(బుద్ధి యనగా వస్తువుయొక్క యదార్థమును నిశ్చయించగల అంతఃకరణము యొక్క వృత్తి).
సత్వాది గుణతః త్రివిధం - సాత్విక బుద్ధిః, రాజస బుద్ధిః, తామస బుద్ధిః.
(మంచి, చెడ్డ, జిజము, అబద్దము మొదలగునవి వివేకించి నిశ్చయించు జ్ఞానముబుద్ధి. త్రిగుణములను బట్టి అది మూడు విధములు - సాత్విక బుద్ధి, రాజస బుద్ధి, తామస బుద్ధి).
(తెలుసుకొనునట్లు చేయునది బుద్ధి).
(మంచి, చెడ్డ, నిజము, అబద్దము మొదలగు వాటి గుఱించి వివేకము చేయగల శక్తి).
(సూక్ష్మవస్తువులును వాటి అర్థమునుబోధించగల అంతఃకరణము యొక్కసామర్థ్యము).
నిశ్చయాత్మికా (నిశ్చయము చేయు వృత్తి గలది)
"కార్యా కార్య వినిశ్చయః" (శ్రీ ఆనందతీర్థః)
మనసో నిరూపణ సామర్థ్యం.
(మనస్సు యొక్క నిరూపణచేయు సామర్థ్యము - శక్తి).
(మనస్సు సంకల్పించునది -; నిశ్చయము చేయునది బుద్ధి).
(వికల్పకము లేక నిశ్చయముచేయు జ్ఞానమే బుద్ధి)
"బుద్ధి శబ్దాన్మహత్తత్వమహంకారస్య కారణం"
(బుద్ధి యనగా అహంకారమునకు కారణమైన మహత్తత్త్వము - మహత్తత్త్వములోనుండి అహంకారము పుట్టినది). "అహంకార కారణం బుద్ధిః అధ్యవసాయ లక్ల్షణా" (శ్రీశంకరః)
జ్ఞానమాత్రం (జ్ఞానమాత్రమే అయినది).
ఆత్మజ్ఞానం; జ్ఞానస్వరూపమాత్ర జనన సామర్థ్యం.
(బ్రహ్మజ్ఞానము - జ్ఞానస్వరూపమును పుట్టించు సామర్థ్యము).
బుద్ధి మనస్సు కంటె సూక్ష్మమైనది, మహత్తరమైనది - అదియే ప్రత్యగాత్మ).
"భావానా మనుసంధానం యధా నిశ్చిత్య సంస్థితా |
తధైషా ప్రోచ్యతే బుద్ధిరియత్తా గ్రహణక్షమా ||". (యోగవాశిష్టము - 96 - 18)
(పదార్థముల పూర్వోత్తరముల నిశ్చయించి దాని యదార్థ స్థితిని గ్రహింపగలుగు శక్తియేబుద్ధియని చెప్పబడును)
"సీ. - - - ఎవ్వడు మనము బుద్ధీంద్రియములు దానయై గుణ సంప్రదాహంబు నెఱపు - - - ". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 8 - 3 - 85)
"బుద్ధిర్హిమన ఆదికారణ గ్రామ మాప్నోతీత్యాత్మా.ప్రత్యక్ భావేన ఇత్యర్థః".
(మనస్సు మొదలగు ఇంద్రియములకు కారణరూపమైన ప్రత్యగాత్మ స్వరూపములోనున్న ఆత్మ)
(అన్ని వ్యవహారములకు - అన్ని పనులకు - కారణమైన జ్ఞానము బుద్ధి - అంది రెండునిధములు - స్మృతి, అనుభవము - సంస్కారమువలన కలిగిన జ్ఞానము స్మృతి, దానికి వేరైనది అనుభవము - అనుభవజ్ఞానము రెండు విధములు - యథార్థము, యథార్థముకానిది)
"సర్వేషాం వ్యవహారాణాం హేతురిత్యర్థః - బుద్ధిరేవ జ్ఞానమిత్యుచ్యతే -".
