(ఆ పరబ్రహ్మను - తత్పదవాచ్యు డైన బ్రహ్మను - బాగుగా తెలిసినవాడు).
(బ్రహ్మను గుఱించి అయిన జ్ఞానముకలవాడు)
(బ్రహ్మసాక్షాత్కారమును పొందినవాడు)
(పరమ పురుషార్థమైన మోక్షరూపమైన పరబ్రహ్మను చూచినవాడు).
బ్రహ్మవేత్త -
“వేదం వేదార్థంచ యథావత్ వేత్తీతి బ్రహ్మవిత్”. (శ్రీశంకరః)
(వేదమును వేదార్థమును యధార్థముగా తెలుసుకొనినవాడు).
(బ్రహ్మను ఉపాసనచేయువాడు, బ్రహ్మను ఉపాసన చేయుటయందు ఆసక్తి కలవాడు, నిష్టకలవాడు).
(ధర్మములన్నింటిని ఉపదేశించువాడు).
(అన్యోన్యాధ్యాసవలన కలుగు మోహము లేనివాడై బ్రహ్మగుఱించి బాగుగా తెలిసినవాడు).
తే బ్రహ్మ తద్విదుః కృత్స్నమధ్యాత్మం కర్మ చాఖిలం |
సాధిభూతాధి దైవం మాం సాధియజ్ఞం చ యే విదుః |
ప్రయాణకాలేపి చ మాం తే విదుర్యుక్త చేతసః ||“. (శ్రీమద్భగవద్గీత - 7 - 29, 30)
(జరామరణములు లేకుండుటకై నన్ను (భగవంతుని) ఆశ్రయించువారు బ్రహ్మజ్ఞానము కలవారగుదురు. అధ్యాత్మవిషయమంతయు వారు తెలుసుకొందురు. మరణకాలమందు అధిభూతము, అధిదైవము, అధియజ్ఞము ఎవరు తెలుసుకొనెదరో వారు బ్రహ్మను తెలుసుకొందురు - వారు బ్రహ్మజ్ఞానము కలవారగుదురు - బ్రహ్మవిదులు - బ్రహ్మవేత్తలు అగుదురు)
(తనుకానటువంటిదానిని కప్పిపుచ్చి, అన్నియు లయమైపోగా తాను మాత్రము శేషించి - మిగిలియుండి - మరల పెద్దదిగా - ప్రపంచములోని అన్ని వస్తువులగా - తానే అగువాడు కనుక బ్రహ్మ అని చెప్పబడుచున్నాడు - అట్టి బ్రహ్మను - (బ్రహ్మ అట్లగుటను) - తెలుసుకొనినవాడు బ్రహ్మవిదుడు).
(ఆత్మజ్ఞానము కలవాడు సంసారమువలన కలుగు బాధలుపొందడు, ముక్తినొందును - బ్రహ్మజ్ఞానము కలవాడు).
(ఎవడు తత్పదవాచ్యుడగు పరబ్రహ్మను తెలుసుకొనునో - ఎవడు బ్రహ్మవేత్తయగునోవాడు బ్రహ్మమే యగును).
ప్రసాదేన హి రుద్రస్య బ్రహ్మవిద్ బ్రాహ్మణో భవేత్ ||“. (పరాశరోపపురాణము)
(శివుని ప్రసాదమువలననే - దయవలననే - బ్రాహ్మణుడు జ్ఞాన నిష్ఠుడగును - బ్రహ్మజ్ఞానము కలుగచేసుకొనుటలో నిష్ఠకలిగియుండును - ఆ శివుని దయచేతనే బ్రాహ్మణుడు బ్రహ్మవిదుడు - బ్రహ్మజ్ఞాని - యగును).
