(పరబ్రహ్మ శబ్దము, స్పర్శము, రూపము, వ్యయము లేనివాడు. రూపము లేనివాడగుటచేత అవయవములు లేనిది కనుక క్షీణించనిది)
(పరబ్రహ్మ అక్షరుడు, స్థూలరూపము అను లక్షణము లేనివాడు, కంటికి కనబడనివాడు - స్పష్టముగా కనబడనివాడు, బుద్ధి మొదలగు ఇంద్రియములకు గోచరముకానివాడు, ఆకారములేనివాడు).
(కండ్లకు కనబడువాడు కాడు, నోటితో చెప్పుటకు వీలుకానివాడు, నిర్మలమైన మనసుతో ఊహించుటకు కూడ వీలుకానివాడు).
(కళలు లేనిది - భాగములు లేనిది, క్రియలు లేనిది, శాంతము, నిరవధ్యము, నిరంజనము, మరణములేని మోక్షమునకు సేతువు వంటిది) (పూర్తిగా కాలిపోయిన కట్టె యొక్క అగ్నివలె నుండువాడు - ఉపాదులు లేనివాడు).
ఇట్టి నిరాకార నిర్గుణ నిర్విశేష పరబ్రహ్మ దర్శనమెట్లు కలుగుననగా -
దృశ్యతే త్యగ్ర్యా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మ దర్శిభిః ||“.
(ఈ నిరాకార, నిర్గుణ నిర్విశేష పరబ్రహ్మ సమస్తమైన భూతములందును గూఢమైన - ఉన్నట్లు పైకి కనబడనటువంటి - రూపముతో - ఉన్నాడు - అట్లు ఉన్నట్లు ఎవరికి పైకి కనబడడు - కాని, సూక్ష్మాతి సూక్ష్మమైన వస్తువులను చూడ శక్తి గలవారు దర్భయొక్క కొన అతి తీక్ష్ణమైనవారి దృష్టితో చూడగలుగుచున్నారు).
(ఆ పరబ్రహ్మ అయిన విష్ణువు యొక్క ఉత్కృష్టమైన స్థానమును - సూరి జనులు - మహా భక్తులు - బ్రహ్మజ్ఞానులు, ఎల్లపుడు చూచుచుందురు - ఆ పరమపదమే అతను, అతనే ఆ పరమపదము).
“దారువందు నతి గూఢంబైన వీతిహోత్రుని బుద్ధి చేత బ్రకాశంబు నొందించు భంగి బుధ్ధిమంతులు హృదంతరంబున సన్నివేశుండై పరమపురుషుని నాత్మ శక్తి త్రయంబుచేతం - దేజరిల్లం జేయుదురు” - (శ్రీమదాంధ్రమహాభాగవతము - 6 - 4 -)
ఉపాధులలోనున్న భగవద్రూపము నిర్గుణమే - ఎందుచేతననగా బ్రహ్మ తన్మాత్రము; ‘చైతన్య మాత్రము’ సన్మాత్రము, సత్తామాత్రము, శుద్ధ సత్వము అని చెప్పబడినది. “అనేన జీవేనాత్మసాను ప్రవిశ్య” (ఛాందోపనిషత్తు - 6 - 3 - 2)
పరమాత్మ - పరబ్రహ్మ - జీవరూపములో అన్నింటిలోను ప్రవేశించియున్నాడు - “తత్సృష్ట్వా తదేవాను ప్రావిశత్” (లోకములను - లోకములోని వస్తువులను -. సృష్టించి - వాటిలోనే ప్రవేశించెను).
(పరబ్రహ్మ వ్యక్తము కానిది, కంటికి కనబడనిది - మనసులో ఊహించుటకు అయినను వీలుకానిది.)
“పరాంభికానివ్యతృణ త్స్వయం భూః; తస్మాత్ పరాఙ్ పశ్యతి నాంతరాత్మన్, కశ్చిద్ధీరః ప్రత్యగాత్మాన మైక్షదావృత్త చక్షురమృతత్వ మిచ్చన్ ||” (కఠవల్లి - 4 -1)
(పరబ్రహ్మ నేత్రములను, చెవులను పైనున్న వస్తువులను గ్రహించునట్లే సృష్టించెను. అందుచేత జీవులు పైగానున్న వస్తువులనే ప్రపంచములో కంటికి కనబడు వస్తువులనే చూచుటకు, చెవులకు కనబడుచుండు వస్తువులనే వినుటకు - గ్రహించెదరు. లోపలనున్న పరబ్రహ్మను చూడలేరు - ధీరుడైన వాడొకానొకడు, మోక్షముకోరువాడు, ఇంద్రియ నిగ్రహము గలవాడు ఇంద్రియములను లోనికి మళ్ళించి పరబ్రహ్మను చూడగలుగుచున్నాడు).
జ్యోతిః పశ్యంతి యం జానాస్తస్మై యోగాత్మనే నమః ||“. (శ్రీమహాభారతము - 12 - 47 - 54)
(నిద్రపోనివారు, ప్రాణాయామముచే వాయువును స్వాధీనము చేసుకొనినవారు, ఇంద్రియములను జయించినవారు, సంతోషము పొందినవారు అయిన యోగులు జ్యోతి స్వరూపుడగు పరమాత్మను చూచెదరు - అట్టి పరమాత్మకు నమస్కారము).
(ప్రపంచములోనున్న వస్తువులన్నియు ఒక్కొక్కటి చెప్పి ‘ఇదికాది, ఇదికాదు’ (ఇది బ్రహ్మ కాదు) అని త్రోసివేసి - మిగిలినది పరబ్రహ్మ అని నిశ్చయము చేయడమైనది - త్రోసివేయబడినవన్నియు, పరబ్రహ్మయొక్క మూర్తా మూర్తములు అని రెండు విధములు - కనుక “నేతి నేతి” అని రెండుమార్లు చెప్పబడినది).
ఈ పైన చెప్పినదంతయు పరబ్రహ్మయొక్క నిర్గుణ రూపము - (చూడుము - బ్రహ్మ) - ఈ నిర్గుణ నిరాకార పరబ్రహ్మను ధ్యానించుట కష్టము –
” క్లేశో(అ)ధికతరస్తేషామ వ్యక్తాసక్త చేతసాం |
అవ్యక్తా హి గతిర్ధుఃఖం దేహవద్భిరవాప్యతే ||” (శ్రీమద్భగవద్గీత - 12 - 5)
(నిరాకార పరబ్రహ్మను ఉపాసించుట కష్టము - దుఃఖకర మైనది. అందుచేత సాకారబ్రహ్మను - ఆకారము - రూపము - గల బ్రహ్మను - ఉపాసించవలెను - సాకార బ్రహ్మమే ఉపాస్యము - ధ్యేయబ్రహ్మ).
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 9 - 252)
“ఉపాసకులకు ధృఢమైన ధారణ (ధ్యానము) కలుగుటకు అవకాశము కలుగుటకు నిరాకార పరబ్రహ్మకు రూపము కల్పింపబడినది.
క్షరాక్షర స్వరూపే తౌ సర్వభూతేషు చ స్థితౌ |
అక్షరం తత్పరం బ్రహ్మ క్షరం సర్వమిదం జగత్ |
ఏకదేశస్థి తస్యాగ్నేర్జ్యోత్స్నా విస్తరిణీ యథా |
పరః బ్రహ్మణః శక్తిః తధేదమఖిలం జగత్ ||“.
(బ్రహ్మ రూపములు రెండు, మూర్తము, అమూర్తము, ఆకారము కలది. ఆకారము లేనిది. ఒకటి క్షరము (నశించునది). రెండవది అక్షరము (నశించనిది) - అక్షరమనునది పరబ్రహ్మ, క్షరమనునది ఈ జగత్తు అంతయు. ఒక్కచోటనున్న అగ్నియొక్క కాంతి విస్తరించినట్లే పరబ్రహ్మ యొక్క శక్తియే వ్యాపించి యీ జగత్తు అయినది - నిరాకారము, ఆకారముగల జగత్తు అనునది భగవంతుని రెండు రూపములు-)
(బ్రహ్మకు రెండు రూపములున్నవని తెలియవచ్చుచున్నది. అనేక విధములైన నామరూపములు ఉపాధిగా గలది ఒకటి -) అట్లు కానిది - ఏ విధమైన ఉపాధిలేనిది, రెండవది).
(బ్రహ్మరూపము రెండు విధములు - సగుణము, నిర్గుణము. సత్వరజస్తమోగుణములుగల ప్రకృతితో కూడియున్నది, ఆ గుణములు లేనిది - ప్రకృతితో కలియనిది.నిర్గుణ పరబ్రహ్మ సత్వరజస్తమములు గల ప్రకృతిఉతో కలియుటచే రూపము కలిగినది).
