← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మధ్యమావాక్కు madhyamāvākku

Original — తెలుగు
  1. తదేవ శబ్దబ్రహ్మ తేనైవ వాయునా హృదయ పర్యంతమభివ్యజ్యమానం నిశ్చయాత్మ కయా బుద్ధ్యాయుక్తం విశేష స్పందరూప నాదబిందుమయీ అధిదైవం హిరణ్యగర్భరూపా మధ్యమా వాగిత్యుచ్యతే. - “పశ్చాత్పశ్యంత్యధ హృదయ గో బుద్ధి యుఙ్మధ్యమాఖ్యః”.

“ఆ బ్రహ్మంబు (శబ్ద బ్రహ్మంబు) ఆ వాయువుచేత - మూలాధారవస్థిత పవనముచేత - హృదయపర్యంత మభివ్యజ్యమానంబై, నిశ్చయాత్మక బుద్ధియుక్తంబై విశేషస్పందన స్వరూపయు, నాదబిందు మయయు, హిరణ్యగర్భాది దేవతయునై మధ్యమా వాక్కనంబడు” (కాశీఖండము - శ్రీనాధుడు)

(బ్రహ్మాండ భేదనసమయమున కలిగిన రవము (శబ్దము - శబ్ద బ్రహ్మము, శబ్దరూపమైన భగవంతుని శక్తి) జీవుల శరీరములో ప్రవేశించి అంతర్గతమై మూలాధారమునందు సూక్ష్మరూపములోనుండి, అక్కడనుండి సహస్రారమునకు ఊర్ధ్వగమనము చేయునపుడు మధ్యలో హృదయమను బుద్ధిస్థానమందు వాయువుతో కలిసి వాగ్రూపము నొందినవి. అదియే మధ్యమావాక్కుగా చెప్పబడినది).

Transliteration
  1. tadēva śabdabrahma tēnaiva vāyunā hṛdaya paryaṃtamabhivyajyamānaṃ niścayātma kayā buddhyāyuktaṃ viśēṣa spaṃdarūpa nādabiṃdumayī adhidaivaṃ hiraṇyagarbharūpā madhyamā vāgityucyatē. - “paścātpaśyaṃtyadha hṛdaya gō buddhi yuṅmadhyamākhyaḥ”.

“ā brahmaṃbu (śabda brahmaṃbu) ā vāyuvucēta - mūlādhāravasthita pavanamucēta - hṛdayaparyaṃta mabhivyajyamānaṃbai, niścayātmaka buddhiyuktaṃbai viśēṣaspaṃdana svarūpayu, nādabiṃdu mayayu, hiraṇyagarbhādi dēvatayunai madhyamā vākkanaṃbaḍu” (kāśīkhaṃḍamu - śrīnādhuḍu)

(brahmāṃḍa bhēdanasamayamuna kaligina ravamu (śabdamu - śabda brahmamu, śabdarūpamaina bhagavaṃtuni śakti) jīvula śarīramulō pravēśiṃci aṃtargatamai mūlādhāramunaṃdu sūkṣmarūpamulōnuṃḍi, akkaḍanuṃḍi sahasrāramunaku ūrdhvagamanamu cēyunapuḍu madhyalō hṛdayamanu buddhisthānamaṃdu vāyuvutō kalisi vāgrūpamu noṃdinavi. adiyē madhyamāvākkugā ceppabaḍinadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.