(తర్క సంగ్రహములో చెప్పబడిన దాని సారాన్శమేమనగా అన్ని వ్యవహారములకు కారణమైనదే బుద్ధియని, బుద్ధియే జ్ఞానమని).
"ఇంద్రియేభ్యస్తు ప్రేరకత్వాన్మనః పరః |
మనసః పరాబుద్ధిర్నిశ్చయైక స్వరూపిణీ |
యస్తు బుద్ధేః పరస్తస్యా భాసకత్వేన చిద్వపుః ||".
(ఇంద్రియములను వాటి వాటి పనులలో ప్రేరేపించునది కనుక మనస్సు వాటికంటె ఉత్కృష్టమైనది. నిశ్చయించు స్వభావముకలదికనుక బుద్ధి మనస్సుకంటె ఉత్కృష్టమైనది. బుద్ధిని ప్రకాశింపచేయువాడు కనుక బుద్ధికంటె ఉత్కృష్టమైనవాడు భగవంతుడు).
తస్య విస్తారితా బుద్ధిః తైల బిందు రివాంభసా ||".
(దేశ సంచారము ఎవడు చేయునో, పండితులను ఎవడు సేవించునో అతని బుద్ధి నీటిలో పడిన నూనె చుక్కవలె వ్యాపించును).
(పురుషులకు చేసిన కర్మవలన ఫలము కలుగును. కర్మను అనుసరించియే బుద్ధి యుండును - కర్మఫలముననుభవింపచేయుటకే బుద్ధి పని చేయును).
(జ్ఞానము కలుగుటవలన బుద్ధి శుద్ధి యగును).
ప్రోచ్యమాన మశేషేణ పృథైక్త్వేనధనంజయ |
ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్యే భయాభయే |
బంధం మోక్షం చయోవేత్తి బుద్ధి సాపార్థ సాత్వికీ |
యయా ధర్మ మధర్మంచ కార్యం చా కార్యమేవచ |
అయధావత్ ప్రజానాతి బుద్ధిః సాపార్థ రాజసీ |
అధర్మ ధర్మమితి యామన్యతే తమసావృతా |
సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధిః సాపార్థ తామసీ ||". (శ్రీమద్భగవద్గీత - 18 - 29 - 32)
(త్రిగుణములనుబట్టి బుద్ధి మూడు విధములు - సాత్వికబుద్ధి, రాజసబుద్ధి, తామసబుద్ధి. ప్రవృత్తి మార్గము, నివృత్తిమార్గము, కార్యము, అకార్యము. భయము. అభయము, బంధము, మోక్షము - వీటిని తెలియునది సాత్వికబుద్ధి. ధర్మము, అధర్మము,కార్యము, అకార్యము - యదార్థముగాకాక అన్యముగా తెలియచేయునది రాజసబుద్ధి. అధర్మమును ధర్మమని - ఇట్లు అన్నివిషయములగుఱించి విపరీతజ్ఞానము కలుగచేయుబుద్ధి తామసబుద్ధి).