“వస్తుతః నిర్గుణే సగుణే, తథా నిరాకారే సాకారే కోపి భేదోనాస్తి. స ఏవ మనో బుధ్ధ్యగోచరం బ్రహ్మ స ఏవ జగదాత్మా. స ఏవ శ్రీరామః శ్రీకృష్ణశ్చాస్తి. స ఎవ మహాశివో, మహావిష్ణుః, మహాదేవీచాస్తి. స ఏవాయం విరాట్పురుషోస్తి. తస్మాత్ భిన్నం కించి దస్త్యేవన - యథా రసికస్య హాఠాన్వి తస్య చ భక్తస్య ప్రేమ్ణా ఆకర్షణం భవతి, తథా న ఆత్మనో దివ్యాహ్లాదీనాం శక్తిం నిమిత్తీకృత్య దివ్య చిన్మయ వస్త్రమాలా గంధాయుధ భూషణ్యాదిభిః. సు సజ్జితః సౌందర్య నిధిరూపేణ ప్రకటీ భూయ భక్తం కృతార్థయతి –
“సగుణే, నిర్గుణే వాపి కశ్చిత్ భేదో నవిద్య తే |
గాయంతి మునయో వేదాః పురాణాని బుధా ఇతి ||“.
“అరూపో నిర్గుణో అలక్ష్యో ఏ వాజో నిగద్యతే |
భక్త ప్రేమ వశాదీశః స ఏవ సగుణో భవేత్ ||”
“పరంతు ఇయం వార్తానాస్తి యదిదం రూపం జగత్ప్రసవిన్యాః మాయాః నిర్మితం భవతి అత్ర సర్వాణి వస్తూని దివ్యాని శుద్ధాని నిత్యాని చిన్మయాని భగవత్స్వరూపాణి చ భవంతి”.
(బ్రహ్మ రూపము రెండు విధములు - సగుణము, నిర్గుణము - వాస్తవముగా నిర్గుణరూపమునకు సగుణరూపమునకు, నిరాకారమునకు, సాకారమునకు భేదములేదు - బుద్ధికి గోచరముకాని నిర్గుణ పరబ్రహ్మ ఎవరో అతనే జగత్తునకాత్మ అయినవాడు, అతనే శ్రీరాముడు, అతనే శ్రీకృష్ణుడు, అతనే మహాశివుడు, మహా విష్ణువు, మహాదేవియున్నూ, అతనే విరాట్పురుషుడు. అందుచేత ఏ కొంచెము భేదము లేదు)
(రసికునకు, హరయోగికి, భక్తునకు పరమాత్మ యందాకర్షణ ఒక్క రీతిగనే యుండును - అయినను భక్తునకు దివ్యగ్రంధము, అలంకారములతో సుందరరూపముతో సగుణరూపముతో ప్రత్యక్షమై అనుగ్రహించును. హరయోగికి నిర్గుణరూపముతో అనుగ్రహించును. సగుణరూపమైనను, నిర్గుణరూపమైనను భగవంతునికి భేదము లేదు. అని మునులు, వేదములు, పురాణములు, పండితులు చెప్పుచున్నారు. నిర్గుణ నిరాకారుడు అగోచరుడు అజరుడు. అని చెప్పబడినవాడే భక్తుని ప్రేమవశుడై సగుణుడు, సాకారుడు అగును - ఈ రూపములన్నియు మాయా నిర్మితములే అనుటకు వీలుకాదు - దివ్యములు, శుద్ధములు, నిత్యములు, చిన్మయములు అయిన వన్నియు భగవంతుని స్వరూపుములే).
బ్రహ్మరూపములు రెండు - మూర్తము, అమూర్తము - రూపముగలది, రూపములేనిది.పంచభూతములలో కంటికి కనబడు పృధివి, జలము, అగ్ని, యీ మూడు రూపము కలవి. కంటికి కనబడనటూవంటి ఆకాశము, వాయువు, రూపములేనివి. కొందఱు శ్రుతిని బట్టి పంచీకృతముకాని స్థితిలో - సూక్ష్మ రూపములో నున్న పంచభూతములు (పంచ తన్మాత్రలు) అమూర్తములనియు, (ఆకారము లేనివనియు, పంచీకృతమైన పంచభూతములు - స్థూలములు, ఆకారము గలవి అని - ఆకారముగల భగవంతుని రూపములని చెప్పుదురు).
అవ్యక్తం బ్రహ్మణో రూపం వ్యక్తమే తచ్చరాచం ||“.
(వాసుదేవునకు వ్యక్తమగునది (కనబడునది), అవ్యక్తము (కనబడనది) అని రెండు రూపములు గలవు. అవ్యక్తము పరబ్రహ్మ స్వరూపము - జగత్తు అంతయు వ్యక్తరూపము).
(బ్రహ్మ రూపము రెండువిధములుగా నున్నది - మూర్తివంతము - (ఆకారముగలది), మూర్తివంతముకానిది (ఆకారము లేనిది); నశించునది, నశించనిది (శాశ్వతముగా నుండునది, సత్పదార్థము, (మూడుకాలములందుండునది) చైతన్యమైనది); అసత్పదార్థము (జడము) పంచభూతములవలన కలుగు కార్యములు, కరణములు; మూర్తము, అమూర్తము (స్థూలరూపములోనుండి కంటికి కనబడునవి) మూర్తము, కంటికికనబడక సూక్ష్మరూపములో నున్నవి అమూర్తములు, పంచభూతములవలన కలుగు వాసనలు నశించునవి నశించనివి క్రియాకారక ఫలాత్మకములు - సర్వజ్ఞుడు సర్వశక్తిసమన్వితుడు, సర్వ వ్యవహారములకు ఆస్పదమైనది - యగు ఆ బ్రహ్మమే సమస్తమైన ఉపాధులలో నున్నది సమ్యగ్దర్శనమునకు విషయమైనది, అజుడు, అజరుడు, అమృతుడు, అభయమైనవాడు, వాక్కునకు గాని మనస్సునకుగాని అందనివాడు - అద్వయుడైనవాడు - అందుచేత మిగతా వస్తువులన్నింటిని “ఇదికాదు, ఇదికాదు” అని త్రోసివేయగా మిగిలియుండునది పరబ్రహ్మ)
బ్రహ్మణో ద్వివిధం హి రూపమితి ప్రకల్ప్య విభాగతః |
ఆదిశ్యంత్యధ నేతి నేతి నిషిధ్య రూపమశేషతః |
కాణ్యవాజసనేయక శ్రతిరస్య శేష యదద్వయం ||“. (స్వారాజ్యసిద్ధి - అపవాదప్రకరణము)
(స్థూలములు, సూక్ష్మములు అని వేరు వేరు భాగములుగా గల యీ జగత్తంతటిలోను మూర్తం అమూర్తము (ఆకారము కలది, ఆకారము లేనిది) అనునవి బ్రహ్మరూపములు రెండు అని కల్పించి చెప్పి, తర్వాత ఒక్కొక్క వస్తువును “ఇది బ్రహ్మకాదు, ఇది బ్రహ్మకాదు” అని అన్ని వస్తువులను (అన్ని రూపములను) నిషేధించి, చివరకు మిగిలినది (శేషించినది) అవ్యయమైన బ్రహ్మ - బ్రహ్మకాక మఱియొక వస్తువు లేదు) అని కాణ్వవాజసనేయ శ్రుతులందు చెప్పబడినది. మొదట చెప్పిన రూపములు అరూపములు అన్నియు కల్పితములే - పరబ్రహ్మకు రూపమే లేదు - “అరూప మవ్యయం”).
“వ. రూపరహితుడవైన నీకు బీజాంకురంబుల కైవడి కారణ కార్యంబులయిన సదసద్రూ పంబులు రెండును ప్రకాశమానంబులగు. ఆ రెంటియందును భక్తియోగంబున బుద్ధిమంతులు, మథనంబున దారువులందు వహ్నిం గనియెడు తెఱంగున, నిన్ను జూడగందురు”. - - - ” సగుణంబును, నిర్గుణంబును, నీవ “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 9 - 366)
“అస్తి భాతి ప్రియం రూపం నామ ఇత్యన్శ పంచకం |
ఆద్యత్రయం బ్రహ్మణో రూపం నామరూపాత్మకం జగత్ ||“.
(అస్తి - ఉన్నది - ఎల్లకాలమందుండునది; భాతి = ప్రకాశించునది - తేజోరూపమైనది, స్వయంప్రకాశమైనది; ప్రియం = పరమానందమును కలుగచేయునది కనుక ప్రియమైనది - మోక్షము; రూపము, నామము అని భగవంతుని అంశలు అయిదు. వాటిలో మొదటి మూడును బ్రహ్మరూపము, మిగిలిన రెండును జగత్తు = జగత్తు రూపమైన బ్రహ్మ - ఈ రెండును భగవంతునియొక్క రెండురూపములు - భగవంతుని అస్తి, భాతి, ప్రియం అను మూడును, నామరూపములుగల జగత్తు కలిసియే యున్నవి, అందుచేత అంశపంచకమని చెప్పబడినది - జగత్తులోని ప్రతివస్తువులోను ఈ అయిదు అంశలు ఉన్నవి.
