← Back to బ · Booklets 31–40 (digitized file 4)

బ్రహ్మవిద్య brahmavidya

Original — తెలుగు
  1. బ్రహ్మణః పరమాత్మనః విద్యా బ్రహ్మవిద్యా.

(పరమాత్మను తెలుపు విద్య) (పరబ్రహ్మను తెలియచేయువిద్య).

  1. “బ్రహ్మ ప్రతిపాదికాం వేదరూపాం విద్యాం”. (శ్రీరంగరామానుజః)

(పరబ్రహ్మను ప్రతిపాదించు వేదరూపమైన విద్య - వేదము పరబ్రహ్మను తెలియచేయునది)

  1. బ్రహ్మ తన్మాత్రబోధినీ విద్యా.

(ప్రకృతితోను, దాని వికారములతోను కలియక, కేవలము బ్రహ్మమాత్రముగానుండు దానిని బోధించు విద్య).

  1. “యేన విద్యా విశేషేణ అక్షరం సత్యం పరమపురుషం విద్యాత్, తత్.”

(క్షీణించనివాడు, మూడుకాలములందుండువాడు అయిన పరమపురుషుని తెలియచేయు విద్య).

  1. “యే నా క్షరం పురుషం వేద సత్యమితి విశేషణాత్ పరమాత్మ విషయాహి సా బ్రహ్మణావా అగ్ర జనోక్త ఇతి బ్రహ్మవిద్య”.

(అక్షరపురుషుడు, త్రికాలములందుండువాడు అగు పురుషుని తెలియచేయునదని చెప్పుటచేత పరమాత్మ విషయమైన విద్య - పరమాత్మయే విషయముగా గల విద్య. లేక, అగ్రజన్ముడు - పరమాత్మనుండి మొదట పుట్టినవాడగు చతుర్ముఖ బ్రహ్మ చెప్పినది - వేదము).

  1. “యేనాక్షరం పురుషం వేద సత్యం ప్రోవాచ, తాం తత్వతః బ్రహ్మవిద్యాం” ఇతి, యేన జ్ఞానేన అక్షరం భూతయోనిం సర్వజ్ఞం పురుషం వేద తాం బ్రహ్మ విద్యాం యోగ్యాయ శిష్యాయ ప్రభ్రూయాత్.

(సత్స్వరూపుడు, అక్షరుడు అయిన పురుషుని గుఱించి - బ్రహ్మ తత్వమును గుఱించి యధార్థముగా చెప్పునది బ్రహ్మవిద్య. సమస్తభూతములు పుట్టుటకు కారణమైన సర్వజ్ఞుడైన పరబ్రహ్మ గుఱించి చెప్పునది బ్రహ్మవిద్య. దానిని యోగ్యుడైన శిష్యునకు చెప్పవలెను)

  1. “స బ్రహ్మవిద్యాం సర్వవిద్యా ప్రతిష్టాం అధర్వాయ జ్యేష్టపుత్రాయ ప్రాహ” ఇతి బ్రహ్మవిద్యాం సర్వ విద్యానాం ప్రతిష్టాం సమాప్తి భూమం బ్రహ్మవిద్యాం ఉవాచ, బ్రహ్మణి సర్వ విద్యానాం విద్యాఫలానాం చాంతర్బావాత్ బ్రహ్మ విద్యా సర్వ విద్యా ప్రతిష్టా.

(సమస్త విద్యలు బ్రహ్మవిద్యయందే ప్రతిష్టింపబడియున్నవి. అన్ని విద్యలు బ్రహ్మవిద్యతోనే సమాప్తి చెందునవి. అన్ని విద్యల ఫలము బ్రహ్మమే - వాటి ఫలముయొక్క అంతర్భావము బ్రహ్మమే - అందుచేత బ్రహ్మవిద్య సమస్తమైన విద్యలకు సమాప్తి భూమి - ఆఖరిమెట్టు. బ్రహ్మ విద్య తెలిసిన అన్ని విద్యలు తెలిసినట్లే).

