← Back to బ · Booklets 31–40 (digitized file 4)

బుధః budhaḥ

Original — తెలుగు
  1. బుద్ధిమాన్; విద్వాన్; జ్ఞానీ; జ్ఞాతా; పండితః; విద్వాంసః; మనీషీ.

(బుద్ధిమంతుడు, విద్వాంసుడు, జ్ఞానము గలవాడు, (బ్రహ్మజ్ఞానము కలవాడు); పండితుడు).

  1. శృతి స్మృతి జ్ఞః

(శ్రుతులను, స్మృతులను - వేదములను, పురాణములను, ఇతిహాసములను తెలిసినవాడు - వాటి ద్వారా భగవత్తత్వమును తెలిసినవాడు).

  1. “వివేకీ; అవగత పరమార్థతత్వః" (శ్రీశంకరః)

(మంచి, చెడు అను వివేకముకలవాడు, ఆత్మ అనాత్మ వీటి వివేకము కలవాడు - పరమార్థమైన మోక్షమును, మోక్షరూపుడైన భగనవంతుని తత్వమును తెలిసినవాడు).

  1. "బ్రహ్మాదిద్వారాః" (గీతాభావప్రకాశము - 4 - 134)

(బ్రహ్మజ్ఞానము కలవారలలో శ్రేష్టుడు)

  1. "సద్వివేకేన జ్ఞాతతత్వాః బుధాః -". (గీతాభావప్రకాశము - 10 - 38)

(మంచి వివేకవంతుడగుటచేత తత్వమును - ఆత్మ తత్వమును తెలిసినవాడు).

  1. హేయోపాదేయ వివేకవాన్ -

(హేయము ఉపాదేయము - అను వాటిని బాగుగా తెలిసినవాడు).

  1. "దృక్ దృశ్య తత్వవిత్" (భాష్యోత్కర్ష దీపికా)

(దృశ్యమగు ప్రపంచము, దానికి దృక్ (సాక్షి) యగు పరమాత్మ - ఈ రెండింటియొక్క తత్వమును తెలిసినవాడు).

  1. అధిష్టాన సాక్షాత్కారేణ నివృత్త భ్రమః -

(ప్రపంచమంతటను, తనలోను ఉన్న పరమాత్మను సాక్షాత్కరించుటచేత భ్రమ పోగొట్టు కొనినవాడు).

  1. పరిపాకదర్శీ

(ఉత్కృష్టమైన పరబ్రహ్మ దర్శనము చేయకలిగిన వాడు - పరిపాకమును పొందిన దృష్టి కలవాడు -

  1. ప్రాప్యస్య, ప్రాప్తుశ్చ ఆత్మనః ప్రాపకస్యచ కర్మ యోగస్య అసందిగ్ధ విపరీత స్వరూపజ్ఞాః - బుధ శబ్దేన వివక్షితాః ఇతి భావః.

(పాప్యము - పొందవలసినదైన పరమాత్మ, ఆత్మ ఆత్మనుపొందింపచేయు కర్మయోగము - ఈ మూడింటిని, వాటికి సంబంధించిన అసందిగ్ధ విపరీత స్వరూపముతో సహ తెలుసుకొనినవాడు).

  1. అకించనః కామచారో నిర్ద్వందశ్ఛిన్న సంశయః |

అసక్తః సర్వభూతేషు కేవలోరమతే బుధః ||". (అష్టావక్రగీత - 18 - 87)

(అకించనుడు - ఏమియు అక్కరలేనివాడు - శీతోష్ణములు మొదలగు ద్వంద్వములు లేనివాడు, సంశయములు లేని వాడు, దేనియందును ఆసక్తి లేనివాడు -, ఒంటరిగానుండుట యందే, కేవలము పరబ్రహ్మయందే రమించువాడు బుధుడు).

  1. "యేహి సంస్పర్శ జా భోగా దుఃఖ యోనయః ఏవ తే ||

ఆద్యంతవంతః కౌంతేయ,న తేషు రమతే బుధః ||". (శ్రీమద్భగవద్గీత - 5 - 22)

(ఇంద్రియములతో స్పర్శవలన కలుగు భోగములు దుఃఖమును కలిగించునవి, కలిగి, లేకుండ పోవునవి, వాటియందు బుధుడైనవాడు - జ్ఞాని - రమించువాడు).