(‘తత్వమసి’ యను మహావాక్యార్థమును గురువువలన గ్రహించి తాను సంసారికానని పరబ్రహ్మస్వరూపుడనే తెలుసుకొని, మాయాప్రభావముచే (భ్రాంతి వలన) తన నిజస్వరూపమును తెలుసు కొనలేక ఉన్నాడనని ఎప్పుడు బ్రహ్మజ్ఞానము కలుగునో అప్పుడు అతను పరబ్రహ్మమే యగును).
(లోకములో ఎవరు “ఆ పరబ్రహ్మను నేనే” అని సాక్షాత్తుగా యదార్థముగా తెలుసుకొనెదరో వారు పరమగతి అయిన పరబ్రహ్మను తప్ప మఱియొక గతిని పొందరు. అట్టివాడిట్లు బ్రహ్మమే యగుటలో (బ్రహ్మ ప్రాప్తిని పొందుటలో) దేవతులుకూడ విఘ్నము చేయుటకు సమర్థులుగారు. అందుచేత బ్రహ్మవిదుడు బ్రహ్మమే యగును).
(శ్రీరంగరామానుజః)
(పరబ్రహ్మను తెలుసుకొనినవాడు - దర్శనసమానాకారోపాసన కలవాడు కాడు - ఆవిర్భించిన సాక్షాత్ బ్రహ్మమే యగును).
(శ్రీరంగరామానుజః)
(బ్రహ్మవేత్త పరమ బ్రహ్మమును పొందును అని చెప్పబడినది. బ్రహ్మ వేదనము (బ్రహ్మను తెలుసుకొనుట), బ్రహ్మోపాసనము అను రెండింటికి అర్థము ఒకటే కనుక పరబ్రహ్మను ఉపాసించవలెను అని తెలియ చేయబడినది).
(మోక్షముకోరువారికి పరతత్వముతోకూడ పురుషార్థములను చెప్పుటలో బ్రహ్మను తెలుసుకొనినవాడు పరమును - పరమ పురుషార్థమైన మోక్షమును - పొందును అనిచెప్పబడినది. పరతత్వమనగా పరబ్రహ్మమే, దానిని తెలుసుకొనుట యనగా దానిని పొందుట, అదియే పరమ పురుషార్థము - చతుర్విధ పురుషార్థములలో నొకటి),
తదైవ బ్రహ్మ విచ్ఛ్రేష్టః సదా బ్రహ్మైవ నాపరః |
ఘటేనష్టే యధా వ్యోమః వ్యోమైవభవతి స్వయం |
తధైవోపాధివిలయే బ్రహ్మైవ విత్స్వయం |
క్షీరం క్షీరే యధా క్షిప్తం తైలం తైలే జలం జలే |
సం యుక్తమేకతాయాతి తథా తథా ఆత్మన్యా త్మ విన్మునిః |
లక్ష్యా లక్ష్య గతిం త్యక్త్వా యస్తిష్టే త్కేవలాత్మనా |
శివ ఏవ స్వయం సాక్షా దయం బ్రహ్మ విదుత్తమః |
జీవన్నేవ సదాముక్తః కృతార్థో బ్రహ్మ విత్తమః |
ఉపాధినాశాత్ బ్రహ్మైవసన్ బ్రహ్మప్యేతి నిర్ద్వయం |
బ్రహ్మవిదాప్నోతిపరం బ్రహ్మ తద్బ్రహ్మైవ భవతి ||“.
