“సహస్రయుగపర్యంత మహర్యద్బ్రహ్మణో విదః |
రాత్రిం యుగసహస్రాంతాం తే అహోరాత్రివిదో జనాః |
భూతగ్రామః స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే |
రాత్ర్యాగమే (అ)వశః, పార్థ, ప్రభవంత్యహరాగమే ||“. (శ్రీమద్భగవద్గీత - 8 - 17, 19)
“భూతగ్రామో య ఏవాసీత్పూర్వకల్పే స ఏవహి |
చరాచరాత్మకో నాన్యో భూత్వా భూత్వా ప్రలీయతే |
నిశాగమేదినాదే చ స ఏవాయం ప్రజాయతే |
స్వావిద్యాది పరాధీనో భూతగ్రామోహ్యనేకథా |
అవిద్యాది క్లేశమూల కర్మాశయ వశాదయం భూతగ్రామః
పరాయత్తో జాయతే, లీయతే పునః ||“. (గీతాభావప్రకాశము - 8 - 114 to 117)
(చతుర్ముఖబ్రహ్మకు సహస్రయుగములు ఒకదినము, రాత్రియునట్లే జరుగును - ఈ చతుర్ముఖబ్రహ్మ పగటికాలమందు భూతములన్నియు పుట్టుచుండును - అతని రాత్రికాలమందు అతనిలో లీనమగును - మరల పగటియందు పుట్టుచుండును, రాత్రియందు అతనిలోనే మరల లీనమగుచుండును - ఇటివంటి దినములు 360 జరుగనొక సంవత్సరమగును - అట్టి సంవత్సరములు నూరుజన చతుర్ముఖబ్రహ్మకు అవి పరమాయువు - (చూడుము ‘బ్రహ్మ దినము’). ఒక సృష్టిలో పుట్టిన భూతములే మరల మరల పుట్టుచు లయమగుచుండును.(చూడుము - ‘కాలము’). కాలవేదులైన మునులుఈ విషయమును చెప్పిరి. చతుర్ముఖ బ్రహ్మయొక్క రాత్రికాలమనగా సృష్టిలోనున్న వస్తువులన్నియు ఒకదానిలోనొకటిగా - కార్యవస్తువులు తమ తమ కారణ వస్తువులలో - లయమగుచు, తిరిగి అప్పటినుండి తిరిగి సృష్టి ప్రారంభమగునంతవఱకు జరుగుకాలము - ఈ కాలములో సృష్టి జరగదు - చతుర్ముఖబ్రహ్మయొక్క పగటికాలమనగా సృష్టి ప్రారంభమై ప్రళయమువరకు గలకాలము - రాత్రికిపగలుకి, పగలుకి రాత్రికి బధ్య వ్యవధిలేనట్లే యీ బ్రహ్మ అహోరాత్రులుకూడ జరుగుచుండును - ఒకటి తర్వాత నొకటిగా మరల మరల జరుగుచుండును - ఇట్లు జరుగుటలో సృష్టి చేయబడిన భూతములన్నియు స్వతంత్రము లేనివై కాలగతికి, భగవంతుని శక్తికి, వశమై పుట్టుచు, పెరుగుచు, గిట్టు చుండును - ఒక సృష్టిలో పుట్టిన భూతములే ప్రళయకాలమందు చతుర్ముఖబ్రహ్మలో లయమై అవియే మరల పుట్టుచుండును. భగవంతునియొక్క అపరాప్రకృతియే - అపరాశక్తియే చతుర్ముఖబ్రహ్మ యని చెప్పబడినది.ఈ శక్తియే చతుర్ముఖబ్రహ్మయని చెప్పబడినది. ఈ అపరా శక్తి అయిన ప్రకృతిలో - చతుర్ముఖబ్రహ్మలో - పరబ్రహ్మ తన చైతన్య శక్తితో - పరాశక్తితో ప్రవేశించి దానిని శక్తివంతముగా చేయగా, ఇదివరకు లయమైయున్న భూతములు మరల సృష్టి చేయబడుటకు - పుట్టుటకు - ఉన్ముఖముగానుండి కాలక్రమేణ చతుర్ముఖబ్రహ్మ యొక్క పగటికాలముప్రారంభమగునపుడు సృష్టింపబడినట్లు స్థూలరూపముతో వ్యక్తమగును - ఇదియే సృష్టి) (చూడుము - సృష్టి).