  1. “అధీహి భగవన్ బ్రహ్మవిద్యాం వరిష్టాం సదాసద్భిస్సేవ్య మానాం గూఢాం |

యయాచిరాత్సర్వపాపం వ్యపోహ్య పరాత్పరం, పురుషముపైతి విద్వాన్” (కైవల్యోపనిషత్)

(ఓ భగవంతుడా! అన్నింటికంటె శ్రేష్టమైనదిన్నీ, రహస్యమైనదిన్నీ, ఎల్లపుడు సత్పురుషుల చేత సేవింపబడునది, ఉపాసింపబడునదిన్నీ, దేనిని ఉపాసించినయడల విద్వాంసుడైనవాడు - జ్ఞాని అయినవాడు - శీఘ్రముగా సమస్త పాపములను పోగొట్టుకొని, దివ్యము పరాత్పరము అయిన పురుషుని -పరమపురుషుని - పొందునో, అట్టి బ్రహ్మవిద్య నుపదేశింపుడు).

  1. “కస్మిన్ను భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి” ఇతి చైక విజ్ఞానేన సర్వ విజ్ఞాపేక్షణం, సర్వాత్మకే బ్రహ్మణి వివక్ష్యమాణే అవకల్పతే.

(దేనిని తెలుసుకొనినచో ఈ ప్రపంచకమంతయు తెలుసుకొనినట్లగును - అను వాక్యమును బట్టి ఒకదానిని తెలుసుకొనినచో అన్నియు తెలియనగును అనునది ఏకవిజ్ఞానప్రతిజ్ఞ - పరబ్రహ్మను తెలుసుకొనినచో అన్నియు తెలిసినట్లే యగును - అన్నియు భగవంతుడే, అందుచేత భగవంతుని తెలుసు కొనిన అన్నియు తెలియును. సృష్టిలోని విషయములకు సంబంధించిన శాస్త్రములన్నియు సృష్టికి సంబంధించిన శాస్త్రములోని అంతర్భాగములే. ఈ శాస్త్రములన్నింటివలన కలుగు జ్ఞానమే బ్రహ్మజ్ఞానము - అందుచేత బ్రహ్మజ్ఞానము కలిగిన సర్వజ్ఞానము కలుగును. అందుచేత బ్రహ్మ విద్యలోని భాగములే విద్యలన్నియు.బ్రహ్మ ఈ సృష్టి యెట్లు చేసెను? ఈ సృష్టిలోని వస్తువులన్నియు తానే యెట్లాయెను? అను మొదలగు విషయములు తెలుసుకొనుటయే బ్రహ్మ విద్య. బ్రహ్మయనగా ఎవరు, ఎక్కడుండును, ఏమి చేయుచుండును? అను మొదలగు విషయములను బ్రహ్మ గుఱించి తెలుసుకొనుట బ్రహ్మ విద్య).

  1. “అపరాం ఋగ్వేదాది లక్షణాం విద్యాం ఉక్త్వా బ్రవీతి -” అధ పరా యయా తదక్షరమధి గమ్యతే. ఇతి

(ఋగ్వేదము మొదలగునవి అపరావిద్య. వాటిని చెప్పిన తర్వాత అక్షరుడైన పరబ్రహ్మను పొందింపచేయు పరావిద్యను చెప్పెను : అని చెప్పబడినవి. వేదములో కర్మకాండ చెప్పినతర్వాత వేదముల అంతమందు (కొసను) ఉండు ఉపనిషత్తులను - జ్ఞానకాండను, బ్రహ్మప్రాప్తి సాధనమైన పరావిద్యను చెప్పెను - అనగా ఉపనిషత్తులు బోధించునది బ్రహ్మవిద్య).