(బ్రహ్మవేత్త ఎల్లపుడు బ్రహ్మమేకాని ఇతరముకాది - కుండ పగిలిపోయినపుడు కుండలో నుండిన ఆకాశము ఆకాశములో కలిసిపోవును. ఆ ప్రకారముగానే బ్రహ్మవేత్త తన ఉపాధి నష్టముకాగానే స్వయముగా బ్రహ్మమే యగును - పాలలో పాలు కలిసినను, నూనెలో నూనె కలిసినను నీటిలో నీరు కలిసినను, అవి కలిసిపోయి ఒకటిగా అయినట్లే బ్రహ్మజ్ఞానము గల ముని (బ్రహ్మవేత్త) బ్రహ్మలో కలియును - ఐక్యమగును - లక్ష్యాలక్ష్యగతిని వదలి కేవలాత్మవలనే - కేవలబ్రహ్మవలనే యుండును. బ్రహ్మవిదులలో నుత్తముడగువాడు సాక్షాత్ శివుడే యగును. బ్రహ్మవేత్తలలో నుత్తముడగువాడు జీవించియుండగనే ముక్తుడగును (జీవన్ముక్తుడగును) కృతార్థుడగును - ఉపాధి నశించినందున బ్రహ్మవిదుడు అద్వయుడైన బ్రహ్మను పొందును - బ్రహ్మమే యగును). బ్రహ్మవేత్త స్వయముగ బ్రహ్మమే అయినను మాయవలన కలిగిన అజ్ఞానము చేత తన స్వస్వరూపమును మఱచి పోవును - బ్రహ్మజ్ఞానము కలుగగనే స్వస్వరూపమును తెలుసుకొనినవాడై బ్రహ్మమును కలియును - అనగా, పరమాత్మయే జీవుడు, ఉపాధిలోనున్న జీవుడే పరమాత్మ. బ్రహ్మవేత్తకు ప్రస్తుత శరీరము నశించువఱకు ప్రారబ్దకర్మ అనుభవించవలసి యుండును - ఆ అనుభవముతో ప్రారబ్దకర్మ నశించగా మిగిలినకర్మలు బ్రహ్మజ్ఞానము వలన నశించునుకనుక ఈ దేహము నశించిన తర్వాత కర్మలఫలము ననుభవింపవలసిన అవసరములేదు - కనుక జన్మము పొందక పరబ్రహ్మమును పొందును).
(అన్నింటికంటె బాగుగా పెద్దవాడు, పెద్దగా పెరుగువాడు కనుక బ్రహ్మ అని చెప్పబడుచున్నాడు. ప్రపంచమంతయు తానే అయినట్టు పెరిగినవాడు, వృద్ధిపొందినవాడు - (వామనమూర్తివలె) కనుక బ్రహ్మ యని చెప్పబడు చున్నాడు. అట్టి బ్రహ్మను తెలుసుకొనినవాడు బ్రహ్మవేత్త - బ్రహ్మవిదుడు. అట్టి బ్రహ్మవేత్త పరమును పొందును అని చెప్పబడినది. పరమమనగా అన్నింటికంటె అతిశయించి ఉత్కృష్టమైనది. అదియే పరబ్రహ్మ. అందుచేత బ్రహ్మవేత్త పరబ్రహ్మమును పొందును.)
(బ్రహ్మ విద్యవలన కలిగిన ఫలమే బ్రహ్మవిదుడగుట, బ్రహ్మజ్ఞానము కలిగియుండుట. దానివలన పరమును పొందును అని చెప్పబడినది. పరము అనగా సర్వాత్మభావము - అన్నింటికి ఆత్మయగు భావము - అనగా, సంసారమువలనకలుగు సర్వధర్మములకు అతీతమైన (మించిన స్వరూపము కలిగియుండుట - వేఱొకటికాదు).
(వేద అనుమాటకు ఉపాసన అనుమాటకు ఒకే అర్థముకలదు కనుక బ్రహ్మవిత్ అను మాటలోని ‘విదు’ అను మాటకు ఉపాసనయని యర్థమగును. అందుచేత నిరతిశయ బృహత్వముగల ఉపాసకవస్తువులన్నింటికంటె ఉత్కృష్టమైనదానిని పొందును అని అర్థము).
(బ్రహ్మవిదుడు బ్రహ్మమునే పొందును అని చెప్పుటవలన ప్రాప్యమైన పరబ్రహ్మకు ప్రాప్తించుటకు కర్త అయిన వానికి - అనగా ప్రాప్య పాప్త్యులకు - భేదములేదు -; పరమాత్మ జీవాత్మలకు భేదములేదని చెప్పబడినది).