(బ్రహ్మవిద్యాసుధార్ణవము - 1)
"వ. తైజసంబువలన బుద్ధి తత్వంబు పుట్టె. దాని లక్షణంబులు ద్రవ్య ప్రకాశంబైన జ్ఞానంబును, నింద్రియానుగ్రహంబును, సంశయంబును, మిథ్యాజ్ఞానంబును, నిద్రయు, నిశ్చయంబును, స్మృతియు ననందగియుండు -". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 26 - 893)
"దధ్నః సర్పిర్యధా జాతం మధనేన సురర్షభాః |
తథా బుద్ధ్యాదయో భావా భూతేభ్యశ్చోద్భవంతి హి |
అన్నే నాప్యాయితే భుక్తే నాధీతస్తస్య భాసతే |
తతోపిబుద్ధిరన్నస్య కార్యం త్యక్త్వా వివిక్తధీః |
సర్వ సాక్షిణీ చిద్రూపే కార్యాన్నిత్య మహమ్మతిం ||'. (సూతసంహితాయాం)
(పెరుగు మధించిన నేయి (వెన్న) పుట్టినట్లు భూతములవలన బుద్ధి మొదలగు భూతములు పుట్టుచున్నవి. తినిన అన్నమును బట్టి బుద్ధి విశేషము కలుగుచున్నది. (Tell me what you eat and I shall tell what you are) అందుచేత బుద్ధి అన్నము యొక్క కార్యము - అన్నము వలన కలిగినది, అందుచేత బుద్ధి, శరీరము, అవయవములు మొదలగు అనాత్మ వస్తువులందు అహంభావము విడిచి పెట్టి, సర్వసాక్షి, చిద్రూపుడు అయిన భగవంతుని యందు "నేనే ఆ భగవంతుడు" అను 'అహం' బుద్ధి కలిగి యుండవలెను).
(పుణ్య పాపములు, వాటి ఫలములగు సుఖ దుఃఖములు, ఇతర లోకములకు పోవుట, అచ్చటనుండి తిరిగివచ్చుట - ఇది అంతయూ బుద్ధి వలననే కలుగుచున్నది - చిదాభాసుని వలన కాదు. నీటితో నిండిన కుండ తిన్నగా ఉన్నా, వంకరగా ఉన్నను, ఆ కుండను ఎవరైన తీలుకొని వెళ్ళినా, తీసుకొని వెళ్ళకపోయినా ఆ ఘటముతో సంబంధము కలిగియుండుటవలననే ఆ ఘటములోని ఆకాశము కూడా కదలుచున్నట్లు, మేఘములున్నట్లు కనుపించును. అంతేగాని స్వతహా కాదు - ఆ ప్రకారముగానే కామ కర్మలతో నిండియున్న బుద్ధి యను కుండ పుణ్యపాపములు మొదలగు అనేక విక్రియములకు ఆశ్రయమగుచున్నది. కూటస్థుడు (పరమాత్మ) ఏ విధమైన వికారములు లేనివాడు. కుండలోని జలములోకలుగు వికారములు ఘటాకాశమునకు లేనట్లు - అట్లే కూటస్థుడు అసంగుడు).
(buddhi yanagā vastuvuyokka yadārthamunu niścayiṃcagala aṃtaḥkaraṇamu yokka vṛtti).
satvādi guṇataḥ trividhaṃ - sātvika buddhiḥ, rājasa buddhiḥ, tāmasa buddhiḥ.
(maṃci, ceḍḍa, jijamu, abaddamu modalagunavi vivēkiṃci niścayiṃcu jñānamubuddhi. triguṇamulanu baṭṭi adi mūḍu vidhamulu - sātvika buddhi, rājasa buddhi, tāmasa buddhi).
(telusukonunaṭlu cēyunadi buddhi).
(maṃci, ceḍḍa, nijamu, abaddamu modalagu vāṭi guṟiṃci vivēkamu cēyagala śakti).
(sūkṣmavastuvulunu vāṭi arthamunubōdhiṃcagala aṃtaḥkaraṇamu yokkasāmarthyamu).
niścayātmikā (niścayamu cēyu vṛtti galadi)
"kāryā kārya viniścayaḥ" (śrī ānaṃdatīrthaḥ)
manasō nirūpaṇa sāmarthyaṃ.
(manassu yokka nirūpaṇacēyu sāmarthyamu - śakti).
(manassu saṃkalpiṃcunadi -; niścayamu cēyunadi buddhi).