(బ్రహ్మకు మూడు రూపములున్నవి - నిష్కలం, సకలం, సకలం నిష్కలం అని. సత్యము, విజ్ఞానము, ఆనందము (సచ్చిదానందము), నిష్క్రియము, నిరంజనము, సర్వగతము (అన్నింటిలోను ప్రవేశించియుండునది, మిక్కిలి సూక్ష్మమైనది (అతిసూక్ష్మమైన అణువు కంటె సూక్ష్మమైనది) సర్వతో ముఖము కలది, అన్ని ప్రక్కల ఒకే రీతినుండునది), అనిర్దేశ్యము (ఇది ఇట్టిదని నిర్దేశింపరానిది), అమృతము - (నాశము లేనిది) (నిత్యమైనది) అగునది - ఇట్టి లక్షణములుకలది బ్రహ్మయొక్క నిష్కలరూపము - బ్రహ్మకు సహజమైనది, అవిద్య, మూలప్రకృతి, మాయా లోహిత కృష్ణ పింగళముగా నుండునది యగు దానితో కూడి లోహిత కృష్ణ పింగళుడైన మహేశ్వరుడు బ్రహ్మ యొక్క సకల - నిష్కల రూపము. తన శక్తితో క్రీడించు ఆ పరమశివుడు భక్తులను అనుగ్రహించుటకు, ఇందీవరములవలె ప్రకాశించుచు, నాలుగు భుజములు కలిగి భక్తుల పాపములను పోగొట్టునట్టి దత్తాత్రేయ రూపము బ్రహ్మయొక్క సకళ రూపము - (కళలతో కూడిన రూపము).
“స్మృతేశ్చ” యం యం వాపి స్మరన్ భావం త్యజంత్యంతే కళేబరం |
తంత మేవైతి కౌంతేయ తదా తద్భావ భావితః ||
“ఇతి యద్యప్యేక ఏవాత్మా సర్వభూతేషు స్థావర జంగమేషు గూఢస్తదా పి చ చిత్తోపాధి విశేష తారతమ్యాదాత్మనః కూటస్థ నిత్య స్యక రూపస్యా స్యుత్తరోత్తరమావిష్టస్య తారతమ్యైశ్వర్యశక్తి విశేషై శ్రూయతే -”. “తస్య య ఆత్మానమావిస్తరాం వేదేతి” అత్ర స్మృతావపి –
“యద్యద్విభూతి మత్సత్వం శ్రీమదూర్జిత మేవవా |
తత్తదేసేవగచ్ఛత్వం మమ తేజోంశ సంభవం || ”
ఇతి. యత్ర యత్ర విభూత్యాద్యతిశయః న స ఈశ్వర ఇత్యుపాస్య తయా చోద్యతే |
ఏవమిహా స్యాదిత్యమండలే హిరణ్మయః పురుషః సర్వ పాప్మా దయ లింగాత్ పర ఏవేతి వీక్ష్యతి
(శ్రీ శంకరః - బ్రహ్మ సూత్ర భాష్యే - 1 - 1 - 11)
(పైన చెప్పిన ప్రకారము అనేకచోట్ల ఉపనిషత్తులు విద్యా అవిద్యా భేదముననుసరించి బ్రహ్మకు రెండురూపములు చెప్పుచున్నవి. వాట్లలో అవిద్యా అవస్థయందు ఉపాస్యమని ఉపాసకుడు అని రెండు లక్షణములు చెప్పబడు చున్నవి. అట్టి బ్రహ్మోపాసనలు కొన్నీభ్యుదయము కొఱకు చేయబడుచున్నవి. కొన్ని క్రమముక్తి కొఱకు చేయబడుచున్నవి. కొన్ని కర్మలు చేయుటకొరకు చేయబడుచున్నవి. వాటిలో భేదము గుణవిశేషములో గల భేదమువలన కలుగు చున్నవి. ఒకడే అయిన పరబ్రహ్మ ఆయా గుణవిశేష ముల బట్టి ఉపాసింపబడుచున్నపుడు ఆయా గుణవిశేషమునుబట్టి (భేద మును బట్టి) ఫలభేదము కలుగుచున్నది. ‘ఆ పరమాత్మను ఏ ప్రకారముగా ఉపాసించునో ఆ ప్రకారముగానే యగుచున్నాడు’ అని శ్రుతి చెప్పుచున్నది. మఱియు - “ఈ లోకములో ఏ కర్మచేసి చనిపోవునో దాని కనుగుణముగనే పురుషుడు అగుచున్నాడు - అనిన్నీ శ్రుతి చెప్పుచున్నది. అవసానకాలమందు ఏ ఏ భావమును తలచుకొనుచు చనిపోవునో అదియే యగును - ఆ భావమునకు తగినట్లుగానే యగును” అని స్మృతి (శ్రీమద్భగవద్గీత) చెప్పుచున్నది. స్థావర జంగమములగు సమస్త భూతములందు ఒకడే యగు పరమాత్మ గూఢముగా నున్నాడు. అయినప్పటికీ చిత్తమను ఉపాధి తారతమ్యమువలన కూటస్థుడు, నిత్యుడు, ఒకే రూపము కలవాడైన ఆత్మ ఆయా ఉపాధులను బట్టి ఐశ్వర్యశక్తి విశేషములలో తారతమ్యము గలవాడుగా చెప్పబడుచున్నాడు. దీనిని గుఱించి స్మృతి ఈ విధముగా చెప్పుచున్నది - సృష్టిలో యేదైన ఒక వస్తువు (నా విభూతియే),మిగిలిన వాటికంటె ఏ విషయములో నైనను ఏ రీతిగనైనను ఉత్కృష్టమైనదిగా కనబడినచో అది నా తేజస్సు యొక్క అంశవలననే కలిగినదని తెలుసుకొనుము. అన్ని వస్తువులలోను నేను అణగియున్నప్పటికీ సాధారణముగా నేను ఉన్నట్లు సామాన్యులకు తెలియదు - అయితే ఇటువంటి వస్తువులను బట్టి నేను వాటిలో నున్నట్లు తెలుసుకొనవచ్చును - అట్లే ఆనింటిలోను పైకి కనబడకపోయినను నేను ఉన్నానని గ్రహించవలెను - ఎక్కడెక్కడ విభూతి - (భగవంతుని శక్తి) ఏ విధముగా నైననూ అతిశయించియున్న యడల (మిగిలినవాటిలో కంటె హెచ్చుగా నున్నయడల) అక్కడక్కడ అదే పరమాత్మయని తెలుసుకొని ఉపాసించవలెను - దీని ననుసరించియే సూర్య మండలమందు హిరణ్మయపురుషుడు పరమాత్మయని, ఆ ఉపాధిలోని సత్వాధిక్యమును (అధికతేజోవంతము) బట్టి చెప్పడమైనది).
“మ బ్రహ్మేత్యుపాస్తీనాం కామచారాది రభ్యుదయః ఫలం; దహరాద్యుపాస్తీనాం క్రమముక్తిః - ఉద్గీదాది ధ్యానస్య కర్మ సమృద్ధిః ఫలమితి భేదః”. (రత్న ప్రభా - బ్రహ్మసూత్రభాష్యము - 1 - 1 - 11)
(బ్రహ్మజ్ఞానమునకు విషయమైనది జ్ఞేయబ్రహ్మ; అది నిర్గుణము, నిత్యము, నిరాకారము - అవిద్యకు - అజ్ఞానమునకు - విషయమైనది, ఉపాసన చేయవలసినది సగుణబ్రహ్మ - సాకారబ్రహ్మ. ఇది కల్పితము. నిర్గుణ బ్రహ్మ ధ్యానమునకు అదికారులు కానివారికి - అర్హతలేనివారికి, సామర్థ్యము లేనివారికి - మనోనిశ్చలత్వముకొఱకు ఉపాయముగా చెప్పబడినది. పిల్లలకు చేదుగ నుండు మందు నిచ్చుటకు ముందు తల్లి బెల్లమునిచ్చి - దీనివలె మందు తియ్యగానుండునని చెప్పి తర్వాత మందును యిచ్చి తినిపించినట్లు - బ్రహ్మజ్ఞానము బోధించుటకు ముందు (అనగా నిర్గుణ నిరాకార బ్రహ్మ లక్షణము బోధించుటకు ముందు) అజ్ఞానికి (అధికారము లేనివానికి) ఆయా ఉపాసనలు, వాటి ఫలము (సగుణ బ్రహ్మధ్యానము) విధించబడియున్నవి. నిర్గుణ నిరాకార బ్రహ్మజ్ఞానముకలుగవలెనన్న ముందు చిత్తశుద్ధి, చిత్తైకాగ్రత కావలెను. దాని కొఱకు సగుణ బ్రహ్మ ధ్యానరూపమైన ఉపాసనలు చెప్ప బడినవి. అందుచేత ఈ ఉపాసనలకు చిత్తైకాగ్ర్యముద్వారా బ్రహ్మజ్ఞానము ముఖ్యమైన ఫలము. అందుచేత ఉపాసనలు విధించిన ఉపనిషద్వాక్యముల తాత్పర్యముకూడా బ్రహ్మమే - (నిర్గుణ బ్రహ్మమే) అని తెలియ తగినది).
