← Back to బ · Booklets 31–40 (digitized file 4)

బ్రహ్మప్రాప్తి brahmaprāpti

Original — తెలుగు
  1. సర్వాపహ్నవసిద్ధం బ్రహ్మ స్వమాత్రధియా ప్రాప్నోతీతి బ్రహ్మ ప్రాప్తః - బ్రహ్మైవ భవతీత్యర్థః -

(అన్నింటిని కప్పిపుచ్చి బ్రహ్మ స్వస్వరూపముతో తానే యుండుట - బ్రహ్మజ్ఞానము కలవాడు బ్రహ్మమే యగును కనుక తాను బ్రహ్మమే యగుట).

  1. “నాయమాత్మా ప్రవచనేన లభ్యో, నమేధయా, న బహునాశ్రుతేన యమైవ ఈశ వృణుతేతేన లభ్యః తస్మై స ఆత్మా వివృణుతే తనూ స్వాం”

(ఈ ఆత్మ - పరబ్రహ్మ - తెలివివలనగాని, వేదాధ్యయనము చేయుటచేతగాని, పొందు టకు వీలుగానివాడు - బ్రహ్మ ఎవరిని కటాక్షించి దలచితే అతనికే తనరూపమునుకనపర్చును).

  1. ధరలోన బ్రహ్మణంబు దపమున దానంబులను, గృహ ధర్మంబులను, జలాగ్ని

సోమసూర్యులచేత, శ్రుతులచేనైనను, బరమ భాగవతుల పాదసేవ

బొందినమాడ్కిని బొందంగరాదని పలుకుదురార్యులు, పరమమునులు - - - (శ్రీమదాంధ్రమహాభాగవతము - 5 - 1 -)

  1. “ఈశ్వరుండు జీవస్వరూపాను ప్రవిష్టుండైయుండునట్టి భగవంతుం జూచి భక్తి యోగంబుననేని, యోగంబుననేని బురుషుండు పరమాత్మం బొందు” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 29 -)

  2. “ప్రాప్తిర్నామ అనుభవరూపా ప్రాప్యంచ బ్రహ్మ ఇతి లభ్యతే స ఉపాసకః బ్రహ్మణాసహ సర్వకామానశ్నుతే ఇత్యన్వయః”

(శ్రీకృష్ణమాచార్యులు -) (Preface toవేదాంతసార by Sreemaan రామానుజాచార్య)

  1. “సీ. అంబ ! నారాయణుం డఖిల శాస్త్రములను సమధిగా నుష్ఠిత సవనతీర్థ

దర్శన జపతపోధ్యయన యోగక్రియా దానకర్మంబుల గానబడక

యేచిన మనము బాహ్యేంద్రియంబుల గెల్చి సకల కర్మత్యాగసరణి నొప్పి

తలకొని యాత్మతత్వజ్ఞానమున మించియుడుగక వైరాగ్యయుక్తిదనరగ

తే. మహిత ఫలసంగ రహిత ధర్మమున దనరు

నట్టి పురుషుండు దలపోయ నఖిల హేయ

గుణములను బాసి కల్యాణగుణ విశుష్టు

డైన హరినొందు పరమాత్మ ననఘడగుచు“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 32 - 1023)

  1. బ్రహ్మ జిజ్ఞాసకు బ్రహ్మ ప్రాప్తి ఫలము. బ్రహ్మప్రాప్తియనగా పరమ పురుషార్థమైన మోక్షము లభించుట, ప్రాప్తించుట - “బ్రహ్మ విదాస్నోతి పరం”.

  2. “యధా స్వర్ణకారః హేమకారః ఉపాయజ్ఞః గ్రావసుస్పురత్ స్వర్ణకణేషు ఉపాయేన (ధమనాద్యుపాయైః స్వర్ణం ప్రాప్నోతి. తథా అథ్యాత్మవిత్ (ఆత్మాధికృత కార్యకారణ సంఘాతం జ్ఞాతా) యోగైః (ఆత్మ ప్రాప్త్యుపాయైః) బ్రహ్మగతిం (బ్రహ్మతాం) ఆప్నుయాత్”.

(స్వర్ణకారుడు ఉపాయములచేత బంగారమునెట్లు పొందునో, అట్లే అధ్యాత్మవేది ఆత్మను ప్రాప్తించు ఉపాయములచేత బ్రహ్మగతిని (బ్రహ్మస్థితిని) పొందును.)

  1. “అంతకాలే మామేవ స్మరన్ ముక్త్వాకళేబరం |

య ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః (శ్రీమద్భగవద్గీత - 8 - 5)

(మరణకాలమందు నన్నే తలచుకొనుచు శరీరమును విడిచినవాడు - చనిపోయినవాడు - నా భావమును పొందును - బ్రహ్మభావమును పొందును).

  1. “సీ. నీ గృహాంగణభూమి నిటలంబు మోవంగ మోదించి నిత్యంబు మ్రెఉక్కడేని

నీ మంగళస్తవ నికరవర్ణంబులు పలుమారు నాలుక బలుకడేని

నీ యధీనములుగా నిఖిల కృత్యంబులప్రియభావమున సమర్పింపడేని

నీ పదాంబుజముల నిర్మల హృదయుడై చింతించి మక్కువ జిక్కడేని

తే. నిన్ను చెవులార వినడేని. నీకు సేవ

సేయరాడేని బ్రహ్మంబు జెందగలడె

యోగియైన దపోవ్రత యోగియైన

వేదియైన, మహాతత్వవేదియైన”. (శ్రీమదాంధ్రమహాభాగవతం - 7 - 9 - 367)

  1. “నాయమాత్మా ప్రవచనేన లభ్యో నమేధయా |

న బహునా శ్రుతేన, యమేవైష వృణుతే

తేనలభ్యః తస్యైవ ఆత్మా వివృణుతే తనూం స్వాం ||“.