(vikalpakamu lēka niścayamucēyu jñānamē buddhi)
"buddhi śabdānmahattatvamahaṃkārasya kāraṇaṃ"
(buddhi yanagā ahaṃkāramunaku kāraṇamaina mahattattvamu - mahattattvamulōnuṃḍi ahaṃkāramu puṭṭinadi). "ahaṃkāra kāraṇaṃ buddhiḥ adhyavasāya laklṣaṇā" (śrīśaṃkaraḥ)
jñānamātraṃ (jñānamātramē ayinadi).
ātmajñānaṃ; jñānasvarūpamātra janana sāmarthyaṃ.
(brahmajñānamu - jñānasvarūpamunu puṭṭiṃcu sāmarthyamu).
buddhi manassu kaṃṭe sūkṣmamainadi, mahattaramainadi - adiyē pratyagātma).
"bhāvānā manusaṃdhānaṃ yadhā niścitya saṃsthitā |
tadhaiṣā prōcyatē buddhiriyattā grahaṇakṣamā ||". (yōgavāśiṣṭamu - 96 - 18)
(padārthamula pūrvōttaramula niścayiṃci dāni yadārtha sthitini grahiṃpagalugu śaktiyēbuddhiyani ceppabaḍunu)
"sī. - - - evvaḍu manamu buddhīṃdriyamulu dānayai guṇa saṃpradāhaṃbu neṟapu - - - ". (śrīmadāṃdhramahābhāgavatamu - 8 - 3 - 85)
"buddhirhimana ādikāraṇa grāma māpnōtītyātmā.pratyak bhāvēna ityarthaḥ".
(manassu modalagu iṃdriyamulaku kāraṇarūpamaina pratyagātma svarūpamulōnunna ātma)
(anni vyavahāramulaku - anni panulaku - kāraṇamaina jñānamu buddhi - aṃdi reṃḍunidhamulu - smṛti, anubhavamu - saṃskāramuvalana kaligina jñānamu smṛti, dāniki vērainadi anubhavamu - anubhavajñānamu reṃḍu vidhamulu - yathārthamu, yathārthamukānidi)
"sarvēṣāṃ vyavahārāṇāṃ hēturityarthaḥ - buddhirēva jñānamityucyatē -".
(tarka saṃgrahamulō ceppabaḍina dāni sārānśamēmanagā anni vyavahāramulaku kāraṇamainadē buddhiyani, buddhiyē jñānamani).
"iṃdriyēbhyastu prērakatvānmanaḥ paraḥ |
manasaḥ parābuddhirniścayaika svarūpiṇī |
yastu buddhēḥ parastasyā bhāsakatvēna cidvapuḥ ||".
(iṃdriyamulanu vāṭi vāṭi panulalō prērēpiṃcunadi kanuka manassu vāṭikaṃṭe utkṛṣṭamainadi. niścayiṃcu svabhāvamukaladikanuka buddhi manassukaṃṭe utkṛṣṭamainadi. buddhini prakāśiṃpacēyuvāḍu kanuka buddhikaṃṭe utkṛṣṭamainavāḍu bhagavaṃtuḍu).
tasya vistāritā buddhiḥ taila biṃdu rivāṃbhasā ||".
(dēśa saṃcāramu evaḍu cēyunō, paṃḍitulanu evaḍu sēviṃcunō atani buddhi nīṭilō paḍina nūne cukkavale vyāpiṃcunu).
(puruṣulaku cēsina karmavalana phalamu kalugunu. karmanu anusariṃciyē buddhi yuṃḍunu - karmaphalamunanubhaviṃpacēyuṭakē buddhi pani cēyunu).