(నామ బ్రహ్మనుపాసించువారికి కామచారము మొదలగు అభ్యుదయము ఫలము. దహరవిద్య నభ్యసించువారికి క్రమముక్తి ఫలము - ఉద్గీధము మొదలగు ధ్యానమునకు కర్మ సమృద్ధి ఫలము - అని ఈ విధముగ ఉపాసనాఫలములో భేదమున్నది)
వ్వారును లేరు, తండ్రి, భగవంతుననంతుని విశ్వభవనో
దారుని సద్గుణావళులు దాత్తమతిం గొనియాడకుండినన్
జేరవు చిత్తముల్ ప్రకృతి చెందని నిర్గుణమైన బ్రహ్మమున్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 7 - 21)
(సగుణ బ్రహ్మోపాసన లేనిది నిర్గుణ బ్రహ్మోపాసన కుదరదు).
(నిర్గుణ బ్రహ్మఓపాసన చేయుటయందు అధికారము లేనివాడు సగుణ బ్రహ్మోపాసన ఎల్లపుడు చేయవలెను).
(సగుణబ్రహ్మోపాసన చిత్తైకాగ్ర్యత కలిగించును. దాని ద్వారా నిర్గుణబ్రహ్మ సాక్షాత్కారమునకు హేతువగును).
జగముల గల్పించికొఱకు జతురత మాయా
సగుణుండగు, గావున హరి
భగవంతుడనగ బరగె భవ్య చరిత్రా“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 6 - 99)
సృష్టికి పూర్వము పరబ్రహ్మ యొక్కడే యుండెను - తన అపరాశక్తియైన ప్రకృతితో కలియుటవలన (ప్రకృతి సత్వరజస్తమములను త్రిగుణములు గలదగుట చేత) రూపము కలిగెను - అదియే సగుణబ్రహ్మ, సాకారబ్రహ్మ - భగవంతుని అవతారములన్నియు సగుణబ్రహ్మ రూపములే - నిరాకార, నిర్గుణ పరబ్రహ్మకు త్రిగుణమయమైన ప్రకృతి అతని ఇష్టానుసారము, కల్పించి యిచ్చిన రూపములు - ఆ రూపములలో నిర్గుణ పరబ్రహ్మమే అవతరించినట్లు వ్యవహరించెను. ప్రపంచ ములోని వస్తువులన్నియు ఈ ప్రకారముగానే పురుష ప్రకృతి అంశలు కలవియే (పురుషుడనగా పరబ్రహ్మ - పురమందు శయనించువాడు - అతను ప్రకృతి వికారమైన ఏ వస్తువులోనున్న అదియే అతనికి పురము) - ఏ వస్తువులోనైనను ప్రకృతిని విడిచి పరబ్రహ్మలేడు, పరబ్రహ్మ తనలో లేని ప్రకృతి అంశలేదు - అందుచేత సృష్టిలోని వస్తువులన్నియు భగవతుని రూపములే - ఒక విధముగా అవతారములే.
“మ. వరయోగీంద్రులు యోగమార్గముల భావంబందునేనీమనో
హరరూపంబు దలంచి యే గుణగణ ధ్యానంబు గావింతుర
ప్పురుష శ్రేష్ట పరిగ్రహంబునకునై పోల్పార దద్ధ్యాన గో
చరమూర్తిన్ ధరియింతుగాదె పరమోత్సాహంబునన్ మాధవా “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 9 - 298)
మ. “బహు పాదోరు భుజాననేక్షణ శిరః ఫాలః శ్రవో యుకుడై
విహరించున్ బహుదేహి దేహగతుడై; విద్వాన్సు లూహించి త
ద్బహురూపావయవలంబులన్ భువనసంపత్తిన్ విచారింతురు - - -” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 5 - 88)
తత్రైకస్థం జగత్కృత్స్నం ప్రవిభక్తమనేకథా |
అపశ్యద్దేన దేవస్స శరీరీ పాండవస్తథా ||.
(భగవంతుని విశ్వరూపమను స్థూలరూపములో జగత్తంతయు ఒకటిగా, అనేక విధములుగా అనేక వస్తువులు కలసియున్నవిగా అర్జునుడు చూచెను). “ఇప్పుడు నీ కెఱింగించినవెల్లను - (పదునాలుగు లోకములు) బ్రహ్మాండకోశంబునం గలవని పురాణంబులు పలుకుచుండు. అట్టి బ్రహ్మాండంబు శ్రీమన్నారాయణుని స్థూల శరీరంబగుటంజేసి - - - భూద్వీప వర్ష సరిదద్రి నభస్సముద్ర పాతాళ దిఙ్నరక తారాగన లోక సంస్థితంబయి, సకలజీవ నికాయ్యంబై యద్భుతంబైన శ్రీహరి స్థూలశరీరంబు వినిపించితిని”-
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 5 - 2 - 162)
ప్రపంచము, దానిలోని వస్తువులన్నియు భగవంతునియొక్క (పరబ్రహ్మ యొక్క) స్థూలశరీరము - నిరాకార, నిర్గుణ, నిర్విశేష పరబ్రహ్మ అతనియొక్క సూక్ష్మరూపము ప్రతి వస్తువులోను అంతరాత్మగానున్నది భగవంతుని సూక్ష్మ రూపము)
“సీ. పరమ విజ్ఞాన సంపన్నులై నట్టి యోగీంద్రులు మహిత నిస్తంద్రలీల
పరిదృశ్యమానమై భాసిల్లు నిమ్మహీ పర్వతము ఖర ప్రపంచమెల్ల
బరగ బ్రహ్మరూపంబు గాగ తెలియదు రెలమి - - ” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - ఉ,భా.-1206);
నిర్గుణ పరబ్రహ్మయొక్క సగుణరూపము విశ్వరూపముగా నిట్లు వర్ణింపబడినది : -
(1) “వ. చతుర్దశలోకంబులందు మీది ఏడు లోకంబులు శ్రీమహావిష్ణువునకు గటి ప్రదేశంబున నుండి యూర్థ్వ దేహమనియును, గ్రింది యేడు లోకంబులు జఘనంబుననుండి యధో దేహమనియును - బలుకుదురు; ప్రపంచశరీరుండగు భగవంతుని ముఖంబువలన బ్రహ్మకులంబును, బాహువిలవలన క్షత్రియ కులంబును, నూరువులవలన వైశ్యకులంబును, బాదంబులవలన శూద్రకులంబును, జనియించెనని చెప్పుదురు; భూలోకంబు గటి ప్రదేశంబు; భువర్లోకంబు నాభి; సువర్లోకంబు హృదయంబు; మహర్లోకంబు వక్షంబు, జనలోకంబు గ్రీవంబు, తపోలోకంబు స్తనద్వయంబు, సనాతనంబును బ్రహ్మ నివాసంబును నైన సత్యలోకంబు శిరంబు, జఘనప్రదేశంబు బతలంబు; తొడలు వితలంబు, జానువులు సుతలంబు, జంఘలు తలాతలంబు; గుల్ఫంబులు మహాతలంబు, పాదాగ్రంబులు రసాతలంబు, పాదతలంబు పాతాళంబునని లోకమయంగా భావింతురు” - (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 5 - 89).
