(బ్రాహ్మణ భావము; బ్రాహ్మణ కర్మ).
(బ్రాహ్మణులు చేయవలసిన కర్మ - సంధ్యావందనము మొదలగునవి చేయుట; లేక యజనము, యాజనము మొదలగు ఆరు విధములగు కర్మలు) - (బ్రాహ్మణుల వృత్తి).
తపః శ్రుతాభ్యాం యోహీనో జాతి బ్రాహ్మణ ఏవసః ||“. (శబ్దార్థ చింతామణి)
(తపస్సు, భగవంతుని గుఱించి శాస్త్రముల ద్వారా బాగుగా విని యుండుట, బ్రాహ్మణకులములో పుట్టుట - ఈ మూడు బ్రాహ్మణ్యమునకు కారణములు - తపస్సు, శ్రుతము లేనివాడు బ్రాహ్మణ కులమందు పుట్టుటచేతనే బ్రాహ్మణుడైనవాడు - అందుచేత జాతిమాత్ర బ్రాహ్మణుడు).
యాజనాధ్యాపన యోః తద్ధర్మత్వాత్ తద్వారా చ వర్ణాశ్రమ భేద వ్యవస్థాపనాత్. అతో బ్రహ్మణ్యే రక్షితే సర్వమపి సురక్షితం భవతి ఇత్యర్థః-
(బ్రాహ్మణుల ధర్మము యాజనము, అధ్యాపనము అగుటవలన వర్ణాశ్రమ ధర్మములు వారి ద్వారా ప్రవర్తింపబడుచున్నవి. అందుచేత బ్రాహ్మణ్యము రక్షించబడినంత కాలము అన్నియు సురక్షితముగా నుండును).
శిష్టాచార విహీనం తు న పునంతి కిల శ్రుతిః |
వేదా న భ్యసనా ద్ద్రోహాత్ గురు వృద్దవనిందనాత్ |
వాణిజ్యేన కుశీదేన ధూమపానేన సేవయా |
బ్రాహ్మణ్యం నాశమాయా తి సీరకర్షణ తస్తధా |
ఊర్ధ్వ వస్థా నధోవస్తాన్ ప తితి తేభ్యో పరిగ్రహాత్ |
‘బ్రహ్మ’ విష్ణ్వేశ దేవేషు భేద బుద్ధి ప్రకల్పనాత్ |
శూద్రా ధ్యాపన త స్తర్కాత్ శాస్త్రీయేతర వర్తనాత్ |
సంధ్యాకర్మ పరిత్యాగాత్ తథా శూద్రాన్ని భోజనాత్ |
దేవలత్వేన చ తదా యాచకత్వేన వా పునః |
చికిత్సా గణితా భ్యాం జీవనాదిత్వేన వృధాహఠాత |
ప్రతిగ్రహ ముపాదాయ జపాత్ శ్రీవేద మాతరం |
అయాజ్య యాచనా చ్చైవ అసంతోషాన్ మృషోక్తి తః |
అప భ్రంశాది భాషేభ్యః పఠనాత్ జీవ నాత్తథా |
దేవలత్వేన చ త థా యాచకత్వేన వా పునః |
గ్రామ యజమాన వృత్తేశ్చ కృఊర దాన పరిగ్రహాత్ |
మనష్యవార్నిర్మితస్య గ్రంధ సాధ్యయన శ్రుతేః |
సంసారాణాం పరిత్యాగా ద్వేద విక్రయణా త్తథా |
బ్రాహ్మణ్యం నశ్యతికలౌ సాధ్వ భావకుసంగమాత్ |
తథాపి తత్కలౌ దేవీ రామ భక్తి పరాయణః
శమీ దమీ తితిక్షశ్చ గాయత్రీ జప తత్పరః |
బ్రాహ్మణో వేద పూజ్యస్స్యాత్ మనుష్యాణాం చ కాకథా ||“. (స్కాందే)
(వేదములను పఠించుట ఇతరులకు (స్సాధ్యాయ ప్రవచనములు) లేకుండుటవలనను, సదాచారములకు వ్యతిరేకములైన ద్రోహకార్యముల నాచరించుట వలనను, గురు శాస్త్ర దేవ వృద్దుల నిందించుటవలనను వ్యాపారము చేయుట, వడ్డీకి ఇచ్చిన ద్రవ్యముచే జీవించుట, ధూమపాన మాచరించుట, సేవచే జీవించుట, నాగలిపట్టి దున్నుటవలనను, ఎటువంటి బ్రాహ్మణమైనను నశించును. పాపాత్ములవలన బ్రాహ్మణుడు కట్టువస్త్రములను గాని, ఉత్తరీయాదులనుగాని