  1. “బ్రహ్మను బోధించి, బ్రహ్మజ్ఞానము కలుగచేసి బ్రహ్మ ప్రాపకమగుటవలన శ్రీమద్భగవద్గీత బ్రహ్మ విద్యయే -”శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యయాం” అని ప్రతి అధ్యాయ సమాప్తి యందు చెప్పబడుచున్నది. శ్రీమద్భగవద్గీత ఉపనిషత్తుల్యము - ఉపనిషత్తులతో సమానమైనది, బ్రహ్మవిద్యయని పేర్కొనబడినది. శ్రీమద్భగవద్గీత అన్ని ఉపనిషత్తుల సారము కలది - అందుచేత ఉపనిషత్తులవలె నిదియు బ్రహ్మ విద్యయే - ఎట్లంటే –

“సర్వోపనిషదో గాదో, దోగ్ధా గోపాల నందనః |

పార్థోవత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్ ||“. (గీతాధ్యానము)

ఉపనిషత్తులు, ఆవు, ఆ ఆవు పాలు పితుకువాడు భగవానుడైన శ్రీకృష్ణుడు, పెయ్యి పార్థుడు, పాలు త్రాగువాడు బుద్ధిమంతుడు, జ్ఞాని బ్రహ్మజ్ఞానమునకు అధికారి, పితికినపాలు శ్రీమద్భగవద్గీత యను అమృతము, ఉపనిషత్తుల సారము, అమృతతుల్యమైనపాలు - దానిని భగవంతుడే పితికి బ్రహ్మజ్ఞానమునకు అధికారియైనవానికి అందచేసెను. అందుచేత శ్రీమద్భగవద్గీతకూడ బ్రహ్మ విద్యయే.

  1. “బ్రహ్మ విద్యా మాయాదిశబ్దాః మాయా విశిష్ట బ్రహ్మవాచకాః - యధా గజశరీరే ప్రవిష్టస్య చైతన్యం గజ ఇతి సంజ్ఞా, తథా ప్రధమం మాయా శరీరే ప్రవిష్టస్య చైతన్యస్య మాయా శక్తిః”.

(బ్రహ్మవిద్య, మాయ, లేక విద్య, అవిద్య, యను శబ్దములు మాయతో కూడిన, అనగా, ప్రకృతితో కలిసియున్న బ్రహ్మను తెలియచేయునవి. ఏనుగు శరీరములోనున్న చైతన్యమును (భగవచ్ఛక్తిని) (చిచ్ఛక్తిని) ఏనుగు అనుచున్నాము - అట్లే మొదటిలో మాయా శరీరమును (ప్రకృతియను శరీరమును) ప్రవేశించియున్న భగవచ్ఛక్తిని - చైతన్యమును - మాయా శక్తి యని వ్యవహరించుచున్నాము - అందుచేత విద్య (బ్రహ్మవిద్య్త, బ్రహ్మజ్ఞానము) అనినను, మాయ లేక అవిద్య యనినను భగవంతుని శక్తియే)

  1. “తప ఏవ బ్రహ్మవిద్యా సాధనం.”

(తపస్సే బ్రహ్మవిద్యకు సాధనము).

  1. “బ్రహ్మవిద్యా త్పరో నాస్త్యాత్మ పరలాభవాన్ యల్లా భాన్నాపరం లాభో యత్సుఖ్సాన్నాపరం సుఖం ||”.

(బ్రహ్మవిద్యకంటె ఆత్మకు ఉత్కృష్టమైన లాభము కలుగచేయునది లేదు. దానివలన కలుగు సుఖముకంటె ఉత్కృష్టమైన సుఖము లేదు).

  1. “పార్వతీపరమా దేవీ బ్రహ్మవిద్యా ప్రదాయినీ |

విశేణైవ జంతూనాం నాత్ర సందేహ కారణం ||“. (సూతసంహితాయాం)

(బ్రహ్మ విద్యను కలుగచేయునది పార్వతీదేవి - ఇందుకు సందేహము లేదు).

  1. ఈ బ్రహ్మ విద్య ఎందుకు నేర్చుకోవలెననగా -

“పరీక్ష్యలోకాన్ కర్మచితాన్ బ్రహ్మణో నిర్వేద మాయాన్నాస్త్యకృతిః కృతేన తద్విజ్ఞానార్థం సద్గురుమేవాభిగచ్ఛేత్ సమిత్పాణిః శ్రోత్రియం బ్రహ్మనిష్టం”.

