← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మధుసూదనుడు madhusūdanuḍu

Original — తెలుగు
  1. మధునామానం అసురం సూదితవాన్ ఇతి మధుసూదనః - మధుం సూదయతీతి మధుసూదనః -

(మధు అను రాక్షసుని చంపినవాడుకనుక మధుసూదనుడు).

  1. మధోః సూదనః - మధుః ఇత్యుపలక్షణం, కైటభస్యాపి - మధికైటభయోః రజస్తమసోః సూదనః -

(మధువను రాక్షసుని చంపినవాడు - మధువని చెప్పుటచేత కైటభుడను రాక్షసునికూడ చెప్పినట్లే. అందుచేత మధుకైటభులను రాక్షసులను చంపినవాడు అని అర్థము చేసుకోవలెను - రజస్తమోగుణములను నశింప చేయువాడు).

  1. “శ్లో||. కర్మ మిశ్రాద్భవం చాపి మధుం నామ మహాసురం |

బ్రహ్మణోపచితం కుర్వన్ జఘాన పురుషోత్తమః |

తస్య తాతవదాదేవ దేవదానవ మానవాః |

మధుసూదన ఇత్యాహుః ఋష యశ్చ జనార్దనీం ||“.

(బ్రహ్మకు ఉపకారము చేయుటకు మధువను రాక్షసుని పురుషోత్తముడు వధించెను - కనుక జనులు జనార్థనుని మధుసూదనుడని చెప్పిరి).

  1. “మధుం సూదయతి, నాశయతి, అసురస్వభావ నాశకత్వాత్ మధుసూదనః”

(మధువను రాక్షసుని - అనగా అసుర స్వభావమును నాశముచేయువాడు) మర్దించువాడు - బ్రహ్మజ్ఞానము కలిగించి అవిద్యను - అజ్ఞానమును - నశింపచేయువాడు).

  1. వేదాద్వ సంప్రదాయ ప్రవరకః - (వేదాధ్వ సంప్రదాయమునకు ప్రవరుడైనవాడు)

  2. సర్వేషాం దేహే మధువధిష్టత్వాన్మధు రహంకారః; తమాత్మ ప్రకాశేన సూదయతి నాశయతీతి మధుసూదనః.

(అందఱి శరీరములోను తీయనైన మధువు (తేనె) వలె ఇష్టమైనది అహంకారము - ఆత్మజ్ఞానముచేత - జ్ఞానోపదేశముచేత దానిని నశింపచేయువాడు కనుక మధుసూదనుడు).

Transliteration
  1. madhunāmānaṃ asuraṃ sūditavān iti madhusūdanaḥ - madhuṃ sūdayatīti madhusūdanaḥ -

(madhu anu rākṣasuni caṃpinavāḍukanuka madhusūdanuḍu).

  1. madhōḥ sūdanaḥ - madhuḥ ityupalakṣaṇaṃ, kaiṭabhasyāpi - madhikaiṭabhayōḥ rajastamasōḥ sūdanaḥ -

(madhuvanu rākṣasuni caṃpinavāḍu - madhuvani ceppuṭacēta kaiṭabhuḍanu rākṣasunikūḍa ceppinaṭlē. aṃducēta madhukaiṭabhulanu rākṣasulanu caṃpinavāḍu ani arthamu cēsukōvalenu - rajastamōguṇamulanu naśiṃpa cēyuvāḍu).

  1. “ślō||. karma miśrādbhavaṃ cāpi madhuṃ nāma mahāsuraṃ |

brahmaṇōpacitaṃ kurvan jaghāna puruṣōttamaḥ |

tasya tātavadādēva dēvadānava mānavāḥ |

madhusūdana ityāhuḥ ṛṣa yaśca janārdanīṃ ||“.

(brahmaku upakāramu cēyuṭaku madhuvanu rākṣasuni puruṣōttamuḍu vadhiṃcenu - kanuka janulu janārthanuni madhusūdanuḍani ceppiri).

  1. “madhuṃ sūdayati, nāśayati, asurasvabhāva nāśakatvāt madhusūdanaḥ”

(madhuvanu rākṣasuni - anagā asura svabhāvamunu nāśamucēyuvāḍu) mardiṃcuvāḍu - brahmajñānamu kaligiṃci avidyanu - ajñānamunu - naśiṃpacēyuvāḍu).

  1. vēdādva saṃpradāya pravarakaḥ - (vēdādhva saṃpradāyamunaku pravaruḍainavāḍu)

  2. sarvēṣāṃ dēhē madhuvadhiṣṭatvānmadhu rahaṃkāraḥ; tamātma prakāśēna sūdayati nāśayatīti madhusūdanaḥ.

(aṃdaṟi śarīramulōnu tīyanaina madhuvu (tēne) vale iṣṭamainadi ahaṃkāramu - ātmajñānamucēta - jñānōpadēśamucēta dānini naśiṃpacēyuvāḍu kanuka madhusūdanuḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.