ప్రతిగ్రహించుటవలనను, బ్రహ్మ విష్ణు మహేశ్వరులను మువ్వురులో హెచ్చు తగ్గు మొదలగు భేదబుద్ధిని భావించుటవలనను శూద్రులకు వేదము చెప్పుటవలనను, కేవల తర్కశాస్త్రమును మాత్రమే అభ్యసించుటవలనను, సచ్ఛా స్త్రీయేతరమగు కేవల సంఘసంస్కరణమందు పాల్గొనుటవలనను, స్నాన సంధ్యాది నిత్యకర్మలను పరిత్యజించుటవలనను, అటులనే శూద్ర సంబంధమైన ద్రవ్య భోజనముచే జీవించుటవలనను, ఆగమ తంత్రాదులచే స్థాపితమైన దేవతులకు అర్చకుడగుటవలనను, కేవలము యాచనా వృత్తిచేతనే జీవించుటవలనను, చికిత్సా వృత్తులచేతను, తప్పు లెక్కలు వ్రాయుటచేత జీవనము చేయుటచేతను, ఎల్లపుడు కోపముతో నుండుటయే స్వభావముగా నుండుటచేతను, ద్రవ్యమును గ్రహించి ఇతరులకు వేదపారాయణ, మంత్ర జపాదులనాచరించుట చేతను, భ్రష్టులచే శిష్టకర్మలు నాచరింపచేయుటవలనను, సంతోషమనునది లేకుండుటవలనను, అబద్ధములు పలుకుటవలనను, గ్రామ పౌరోహిత్య వృత్తివలనను, క్రూరదానములను ప్రతిగ్రహించుటవలనను, కేవలము మానవ కవులచేత రచింపబడిన గ్రంధములను పఠించుట ఇతరులకు బోధించుటవలనను బ్రాహ్మణునకు విధివిహితములైన 64 సంస్కారములను ఆచరించక పోవుటవలనను, వేద విక్రయము చేయుటవలను, సాధుభావము లేకపోవుట, దుష్టసాంగత్యము నవలంభించుటవలనను, కలియుగమందు బ్రాహ్మణ్యము నశించును. శ్రీరామభక్తి పరాయణుడై శమదమాదుల నాచరించుచు సాక్షాత్ శ్రీ వేదమాతయగు గాయత్రీ తత్పరుడై యే బ్రాహ్మణుడు విహితకార్యముల నాచరించునో అతడు దేవతులకు సయితము పూజ్యుడగును - సాధారణ మనుష్యులకు పూజ్యుడని చెప్పవలసిన దేమున్నది).
(brāhmaṇa bhāvamu; brāhmaṇa karma).
(brāhmaṇulu cēyavalasina karma - saṃdhyāvaṃdanamu modalagunavi cēyuṭa; lēka yajanamu, yājanamu modalagu āru vidhamulagu karmalu) - (brāhmaṇula vṛtti).
tapaḥ śrutābhyāṃ yōhīnō jāti brāhmaṇa ēvasaḥ ||“. (śabdārtha ciṃtāmaṇi)
(tapassu, bhagavaṃtuni guṟiṃci śāstramula dvārā bāgugā vini yuṃḍuṭa, brāhmaṇakulamulō puṭṭuṭa - ī mūḍu brāhmaṇyamunaku kāraṇamulu - tapassu, śrutamu lēnivāḍu brāhmaṇa kulamaṃdu puṭṭuṭacētanē brāhmaṇuḍainavāḍu - aṃducēta jātimātra brāhmaṇuḍu).
yājanādhyāpana yōḥ taddharmatvāt tadvārā ca varṇāśrama bhēda vyavasthāpanāt. atō brahmaṇyē rakṣitē sarvamapi surakṣitaṃ bhavati ityarthaḥ-
(brāhmaṇula dharmamu yājanamu, adhyāpanamu aguṭavalana varṇāśrama dharmamulu vāri dvārā pravartiṃpabaḍucunnavi. aṃducēta brāhmaṇyamu rakṣiṃcabaḍinaṃta kālamu anniyu surakṣitamugā nuṃḍunu).