(కర్మచేత సంపాదింపబడిన - ఫలరూపములైన - లోకములను చూచి నిర్వేదమును (అసహించుకొనుట) పొందును. అందుచేత కర్మచేసినందువలన మోక్షము లేదు అని తెలుసుకొని పరబ్రహ్మను తెలుసుకొనుటకై శ్రోత్రియుడైన సద్గురువును సమిత్పాణియై బ్రహ్మవిద్యనుపదేశింపవలెనని కోరవలెను).

  1. “ఉ. అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై

చచ్చుచు బుట్టుచున్ మరల చర్విత చర్యణులైన వారికిం

జెచ్చెర బుట్టునే పరులు సెప్పిననైన నిజేచ్ఛనైన, నే

మిచ్చిననైన గానలకు నేగిననైన హరి ప్రబోధముల్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 5 - 181)

(బ్రహ్మ విద్య - బ్రహ్మజ్ఞానము - సంసారములోపడి కొట్టుకొనుపోవువారికి కలుగదు - పరమాత్మ కటాక్షము కలిగిననే బ్రహ్మ విద్య అలవడును).

Transliteration
  1. brahmaṇaḥ paramātmanaḥ vidyā brahmavidyā.

(paramātmanu telupu vidya) (parabrahmanu teliyacēyuvidya).

  1. “brahma pratipādikāṃ vēdarūpāṃ vidyāṃ”. (śrīraṃgarāmānujaḥ)

(parabrahmanu pratipādiṃcu vēdarūpamaina vidya - vēdamu parabrahmanu teliyacēyunadi)

  1. brahma tanmātrabōdhinī vidyā.

(prakṛtitōnu, dāni vikāramulatōnu kaliyaka, kēvalamu brahmamātramugānuṃḍu dānini bōdhiṃcu vidya).

  1. “yēna vidyā viśēṣēṇa akṣaraṃ satyaṃ paramapuruṣaṃ vidyāt, tat.”

(kṣīṇiṃcanivāḍu, mūḍukālamulaṃduṃḍuvāḍu ayina paramapuruṣuni teliyacēyu vidya).

  1. “yē nā kṣaraṃ puruṣaṃ vēda satyamiti viśēṣaṇāt paramātma viṣayāhi sā brahmaṇāvā agra janōkta iti brahmavidya”.

(akṣarapuruṣuḍu, trikālamulaṃduṃḍuvāḍu agu puruṣuni teliyacēyunadani ceppuṭacēta paramātma viṣayamaina vidya - paramātmayē viṣayamugā gala vidya. lēka, agrajanmuḍu - paramātmanuṃḍi modaṭa puṭṭinavāḍagu caturmukha brahma ceppinadi - vēdamu).

  1. “yēnākṣaraṃ puruṣaṃ vēda satyaṃ prōvāca, tāṃ tatvataḥ brahmavidyāṃ” iti, yēna jñānēna akṣaraṃ bhūtayōniṃ sarvajñaṃ puruṣaṃ vēda tāṃ brahma vidyāṃ yōgyāya śiṣyāya prabhrūyāt.

(satsvarūpuḍu, akṣaruḍu ayina puruṣuni guṟiṃci - brahma tatvamunu guṟiṃci yadhārthamugā ceppunadi brahmavidya. samastabhūtamulu puṭṭuṭaku kāraṇamaina sarvajñuḍaina parabrahma guṟiṃci ceppunadi brahmavidya. dānini yōgyuḍaina śiṣyunaku ceppavalenu)

  1. “sa brahmavidyāṃ sarvavidyā pratiṣṭāṃ adharvāya jyēṣṭaputrāya prāha” iti brahmavidyāṃ sarva vidyānāṃ pratiṣṭāṃ samāpti bhūmaṃ brahmavidyāṃ uvāca, brahmaṇi sarva vidyānāṃ vidyāphalānāṃ cāṃtarbāvāt brahma vidyā sarva vidyā pratiṣṭā.

(samasta vidyalu brahmavidyayaṃdē pratiṣṭiṃpabaḍiyunnavi. anni vidyalu brahmavidyatōnē samāpti ceṃdunavi. anni vidyala phalamu brahmamē - vāṭi phalamuyokka aṃtarbhāvamu brahmamē - aṃducēta brahmavidya samastamaina vidyalaku samāpti bhūmi - ākharimeṭṭu. brahma vidya telisina anni vidyalu telisinaṭlē).