(2) సీ. అగ్నిముఖంబు పరా పరాత్మక మాత్మ, కాలంబుగతి, రత్నగర్భ పదము
శ్వసనంబు నీయూర్పు, రసన జలేశుండు, దిశంబులు కర్ణంబులు, దివము నాభి
సూర్యుండు గన్నులు, శుక్లంబు సలిలంబు, జఠరంబు జలధులు, సదలు శిరము,
సర్వౌషధములు రోమ చయములు, శల్యంబులద్రులు, మానసమమృతకరుడు
తే. చందములు ధాతువులు, ధర్మ సమితి హృదయ
మాస్య పంచక ముపనిషదా హ్వయంబు
నయిన నీరూపు పరతత్వమై, శివాఖ్య
మై, స్వయంజ్యోతియై యొప్పు నాద్యమగుచు ” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 8 - 7 - 224)
(3). “సీ. యోగీశరూపుడై యోగంబు జూపుచు, మేనిరూపంబున కర్మంబు దాల్చు
సర్గంబు సేయు బ్రజాపతిరూపుడై ఇంద్రుడై దైత్యుల నేపడంచు
జ్ఞానంబునెఱిగించు జతుర సిద్ధాకృతి గాల రూపమున బాకంబుసేయు
నానా విధాకార నామ రూపంబుల గర్మలోచనులకు గానబడడు
ఆ. చనిన రూపములను జనురూపములనింక
జనగనున్న రూపచయము నతడు
వివిధుడై యనేక వృత్తుల వెలిగించు
విష్ణుడవ్యయుండు విమల చరిత”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 8 - 14 - 435)
(1) ’సీ. - - - ఎవ్వడు మనము బుద్ధీంద్రియములు దానయై గుణసంప్రవాహంబు నెఱపు
తే. స్త్రీ నపుంసక పురుషమూర్తియును గాక
తిర్య గమర నరాదిమూర్తియునుగాక
కర్మగుణభేద స దసత్ప్రకాశి గాక
వెనుక నన్నియు దానగు విభు దలంతు’. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 8 - 3 - 85)
(2). “అరూపం, సురూపం సమస్త స్వరూపం” (శ్రీరామకర్ణామృతం - 2 - 85)
(శ్రీరామచంద్రపరబ్రహ్మ రూపము లేనివాడు - నిరాకారపరబ్రహ్మ; సుందరరూపముగల సాకార బ్రహ్మ, సృష్టిలోనున్న సమస్త వస్తువుల రూపము తానే అయినవాడు).
(3) “దేవా నీవు బ్రహ్మస్వరూపంబగు జ్యోతిర్మయుండవు” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - ఉ.భా. - 441)
(parabrahma śabdamu, sparśamu, rūpamu, vyayamu lēnivāḍu. rūpamu lēnivāḍaguṭacēta avayavamulu lēnidi kanuka kṣīṇiṃcanidi)
(parabrahma akṣaruḍu, sthūlarūpamu anu lakṣaṇamu lēnivāḍu, kaṃṭiki kanabaḍanivāḍu - spaṣṭamugā kanabaḍanivāḍu, buddhi modalagu iṃdriyamulaku gōcaramukānivāḍu, ākāramulēnivāḍu).
(kaṃḍlaku kanabaḍuvāḍu kāḍu, nōṭitō ceppuṭaku vīlukānivāḍu, nirmalamaina manasutō ūhiṃcuṭaku kūḍa vīlukānivāḍu).
(kaḷalu lēnidi - bhāgamulu lēnidi, kriyalu lēnidi, śāṃtamu, niravadhyamu, niraṃjanamu, maraṇamulēni mōkṣamunaku sētuvu vaṃṭidi) (pūrtigā kālipōyina kaṭṭe yokka agnivale nuṃḍuvāḍu - upādulu lēnivāḍu).
iṭṭi nirākāra nirguṇa nirviśēṣa parabrahma darśanameṭlu kalugunanagā -
dṛśyatē tyagryā buddhyā sūkṣmayā sūkṣma darśibhiḥ ||“.
(ī nirākāra, nirguṇa nirviśēṣa parabrahma samastamaina bhūtamulaṃdunu gūḍhamaina - unnaṭlu paiki kanabaḍanaṭuvaṃṭi - rūpamutō - unnāḍu - aṭlu unnaṭlu evariki paiki kanabaḍaḍu - kāni, sūkṣmāti sūkṣmamaina vastuvulanu cūḍa śakti galavāru darbhayokka kona ati tīkṣṇamainavāri dṛṣṭitō cūḍagalugucunnāru).
(ā parabrahma ayina viṣṇuvu yokka utkṛṣṭamaina sthānamunu - sūri janulu - mahā bhaktulu - brahmajñānulu, ellapuḍu cūcucuṃduru - ā paramapadamē atanu, atanē ā paramapadamu).
“dāruvaṃdu nati gūḍhaṃbaina vītihōtruni buddhi cēta brakāśaṃbu noṃdiṃcu bhaṃgi budhdhimaṃtulu hṛdaṃtaraṃbuna sannivēśuṃḍai paramapuruṣuni nātma śakti trayaṃbucētaṃ - dējarillaṃ jēyuduru” - (śrīmadāṃdhramahābhāgavatamu - 6 - 4 -)
upādhulalōnunna bhagavadrūpamu nirguṇamē - eṃducētananagā brahma tanmātramu; ‘caitanya mātramu’ sanmātramu, sattāmātramu, śuddha satvamu ani ceppabaḍinadi. “anēna jīvēnātmasānu praviśya” (chāṃdōpaniṣattu - 6 - 3 - 2)
paramātma - parabrahma - jīvarūpamulō anniṃṭilōnu pravēśiṃciyunnāḍu - “tatsṛṣṭvā tadēvānu prāviśat” (lōkamulanu - lōkamulōni vastuvulanu -. sṛṣṭiṃci - vāṭilōnē pravēśiṃcenu).
(parabrahma vyaktamu kānidi, kaṃṭiki kanabaḍanidi - manasulō ūhiṃcuṭaku ayinanu vīlukānidi.)
“parāṃbhikānivyatṛṇa tsvayaṃ bhūḥ; tasmāt parāṅ paśyati nāṃtarātman, kaściddhīraḥ pratyagātmāna maikṣadāvṛtta cakṣuramṛtatva miccan ||” (kaṭhavalli - 4 -1)
(parabrahma nētramulanu, cevulanu painunna vastuvulanu grahiṃcunaṭlē sṛṣṭiṃcenu. aṃducēta jīvulu paigānunna vastuvulanē prapaṃcamulō kaṃṭiki kanabaḍu vastuvulanē cūcuṭaku, cevulaku kanabaḍucuṃḍu vastuvulanē vinuṭaku - grahiṃcedaru. lōpalanunna parabrahmanu cūḍalēru - dhīruḍaina vāḍokānokaḍu, mōkṣamukōruvāḍu, iṃdriya nigrahamu galavāḍu iṃdriyamulanu lōniki maḷḷiṃci parabrahmanu cūḍagalugucunnāḍu).
jyōtiḥ paśyaṃti yaṃ jānāstasmai yōgātmanē namaḥ ||“. (śrīmahābhāratamu - 12 - 47 - 54)
(nidrapōnivāru, prāṇāyāmamucē vāyuvunu svādhīnamu cēsukoninavāru, iṃdriyamulanu jayiṃcinavāru, saṃtōṣamu poṃdinavāru ayina yōgulu jyōti svarūpuḍagu paramātmanu cūcedaru - aṭṭi paramātmaku namaskāramu).
(prapaṃcamulōnunna vastuvulanniyu okkokkaṭi ceppi ‘idikādi, idikādu’ (idi brahma kādu) ani trōsivēsi - migilinadi parabrahma ani niścayamu cēyaḍamainadi - trōsivēyabaḍinavanniyu, parabrahmayokka mūrtā mūrtamulu ani reṃḍu vidhamulu - kanuka “nēti nēti” ani reṃḍumārlu ceppabaḍinadi).
ī paina ceppinadaṃtayu parabrahmayokka nirguṇa rūpamu - (cūḍumu - brahma) - ī nirguṇa nirākāra parabrahmanu dhyāniṃcuṭa kaṣṭamu –
” klēśō(a)dhikatarastēṣāma vyaktāsakta cētasāṃ |
avyaktā hi gatirdhuḥkhaṃ dēhavadbhiravāpyatē ||” (śrīmadbhagavadgīta - 12 - 5)
(nirākāra parabrahmanu upāsiṃcuṭa kaṣṭamu - duḥkhakara mainadi. aṃducēta sākārabrahmanu - ākāramu - rūpamu - gala brahmanu - upāsiṃcavalenu - sākāra brahmamē upāsyamu - dhyēyabrahma).
(śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 9 - 252)
“upāsakulaku dhṛḍhamaina dhāraṇa (dhyānamu) kaluguṭaku avakāśamu kaluguṭaku nirākāra parabrahmaku rūpamu kalpiṃpabaḍinadi.
kṣarākṣara svarūpē tau sarvabhūtēṣu ca sthitau |
akṣaraṃ tatparaṃ brahma kṣaraṃ sarvamidaṃ jagat |
ēkadēśasthi tasyāgnērjyōtsnā vistariṇī yathā |
paraḥ brahmaṇaḥ śaktiḥ tadhēdamakhilaṃ jagat ||“.
(brahma rūpamulu reṃḍu, mūrtamu, amūrtamu, ākāramu kaladi. ākāramu lēnidi. okaṭi kṣaramu (naśiṃcunadi). reṃḍavadi akṣaramu (naśiṃcanidi) - akṣaramanunadi parabrahma, kṣaramanunadi ī jagattu aṃtayu. okkacōṭanunna agniyokka kāṃti vistariṃcinaṭlē parabrahma yokka śaktiyē vyāpiṃci yī jagattu ayinadi - nirākāramu, ākāramugala jagattu anunadi bhagavaṃtuni reṃḍu rūpamulu-)
(brahmaku reṃḍu rūpamulunnavani teliyavaccucunnadi. anēka vidhamulaina nāmarūpamulu upādhigā galadi okaṭi -) aṭlu kānidi - ē vidhamaina upādhilēnidi, reṃḍavadi).