“ప్రవచనేన వేదశాస్త్రాధ్యయనేననలభ్యః; తథాన మేధయా గ్రందార్థధారణ శక్త్యా; న చ బహునా శ్రుతేన నాపి భూయసా శ్రవణేన. కేన తద్వి లభ్యతే ఇతి? యమేవ పరమాత్మా నమేవ ఏషః విద్వాన్ వృణుతే ప్రాప్తు మిచ్ఛతి. తేన వరణేన పరమాత్మా లభ్యః, నాన్యేన సాధనాం తరేణ, నిత్యలబ్దస్వభావత్వాత్. కీదృశో(అ)సౌ విశేషః? ఆత్మలాభ ఇతిః తస్యైష ఆత్మా అవిద్యా సంభన్నాం స్వాం పరాం తనుం స్వాత్మ తత్వం స్వరూపం వివృణుతే - ప్రకాశయతి - ప్రకాశే ఇవ ఘటాదిద్విద్యాయాం సత్యా మావిర్భవతీత్యర్థః - తస్మాత్ అస్యత్యాగేన ఆత్మలాభప్రార్థనైవ ఆత్మలాభసాధన మిత్యర్థః”.

(ఈ ఆత్మ - బ్రహ్మ - వేదశాస్త్రములను అధ్యయనము చేయుటవలనగాని, చదివిన గ్రంధములలోని అర్థములను జ్ఞాపకము చేసుకొని అట్లు నడచు, శక్తికలిగియుండుటవలనగాని, భగవంతుని గుఱించి - వినుకలి వలనగాని, పొందుటకు వీలగువాడు కాడు - మఱి దేనివలన పొందుటకు వీలగువాడనగా - ఎవడు పరమాత్మను - విద్వాంసుడైనవాడు - ఎవడు పరమాత్మను, (పరబ్రహ్మను) పొందుటకు కోరునో - (పరబ్రహ్మను పొందుటకు ఇచ్ఛకలిగియుండునో) అతనికే పరబ్రహ్మప్రాప్తి కలుగును - ఇతర సాధనములచేత కలుగదు - ఎందుచేతననగా పరబ్రహ్మ ఎల్లపుడు ప్రాప్తించు స్వభావము గలవాడు కనుక అవిద్యచేత కప్పబడిన తన ఆత్మతత్వమును, కుండ మొదలగునవి కనబడునట్లు, ఆవిర్భవింప చేయును. అందుచేత ఇతర సాధనములను వదలివైచి ఆత్మలాభప్రార్థనముచేతనే ఆత్మప్రాప్తి కలుగును). (పరమేశ్వరానుగ్రహముకలవానికే బ్రహ్మప్రాప్తి కలుగును).

  1. “సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని |

సంపశ్యన్ బ్రహ్మ పరమం యాతి నాన్యేన హేతునా ||“. (కైవల్యోపనిషత్ - 10)

(సమస్త భూతములలో ఆత్మ యున్నాడనియు, సమస్త భూతములు ఆత్మలోనే ఉన్నాడనియు చూచువాడు పరబ్రహ్మను పొందును.; ఇతర మార్గముల వలన పొందలేడు)

  1. “యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ |

యత్తపస్యసి కౌంతేయ తత్కరుష్వమదర్పణం |

శుభా శుభ ఫలైరేవం మోక్ష్యసే కర్మబంధనైః |

సన్యాస యోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి ||” (శ్రీమద్భగవద్గీత - 9 -17, 18)

(నీవు దేనిని తినినను, దేనిని ఇచ్చినను, యే తపస్సు చేసినను దానిని నాకు అర్పించుము - (‘కృష్ణార్పణము’ అని చేయుము). ఇట్లు శుభఫలములనుగాని, అశుభఫలములనుగాని వివక్షత లేక నాకర్పించిన అట్టి కర్మలవలన కలుగు ఫలమును నీవు అనుభవించనక్కరలేదు - ఇట్లు కర్మఫలమును సన్యసించిన వాడవై నన్ను - పరబ్రహ్మను - పొందెదవు).

  1. “ఆ. ఎన్న గ్రొత్తవైనట్టి యిట్టి సంపదలు నా

కబ్బుటెల్ల హరిదయావలోక

నమున జేసికాదె నలినాక్షుసన్నిధి

కర్థినగుచు నేను నరుగుటయును - - “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - ఉ.భా - 1029)

  1. సంప్రాప్యైన మృషయో జ్ఞాన తృప్తా ః కృతాత్మనో వీతరాగాః ప్రశాంతాః |

తే సర్వగం సర్వతః ప్రాప్యధీరాః యుక్తాత్మానస్సర్వమేవా విశంతి“.

“సంప్రాప్య సమవగమ్య ఏవం ఆత్మానం ఋషయః దర్శనవంతః, తేనైవ జ్ఞానేన తృప్తాః, న బాహ్యేన తృప్తి సాధనేన శరీరోపచయ కారణేన; కృతాత్మానః పరమాత్మ స్వరూపేణైవ నిష్పన్నాత్మానస్సంతః; వీతరాగాః విగతరాగాదిదోషాః, ప్రశాంతాః ఉపరతేంద్రియాః తే ఏవం భూతాః సర్వగం సర్వవ్యాపినం ఆకాశవత్ సర్వతః ప్రాప్య నోపాధి పరిచ్చిన్నేన ఏక దేశేన; కంతర్హి? బ్రహ్మైవాద్వయమాత్మత్వేన ప్రతిపద్య; ధీరాః అత్యంత వివేకినః; యుక్తాత్మానః నిత్య సమాహిత స్వభావాః సర్వమేవ సమస్తం శరీరపాతకాలే (అ)పి ఆవిశంతి. భిన్నఘటాకాశవత్ అవిద్యాకృతోపాధి పరిచ్చేదం జహతి. ఏవం బ్రహ్మవిదో బ్రహ్మధామ ప్రవిశంతి”.

