← Back to బ · Booklets 31–40 (digitized file 4)

బ్రహ్మార్పణం brahmārpaṇaṃ

Original — తెలుగు
  1. “బ్రహ్మ యస్య హవిషః అర్పణం తద్బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః, బ్రహ్మార్పణంహవిః, స్వయంచ బ్రహ్మ భూతం”.

(అగ్నిహోత్రములో ఏది హవిస్సుగా అర్పణ చేయబడుచున్నదో - అది బ్రహ్మార్పణము. బ్రహ్మను గుఱించి, బ్రహ్మనుద్దేశించి అగ్నిలో అర్పణ చేయబడునది, బ్రహ్మనుద్దేశించి హవిస్సుగా అర్పణ చేయబడునది) (అది బ్రహ్మమే యగును).

  1. “బ్రహ్మార్పణం, బ్రహ్మ హవిర్బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం |

బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా ||“. (శ్రీమద్భగవద్గీత - 4 - 24)

(బ్రహ్మనుద్దేశించి చేయు యజ్ఞ యాగాదులను కర్మలలో అగ్నిలో అర్పించు హవిస్సు, అర్పణచేయు కర్మ, అగ్ని, ఆ కర్మచేయువాడు అందరూ, అన్నియు బ్రహ్మము - ఈ కర్మవలన ఫలముగా పొందతగినవాడు బ్రహ్మమే - అని భావించవలెను).

  1. “బ్రహ్మ అర్పణం యేన కరణేన బ్రహ్మవిత్ హవిః అగ్నౌ అర్పయతి తత్ బ్రహ్మైవ ఇతి పశ్యతి. తస్య ఆత్మ వ్యతిరేకేణ అభావం పశ్యతి - యథా శుక్తికాయాం రజతా భావం తదుచ్యతే బ్రహ్మైవ అర్పణమితి, యథా యద్రజతం తత్ శుక్తి కైవేతి,”బ్రహ్మార్పణం” (బ్రహ్మ అర్పణం) ఇతి అ సమస్తే పదే యత్ అర్పణ బుద్ధ్యా గృహ్యతే లోకే తత్ అస్య బ్రహ్మవిదః బ్రహ్మైవ ఇత్యర్థః “.

    1. (బ్రహ్మను తెలిసినవాడు - బ్రహ్మవిదుడు, బ్రహ్మజ్ఞాని - అగ్నియందు హవిస్సును అర్పించును - అట్లు అర్పించుట యను కర్మ బ్రహ్మము అని అతను తెలిసి చేయును - అది ఆత్మకంటె వేరైనది కాదు అని తెలిసి చేయును - అట్లు చేయుటవలన ఆ అర్పణకర్మ బ్రహ్మమే - బ్రహ్మవిదుడు బ్రహ్మమే అయినట్లు).

(మోక్షము కోరువారు తమకున్నదానిలో ఏదియో కొంచెము - ఏ మాత్రమైనను - ‘బ్రహ్మార్పణము’ అనికాని ‘కృష్ణార్పణము’ అనికాని చేసి భుజించవలెను).

Transliteration
  1. “brahma yasya haviṣaḥ arpaṇaṃ tadbrahmārpaṇaṃ brahma haviḥ, brahmārpaṇaṃhaviḥ, svayaṃca brahma bhūtaṃ”.

(agnihōtramulō ēdi havissugā arpaṇa cēyabaḍucunnadō - adi brahmārpaṇamu. brahmanu guṟiṃci, brahmanuddēśiṃci agnilō arpaṇa cēyabaḍunadi, brahmanuddēśiṃci havissugā arpaṇa cēyabaḍunadi) (adi brahmamē yagunu).

  1. “brahmārpaṇaṃ, brahma havirbrahmāgnau brahmaṇāhutaṃ |

brahmaiva tēna gaṃtavyaṃ brahma karma samādhinā ||“. (śrīmadbhagavadgīta - 4 - 24)

(brahmanuddēśiṃci cēyu yajña yāgādulanu karmalalō agnilō arpiṃcu havissu, arpaṇacēyu karma, agni, ā karmacēyuvāḍu aṃdarū, anniyu brahmamu - ī karmavalana phalamugā poṃdataginavāḍu brahmamē - ani bhāviṃcavalenu).

  1. “brahma arpaṇaṃ yēna karaṇēna brahmavit haviḥ agnau arpayati tat brahmaiva iti paśyati. tasya ātma vyatirēkēṇa abhāvaṃ paśyati - yathā śuktikāyāṃ rajatā bhāvaṃ taducyatē brahmaiva arpaṇamiti, yathā yadrajataṃ tat śukti kaivēti,”brahmārpaṇaṃ” (brahma arpaṇaṃ) iti a samastē padē yat arpaṇa buddhyā gṛhyatē lōkē tat asya brahmavidaḥ brahmaiva ityarthaḥ “.

    1. (brahmanu telisinavāḍu - brahmaviduḍu, brahmajñāni - agniyaṃdu havissunu arpiṃcunu - aṭlu arpiṃcuṭa yanu karma brahmamu ani atanu telisi cēyunu - adi ātmakaṃṭe vērainadi kādu ani telisi cēyunu - aṭlu cēyuṭavalana ā arpaṇakarma brahmamē - brahmaviduḍu brahmamē ayinaṭlu).

(mōkṣamu kōruvāru tamakunnadānilō ēdiyō koṃcemu - ē mātramainanu - ‘brahmārpaṇamu’ anikāni ‘kṛṣṇārpaṇamu’ anikāni cēsi bhujiṃcavalenu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.