(అన్నింటికంటె పెద్దది - పెద్దదిగా పెరుగునది - యను లక్షణముకలది కనుక బ్రహ్మయని చెప్పబడినది. అట్టి బ్రహ్మను తెలుసుకొనినవాడు బ్రహ్మవిదుడు - అన్నింటికంటె అన్ని విధముల గొప్పది అయినది పరము - పరతత్వము; పరబ్రహ్మము - అట్టి పరబ్రహ్మను తెలుసుకొనినవాడు పరబ్రహ్మను పొందును. బ్రహ్మ యనునది అన్నింటిలోను ఉన్నది, అన్నింటికీ ఆత్మయినది అని చెప్పబడుచున్నది. “ఆప్నోతి” అనగా పరిచ్ఛిన్నమైనదానిని ఇంకొకటి కలియుటయని అర్థమగును - బ్రహ్మ అపరిచ్ఛిన్నమున్నూ అన్నింటికి ఆత్మ అయినదిన్నీ, అందుచేత పరిచ్ఛిన్నమైన అనాత్మవస్తువువలె ఆత్మను పొందుట ఉపపన్నముకాదు, ఇట్లు చెప్పుట తగదు అని దోషము చెప్పుట వలనుపడదు. ఎందుచేతననగా మాయవలన అన్నమయాదులగు అనాత్మవస్తువులు నేనేయని అభిమానము కలిగియుండుట వలన బ్రహ్మ ఆత్మయే అయినను అనాత్మగా పరిగణింపబడుచున్నది).
“చ. ముంచితి వార్థులన్, గదలమెత్తితి, శైలతటంబులందు ద్రొ
బ్బించితి, శస్త్రరాజి పొడిపించితి మీది నిభేంద్రపంక్తి ఱొ
బ్బించితి, దిక్కరించితి, శపించితి, ఘోరదవాగ్నులందు ద్రో
యించితి, బెక్కుసార్లు నలయించితి జావడిదేమి చిత్రమో!
చ. ఎఱుగడు జీవనౌషధము లెవ్వరు భర్తలు లేరు, బాధలం
దరలడు, నైజ తేజమున దధ్యము జాడ్యములేదు, మిక్కిలిన్
మెరయుచునున్నవాడొక నిమేషము దైన్యము నొందడింక నే
తెఱంగున ద్రుంతు? వేసరితి, దివ్యము వీని ప్రభావమెట్టిదో“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 5 - 201, 202)
“వ. ఇట్లు సర్వాత్మకంబై యిట్టి దట్టిదని నిర్దేశింపరాని పరబ్రహ్మంబు దానయై, యమ్మహా విష్ణునియందు చిత్తంబు చేర్చి తన్మయుండై పరమా నందంబునం బొందియున్న బ్రహ్లాదుని యందు రాక్ష సేంద్రుడు దన కింకరుల చేతం జేయించుచున్న మారణ కర్మంబులు- - - విఫలంబులగుటంజూచి - - -”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 5 - 195)
(ā parabrahmanu - tatpadavācyu ḍaina brahmanu - bāgugā telisinavāḍu).
(brahmanu guṟiṃci ayina jñānamukalavāḍu)
(brahmasākṣātkāramunu poṃdinavāḍu)
(parama puruṣārthamaina mōkṣarūpamaina parabrahmanu cūcinavāḍu).
brahmavētta -
“vēdaṃ vēdārthaṃca yathāvat vēttīti brahmavit”. (śrīśaṃkaraḥ)
(vēdamunu vēdārthamunu yadhārthamugā telusukoninavāḍu).
(brahmanu upāsanacēyuvāḍu, brahmanu upāsana cēyuṭayaṃdu āsakti kalavāḍu, niṣṭakalavāḍu).
(dharmamulanniṃṭini upadēśiṃcuvāḍu).