(పరబ్రహ్మను ఋషులు - త్రికాలవేదులు, సూక్ష్మవస్తువులను చూడగలుగువారు - అవగాహనచేసుకొని, ఆ జ్ఞానముచేతనే (బ్రహ్మజ్ఞానముచేతనే) తృప్తి పొందినవారై(శరీరమునకుపకరించు బాహ్య సాధనములచే తృప్తి పొందనివారై) కృతాత్ములు (పరమాత్మస్వరూపము చేతనే నిష్ఠన్నాత్ములైనవారు), రాగము మొదలగు దోషములు లేనివారై (ప్రశాంతమనస్కులై - ఇంద్రియములను జయించినవారై -) ఆకాశమువలె అన్నింటిలోను ప్రవేశించి అన్నింటిలోను పూర్తిగా వ్యాపించియుండునది అద్వయపరబ్రహ్మ అని ప్రతివాదించి, గొప్ప వివేకముగలవారు ఎల్లపుడు సమాహితమైన స్వభావముగలవారు మరణకాలమందు సర్వుడైన బ్రహ్మను పొందుదురు - బ్రద్దలైపోయిన కుండలోని ఆకాశమువలె - అవిద్యచేత కల్పించబడిన ఉపాదిని వదలివేయుదురు. ఈ ప్రకారము బ్రహ్మజ్ఞానముగలవారు బ్రహ్మపదమును ప్రవేశించుదురు - పొందుదురు).

  1. “జ్ఞానప్రసాదేన విశుద్ధ సత్వస్తతస్తు తం పశ్యతే నిష్కలం ధ్యామానాః”.

“జ్ఞాన ప్రసాదేన ఆత్మావబోధన స సమర్థమపి స్వభావేక సర్వ ప్రాణినాం జ్ఞానం బాహ్యవిషయ రాగాదిదోష కలుషితమప్రసన్న మశుద్ధం సత్ న బోధయతి. నిత్య సన్నిహిత మప్యాత్మ తత్వం మలాపనమివా దర్శతలం విలురి తమివ వా సలిలం తత్ యదా ఇత్రియ విషయ సంసర్గ జనిత రాగాది మలకాలుష్యాప నయనాత్, ఆదర్శ సలిలాది రత్ ప్రసాదితం స్వచ్ఛం శాంతమవ తిష్టతే. తదా జ్ఞానస్య ప్రసాదః స్యాత్ తేన జ్ఞానప్రసాదేన విశుద్ధస్తవః విశుద్ధాంతఃకరణో యోగ్యో బ్రహ్మద్రష్టుం యస్మాత్ తతః తస్మాత్ తం ఆత్మానం పశ్యతే - పశ్యతి, ఉపలభతే. నిష్కలం సర్వాయవాది భేదవర్జితం ధ్యాయమానః సత్యాది సాధనవానుప సమ్హృతకరణః ఏకాగ్రేణ మనసా ధ్యాయమానః చింతయన్”.

(ఆత్మజ్ఞానమును తెలుసుకొనుటకు సామర్థ్యము కలిగియున్నప్పటికీ ప్రాణులందరిజ్ఞానము బాహ్య విషయములైన రాగాది దోషములచేత కలుషితమై అశుద్ధమైనదియైయుండుటవలన, ధూళిచే కప్పబడిన అద్దమువలన నాచుచే కప్పబడిన జలమువలె దగ్గరగా (తనలోనే) ఎప్పుడూ ఉన్న ఆత్మతత్వమును తలుసుకొనలేకుండనున్నారు. ఇంద్రియములకు విషయములతోడి సంసర్గమువలన కలిగిన రాగము మొదలగు కాలుష్యము ఎప్పుడు తొలగిపోవునో - అద్దముమేద ధూళి, నీటిమీద నాచు తొలగిపోయినప్పటివలె - అప్పుడు జ్ఞానము కలుగును - అట్లు జ్ఞానము కలుగుటవలన నిష్కల్మషమైన సత్వగుణముకలవాడై, చిత్తశుద్ధి కలవాడై బ్రహ్మ దర్శనమునకు - బ్రహ్మప్రాప్తికి యోగ్యుడగును - తగినవాడగును - అందుచేత ఆత్మప్రాప్తి కలుగును - నిష్కలుడు, ఏ అవయవములులేనివాడు అయిన పరబ్రహ్మను ధ్యానించువాడు, సత్వ్యాదిసాధనములు గలవాడు, ఇంద్రియ జయము కలవాడు - ఒకేదానియందు కేంద్రీకరించిన మనస్సు గలవాడు ధ్యానము గలవాడు పరబ్రహ్మను పొందును)

  1. ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశౌ(అ)ర్జున తిష్టతిః |

భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా |

తమేవ శరణం గచ్ఛ సర్వభావేన భారత |

తత్ప్రాసాదాత్పరాం శాంతిం స్థానం ప్రాప్యసి శాశ్వతం |

- - - మన్మనా భవ మద్భక్తో మద్యాజీమాం నమస్కురు |

మామైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియా(అ)సి మే |

సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ |

అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః (శ్రీమద్భగవద్గీత - 18 - 61 to 66)

