← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మహా వాక్యము mahā vākyamu

Original — తెలుగు
  1. జీవ బ్రహ్మైక్య ప్రతిపాదక వాక్యం మహా వాక్యం. మహా వాక్యేన అపరోక్షజ్ఞానం జాయతే. ‘అహమేహ బ్రహ్మ’ ఇతి జ్ఞానం అపరోక్షం.

(జీవుడు, పరబ్రహ్మ ఒకటే యని ప్రతిపాదించు వేదవాక్యము. మహా వాక్యము వలన అపరోక్షజ్ఞానం కలుగును - “నేనే” బ్రహ్మను అను జ్ఞానము అపరోక్షజ్ఞానము).

  1. మహా వాక్యములు నాలుగు _

(1) “ప్రజ్ఞానం బ్రహ్మ” (ఋక్శాకాంతర్గత ఐతరేయ బ్రాహ్మణ గతస్య వాక్యః). (ఋగ్వేదములోని ఐతరేయ బ్రాహ్మణము లోని చెప్పబడినవాక్యము - ‘జ్ఞానమే బ్రహ్మ’ సచ్చిదానందములోని చిత్ అనగా జ్ఞానము).

(2). “అయమాత్మా బ్రహ్మ” అధర్వణవేదగత వాక్యము - “ఈ ఆత్మయే బ్రహ్మ” అని చెప్పునది. పైన (1), (2) వలన బ్రహ్మ ఏమిటో చెప్ప బడినది).

(3) “తత్వమసి” (నీవు బ్రహ్మ అయితివి) - (ఛాందోగ్యోపనిషత్తులోని వాక్యము - జీవుడే బ్రహ్మ అని బోధించువాక్యము –

(4). ఈ బోధలవలన బ్రహ్మజ్ఞానము కలిగినతర్వాత - “అహం బ్రహ్మాస్మి” నేనే బ్రహ్మను - అయితిని - అని తనకు - జీవునకు - పరబ్రహ్మకు ఐక్యమును తెలుసుకొనినపిమ్మట కలుగు జ్ఞానము - ఇదియే వేదాంతసారము - సృష్టి రహస్యము - సృష్టి అంతటిలోను నున్న తత్వమొకటే - అదియే వేరువేరు రూపములుగాను, విధములుగాను మారుచున్నది. ఇదియే బ్రహ్మజ్ఞానము - “బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి” (బ్రహ్మజ్ఞానము కలవాడు బ్రహ్మమే యగును). (only one Energy pervades the entire creation and manifests itself in several forms).

  1. “యమే వైష వృణుతే తేన లభ్యః, తస్యైష ఆత్మా వివృతే తనూం స్వాం” (ఈ పరమాత్మ యే ముముక్షువు. నను గ్రహింపతలచునో, వాని చేతనే పొందతగినవాడు - ఆ పరమేశ్వరానుగ్రహముగల వానికే నిర్విశేష పరమాత్మజ్ఞానము కలుగును - కొండమీద పొగ కనపడినప్పుడు అక్కడ అగ్ని యున్నదని జ్ఞానము కలుగును - అగ్ని కనబడకపోయినను - ఇది అనుమాన ప్రమాణము - అగ్నిలేనిదే పొగ ఉండదుకనుక అగ్ని అక్కడ ఉన్నదను అనుమానమువలన కలిగిన జ్ఞానము - కాని ఆ అగ్నియొక్క - ఉష్ణత్వము, ప్రకాశవత్వము మొదలగు అసాధారణగుణములు ఈ అనుమాన ప్రమాణము వలన తెలియవు - అందుచేత అగ్ని అక్కడ ఉన్నదని తెలుసుకొను జ్ఞానము పరోక్షజ్ఞానము - ఆ అగ్నియున్న చోటికి వెళ్ళి దానిని ప్రత్యక్షముగా చూచుటవలన కలుగు జ్ఞానము అపరోక్షజ్ఞానము - పరబ్రహ్మను స్వయముగా స్వానుభవమువలనకాక, శాస్త్రములవలను గురుబోధవలనను కలిగినజ్ఞానము పరోక్షజ్ఞానము - బ్రహ్మ ఉన్నాడని అతనే జీవుడని, రెండింటికి భేదము లేదు అను జ్ఞానము పరోక్షజ్ఞానము - గురుబోధవలన కలిగిన జ్ఞానముతో తాను స్వయముగా జీవ బ్రహ్మల ఐక్యమును స్వానుభవము వలన తెలుసుకొనుట వలన కలిగిన జ్ఞానము – అపరోక్ష జ్ఞానము - ఇది మహా వాక్యముల అర్థమును బోధపరచుకొని అనుభవించుటవలనే కలుగునది.)
Transliteration
  1. jīva brahmaikya pratipādaka vākyaṃ mahā vākyaṃ. mahā vākyēna aparōkṣajñānaṃ jāyatē. ‘ahamēha brahma’ iti jñānaṃ aparōkṣaṃ.