(anyōnyādhyāsavalana kalugu mōhamu lēnivāḍai brahmaguṟiṃci bāgugā telisinavāḍu).
tē brahma tadviduḥ kṛtsnamadhyātmaṃ karma cākhilaṃ |
sādhibhūtādhi daivaṃ māṃ sādhiyajñaṃ ca yē viduḥ |
prayāṇakālēpi ca māṃ tē viduryukta cētasaḥ ||“. (śrīmadbhagavadgīta - 7 - 29, 30)
(jarāmaraṇamulu lēkuṃḍuṭakai nannu (bhagavaṃtuni) āśrayiṃcuvāru brahmajñānamu kalavāraguduru. adhyātmaviṣayamaṃtayu vāru telusukoṃduru. maraṇakālamaṃdu adhibhūtamu, adhidaivamu, adhiyajñamu evaru telusukonedarō vāru brahmanu telusukoṃduru - vāru brahmajñānamu kalavāraguduru - brahmavidulu - brahmavēttalu aguduru)
(tanukānaṭuvaṃṭidānini kappipucci, anniyu layamaipōgā tānu mātramu śēṣiṃci - migiliyuṃḍi - marala peddadigā - prapaṃcamulōni anni vastuvulagā - tānē aguvāḍu kanuka brahma ani ceppabaḍucunnāḍu - aṭṭi brahmanu - (brahma aṭlaguṭanu) - telusukoninavāḍu brahmaviduḍu).
(ātmajñānamu kalavāḍu saṃsāramuvalana kalugu bādhalupoṃdaḍu, muktinoṃdunu - brahmajñānamu kalavāḍu).
(evaḍu tatpadavācyuḍagu parabrahmanu telusukonunō - evaḍu brahmavēttayagunōvāḍu brahmamē yagunu).
prasādēna hi rudrasya brahmavid brāhmaṇō bhavēt ||“. (parāśarōpapurāṇamu)
(śivuni prasādamuvalananē - dayavalananē - brāhmaṇuḍu jñāna niṣṭhuḍagunu - brahmajñānamu kalugacēsukonuṭalō niṣṭhakaligiyuṃḍunu - ā śivuni dayacētanē brāhmaṇuḍu brahmaviduḍu - brahmajñāni - yagunu).
(‘tatvamasi’ yanu mahāvākyārthamunu guruvuvalana grahiṃci tānu saṃsārikānani parabrahmasvarūpuḍanē telusukoni, māyāprabhāvamucē (bhrāṃti valana) tana nijasvarūpamunu telusu konalēka unnāḍanani eppuḍu brahmajñānamu kalugunō appuḍu atanu parabrahmamē yagunu).
(lōkamulō evaru “ā parabrahmanu nēnē” ani sākṣāttugā yadārthamugā telusukonedarō vāru paramagati ayina parabrahmanu tappa maṟiyoka gatini poṃdaru. aṭṭivāḍiṭlu brahmamē yaguṭalō (brahma prāptini poṃduṭalō) dēvatulukūḍa vighnamu cēyuṭaku samarthulugāru. aṃducēta brahmaviduḍu brahmamē yagunu).
(śrīraṃgarāmānujaḥ)
(parabrahmanu telusukoninavāḍu - darśanasamānākārōpāsana kalavāḍu kāḍu - āvirbhiṃcina sākṣāt brahmamē yagunu).
(śrīraṃgarāmānujaḥ)
(brahmavētta parama brahmamunu poṃdunu ani ceppabaḍinadi. brahma vēdanamu (brahmanu telusukonuṭa), brahmōpāsanamu anu reṃḍiṃṭiki arthamu okaṭē kanuka parabrahmanu upāsiṃcavalenu ani teliya cēyabaḍinadi).