  1. “adhīhi bhagavan brahmavidyāṃ variṣṭāṃ sadāsadbhissēvya mānāṃ gūḍhāṃ |

yayācirātsarvapāpaṃ vyapōhya parātparaṃ, puruṣamupaiti vidvān” (kaivalyōpaniṣat)

(ō bhagavaṃtuḍā! anniṃṭikaṃṭe śrēṣṭamainadinnī, rahasyamainadinnī, ellapuḍu satpuruṣula cēta sēviṃpabaḍunadi, upāsiṃpabaḍunadinnī, dēnini upāsiṃcinayaḍala vidvāṃsuḍainavāḍu - jñāni ayinavāḍu - śīghramugā samasta pāpamulanu pōgoṭṭukoni, divyamu parātparamu ayina puruṣuni -paramapuruṣuni - poṃdunō, aṭṭi brahmavidya nupadēśiṃpuḍu).

  1. “kasminnu bhagavō vijñātē sarvamidaṃ vijñātaṃ bhavati” iti caika vijñānēna sarva vijñāpēkṣaṇaṃ, sarvātmakē brahmaṇi vivakṣyamāṇē avakalpatē.

(dēnini telusukoninacō ī prapaṃcakamaṃtayu telusukoninaṭlagunu - anu vākyamunu baṭṭi okadānini telusukoninacō anniyu teliyanagunu anunadi ēkavijñānapratijña - parabrahmanu telusukoninacō anniyu telisinaṭlē yagunu - anniyu bhagavaṃtuḍē, aṃducēta bhagavaṃtuni telusu konina anniyu teliyunu. sṛṣṭilōni viṣayamulaku saṃbaṃdhiṃcina śāstramulanniyu sṛṣṭiki saṃbaṃdhiṃcina śāstramulōni aṃtarbhāgamulē. ī śāstramulanniṃṭivalana kalugu jñānamē brahmajñānamu - aṃducēta brahmajñānamu kaligina sarvajñānamu kalugunu. aṃducēta brahma vidyalōni bhāgamulē vidyalanniyu.brahma ī sṛṣṭi yeṭlu cēsenu? ī sṛṣṭilōni vastuvulanniyu tānē yeṭlāyenu? anu modalagu viṣayamulu telusukonuṭayē brahma vidya. brahmayanagā evaru, ekkaḍuṃḍunu, ēmi cēyucuṃḍunu? anu modalagu viṣayamulanu brahma guṟiṃci telusukonuṭa brahma vidya).

  1. “aparāṃ ṛgvēdādi lakṣaṇāṃ vidyāṃ uktvā bravīti -” adha parā yayā tadakṣaramadhi gamyatē. iti

(ṛgvēdamu modalagunavi aparāvidya. vāṭini ceppina tarvāta akṣaruḍaina parabrahmanu poṃdiṃpacēyu parāvidyanu ceppenu : ani ceppabaḍinavi. vēdamulō karmakāṃḍa ceppinatarvāta vēdamula aṃtamaṃdu (kosanu) uṃḍu upaniṣattulanu - jñānakāṃḍanu, brahmaprāpti sādhanamaina parāvidyanu ceppenu - anagā upaniṣattulu bōdhiṃcunadi brahmavidya).

  1. “brahmanu bōdhiṃci, brahmajñānamu kalugacēsi brahma prāpakamaguṭavalana śrīmadbhagavadgīta brahma vidyayē -”śrīmadbhagavadgītāsūpaniṣatsu brahmavidyayāṃ” ani prati adhyāya samāpti yaṃdu ceppabaḍucunnadi. śrīmadbhagavadgīta upaniṣattulyamu - upaniṣattulatō samānamainadi, brahmavidyayani pērkonabaḍinadi. śrīmadbhagavadgīta anni upaniṣattula sāramu kaladi - aṃducēta upaniṣattulavale nidiyu brahma vidyayē - eṭlaṃṭē –