(యంత్రముమీదనున్న బొమ్మలని త్రిప్పినట్లు - ఈశ్వరుడు - పరబ్రహ్మ - సమస్త భూతములయొక్క హృదయమందుండి మాయచేత వాటిని భ్రమింపచేయుచు త్రిప్పుచున్నాడు - అన్నివిధముల అతనిని శరణు పొందుము - అతని దయవలన శాశ్వతమైనటువంటిన్నీ ఉత్కృష్టమైన శాంతిని - మోక్షమును - (మోక్షరూపుడైన పరబ్రహ్మను) పొందగలవు - నాయందే మనస్సు గలవాడవుకమ్ము, నాభక్తుడవుకమ్ము నన్నే యజించుము, నాకు నమస్కరించుము - ఇట్లు చేసిన నన్ను (పరబ్రహ్మమే అయిన నన్ను) పొందగలవు - నీవు నా భక్తుడవు, నాకు ప్రియుడవు - ఇష్టమైనవాడవు - ఇది నిజము – సమస్తమైన ధర్మములను - పరబ్రహ్మను పొందు ఉపాయములను (సాధనములను) విడిచిపెట్టుము -వాటినాచరించుట చాలకష్టము - చాల సులభమైన మార్గము చెప్పుచున్నాను - సృష్టి అంతటిలోను ఉన్నది నేను ఒక్కడినే - అన్ని దేవతా రూపములూ నేనే - అందుచేత నన్ను శరణు పొందుము - అట్లు నీవు చేసినయడల సమస్త పాపములనుండి విముక్తుడుగా చేసెదను - పాపకర్మలు ఫలముననుభవించ అవసరములేక, మోక్షమును పొందెదవు - పరబ్రహ్మను పొందెదవు - విచారింపకము).

  1. “నిత్యకర్మానుష్టానాద్ధర్మోత్పత్తిః, ధర్మోత్పత్తేః పాపహానిస్తతశ్చిత్త శుద్ధిః, తతస్సంసార యాథాత్మావబోధః, తతో వైరాగ్యం, తతో ముక్షుత్వం, తతో స్తదుపాయపర్యేషణం, తతస్సర్వకర్మ తత్సాధన సన్యాసః, తతో యోగాభ్యాసః, తతశ్చిత్తస్య ప్రత్యక్ప్రవణతా, తతస్తత్వమస్యాది వాక్యార్థ పరిజ్ఞానం, తతో(అ)విద్యోచ్ఛేదః, తతః స్వాత్మన్యేవాపస్థానం” (నైష్కర్మ్యసిద్ధి - 1 - 135)

(నిత్యకర్మల ననుష్టించుటవలన ధర్మము జనించును, ధర్మము కలిగినచో పాపము తొలగిపోవును - తర్వాత చిత్తశుద్ధి కలుగును - చిత్తశుద్ధి కలిగిన సంసారముయొక్క యధార్థస్థితి తెలియనగును - అటు తరువాత వైరాగ్యము కలుగును - దానివలన మోక్షమందు ఇచ్ఛ జనించును - అప్పుడు మోక్షమునకుపాయము వెదుకనగును. అప్పుడు సర్వకర్మసన్యాసము చేయవలెను - అటుపైన యోగాభ్యాసము. దానివలన ప్రత్యగాత్మయందు ఆసక్తి కలుగును - అటు తర్వాత ‘తత్వమసి’ యను వాక్యార్థమునవగాహనము చేసుకొనుట, అందువలన అవిద్యానాశము కలుగును - అవిద్యానాశముతో పరబ్రహ్మ జ్ఞానముకలిగి దానియందే స్థిరత్వము కలుగును - అనగా బ్రహ్మప్రాప్తి కలుగును).

  1. “సీ. అంఘ్రిమూలమున మూలాధారచక్రంబు పీడించి ప్రాణంబు బిగియబట్టి

నాభితలము చేర్చి నయముతో మెల్లన హృత్సరోజముమీదికెగయబట్టి

యెటమీద నురమందు హత్తించి క్రమ్మఱ తాలు మూలమునకు దఱిమి, నిలిపి

మతముతో భ్రూయుగమధ్యంబు చేర్చి దృక్కర్ణనాపాస్య మార్గములు మూసి

తే. యిచ్ఛలేని యోగి యెలమి ముహూర్తార్థ,

మింద్రియానుషంగ మింతలేక

ప్రాణములను మించి బ్రహ్మరంధ్రము చించి

బ్రహ్మమందు గలియు పౌరవేంద్ర”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 -2 -27)

(చూడుము - శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 2 - 30).

  1. “అభ్యాస యోగయుక్తేన చేతసా నాన్యగామినా |

పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్ ||

కవిం పురాణమనుశాసితారం అతోరణీయాం సమనుస్మరేద్యః |

సర్వస్యధాతారమచింత్యరూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ ||

ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ |

భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ స తం పురుషముపైతి దివ్యం ||“. (శ్రీమద్భగవద్గీత - 8 - 8 to10)

“అంతకాలే (అ)చలేనాంతః కరణేనాను సంస్మరేత్ |

భగవిద్విషయేణాతి ప్రేమ్ణాయుక్తః సమాధినా |

సమాధి జన్యసంస్కార సమూహేన యతః పుమాన్ |

ఆదౌహృదివశీకృత్య తతో భూమి జయక్రమాత్ |

సుషుమ్న యోర్థ్వగామిన్యా నాద్యా (ఆ)చార్యోక్త మార్గతః |

స్థాపయిత్వాత్మవః ప్రాణమాజ్ఞాచక్రే సమాహితః |

బ్రహ్మరంధ్రాత్ ఉత్క్రమ్యోపాసకస్తం స్వచింతితం |

కలిం పురాణమిత్యాది లక్షణం పురుషం పరం |

ద్యోతనాత్మకమీశాన మద్భుతం ప్రతి పద్యతే ||” (గీతాభావప్రకాశము - 8 - 71 to 75)

(ప్రాణావసానకాలమందు పురుషుడు చలించని మనస్సుతో, భగవిద్విషయమైన భక్తితో కూడిన సమాధితో భగవంతుని స్మరించవలెను - మొదట హృదయమునుతనవశములో నుంచుకొని, తరువాత క్రమముగా భూమిమీదనుండి - ఆసనమునుండి - మీదికి గాలిలోనికి లేవగలుగు శక్తిగల ప్రాణాయామము చేసి, ఊర్థ్వముగా పోవు సుషుమ్నయను నాడిద్వారా గురువు ఉపదేశించిన మార్గముద్వారా ప్రాణమును - ప్రాణవాయువును - సమాహితమైన మనస్సు గలవాడై - ఆజ్ఞాచక్రములో స్థాపించి - బ్రహ్మరంధ్రమునుండి పైకి వెడలి ఉపాసకుడైనవాడు, తాను ధ్యానముచేయుచున్నా కలిరేయినటువంటిన్నీ, పూర్వమునుండి - మొదటినుండి యున్నవాడు - అను లక్షణములుగలవాడు, ప్రకాశస్వరూపుడు, ఈశుడు (ఈశ్వరుడు) పరమపురుషుడు అయిన పరబ్రహ్మను పొందును).