(mōkṣamukōruvāriki paratatvamutōkūḍa puruṣārthamulanu ceppuṭalō brahmanu telusukoninavāḍu paramunu - parama puruṣārthamaina mōkṣamunu - poṃdunu aniceppabaḍinadi. paratatvamanagā parabrahmamē, dānini telusukonuṭa yanagā dānini poṃduṭa, adiyē parama puruṣārthamu - caturvidha puruṣārthamulalō nokaṭi),
tadaiva brahma vicchrēṣṭaḥ sadā brahmaiva nāparaḥ |
ghaṭēnaṣṭē yadhā vyōmaḥ vyōmaivabhavati svayaṃ |
tadhaivōpādhivilayē brahmaiva vitsvayaṃ |
kṣīraṃ kṣīrē yadhā kṣiptaṃ tailaṃ tailē jalaṃ jalē |
saṃ yuktamēkatāyāti tathā tathā ātmanyā tma vinmuniḥ |
lakṣyā lakṣya gatiṃ tyaktvā yastiṣṭē tkēvalātmanā |
śiva ēva svayaṃ sākṣā dayaṃ brahma viduttamaḥ |
jīvannēva sadāmuktaḥ kṛtārthō brahma vittamaḥ |
upādhināśāt brahmaivasan brahmapyēti nirdvayaṃ |
brahmavidāpnōtiparaṃ brahma tadbrahmaiva bhavati ||“.
(brahmavētta ellapuḍu brahmamēkāni itaramukādi - kuṃḍa pagilipōyinapuḍu kuṃḍalō nuṃḍina ākāśamu ākāśamulō kalisipōvunu. ā prakāramugānē brahmavētta tana upādhi naṣṭamukāgānē svayamugā brahmamē yagunu - pālalō pālu kalisinanu, nūnelō nūne kalisinanu nīṭilō nīru kalisinanu, avi kalisipōyi okaṭigā ayinaṭlē brahmajñānamu gala muni (brahmavētta) brahmalō kaliyunu - aikyamagunu - lakṣyālakṣyagatini vadali kēvalātmavalanē - kēvalabrahmavalanē yuṃḍunu. brahmavidulalō nuttamuḍaguvāḍu sākṣāt śivuḍē yagunu. brahmavēttalalō nuttamuḍaguvāḍu jīviṃciyuṃḍaganē muktuḍagunu (jīvanmuktuḍagunu) kṛtārthuḍagunu - upādhi naśiṃcinaṃduna brahmaviduḍu advayuḍaina brahmanu poṃdunu - brahmamē yagunu). brahmavētta svayamuga brahmamē ayinanu māyavalana kaligina ajñānamu cēta tana svasvarūpamunu maṟaci pōvunu - brahmajñānamu kalugaganē svasvarūpamunu telusukoninavāḍai brahmamunu kaliyunu - anagā, paramātmayē jīvuḍu, upādhilōnunna jīvuḍē paramātma. brahmavēttaku prastuta śarīramu naśiṃcuvaṟaku prārabdakarma anubhaviṃcavalasi yuṃḍunu - ā anubhavamutō prārabdakarma naśiṃcagā migilinakarmalu brahmajñānamu valana naśiṃcunukanuka ī dēhamu naśiṃcina tarvāta karmalaphalamu nanubhaviṃpavalasina avasaramulēdu - kanuka janmamu poṃdaka parabrahmamunu poṃdunu).
(anniṃṭikaṃṭe bāgugā peddavāḍu, peddagā peruguvāḍu kanuka brahma ani ceppabaḍucunnāḍu. prapaṃcamaṃtayu tānē ayinaṭṭu periginavāḍu, vṛddhipoṃdinavāḍu - (vāmanamūrtivale) kanuka brahma yani ceppabaḍu cunnāḍu. aṭṭi brahmanu telusukoninavāḍu brahmavētta - brahmaviduḍu. aṭṭi brahmavētta paramunu poṃdunu ani ceppabaḍinadi. paramamanagā anniṃṭikaṃṭe atiśayiṃci utkṛṣṭamainadi. adiyē parabrahma. aṃducēta brahmavētta parabrahmamunu poṃdunu.)