śiṣṭācāra vihīnaṃ tu na punaṃti kila śrutiḥ |
vēdā na bhyasanā ddrōhāt guru vṛddavaniṃdanāt |
vāṇijyēna kuśīdēna dhūmapānēna sēvayā |
brāhmaṇyaṃ nāśamāyā ti sīrakarṣaṇa tastadhā |
ūrdhva vasthā nadhōvastān pa titi tēbhyō parigrahāt |
‘brahma’ viṣṇvēśa dēvēṣu bhēda buddhi prakalpanāt |
śūdrā dhyāpana ta starkāt śāstrīyētara vartanāt |
saṃdhyākarma parityāgāt tathā śūdrānni bhōjanāt |
dēvalatvēna ca tadā yācakatvēna vā punaḥ |
cikitsā gaṇitā bhyāṃ jīvanāditvēna vṛdhāhaṭhāta |
pratigraha mupādāya japāt śrīvēda mātaraṃ |
ayājya yācanā ccaiva asaṃtōṣān mṛṣōkti taḥ |
apa bhraṃśādi bhāṣēbhyaḥ paṭhanāt jīva nāttathā |
dēvalatvēna ca ta thā yācakatvēna vā punaḥ |
grāma yajamāna vṛttēśca kṛūra dāna parigrahāt |
manaṣyavārnirmitasya graṃdha sādhyayana śrutēḥ |
saṃsārāṇāṃ parityāgā dvēda vikrayaṇā ttathā |
brāhmaṇyaṃ naśyatikalau sādhva bhāvakusaṃgamāt |
tathāpi tatkalau dēvī rāma bhakti parāyaṇaḥ
śamī damī titikṣaśca gāyatrī japa tatparaḥ |
brāhmaṇō vēda pūjyassyāt manuṣyāṇāṃ ca kākathā ||“. (skāṃdē)
(vēdamulanu paṭhiṃcuṭa itarulaku (ssādhyāya pravacanamulu) lēkuṃḍuṭavalananu, sadācāramulaku vyatirēkamulaina drōhakāryamula nācariṃcuṭa valananu, guru śāstra dēva vṛddula niṃdiṃcuṭavalananu vyāpāramu cēyuṭa, vaḍḍīki iccina dravyamucē jīviṃcuṭa, dhūmapāna mācariṃcuṭa, sēvacē jīviṃcuṭa, nāgalipaṭṭi dunnuṭavalananu, eṭuvaṃṭi brāhmaṇamainanu naśiṃcunu. pāpātmulavalana brāhmaṇuḍu kaṭṭuvastramulanu gāni, uttarīyādulanugāni pratigrahiṃcuṭavalananu, brahma viṣṇu mahēśvarulanu muvvurulō heccu taggu modalagu bhēdabuddhini bhāviṃcuṭavalananu śūdrulaku vēdamu ceppuṭavalananu, kēvala tarkaśāstramunu mātramē abhyasiṃcuṭavalananu, sacchā strīyētaramagu kēvala saṃghasaṃskaraṇamaṃdu pālgonuṭavalananu, snāna saṃdhyādi nityakarmalanu parityajiṃcuṭavalananu, aṭulanē śūdra saṃbaṃdhamaina dravya bhōjanamucē jīviṃcuṭavalananu, āgama taṃtrādulacē sthāpitamaina dēvatulaku arcakuḍaguṭavalananu, kēvalamu yācanā vṛtticētanē jīviṃcuṭavalananu, cikitsā vṛttulacētanu, tappu lekkalu vrāyuṭacēta jīvanamu cēyuṭacētanu, ellapuḍu kōpamutō nuṃḍuṭayē svabhāvamugā nuṃḍuṭacētanu, dravyamunu grahiṃci itarulaku vēdapārāyaṇa, maṃtra japādulanācariṃcuṭa cētanu, bhraṣṭulacē śiṣṭakarmalu nācariṃpacēyuṭavalananu, saṃtōṣamanunadi lēkuṃḍuṭavalananu, abaddhamulu palukuṭavalananu, grāma paurōhitya vṛttivalananu, krūradānamulanu pratigrahiṃcuṭavalananu, kēvalamu mānava kavulacēta raciṃpabaḍina graṃdhamulanu paṭhiṃcuṭa itarulaku bōdhiṃcuṭavalananu brāhmaṇunaku vidhivihitamulaina 64 saṃskāramulanu ācariṃcaka pōvuṭavalananu, vēda vikrayamu cēyuṭavalanu, sādhubhāvamu lēkapōvuṭa, duṣṭasāṃgatyamu navalaṃbhiṃcuṭavalananu, kaliyugamaṃdu brāhmaṇyamu naśiṃcunu. śrīrāmabhakti parāyaṇuḍai śamadamādula nācariṃcucu sākṣāt śrī vēdamātayagu gāyatrī tatparuḍai yē brāhmaṇuḍu vihitakāryamula nācariṃcunō ataḍu dēvatulaku sayitamu pūjyuḍagunu - sādhāraṇa manuṣyulaku pūjyuḍani ceppavalasina dēmunnadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.