“sarvōpaniṣadō gādō, dōgdhā gōpāla naṃdanaḥ |

pārthōvatsaḥ sudhīrbhōktā dugdhaṃ gītāmṛtaṃ mahat ||“. (gītādhyānamu)

upaniṣattulu, āvu, ā āvu pālu pitukuvāḍu bhagavānuḍaina śrīkṛṣṇuḍu, peyyi pārthuḍu, pālu trāguvāḍu buddhimaṃtuḍu, jñāni brahmajñānamunaku adhikāri, pitikinapālu śrīmadbhagavadgīta yanu amṛtamu, upaniṣattula sāramu, amṛtatulyamainapālu - dānini bhagavaṃtuḍē pitiki brahmajñānamunaku adhikāriyainavāniki aṃdacēsenu. aṃducēta śrīmadbhagavadgītakūḍa brahma vidyayē.

  1. “brahma vidyā māyādiśabdāḥ māyā viśiṣṭa brahmavācakāḥ - yadhā gajaśarīrē praviṣṭasya caitanyaṃ gaja iti saṃjñā, tathā pradhamaṃ māyā śarīrē praviṣṭasya caitanyasya māyā śaktiḥ”.

(brahmavidya, māya, lēka vidya, avidya, yanu śabdamulu māyatō kūḍina, anagā, prakṛtitō kalisiyunna brahmanu teliyacēyunavi. ēnugu śarīramulōnunna caitanyamunu (bhagavacchaktini) (cicchaktini) ēnugu anucunnāmu - aṭlē modaṭilō māyā śarīramunu (prakṛtiyanu śarīramunu) pravēśiṃciyunna bhagavacchaktini - caitanyamunu - māyā śakti yani vyavahariṃcucunnāmu - aṃducēta vidya (brahmavidyta, brahmajñānamu) aninanu, māya lēka avidya yaninanu bhagavaṃtuni śaktiyē)

  1. “tapa ēva brahmavidyā sādhanaṃ.”

(tapassē brahmavidyaku sādhanamu).

  1. “brahmavidyā tparō nāstyātma paralābhavān yallā bhānnāparaṃ lābhō yatsukhsānnāparaṃ sukhaṃ ||”.

(brahmavidyakaṃṭe ātmaku utkṛṣṭamaina lābhamu kalugacēyunadi lēdu. dānivalana kalugu sukhamukaṃṭe utkṛṣṭamaina sukhamu lēdu).

  1. “pārvatīparamā dēvī brahmavidyā pradāyinī |

viśēṇaiva jaṃtūnāṃ nātra saṃdēha kāraṇaṃ ||“. (sūtasaṃhitāyāṃ)

(brahma vidyanu kalugacēyunadi pārvatīdēvi - iṃduku saṃdēhamu lēdu).

  1. ī brahma vidya eṃduku nērcukōvalenanagā -

“parīkṣyalōkān karmacitān brahmaṇō nirvēda māyānnāstyakṛtiḥ kṛtēna tadvijñānārthaṃ sadgurumēvābhigacchēt samitpāṇiḥ śrōtriyaṃ brahmaniṣṭaṃ”.

(karmacēta saṃpādiṃpabaḍina - phalarūpamulaina - lōkamulanu cūci nirvēdamunu (asahiṃcukonuṭa) poṃdunu. aṃducēta karmacēsinaṃduvalana mōkṣamu lēdu ani telusukoni parabrahmanu telusukonuṭakai śrōtriyuḍaina sadguruvunu samitpāṇiyai brahmavidyanupadēśiṃpavalenani kōravalenu).

  1. “u. accapu cīkaṭiṃbaḍi gṛhavratulai viṣaya praviṣṭulai

caccucu buṭṭucun marala carvita caryaṇulaina vārikiṃ

jeccera buṭṭunē parulu seppinanaina nijēcchanaina, nē

miccinanaina gānalaku nēginanaina hari prabōdhamul”. (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 5 - 181)

(brahma vidya - brahmajñānamu - saṃsāramulōpaḍi koṭṭukonupōvuvāriki kalugadu - paramātma kaṭākṣamu kaliginanē brahma vidya alavaḍunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.