(brahma vidyavalana kaligina phalamē brahmaviduḍaguṭa, brahmajñānamu kaligiyuṃḍuṭa. dānivalana paramunu poṃdunu ani ceppabaḍinadi. paramu anagā sarvātmabhāvamu - anniṃṭiki ātmayagu bhāvamu - anagā, saṃsāramuvalanakalugu sarvadharmamulaku atītamaina (miṃcina svarūpamu kaligiyuṃḍuṭa - vēṟokaṭikādu).
(vēda anumāṭaku upāsana anumāṭaku okē arthamukaladu kanuka brahmavit anu māṭalōni ‘vidu’ anu māṭaku upāsanayani yarthamagunu. aṃducēta niratiśaya bṛhatvamugala upāsakavastuvulanniṃṭikaṃṭe utkṛṣṭamainadānini poṃdunu ani arthamu).
(brahmaviduḍu brahmamunē poṃdunu ani ceppuṭavalana prāpyamaina parabrahmaku prāptiṃcuṭaku karta ayina vāniki - anagā prāpya pāptyulaku - bhēdamulēdu -; paramātma jīvātmalaku bhēdamulēdani ceppabaḍinadi).
(anniṃṭikaṃṭe peddadi - peddadigā perugunadi - yanu lakṣaṇamukaladi kanuka brahmayani ceppabaḍinadi. aṭṭi brahmanu telusukoninavāḍu brahmaviduḍu - anniṃṭikaṃṭe anni vidhamula goppadi ayinadi paramu - paratatvamu; parabrahmamu - aṭṭi parabrahmanu telusukoninavāḍu parabrahmanu poṃdunu. brahma yanunadi anniṃṭilōnu unnadi, anniṃṭikī ātmayinadi ani ceppabaḍucunnadi. “āpnōti” anagā paricchinnamainadānini iṃkokaṭi kaliyuṭayani arthamagunu - brahma aparicchinnamunnū anniṃṭiki ātma ayinadinnī, aṃducēta paricchinnamaina anātmavastuvuvale ātmanu poṃduṭa upapannamukādu, iṭlu ceppuṭa tagadu ani dōṣamu ceppuṭa valanupaḍadu. eṃducētananagā māyavalana annamayādulagu anātmavastuvulu nēnēyani abhimānamu kaligiyuṃḍuṭa valana brahma ātmayē ayinanu anātmagā parigaṇiṃpabaḍucunnadi).
“ca. muṃciti vārthulan, gadalamettiti, śailataṭaṃbulaṃdu dro
bbiṃciti, śastrarāji poḍipiṃciti mīdi nibhēṃdrapaṃkti ṟo
bbiṃciti, dikkariṃciti, śapiṃciti, ghōradavāgnulaṃdu drō
yiṃciti, bekkusārlu nalayiṃciti jāvaḍidēmi citramō!
ca. eṟugaḍu jīvanauṣadhamu levvaru bhartalu lēru, bādhalaṃ
daralaḍu, naija tējamuna dadhyamu jāḍyamulēdu, mikkilin
merayucununnavāḍoka nimēṣamu dainyamu noṃdaḍiṃka nē
teṟaṃguna druṃtu? vēsariti, divyamu vīni prabhāvameṭṭidō”. (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 5 - 201, 202)
“va. iṭlu sarvātmakaṃbai yiṭṭi daṭṭidani nirdēśiṃparāni parabrahmaṃbu dānayai, yammahā viṣṇuniyaṃdu cittaṃbu cērci tanmayuṃḍai paramā naṃdaṃbunaṃ boṃdiyunna brahlāduni yaṃdu rākṣa sēṃdruḍu dana kiṃkarula cētaṃ jēyiṃcucunna māraṇa karmaṃbulu- - - viphalaṃbulaguṭaṃjūci - - -”. (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 5 - 195)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.