  1. “క. రోషప్రమోదనిద్రా

భాషాశనపాన గతులబాయక చక్రిన్

దోషగతి జూచి యైన వి

శేషగతిం గంసు డతనిజెందె, నరేంద్రా“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ.భా - 1380)

Transliteration
  1. sarvāpahnavasiddhaṃ brahma svamātradhiyā prāpnōtīti brahma prāptaḥ - brahmaiva bhavatītyarthaḥ -

(anniṃṭini kappipucci brahma svasvarūpamutō tānē yuṃḍuṭa - brahmajñānamu kalavāḍu brahmamē yagunu kanuka tānu brahmamē yaguṭa).

  1. “nāyamātmā pravacanēna labhyō, namēdhayā, na bahunāśrutēna yamaiva īśa vṛṇutētēna labhyaḥ tasmai sa ātmā vivṛṇutē tanū svāṃ”

(ī ātma - parabrahma - telivivalanagāni, vēdādhyayanamu cēyuṭacētagāni, poṃdu ṭaku vīlugānivāḍu - brahma evarini kaṭākṣiṃci dalacitē atanikē tanarūpamunukanaparcunu).

  1. dharalōna brahmaṇaṃbu dapamuna dānaṃbulanu, gṛha dharmaṃbulanu, jalāgni

sōmasūryulacēta, śrutulacēnainanu, barama bhāgavatula pādasēva

boṃdinamāḍkini boṃdaṃgarādani palukudurāryulu, paramamunulu - - - (śrīmadāṃdhramahābhāgavatamu - 5 - 1 -)

  1. “īśvaruṃḍu jīvasvarūpānu praviṣṭuṃḍaiyuṃḍunaṭṭi bhagavaṃtuṃ jūci bhakti yōgaṃbunanēni, yōgaṃbunanēni buruṣuṃḍu paramātmaṃ boṃdu” (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 29 -)

  2. “prāptirnāma anubhavarūpā prāpyaṃca brahma iti labhyatē sa upāsakaḥ brahmaṇāsaha sarvakāmānaśnutē ityanvayaḥ”

(śrīkṛṣṇamācāryulu -) (Preface tovēdāṃtasāra by Sreemaan rāmānujācārya)

  1. “sī. aṃba ! nārāyaṇuṃ ḍakhila śāstramulanu samadhigā nuṣṭhita savanatīrtha

darśana japatapōdhyayana yōgakriyā dānakarmaṃbula gānabaḍaka

yēcina manamu bāhyēṃdriyaṃbula gelci sakala karmatyāgasaraṇi noppi

talakoni yātmatatvajñānamuna miṃciyuḍugaka vairāgyayuktidanaraga

tē. mahita phalasaṃga rahita dharmamuna danaru

naṭṭi puruṣuṃḍu dalapōya nakhila hēya

guṇamulanu bāsi kalyāṇaguṇa viśuṣṭu

ḍaina harinoṃdu paramātma nanaghaḍagucu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 32 - 1023)

  1. brahma jijñāsaku brahma prāpti phalamu. brahmaprāptiyanagā parama puruṣārthamaina mōkṣamu labhiṃcuṭa, prāptiṃcuṭa - “brahma vidāsnōti paraṃ”.

  2. “yadhā svarṇakāraḥ hēmakāraḥ upāyajñaḥ grāvasuspurat svarṇakaṇēṣu upāyēna (dhamanādyupāyaiḥ svarṇaṃ prāpnōti. tathā athyātmavit (ātmādhikṛta kāryakāraṇa saṃghātaṃ jñātā) yōgaiḥ (ātma prāptyupāyaiḥ) brahmagatiṃ (brahmatāṃ) āpnuyāt”.

(svarṇakāruḍu upāyamulacēta baṃgāramuneṭlu poṃdunō, aṭlē adhyātmavēdi ātmanu prāptiṃcu upāyamulacēta brahmagatini (brahmasthitini) poṃdunu.)

  1. “aṃtakālē māmēva smaran muktvākaḷēbaraṃ |

ya prayāti samadbhāvaṃ yāti nāstyatra saṃśayaḥ (śrīmadbhagavadgīta - 8 - 5)

(maraṇakālamaṃdu nannē talacukonucu śarīramunu viḍicinavāḍu - canipōyinavāḍu - nā bhāvamunu poṃdunu - brahmabhāvamunu poṃdunu).

  1. “sī. nī gṛhāṃgaṇabhūmi niṭalaṃbu mōvaṃga mōdiṃci nityaṃbu mreukkaḍēni

nī maṃgaḷastava nikaravarṇaṃbulu palumāru nāluka balukaḍēni

nī yadhīnamulugā nikhila kṛtyaṃbulapriyabhāvamuna samarpiṃpaḍēni

nī padāṃbujamula nirmala hṛdayuḍai ciṃtiṃci makkuva jikkaḍēni

tē. ninnu cevulāra vinaḍēni. nīku sēva

sēyarāḍēni brahmaṃbu jeṃdagalaḍe

yōgiyaina dapōvrata yōgiyaina

vēdiyaina, mahātatvavēdiyaina”. (śrīmadāṃdhramahābhāgavataṃ - 7 - 9 - 367)

  1. “nāyamātmā pravacanēna labhyō namēdhayā |

na bahunā śrutēna, yamēvaiṣa vṛṇutē

tēnalabhyaḥ tasyaiva ātmā vivṛṇutē tanūṃ svāṃ ||“.

