(samasta bhūtamulaṃduṃḍuvāḍanainappaṭikī, vēṟu vēṟu ātmalugāka anniṃṭilōnunna bhagavaṃtuḍu - brahma - okaḍē ayi yunnāḍu ani nannu telusukoni bhajiṃcuvāḍu - ellapuḍu ēpani cēyucunnanu atanu nāyaṃdē dhyānaniṣṭha kaligiyunnavāḍu).

  1. vēdāṃtārthaniṣṭhaḥ -

(upaniṣattulalōni ceppabaḍina bhagavaṃtuni guṟiṃci ayina niṣṭha - vēdāṃtamulalōni viṣayamaina (subject) brahmayaṃdu niṣṭhagalavāḍu) (vēdāṃtamulalō viṣayamaina brahmanu telusukonuṭalō niṣṭha galigiyuṃḍuṭa).

  1. “parabrahmānvēṣamāṇāḥ, kiṃ tat yannityaṃ vijñēyaṃ iti tatprātyarthaṃ yathā kāmaṃ yatiṣyāmaḥ ityēvaṃ tadanvēṣaṇaṃ kurvaṃtaḥ”

(śrīśaṃkaraḥ)

(parabrahma anagā ēmiṭi ani brahma guṟiṃci anvēṣiṃcuvāru parabrahma prāpti guṟiṃci nityamu yatnamucēyuvāru - aṭṭi niṣṭhalōnunnavāru).

  1. vēdārtha tātparyavaṃtaḥ; yadvā brahmajñānē tatparāḥ.

(vēdamula arthamunu tātparyamutō telisinavāru, lēka, brahmajñānamunu telusukonuṭalō tatparulainavāru)

  1. utkṛṣṭaṃ nirupacitaṃ brahma svarūpataḥ guṇataśca bṛhadbhūtaṃ vastvēnvēṣamāṇāḥ; jijñāsa,mānāḥ ityarthaḥ.

(utkṛṣṭamainaṭuvaṃṭinnī, upacayamu lēnaṭuvaṃṭinnī, rūpamuvalanagāni, guṇamulavalanakāni, anniṃṭikaṃṭe peddadi (peddadigā perugunadi) ayina vastuvagu parabrahmanu anvēṣiṃcuvāru - vetiki telusukonagōruvāru - (brahmajñānamaṃdu jijñāsa galavāru).

  1. hitvāsarvakarmāṇi kēvalē advayē brahmaṇi niṣṭhā yasya sō (a)yaṃ brahma niṣṭhaḥ - tapōniṣṭha iti yadvat - nahi karmaṇaḥ brahmaniṣṭā saṃbhavati - karmātmajñāna yōrvirōdhāt (śrīśaṃkaraḥ)

(samastamaina karmalanu vadali, advayuḍu, kēvaluḍu okkaḍē ayina parabrahmamaṃdē niṣṭhakalavāḍu - tapōniṣṭuḍu valenē karmayōgamunaku jñānayōgamunaku virōdhamuṃḍuṭavalana karmalaṃdu jñānaniṣṭha kudaradu).

  1. “tapōniṣṭhāḥ - vēdastatvaṃ tapō brahma” ityuktēḥ. (śrīraṃgarāmānujaḥ)

(vēdamu tatvamu - tapassē brahma ani ceppabaḍuṭacēta tapassu cēyuṭalō niṣṭhakalavāḍu).

  1. “brahma niṣṭha manuṣyulaku nāśā nivāriṇi yaguṭaṃjēsi yēnaṃdu tatparuṃḍanai yāhāra nidrādi yōgaṃbula barihariṃceda”

(śrīmadāṃdhramahābhāgavatamu - 9 -)

  1. nirguṇa nirākāra nirdvaṃdamaina parabrahmamaṃdu sarvakarmasanyāsamu cēsi manassunu brahmamaṃdu ēkāgratacēsi dhyāniṃcuṭayaṃdu niṣṭha kaligiyuṃḍuṭa - japaniṣṭha, tapōniṣṭhavale.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.