(jñānamu kaluguṭavalana buddhi śuddhi yagunu).
prōcyamāna maśēṣēṇa pṛthaiktvēnadhanaṃjaya |
pravṛttiṃca nivṛttiṃca kāryākāryē bhayābhayē |
baṃdhaṃ mōkṣaṃ cayōvētti buddhi sāpārtha sātvikī |
yayā dharma madharmaṃca kāryaṃ cā kāryamēvaca |
ayadhāvat prajānāti buddhiḥ sāpārtha rājasī |
adharma dharmamiti yāmanyatē tamasāvṛtā |
sarvārthān viparītāṃśca buddhiḥ sāpārtha tāmasī ||". (śrīmadbhagavadgīta - 18 - 29 - 32)
(triguṇamulanubaṭṭi buddhi mūḍu vidhamulu - sātvikabuddhi, rājasabuddhi, tāmasabuddhi. pravṛtti mārgamu, nivṛttimārgamu, kāryamu, akāryamu. bhayamu. abhayamu, baṃdhamu, mōkṣamu - vīṭini teliyunadi sātvikabuddhi. dharmamu, adharmamu,kāryamu, akāryamu - yadārthamugākāka anyamugā teliyacēyunadi rājasabuddhi. adharmamunu dharmamani - iṭlu anniviṣayamulaguṟiṃci viparītajñānamu kalugacēyubuddhi tāmasabuddhi).
(brahmavidyāsudhārṇavamu - 1)
"va. taijasaṃbuvalana buddhi tatvaṃbu puṭṭe. dāni lakṣaṇaṃbulu dravya prakāśaṃbaina jñānaṃbunu, niṃdriyānugrahaṃbunu, saṃśayaṃbunu, mithyājñānaṃbunu, nidrayu, niścayaṃbunu, smṛtiyu nanaṃdagiyuṃḍu -". (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 26 - 893)
"dadhnaḥ sarpiryadhā jātaṃ madhanēna surarṣabhāḥ |
tathā buddhyādayō bhāvā bhūtēbhyaścōdbhavaṃti hi |
annē nāpyāyitē bhuktē nādhītastasya bhāsatē |
tatōpibuddhirannasya kāryaṃ tyaktvā viviktadhīḥ |
sarva sākṣiṇī cidrūpē kāryānnitya mahammatiṃ ||'. (sūtasaṃhitāyāṃ)
(perugu madhiṃcina nēyi (venna) puṭṭinaṭlu bhūtamulavalana buddhi modalagu bhūtamulu puṭṭucunnavi. tinina annamunu baṭṭi buddhi viśēṣamu kalugucunnadi. (Tell me what you eat and I shall tell what you are) aṃducēta buddhi annamu yokka kāryamu - annamu valana kaliginadi, aṃducēta buddhi, śarīramu, avayavamulu modalagu anātma vastuvulaṃdu ahaṃbhāvamu viḍici peṭṭi, sarvasākṣi, cidrūpuḍu ayina bhagavaṃtuni yaṃdu "nēnē ā bhagavaṃtuḍu" anu 'ahaṃ' buddhi kaligi yuṃḍavalenu).
(puṇya pāpamulu, vāṭi phalamulagu sukha duḥkhamulu, itara lōkamulaku pōvuṭa, accaṭanuṃḍi tirigivaccuṭa - idi aṃtayū buddhi valananē kalugucunnadi - cidābhāsuni valana kādu. nīṭitō niṃḍina kuṃḍa tinnagā unnā, vaṃkaragā unnanu, ā kuṃḍanu evaraina tīlukoni veḷḷinā, tīsukoni veḷḷakapōyinā ā ghaṭamutō saṃbaṃdhamu kaligiyuṃḍuṭavalananē ā ghaṭamulōni ākāśamu kūḍā kadalucunnaṭlu, mēghamulunnaṭlu kanupiṃcunu. aṃtēgāni svatahā kādu - ā prakāramugānē kāma karmalatō niṃḍiyunna buddhi yanu kuṃḍa puṇyapāpamulu modalagu anēka vikriyamulaku āśrayamagucunnadi. kūṭasthuḍu (paramātma) ē vidhamaina vikāramulu lēnivāḍu. kuṃḍalōni jalamulōkalugu vikāramulu ghaṭākāśamunaku lēnaṭlu - aṭlē kūṭasthuḍu asaṃguḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.