(jīvuḍu, parabrahma okaṭē yani pratipādiṃcu vēdavākyamu. mahā vākyamu valana aparōkṣajñānaṃ kalugunu - “nēnē” brahmanu anu jñānamu aparōkṣajñānamu).

  1. mahā vākyamulu nālugu _

(1) “prajñānaṃ brahma” (ṛkśākāṃtargata aitarēya brāhmaṇa gatasya vākyaḥ). (ṛgvēdamulōni aitarēya brāhmaṇamu lōni ceppabaḍinavākyamu - ‘jñānamē brahma’ saccidānaṃdamulōni cit anagā jñānamu).

(2). “ayamātmā brahma” adharvaṇavēdagata vākyamu - “ī ātmayē brahma” ani ceppunadi. paina (1), (2) valana brahma ēmiṭō ceppa baḍinadi).

(3) “tatvamasi” (nīvu brahma ayitivi) - (chāṃdōgyōpaniṣattulōni vākyamu - jīvuḍē brahma ani bōdhiṃcuvākyamu –

(4). ī bōdhalavalana brahmajñānamu kaliginatarvāta - “ahaṃ brahmāsmi” nēnē brahmanu - ayitini - ani tanaku - jīvunaku - parabrahmaku aikyamunu telusukoninapimmaṭa kalugu jñānamu - idiyē vēdāṃtasāramu - sṛṣṭi rahasyamu - sṛṣṭi aṃtaṭilōnu nunna tatvamokaṭē - adiyē vēruvēru rūpamulugānu, vidhamulugānu mārucunnadi. idiyē brahmajñānamu - “brahmavid brahmaiva bhavati” (brahmajñānamu kalavāḍu brahmamē yagunu). (only one Energy pervades the entire creation and manifests itself in several forms).

  1. “yamē vaiṣa vṛṇutē tēna labhyaḥ, tasyaiṣa ātmā vivṛtē tanūṃ svāṃ” (ī paramātma yē mumukṣuvu. nanu grahiṃpatalacunō, vāni cētanē poṃdataginavāḍu - ā paramēśvarānugrahamugala vānikē nirviśēṣa paramātmajñānamu kalugunu - koṃḍamīda poga kanapaḍinappuḍu akkaḍa agni yunnadani jñānamu kalugunu - agni kanabaḍakapōyinanu - idi anumāna pramāṇamu - agnilēnidē poga uṃḍadukanuka agni akkaḍa unnadanu anumānamuvalana kaligina jñānamu - kāni ā agniyokka - uṣṇatvamu, prakāśavatvamu modalagu asādhāraṇaguṇamulu ī anumāna pramāṇamu valana teliyavu - aṃducēta agni akkaḍa unnadani telusukonu jñānamu parōkṣajñānamu - ā agniyunna cōṭiki veḷḷi dānini pratyakṣamugā cūcuṭavalana kalugu jñānamu aparōkṣajñānamu - parabrahmanu svayamugā svānubhavamuvalanakāka, śāstramulavalanu gurubōdhavalananu kaliginajñānamu parōkṣajñānamu - brahma unnāḍani atanē jīvuḍani, reṃḍiṃṭiki bhēdamu lēdu anu jñānamu parōkṣajñānamu - gurubōdhavalana kaligina jñānamutō tānu svayamugā jīva brahmala aikyamunu svānubhavamu valana telusukonuṭa valana kaligina jñānamu – aparōkṣa jñānamu - idi mahā vākyamula arthamunu bōdhaparacukoni anubhaviṃcuṭavalanē kalugunadi.)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.