“pravacanēna vēdaśāstrādhyayanēnanalabhyaḥ; tathāna mēdhayā graṃdārthadhāraṇa śaktyā; na ca bahunā śrutēna nāpi bhūyasā śravaṇēna. kēna tadvi labhyatē iti? yamēva paramātmā namēva ēṣaḥ vidvān vṛṇutē prāptu micchati. tēna varaṇēna paramātmā labhyaḥ, nānyēna sādhanāṃ tarēṇa, nityalabdasvabhāvatvāt. kīdṛśō(a)sau viśēṣaḥ? ātmalābha itiḥ tasyaiṣa ātmā avidyā saṃbhannāṃ svāṃ parāṃ tanuṃ svātma tatvaṃ svarūpaṃ vivṛṇutē - prakāśayati - prakāśē iva ghaṭādidvidyāyāṃ satyā māvirbhavatītyarthaḥ - tasmāt asyatyāgēna ātmalābhaprārthanaiva ātmalābhasādhana mityarthaḥ”.

(ī ātma - brahma - vēdaśāstramulanu adhyayanamu cēyuṭavalanagāni, cadivina graṃdhamulalōni arthamulanu jñāpakamu cēsukoni aṭlu naḍacu, śaktikaligiyuṃḍuṭavalanagāni, bhagavaṃtuni guṟiṃci - vinukali valanagāni, poṃduṭaku vīlaguvāḍu kāḍu - maṟi dēnivalana poṃduṭaku vīlaguvāḍanagā - evaḍu paramātmanu - vidvāṃsuḍainavāḍu - evaḍu paramātmanu, (parabrahmanu) poṃduṭaku kōrunō - (parabrahmanu poṃduṭaku icchakaligiyuṃḍunō) atanikē parabrahmaprāpti kalugunu - itara sādhanamulacēta kalugadu - eṃducētananagā parabrahma ellapuḍu prāptiṃcu svabhāvamu galavāḍu kanuka avidyacēta kappabaḍina tana ātmatatvamunu, kuṃḍa modalagunavi kanabaḍunaṭlu, āvirbhaviṃpa cēyunu. aṃducēta itara sādhanamulanu vadalivaici ātmalābhaprārthanamucētanē ātmaprāpti kalugunu). (paramēśvarānugrahamukalavānikē brahmaprāpti kalugunu).

  1. “sarvabhūtasthamātmānaṃ sarvabhūtāni cātmani |

saṃpaśyan brahma paramaṃ yāti nānyēna hētunā ||“. (kaivalyōpaniṣat - 10)

(samasta bhūtamulalō ātma yunnāḍaniyu, samasta bhūtamulu ātmalōnē unnāḍaniyu cūcuvāḍu parabrahmanu poṃdunu.; itara mārgamula valana poṃdalēḍu)

  1. “yatkarōṣi yadaśnāsi yajjuhōṣi dadāsi yat |

yattapasyasi kauṃtēya tatkaruṣvamadarpaṇaṃ |

śubhā śubha phalairēvaṃ mōkṣyasē karmabaṃdhanaiḥ |

sanyāsa yōgayuktātmā vimuktō māmupaiṣyasi ||” (śrīmadbhagavadgīta - 9 -17, 18)

(nīvu dēnini tininanu, dēnini iccinanu, yē tapassu cēsinanu dānini nāku arpiṃcumu - (‘kṛṣṇārpaṇamu’ ani cēyumu). iṭlu śubhaphalamulanugāni, aśubhaphalamulanugāni vivakṣata lēka nākarpiṃcina aṭṭi karmalavalana kalugu phalamunu nīvu anubhaviṃcanakkaralēdu - iṭlu karmaphalamunu sanyasiṃcina vāḍavai nannu - parabrahmanu - poṃdedavu).

  1. “ā. enna grottavainaṭṭi yiṭṭi saṃpadalu nā

kabbuṭella haridayāvalōka

namuna jēsikāde nalinākṣusannidhi

karthinagucu nēnu naruguṭayunu - - “. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - u.bhā - 1029)

  1. saṃprāpyaina mṛṣayō jñāna tṛptā ḥ kṛtātmanō vītarāgāḥ praśāṃtāḥ |

tē sarvagaṃ sarvataḥ prāpyadhīrāḥ yuktātmānassarvamēvā viśaṃti”.

“saṃprāpya samavagamya ēvaṃ ātmānaṃ ṛṣayaḥ darśanavaṃtaḥ, tēnaiva jñānēna tṛptāḥ, na bāhyēna tṛpti sādhanēna śarīrōpacaya kāraṇēna; kṛtātmānaḥ paramātma svarūpēṇaiva niṣpannātmānassaṃtaḥ; vītarāgāḥ vigatarāgādidōṣāḥ, praśāṃtāḥ uparatēṃdriyāḥ tē ēvaṃ bhūtāḥ sarvagaṃ sarvavyāpinaṃ ākāśavat sarvataḥ prāpya nōpādhi pariccinnēna ēka dēśēna; kaṃtarhi? brahmaivādvayamātmatvēna pratipadya; dhīrāḥ atyaṃta vivēkinaḥ; yuktātmānaḥ nitya samāhita svabhāvāḥ sarvamēva samastaṃ śarīrapātakālē (a)pi āviśaṃti. bhinnaghaṭākāśavat avidyākṛtōpādhi pariccēdaṃ jahati. ēvaṃ brahmavidō brahmadhāma praviśaṃti”.