(brahmarūpamu reṃḍu vidhamulu - saguṇamu, nirguṇamu. satvarajastamōguṇamulugala prakṛtitō kūḍiyunnadi, ā guṇamulu lēnidi - prakṛtitō kaliyanidi.nirguṇa parabrahma satvarajastamamulu gala prakṛtiutō kaliyuṭacē rūpamu kaliginadi).
“vastutaḥ nirguṇē saguṇē, tathā nirākārē sākārē kōpi bhēdōnāsti. sa ēva manō budhdhyagōcaraṃ brahma sa ēva jagadātmā. sa ēva śrīrāmaḥ śrīkṛṣṇaścāsti. sa eva mahāśivō, mahāviṣṇuḥ, mahādēvīcāsti. sa ēvāyaṃ virāṭpuruṣōsti. tasmāt bhinnaṃ kiṃci dastyēvana - yathā rasikasya hāṭhānvi tasya ca bhaktasya prēmṇā ākarṣaṇaṃ bhavati, tathā na ātmanō divyāhlādīnāṃ śaktiṃ nimittīkṛtya divya cinmaya vastramālā gaṃdhāyudha bhūṣaṇyādibhiḥ. su sajjitaḥ sauṃdarya nidhirūpēṇa prakaṭī bhūya bhaktaṃ kṛtārthayati –
“saguṇē, nirguṇē vāpi kaścit bhēdō navidya tē |
gāyaṃti munayō vēdāḥ purāṇāni budhā iti ||“.
“arūpō nirguṇō alakṣyō ē vājō nigadyatē |
bhakta prēma vaśādīśaḥ sa ēva saguṇō bhavēt ||”
“paraṃtu iyaṃ vārtānāsti yadidaṃ rūpaṃ jagatprasavinyāḥ māyāḥ nirmitaṃ bhavati atra sarvāṇi vastūni divyāni śuddhāni nityāni cinmayāni bhagavatsvarūpāṇi ca bhavaṃti”.
(brahma rūpamu reṃḍu vidhamulu - saguṇamu, nirguṇamu - vāstavamugā nirguṇarūpamunaku saguṇarūpamunaku, nirākāramunaku, sākāramunaku bhēdamulēdu - buddhiki gōcaramukāni nirguṇa parabrahma evarō atanē jagattunakātma ayinavāḍu, atanē śrīrāmuḍu, atanē śrīkṛṣṇuḍu, atanē mahāśivuḍu, mahā viṣṇuvu, mahādēviyunnū, atanē virāṭpuruṣuḍu. aṃducēta ē koṃcemu bhēdamu lēdu)
(rasikunaku, harayōgiki, bhaktunaku paramātma yaṃdākarṣaṇa okka rītiganē yuṃḍunu - ayinanu bhaktunaku divyagraṃdhamu, alaṃkāramulatō suṃdararūpamutō saguṇarūpamutō pratyakṣamai anugrahiṃcunu. harayōgiki nirguṇarūpamutō anugrahiṃcunu. saguṇarūpamainanu, nirguṇarūpamainanu bhagavaṃtuniki bhēdamu lēdu. ani munulu, vēdamulu, purāṇamulu, paṃḍitulu ceppucunnāru. nirguṇa nirākāruḍu agōcaruḍu ajaruḍu. ani ceppabaḍinavāḍē bhaktuni prēmavaśuḍai saguṇuḍu, sākāruḍu agunu - ī rūpamulanniyu māyā nirmitamulē anuṭaku vīlukādu - divyamulu, śuddhamulu, nityamulu, cinmayamulu ayina vanniyu bhagavaṃtuni svarūpumulē).
brahmarūpamulu reṃḍu - mūrtamu, amūrtamu - rūpamugaladi, rūpamulēnidi.paṃcabhūtamulalō kaṃṭiki kanabaḍu pṛdhivi, jalamu, agni, yī mūḍu rūpamu kalavi. kaṃṭiki kanabaḍanaṭūvaṃṭi ākāśamu, vāyuvu, rūpamulēnivi. koṃdaṟu śrutini baṭṭi paṃcīkṛtamukāni sthitilō - sūkṣma rūpamulō nunna paṃcabhūtamulu (paṃca tanmātralu) amūrtamulaniyu, (ākāramu lēnivaniyu, paṃcīkṛtamaina paṃcabhūtamulu - sthūlamulu, ākāramu galavi ani - ākāramugala bhagavaṃtuni rūpamulani ceppuduru).
avyaktaṃ brahmaṇō rūpaṃ vyaktamē taccarācaṃ ||“.
(vāsudēvunaku vyaktamagunadi (kanabaḍunadi), avyaktamu (kanabaḍanadi) ani reṃḍu rūpamulu galavu. avyaktamu parabrahma svarūpamu - jagattu aṃtayu vyaktarūpamu).
(brahma rūpamu reṃḍuvidhamulugā nunnadi - mūrtivaṃtamu - (ākāramugaladi), mūrtivaṃtamukānidi (ākāramu lēnidi); naśiṃcunadi, naśiṃcanidi (śāśvatamugā nuṃḍunadi, satpadārthamu, (mūḍukālamulaṃduṃḍunadi) caitanyamainadi); asatpadārthamu (jaḍamu) paṃcabhūtamulavalana kalugu kāryamulu, karaṇamulu; mūrtamu, amūrtamu (sthūlarūpamulōnuṃḍi kaṃṭiki kanabaḍunavi) mūrtamu, kaṃṭikikanabaḍaka sūkṣmarūpamulō nunnavi amūrtamulu, paṃcabhūtamulavalana kalugu vāsanalu naśiṃcunavi naśiṃcanivi kriyākāraka phalātmakamulu - sarvajñuḍu sarvaśaktisamanvituḍu, sarva vyavahāramulaku āspadamainadi - yagu ā brahmamē samastamaina upādhulalō nunnadi samyagdarśanamunaku viṣayamainadi, ajuḍu, ajaruḍu, amṛtuḍu, abhayamainavāḍu, vākkunaku gāni manassunakugāni aṃdanivāḍu - advayuḍainavāḍu - aṃducēta migatā vastuvulanniṃṭini “idikādu, idikādu” ani trōsivēyagā migiliyuṃḍunadi parabrahma)
brahmaṇō dvividhaṃ hi rūpamiti prakalpya vibhāgataḥ |
ādiśyaṃtyadha nēti nēti niṣidhya rūpamaśēṣataḥ |
kāṇyavājasanēyaka śratirasya śēṣa yadadvayaṃ ||“. (svārājyasiddhi - apavādaprakaraṇamu)
(sthūlamulu, sūkṣmamulu ani vēru vēru bhāgamulugā gala yī jagattaṃtaṭilōnu mūrtaṃ amūrtamu (ākāramu kaladi, ākāramu lēnidi) anunavi brahmarūpamulu reṃḍu ani kalpiṃci ceppi, tarvāta okkokka vastuvunu “idi brahmakādu, idi brahmakādu” ani anni vastuvulanu (anni rūpamulanu) niṣēdhiṃci, civaraku migilinadi (śēṣiṃcinadi) avyayamaina brahma - brahmakāka maṟiyoka vastuvu lēdu) ani kāṇvavājasanēya śrutulaṃdu ceppabaḍinadi. modaṭa ceppina rūpamulu arūpamulu anniyu kalpitamulē - parabrahmaku rūpamē lēdu - “arūpa mavyayaṃ”).
“va. rūparahituḍavaina nīku bījāṃkuraṃbula kaivaḍi kāraṇa kāryaṃbulayina sadasadrū paṃbulu reṃḍunu prakāśamānaṃbulagu. ā reṃṭiyaṃdunu bhaktiyōgaṃbuna buddhimaṃtulu, mathanaṃbuna dāruvulaṃdu vahniṃ ganiyeḍu teṟaṃguna, ninnu jūḍagaṃduru”. - - - ” saguṇaṃbunu, nirguṇaṃbunu, nīva “. (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 9 - 366)
“asti bhāti priyaṃ rūpaṃ nāma ityanśa paṃcakaṃ |
ādyatrayaṃ brahmaṇō rūpaṃ nāmarūpātmakaṃ jagat ||“.
(asti - unnadi - ellakālamaṃduṃḍunadi; bhāti = prakāśiṃcunadi - tējōrūpamainadi, svayaṃprakāśamainadi; priyaṃ = paramānaṃdamunu kalugacēyunadi kanuka priyamainadi - mōkṣamu; rūpamu, nāmamu ani bhagavaṃtuni aṃśalu ayidu. vāṭilō modaṭi mūḍunu brahmarūpamu, migilina reṃḍunu jagattu = jagattu rūpamaina brahma - ī reṃḍunu bhagavaṃtuniyokka reṃḍurūpamulu - bhagavaṃtuni asti, bhāti, priyaṃ anu mūḍunu, nāmarūpamulugala jagattu kalisiyē yunnavi, aṃducēta aṃśapaṃcakamani ceppabaḍinadi - jagattulōni prativastuvulōnu ī ayidu aṃśalu unnavi.