“sahasrayugaparyaṃta maharyadbrahmaṇō vidaḥ |
rātriṃ yugasahasrāṃtāṃ tē ahōrātrividō janāḥ |
bhūtagrāmaḥ sa ēvāyaṃ bhūtvā bhūtvā pralīyatē |
rātryāgamē (a)vaśaḥ, pārtha, prabhavaṃtyaharāgamē ||“. (śrīmadbhagavadgīta - 8 - 17, 19)
“bhūtagrāmō ya ēvāsītpūrvakalpē sa ēvahi |
carācarātmakō nānyō bhūtvā bhūtvā pralīyatē |
niśāgamēdinādē ca sa ēvāyaṃ prajāyatē |
svāvidyādi parādhīnō bhūtagrāmōhyanēkathā |
avidyādi klēśamūla karmāśaya vaśādayaṃ bhūtagrāmaḥ
parāyattō jāyatē, līyatē punaḥ ||“. (gītābhāvaprakāśamu - 8 - 114 to 117)
(caturmukhabrahmaku sahasrayugamulu okadinamu, rātriyunaṭlē jarugunu - ī caturmukhabrahma pagaṭikālamaṃdu bhūtamulanniyu puṭṭucuṃḍunu - atani rātrikālamaṃdu atanilō līnamagunu - marala pagaṭiyaṃdu puṭṭucuṃḍunu, rātriyaṃdu atanilōnē marala līnamagucuṃḍunu - iṭivaṃṭi dinamulu 360 jaruganoka saṃvatsaramagunu - aṭṭi saṃvatsaramulu nūrujana caturmukhabrahmaku avi paramāyuvu - (cūḍumu ‘brahma dinamu’). oka sṛṣṭilō puṭṭina bhūtamulē marala marala puṭṭucu layamagucuṃḍunu.(cūḍumu - ‘kālamu’). kālavēdulaina munuluī viṣayamunu ceppiri. caturmukha brahmayokka rātrikālamanagā sṛṣṭilōnunna vastuvulanniyu okadānilōnokaṭigā - kāryavastuvulu tama tama kāraṇa vastuvulalō - layamagucu, tirigi appaṭinuṃḍi tirigi sṛṣṭi prāraṃbhamagunaṃtavaṟaku jarugukālamu - ī kālamulō sṛṣṭi jaragadu - caturmukhabrahmayokka pagaṭikālamanagā sṛṣṭi prāraṃbhamai praḷayamuvaraku galakālamu - rātrikipagaluki, pagaluki rātriki badhya vyavadhilēnaṭlē yī brahma ahōrātrulukūḍa jarugucuṃḍunu - okaṭi tarvāta nokaṭigā marala marala jarugucuṃḍunu - iṭlu jaruguṭalō sṛṣṭi cēyabaḍina bhūtamulanniyu svataṃtramu lēnivai kālagatiki, bhagavaṃtuni śaktiki, vaśamai puṭṭucu, perugucu, giṭṭu cuṃḍunu - oka sṛṣṭilō puṭṭina bhūtamulē praḷayakālamaṃdu caturmukhabrahmalō layamai aviyē marala puṭṭucuṃḍunu. bhagavaṃtuniyokka aparāprakṛtiyē - aparāśaktiyē caturmukhabrahma yani ceppabaḍinadi.ī śaktiyē caturmukhabrahmayani ceppabaḍinadi. ī aparā śakti ayina prakṛtilō - caturmukhabrahmalō - parabrahma tana caitanya śaktitō - parāśaktitō pravēśiṃci dānini śaktivaṃtamugā cēyagā, idivaraku layamaiyunna bhūtamulu marala sṛṣṭi cēyabaḍuṭaku - puṭṭuṭaku - unmukhamugānuṃḍi kālakramēṇa caturmukhabrahma yokka pagaṭikālamuprāraṃbhamagunapuḍu sṛṣṭiṃpabaḍinaṭlu sthūlarūpamutō vyaktamagunu - idiyē sṛṣṭi) (cūḍumu - sṛṣṭi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.