(parabrahmanu ṛṣulu - trikālavēdulu, sūkṣmavastuvulanu cūḍagaluguvāru - avagāhanacēsukoni, ā jñānamucētanē (brahmajñānamucētanē) tṛpti poṃdinavārai(śarīramunakupakariṃcu bāhya sādhanamulacē tṛpti poṃdanivārai) kṛtātmulu (paramātmasvarūpamu cētanē niṣṭhannātmulainavāru), rāgamu modalagu dōṣamulu lēnivārai (praśāṃtamanaskulai - iṃdriyamulanu jayiṃcinavārai -) ākāśamuvale anniṃṭilōnu pravēśiṃci anniṃṭilōnu pūrtigā vyāpiṃciyuṃḍunadi advayaparabrahma ani prativādiṃci, goppa vivēkamugalavāru ellapuḍu samāhitamaina svabhāvamugalavāru maraṇakālamaṃdu sarvuḍaina brahmanu poṃduduru - braddalaipōyina kuṃḍalōni ākāśamuvale - avidyacēta kalpiṃcabaḍina upādini vadalivēyuduru. ī prakāramu brahmajñānamugalavāru brahmapadamunu pravēśiṃcuduru - poṃduduru).

  1. “jñānaprasādēna viśuddha satvastatastu taṃ paśyatē niṣkalaṃ dhyāmānāḥ”.

“jñāna prasādēna ātmāvabōdhana sa samarthamapi svabhāvēka sarva prāṇināṃ jñānaṃ bāhyaviṣaya rāgādidōṣa kaluṣitamaprasanna maśuddhaṃ sat na bōdhayati. nitya sannihita mapyātma tatvaṃ malāpanamivā darśatalaṃ viluri tamiva vā salilaṃ tat yadā itriya viṣaya saṃsarga janita rāgādi malakāluṣyāpa nayanāt, ādarśa salilādi rat prasāditaṃ svacchaṃ śāṃtamava tiṣṭatē. tadā jñānasya prasādaḥ syāt tēna jñānaprasādēna viśuddhastavaḥ viśuddhāṃtaḥkaraṇō yōgyō brahmadraṣṭuṃ yasmāt tataḥ tasmāt taṃ ātmānaṃ paśyatē - paśyati, upalabhatē. niṣkalaṃ sarvāyavādi bhēdavarjitaṃ dhyāyamānaḥ satyādi sādhanavānupa samhṛtakaraṇaḥ ēkāgrēṇa manasā dhyāyamānaḥ ciṃtayan”.

(ātmajñānamunu telusukonuṭaku sāmarthyamu kaligiyunnappaṭikī prāṇulaṃdarijñānamu bāhya viṣayamulaina rāgādi dōṣamulacēta kaluṣitamai aśuddhamainadiyaiyuṃḍuṭavalana, dhūḷicē kappabaḍina addamuvalana nācucē kappabaḍina jalamuvale daggaragā (tanalōnē) eppuḍū unna ātmatatvamunu talusukonalēkuṃḍanunnāru. iṃdriyamulaku viṣayamulatōḍi saṃsargamuvalana kaligina rāgamu modalagu kāluṣyamu eppuḍu tolagipōvunō - addamumēda dhūḷi, nīṭimīda nācu tolagipōyinappaṭivale - appuḍu jñānamu kalugunu - aṭlu jñānamu kaluguṭavalana niṣkalmaṣamaina satvaguṇamukalavāḍai, cittaśuddhi kalavāḍai brahma darśanamunaku - brahmaprāptiki yōgyuḍagunu - taginavāḍagunu - aṃducēta ātmaprāpti kalugunu - niṣkaluḍu, ē avayavamululēnivāḍu ayina parabrahmanu dhyāniṃcuvāḍu, satvyādisādhanamulu galavāḍu, iṃdriya jayamu kalavāḍu - okēdāniyaṃdu kēṃdrīkariṃcina manassu galavāḍu dhyānamu galavāḍu parabrahmanu poṃdunu)

  1. īśvaraḥ sarvabhūtānāṃ hṛddēśau(a)rjuna tiṣṭatiḥ |

bhrāmayan sarvabhūtāni yaṃtrārūḍhāni māyayā |

tamēva śaraṇaṃ gaccha sarvabhāvēna bhārata |

tatprāsādātparāṃ śāṃtiṃ sthānaṃ prāpyasi śāśvataṃ |

- - - manmanā bhava madbhaktō madyājīmāṃ namaskuru |

māmaiṣyasi satyaṃ tē pratijānē priyā(a)si mē |

sarvadharmān parityajya māmēkaṃ śaraṇaṃ vraja |

ahaṃ tvā sarvapāpēbhyō mōkṣayiṣyāmi mā śucaḥ (śrīmadbhagavadgīta - 18 - 61 to 66)

(yaṃtramumīdanunna bommalani trippinaṭlu - īśvaruḍu - parabrahma - samasta bhūtamulayokka hṛdayamaṃduṃḍi māyacēta vāṭini bhramiṃpacēyucu trippucunnāḍu - annividhamula atanini śaraṇu poṃdumu - atani dayavalana śāśvatamainaṭuvaṃṭinnī utkṛṣṭamaina śāṃtini - mōkṣamunu - (mōkṣarūpuḍaina parabrahmanu) poṃdagalavu - nāyaṃdē manassu galavāḍavukammu, nābhaktuḍavukammu nannē yajiṃcumu, nāku namaskariṃcumu - iṭlu cēsina nannu (parabrahmamē ayina nannu) poṃdagalavu - nīvu nā bhaktuḍavu, nāku priyuḍavu - iṣṭamainavāḍavu - idi nijamu – samastamaina dharmamulanu - parabrahmanu poṃdu upāyamulanu (sādhanamulanu) viḍicipeṭṭumu -vāṭinācariṃcuṭa cālakaṣṭamu - cāla sulabhamaina mārgamu ceppucunnānu - sṛṣṭi aṃtaṭilōnu unnadi nēnu okkaḍinē - anni dēvatā rūpamulū nēnē - aṃducēta nannu śaraṇu poṃdumu - aṭlu nīvu cēsinayaḍala samasta pāpamulanuṃḍi vimuktuḍugā cēsedanu - pāpakarmalu phalamunanubhaviṃca avasaramulēka, mōkṣamunu poṃdedavu - parabrahmanu poṃdedavu - vicāriṃpakamu).