Transliteration
  1. buddhimān; vidvān; jñānī; jñātā; paṃḍitaḥ; vidvāṃsaḥ; manīṣī.

(buddhimaṃtuḍu, vidvāṃsuḍu, jñānamu galavāḍu, (brahmajñānamu kalavāḍu); paṃḍituḍu).

  1. śṛti smṛti jñaḥ

(śrutulanu, smṛtulanu - vēdamulanu, purāṇamulanu, itihāsamulanu telisinavāḍu - vāṭi dvārā bhagavattatvamunu telisinavāḍu).

  1. “vivēkī; avagata paramārthatatvaḥ" (śrīśaṃkaraḥ)

(maṃci, ceḍu anu vivēkamukalavāḍu, ātma anātma vīṭi vivēkamu kalavāḍu - paramārthamaina mōkṣamunu, mōkṣarūpuḍaina bhaganavaṃtuni tatvamunu telisinavāḍu).

  1. "brahmādidvārāḥ" (gītābhāvaprakāśamu - 4 - 134)

(brahmajñānamu kalavāralalō śrēṣṭuḍu)

  1. "sadvivēkēna jñātatatvāḥ budhāḥ -". (gītābhāvaprakāśamu - 10 - 38)

(maṃci vivēkavaṃtuḍaguṭacēta tatvamunu - ātma tatvamunu telisinavāḍu).

  1. hēyōpādēya vivēkavān -

(hēyamu upādēyamu - anu vāṭini bāgugā telisinavāḍu).

  1. "dṛk dṛśya tatvavit" (bhāṣyōtkarṣa dīpikā)

(dṛśyamagu prapaṃcamu, dāniki dṛk (sākṣi) yagu paramātma - ī reṃḍiṃṭiyokka tatvamunu telisinavāḍu).

  1. adhiṣṭāna sākṣātkārēṇa nivṛtta bhramaḥ -

(prapaṃcamaṃtaṭanu, tanalōnu unna paramātmanu sākṣātkariṃcuṭacēta bhrama pōgoṭṭu koninavāḍu).

  1. paripākadarśī

(utkṛṣṭamaina parabrahma darśanamu cēyakaligina vāḍu - paripākamunu poṃdina dṛṣṭi kalavāḍu -

  1. prāpyasya, prāptuśca ātmanaḥ prāpakasyaca karma yōgasya asaṃdigdha viparīta svarūpajñāḥ - budha śabdēna vivakṣitāḥ iti bhāvaḥ.

(pāpyamu - poṃdavalasinadaina paramātma, ātma ātmanupoṃdiṃpacēyu karmayōgamu - ī mūḍiṃṭini, vāṭiki saṃbaṃdhiṃcina asaṃdigdha viparīta svarūpamutō saha telusukoninavāḍu).

  1. akiṃcanaḥ kāmacārō nirdvaṃdaśchinna saṃśayaḥ |

asaktaḥ sarvabhūtēṣu kēvalōramatē budhaḥ ||". (aṣṭāvakragīta - 18 - 87)

(akiṃcanuḍu - ēmiyu akkaralēnivāḍu - śītōṣṇamulu modalagu dvaṃdvamulu lēnivāḍu, saṃśayamulu lēni vāḍu, dēniyaṃdunu āsakti lēnivāḍu -, oṃṭarigānuṃḍuṭa yaṃdē, kēvalamu parabrahmayaṃdē ramiṃcuvāḍu budhuḍu).

  1. "yēhi saṃsparśa jā bhōgā duḥkha yōnayaḥ ēva tē ||

ādyaṃtavaṃtaḥ kauṃtēya,na tēṣu ramatē budhaḥ ||". (śrīmadbhagavadgīta - 5 - 22)

(iṃdriyamulatō sparśavalana kalugu bhōgamulu duḥkhamunu kaligiṃcunavi, kaligi, lēkuṃḍa pōvunavi, vāṭiyaṃdu budhuḍainavāḍu - jñāni - ramiṃcuvāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.