(brahmaku mūḍu rūpamulunnavi - niṣkalaṃ, sakalaṃ, sakalaṃ niṣkalaṃ ani. satyamu, vijñānamu, ānaṃdamu (saccidānaṃdamu), niṣkriyamu, niraṃjanamu, sarvagatamu (anniṃṭilōnu pravēśiṃciyuṃḍunadi, mikkili sūkṣmamainadi (atisūkṣmamaina aṇuvu kaṃṭe sūkṣmamainadi) sarvatō mukhamu kaladi, anni prakkala okē rītinuṃḍunadi), anirdēśyamu (idi iṭṭidani nirdēśiṃparānidi), amṛtamu - (nāśamu lēnidi) (nityamainadi) agunadi - iṭṭi lakṣaṇamulukaladi brahmayokka niṣkalarūpamu - brahmaku sahajamainadi, avidya, mūlaprakṛti, māyā lōhita kṛṣṇa piṃgaḷamugā nuṃḍunadi yagu dānitō kūḍi lōhita kṛṣṇa piṃgaḷuḍaina mahēśvaruḍu brahma yokka sakala - niṣkala rūpamu. tana śaktitō krīḍiṃcu ā paramaśivuḍu bhaktulanu anugrahiṃcuṭaku, iṃdīvaramulavale prakāśiṃcucu, nālugu bhujamulu kaligi bhaktula pāpamulanu pōgoṭṭunaṭṭi dattātrēya rūpamu brahmayokka sakaḷa rūpamu - (kaḷalatō kūḍina rūpamu).
“smṛtēśca” yaṃ yaṃ vāpi smaran bhāvaṃ tyajaṃtyaṃtē kaḷēbaraṃ |
taṃta mēvaiti kauṃtēya tadā tadbhāva bhāvitaḥ ||
“iti yadyapyēka ēvātmā sarvabhūtēṣu sthāvara jaṃgamēṣu gūḍhastadā pi ca cittōpādhi viśēṣa tāratamyādātmanaḥ kūṭastha nitya syaka rūpasyā syuttarōttaramāviṣṭasya tāratamyaiśvaryaśakti viśēṣai śrūyatē -”. “tasya ya ātmānamāvistarāṃ vēdēti” atra smṛtāvapi –
“yadyadvibhūti matsatvaṃ śrīmadūrjita mēvavā |
tattadēsēvagacchatvaṃ mama tējōṃśa saṃbhavaṃ || ”
iti. yatra yatra vibhūtyādyatiśayaḥ na sa īśvara ityupāsya tayā cōdyatē |
ēvamihā syādityamaṃḍalē hiraṇmayaḥ puruṣaḥ sarva pāpmā daya liṃgāt para ēvēti vīkṣyati
(śrī śaṃkaraḥ - brahma sūtra bhāṣyē - 1 - 1 - 11)
(paina ceppina prakāramu anēkacōṭla upaniṣattulu vidyā avidyā bhēdamunanusariṃci brahmaku reṃḍurūpamulu ceppucunnavi. vāṭlalō avidyā avasthayaṃdu upāsyamani upāsakuḍu ani reṃḍu lakṣaṇamulu ceppabaḍu cunnavi. aṭṭi brahmōpāsanalu konnībhyudayamu koṟaku cēyabaḍucunnavi. konni kramamukti koṟaku cēyabaḍucunnavi. konni karmalu cēyuṭakoraku cēyabaḍucunnavi. vāṭilō bhēdamu guṇaviśēṣamulō gala bhēdamuvalana kalugu cunnavi. okaḍē ayina parabrahma āyā guṇaviśēṣa mula baṭṭi upāsiṃpabaḍucunnapuḍu āyā guṇaviśēṣamunubaṭṭi (bhēda munu baṭṭi) phalabhēdamu kalugucunnadi. ‘ā paramātmanu ē prakāramugā upāsiṃcunō ā prakāramugānē yagucunnāḍu’ ani śruti ceppucunnadi. maṟiyu - “ī lōkamulō ē karmacēsi canipōvunō dāni kanuguṇamuganē puruṣuḍu agucunnāḍu - aninnī śruti ceppucunnadi. avasānakālamaṃdu ē ē bhāvamunu talacukonucu canipōvunō adiyē yagunu - ā bhāvamunaku taginaṭlugānē yagunu” ani smṛti (śrīmadbhagavadgīta) ceppucunnadi. sthāvara jaṃgamamulagu samasta bhūtamulaṃdu okaḍē yagu paramātma gūḍhamugā nunnāḍu. ayinappaṭikī cittamanu upādhi tāratamyamuvalana kūṭasthuḍu, nityuḍu, okē rūpamu kalavāḍaina ātma āyā upādhulanu baṭṭi aiśvaryaśakti viśēṣamulalō tāratamyamu galavāḍugā ceppabaḍucunnāḍu. dīnini guṟiṃci smṛti ī vidhamugā ceppucunnadi - sṛṣṭilō yēdaina oka vastuvu (nā vibhūtiyē),migilina vāṭikaṃṭe ē viṣayamulō nainanu ē rītiganainanu utkṛṣṭamainadigā kanabaḍinacō adi nā tējassu yokka aṃśavalananē kaliginadani telusukonumu. anni vastuvulalōnu nēnu aṇagiyunnappaṭikī sādhāraṇamugā nēnu unnaṭlu sāmānyulaku teliyadu - ayitē iṭuvaṃṭi vastuvulanu baṭṭi nēnu vāṭilō nunnaṭlu telusukonavaccunu - aṭlē āniṃṭilōnu paiki kanabaḍakapōyinanu nēnu unnānani grahiṃcavalenu - ekkaḍekkaḍa vibhūti - (bhagavaṃtuni śakti) ē vidhamugā nainanū atiśayiṃciyunna yaḍala (migilinavāṭilō kaṃṭe heccugā nunnayaḍala) akkaḍakkaḍa adē paramātmayani telusukoni upāsiṃcavalenu - dīni nanusariṃciyē sūrya maṃḍalamaṃdu hiraṇmayapuruṣuḍu paramātmayani, ā upādhilōni satvādhikyamunu (adhikatējōvaṃtamu) baṭṭi ceppaḍamainadi).
“ma brahmētyupāstīnāṃ kāmacārādi rabhyudayaḥ phalaṃ; daharādyupāstīnāṃ kramamuktiḥ - udgīdādi dhyānasya karma samṛddhiḥ phalamiti bhēdaḥ”. (ratna prabhā - brahmasūtrabhāṣyamu - 1 - 1 - 11)
(brahmajñānamunaku viṣayamainadi jñēyabrahma; adi nirguṇamu, nityamu, nirākāramu - avidyaku - ajñānamunaku - viṣayamainadi, upāsana cēyavalasinadi saguṇabrahma - sākārabrahma. idi kalpitamu. nirguṇa brahma dhyānamunaku adikārulu kānivāriki - arhatalēnivāriki, sāmarthyamu lēnivāriki - manōniścalatvamukoṟaku upāyamugā ceppabaḍinadi. pillalaku cēduga nuṃḍu maṃdu niccuṭaku muṃdu talli bellamunicci - dīnivale maṃdu tiyyagānuṃḍunani ceppi tarvāta maṃdunu yicci tinipiṃcinaṭlu - brahmajñānamu bōdhiṃcuṭaku muṃdu (anagā nirguṇa nirākāra brahma lakṣaṇamu bōdhiṃcuṭaku muṃdu) ajñāniki (adhikāramu lēnivāniki) āyā upāsanalu, vāṭi phalamu (saguṇa brahmadhyānamu) vidhiṃcabaḍiyunnavi. nirguṇa nirākāra brahmajñānamukalugavalenanna muṃdu cittaśuddhi, cittaikāgrata kāvalenu. dāni koṟaku saguṇa brahma dhyānarūpamaina upāsanalu ceppa baḍinavi. aṃducēta ī upāsanalaku cittaikāgryamudvārā brahmajñānamu mukhyamaina phalamu. aṃducēta upāsanalu vidhiṃcina upaniṣadvākyamula tātparyamukūḍā brahmamē - (nirguṇa brahmamē) ani teliya taginadi).
(nāma brahmanupāsiṃcuvāriki kāmacāramu modalagu abhyudayamu phalamu. daharavidya nabhyasiṃcuvāriki kramamukti phalamu - udgīdhamu modalagu dhyānamunaku karma samṛddhi phalamu - ani ī vidhamuga upāsanāphalamulō bhēdamunnadi)
vvārunu lēru, taṃḍri, bhagavaṃtunanaṃtuni viśvabhavanō
dāruni sadguṇāvaḷulu dāttamatiṃ goniyāḍakuṃḍinan
jēravu cittamul prakṛti ceṃdani nirguṇamaina brahmamun”. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 7 - 21)
(saguṇa brahmōpāsana lēnidi nirguṇa brahmōpāsana kudaradu).