  1. “nityakarmānuṣṭānāddharmōtpattiḥ, dharmōtpattēḥ pāpahānistataścitta śuddhiḥ, tatassaṃsāra yāthātmāvabōdhaḥ, tatō vairāgyaṃ, tatō mukṣutvaṃ, tatō stadupāyaparyēṣaṇaṃ, tatassarvakarma tatsādhana sanyāsaḥ, tatō yōgābhyāsaḥ, tataścittasya pratyakpravaṇatā, tatastatvamasyādi vākyārtha parijñānaṃ, tatō(a)vidyōcchēdaḥ, tataḥ svātmanyēvāpasthānaṃ” (naiṣkarmyasiddhi - 1 - 135)

(nityakarmala nanuṣṭiṃcuṭavalana dharmamu janiṃcunu, dharmamu kaliginacō pāpamu tolagipōvunu - tarvāta cittaśuddhi kalugunu - cittaśuddhi kaligina saṃsāramuyokka yadhārthasthiti teliyanagunu - aṭu taruvāta vairāgyamu kalugunu - dānivalana mōkṣamaṃdu iccha janiṃcunu - appuḍu mōkṣamunakupāyamu vedukanagunu. appuḍu sarvakarmasanyāsamu cēyavalenu - aṭupaina yōgābhyāsamu. dānivalana pratyagātmayaṃdu āsakti kalugunu - aṭu tarvāta ‘tatvamasi’ yanu vākyārthamunavagāhanamu cēsukonuṭa, aṃduvalana avidyānāśamu kalugunu - avidyānāśamutō parabrahma jñānamukaligi dāniyaṃdē sthiratvamu kalugunu - anagā brahmaprāpti kalugunu).

  1. “sī. aṃghrimūlamuna mūlādhāracakraṃbu pīḍiṃci prāṇaṃbu bigiyabaṭṭi

nābhitalamu cērci nayamutō mellana hṛtsarōjamumīdikegayabaṭṭi

yeṭamīda nuramaṃdu hattiṃci krammaṟa tālu mūlamunaku daṟimi, nilipi

matamutō bhrūyugamadhyaṃbu cērci dṛkkarṇanāpāsya mārgamulu mūsi

tē. yicchalēni yōgi yelami muhūrtārtha,

miṃdriyānuṣaṃga miṃtalēka

prāṇamulanu miṃci brahmaraṃdhramu ciṃci

brahmamaṃdu galiyu pauravēṃdra”. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 -2 -27)

(cūḍumu - śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 2 - 30).

  1. “abhyāsa yōgayuktēna cētasā nānyagāminā |

paramaṃ puruṣaṃ divyaṃ yāti pārthānuciṃtayan ||

kaviṃ purāṇamanuśāsitāraṃ atōraṇīyāṃ samanusmarēdyaḥ |

sarvasyadhātāramaciṃtyarūpaṃ ādityavarṇaṃ tamasaḥ parastāt ||

prayāṇakālē manasācalēna bhaktyā yuktō yōgabalēna caiva |

bhruvōrmadhyē prāṇamāvēśya samyak sa taṃ puruṣamupaiti divyaṃ ||“. (śrīmadbhagavadgīta - 8 - 8 to10)

“aṃtakālē (a)calēnāṃtaḥ karaṇēnānu saṃsmarēt |

bhagavidviṣayēṇāti prēmṇāyuktaḥ samādhinā |

samādhi janyasaṃskāra samūhēna yataḥ pumān |

ādauhṛdivaśīkṛtya tatō bhūmi jayakramāt |

suṣumna yōrthvagāminyā nādyā (ā)cāryōkta mārgataḥ |

sthāpayitvātmavaḥ prāṇamājñācakrē samāhitaḥ |

brahmaraṃdhrāt utkramyōpāsakastaṃ svaciṃtitaṃ |

kaliṃ purāṇamityādi lakṣaṇaṃ puruṣaṃ paraṃ |

dyōtanātmakamīśāna madbhutaṃ prati padyatē ||” (gītābhāvaprakāśamu - 8 - 71 to 75)

(prāṇāvasānakālamaṃdu puruṣuḍu caliṃcani manassutō, bhagavidviṣayamaina bhaktitō kūḍina samādhitō bhagavaṃtuni smariṃcavalenu - modaṭa hṛdayamunutanavaśamulō nuṃcukoni, taruvāta kramamugā bhūmimīdanuṃḍi - āsanamunuṃḍi - mīdiki gālilōniki lēvagalugu śaktigala prāṇāyāmamu cēsi, ūrthvamugā pōvu suṣumnayanu nāḍidvārā guruvu upadēśiṃcina mārgamudvārā prāṇamunu - prāṇavāyuvunu - samāhitamaina manassu galavāḍai - ājñācakramulō sthāpiṃci - brahmaraṃdhramunuṃḍi paiki veḍali upāsakuḍainavāḍu, tānu dhyānamucēyucunnā kalirēyinaṭuvaṃṭinnī, pūrvamunuṃḍi - modaṭinuṃḍi yunnavāḍu - anu lakṣaṇamulugalavāḍu, prakāśasvarūpuḍu, īśuḍu (īśvaruḍu) paramapuruṣuḍu ayina parabrahmanu poṃdunu).

  1. “ka. rōṣapramōdanidrā

bhāṣāśanapāna gatulabāyaka cakrin

dōṣagati jūci yaina vi

śēṣagatiṃ gaṃsu ḍatanijeṃde, narēṃdrā”. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū.bhā - 1380)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.