(nirguṇa brahmaōpāsana cēyuṭayaṃdu adhikāramu lēnivāḍu saguṇa brahmōpāsana ellapuḍu cēyavalenu).
(saguṇabrahmōpāsana cittaikāgryata kaligiṃcunu. dāni dvārā nirguṇabrahma sākṣātkāramunaku hētuvagunu).
jagamula galpiṃcikoṟaku jaturata māyā
saguṇuṃḍagu, gāvuna hari
bhagavaṃtuḍanaga barage bhavya caritrā”. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 6 - 99)
sṛṣṭiki pūrvamu parabrahma yokkaḍē yuṃḍenu - tana aparāśaktiyaina prakṛtitō kaliyuṭavalana (prakṛti satvarajastamamulanu triguṇamulu galadaguṭa cēta) rūpamu kaligenu - adiyē saguṇabrahma, sākārabrahma - bhagavaṃtuni avatāramulanniyu saguṇabrahma rūpamulē - nirākāra, nirguṇa parabrahmaku triguṇamayamaina prakṛti atani iṣṭānusāramu, kalpiṃci yiccina rūpamulu - ā rūpamulalō nirguṇa parabrahmamē avatariṃcinaṭlu vyavahariṃcenu. prapaṃca mulōni vastuvulanniyu ī prakāramugānē puruṣa prakṛti aṃśalu kalaviyē (puruṣuḍanagā parabrahma - puramaṃdu śayaniṃcuvāḍu - atanu prakṛti vikāramaina ē vastuvulōnunna adiyē ataniki puramu) - ē vastuvulōnainanu prakṛtini viḍici parabrahmalēḍu, parabrahma tanalō lēni prakṛti aṃśalēdu - aṃducēta sṛṣṭilōni vastuvulanniyu bhagavatuni rūpamulē - oka vidhamugā avatāramulē.
“ma. varayōgīṃdrulu yōgamārgamula bhāvaṃbaṃdunēnīmanō
hararūpaṃbu dalaṃci yē guṇagaṇa dhyānaṃbu gāviṃtura
ppuruṣa śrēṣṭa parigrahaṃbunakunai pōlpāra daddhyāna gō
caramūrtin dhariyiṃtugāde paramōtsāhaṃbunan mādhavā “. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 9 - 298)
ma. “bahu pādōru bhujānanēkṣaṇa śiraḥ phālaḥ śravō yukuḍai
vihariṃcun bahudēhi dēhagatuḍai; vidvānsu lūhiṃci ta
dbahurūpāvayavalaṃbulan bhuvanasaṃpattin vicāriṃturu - - -” (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 5 - 88)
tatraikasthaṃ jagatkṛtsnaṃ pravibhaktamanēkathā |
apaśyaddēna dēvassa śarīrī pāṃḍavastathā ||.
(bhagavaṃtuni viśvarūpamanu sthūlarūpamulō jagattaṃtayu okaṭigā, anēka vidhamulugā anēka vastuvulu kalasiyunnavigā arjunuḍu cūcenu). “ippuḍu nī keṟiṃgiṃcinavellanu - (padunālugu lōkamulu) brahmāṃḍakōśaṃbunaṃ galavani purāṇaṃbulu palukucuṃḍu. aṭṭi brahmāṃḍaṃbu śrīmannārāyaṇuni sthūla śarīraṃbaguṭaṃjēsi - - - bhūdvīpa varṣa saridadri nabhassamudra pātāḷa diṅnaraka tārāgana lōka saṃsthitaṃbayi, sakalajīva nikāyyaṃbai yadbhutaṃbaina śrīhari sthūlaśarīraṃbu vinipiṃcitini”-
(śrīmadāṃdhramahābhāgavatamu - 5 - 2 - 162)
prapaṃcamu, dānilōni vastuvulanniyu bhagavaṃtuniyokka (parabrahma yokka) sthūlaśarīramu - nirākāra, nirguṇa, nirviśēṣa parabrahma ataniyokka sūkṣmarūpamu prati vastuvulōnu aṃtarātmagānunnadi bhagavaṃtuni sūkṣma rūpamu)
“sī. parama vijñāna saṃpannulai naṭṭi yōgīṃdrulu mahita nistaṃdralīla
paridṛśyamānamai bhāsillu nimmahī parvatamu khara prapaṃcamella
baraga brahmarūpaṃbu gāga teliyadu relami - - ” (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - u,bhā.-1206);
nirguṇa parabrahmayokka saguṇarūpamu viśvarūpamugā niṭlu varṇiṃpabaḍinadi : -
(1) “va. caturdaśalōkaṃbulaṃdu mīdi ēḍu lōkaṃbulu śrīmahāviṣṇuvunaku gaṭi pradēśaṃbuna nuṃḍi yūrthva dēhamaniyunu, griṃdi yēḍu lōkaṃbulu jaghanaṃbunanuṃḍi yadhō dēhamaniyunu - balukuduru; prapaṃcaśarīruṃḍagu bhagavaṃtuni mukhaṃbuvalana brahmakulaṃbunu, bāhuvilavalana kṣatriya kulaṃbunu, nūruvulavalana vaiśyakulaṃbunu, bādaṃbulavalana śūdrakulaṃbunu, janiyiṃcenani ceppuduru; bhūlōkaṃbu gaṭi pradēśaṃbu; bhuvarlōkaṃbu nābhi; suvarlōkaṃbu hṛdayaṃbu; maharlōkaṃbu vakṣaṃbu, janalōkaṃbu grīvaṃbu, tapōlōkaṃbu stanadvayaṃbu, sanātanaṃbunu brahma nivāsaṃbunu naina satyalōkaṃbu śiraṃbu, jaghanapradēśaṃbu batalaṃbu; toḍalu vitalaṃbu, jānuvulu sutalaṃbu, jaṃghalu talātalaṃbu; gulphaṃbulu mahātalaṃbu, pādāgraṃbulu rasātalaṃbu, pādatalaṃbu pātāḷaṃbunani lōkamayaṃgā bhāviṃturu” - (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 5 - 89).
(2) sī. agnimukhaṃbu parā parātmaka mātma, kālaṃbugati, ratnagarbha padamu
śvasanaṃbu nīyūrpu, rasana jalēśuṃḍu, diśaṃbulu karṇaṃbulu, divamu nābhi
sūryuṃḍu gannulu, śuklaṃbu salilaṃbu, jaṭharaṃbu jaladhulu, sadalu śiramu,
sarvauṣadhamulu rōma cayamulu, śalyaṃbuladrulu, mānasamamṛtakaruḍu
tē. caṃdamulu dhātuvulu, dharma samiti hṛdaya
māsya paṃcaka mupaniṣadā hvayaṃbu
nayina nīrūpu paratatvamai, śivākhya
mai, svayaṃjyōtiyai yoppu nādyamagucu ” (śrīmadāṃdhramahābhāgavatamu - 8 - 7 - 224)
(3). “sī. yōgīśarūpuḍai yōgaṃbu jūpucu, mēnirūpaṃbuna karmaṃbu dālcu
sargaṃbu sēyu brajāpatirūpuḍai iṃdruḍai daityula nēpaḍaṃcu
jñānaṃbuneṟigiṃcu jatura siddhākṛti gāla rūpamuna bākaṃbusēyu
nānā vidhākāra nāma rūpaṃbula garmalōcanulaku gānabaḍaḍu
ā. canina rūpamulanu janurūpamulaniṃka
janaganunna rūpacayamu nataḍu
vividhuḍai yanēka vṛttula veligiṃcu
viṣṇuḍavyayuṃḍu vimala carita”. (śrīmadāṃdhramahābhāgavatamu - 8 - 14 - 435)
(1) ’sī. - - - evvaḍu manamu buddhīṃdriyamulu dānayai guṇasaṃpravāhaṃbu neṟapu
tē. strī napuṃsaka puruṣamūrtiyunu gāka
tirya gamara narādimūrtiyunugāka
karmaguṇabhēda sa dasatprakāśi gāka
venuka nanniyu dānagu vibhu dalaṃtu’. (śrīmadāṃdhramahābhāgavatamu - 8 - 3 - 85)
(2). “arūpaṃ, surūpaṃ samasta svarūpaṃ” (śrīrāmakarṇāmṛtaṃ - 2 - 85)
(śrīrāmacaṃdraparabrahma rūpamu lēnivāḍu - nirākāraparabrahma; suṃdararūpamugala sākāra brahma, sṛṣṭilōnunna samasta vastuvula rūpamu tānē ayinavāḍu).
(3) “dēvā nīvu brahmasvarūpaṃbagu jyōtirmayuṃḍavu” (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - u.bhā. - 441)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.