(పూజింపబడునది; పూజింపతగినది; తేజస్సు, లేక తేజోరూపము. అన్నింటికంటె అతిశయించి ఉండునది - అన్నింటికంటె గొప్పది, పెద్దది - “మతిరేవ బలాద్గరీ యసీ యద భావేనమహిం మహీయతే”. (బలముకంటె బుద్ధియే గొప్పది - బుద్ధిలేనిచో భూమిమీద గొప్పవాడవలేడు) (పూజ్యుడు కాలేడు).
(విష్ణువుకు సంబంధించిన తేజస్సు - భగవంతుడు తేజోరూపుడు - తేజోరూపుడగుటచేత చైతన్యము కలుగచేయువాడు - తేజః తేజస్వి నామహం (తేజస్సుగలవాటిలోని తేజస్సు నేనే).
(చైతన్యరూపము, తేజోరూపము - చిద్ఘనం; అతనిలో ఉన్నదంతయు తేజస్సే యగుటచేత ఈ కనబడు ప్రపంచములోని ఏ వస్తువైనను అతనిలో లేదు)
(మహః అనగా పూజింపతగినదని అర్థము - అన్నింటికంటె ఉత్కృష్టమైన వాడగుటచేత పూజింపబడువాడు అగుటచేత భగవంతుడు పూజింపతగినవాడు).
(భగవంతుడు పూజింపబడుచున్నాడు కనుక ‘మహః’ అని మహచ్ఛబ్ద మునకు వ్యుత్పత్యర్థము).
(“ఓంభూః, ఓం భువః ఓం సువః” అను వ్యాహృతులుమూడింటి తర్వాత నాలుగవ వ్యాహృతి “ఓం మహః” అనుదానిని చమనుడను మహా ఋషి చెప్పెను. నిరతిశయ మహత్వము కలిగియుండుటచేత ‘మహః’ అని చెప్పబడినది. మహః అను మాటచేత పరమాత్మయే, పరబ్రహ్మయే చెప్పబడినది).
(‘మహః’ అనునది వ్యాహృతులలో నాలుగవది. (ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః అనునవి నాలుగు వ్యాహృతులు). ఈ నాలుగవ వ్యాహృతి అయిన ‘మహః’ ను మహాచమస్సుడు కనిపెట్టెను - మహత్ అనగా బ్రహ్మ, ‘మహ’ అను వ్యాహృతి ఆత్మ).
(మహః అనువ్యాహృతియందు అంగములు (అంగములు) గల బ్రహ్మయని భావించ వలెను - పాదములు మొదలగునవి అంగములని చెప్పబడినవి, మధ్యభాగము ‘అంగి’ (అంగములు కలది - అవయవములు కలది) ఆత్మయని చెప్పబడినట్లు - ఆ ప్రకారముగానే మహః అను వ్యాహృతి హిరణ్యగర్భునియొక్క మధ్యభాగము, ఆత్మ, యని కల్పించబడినది - ఊహించబడినది. మిగిలిన వ్యాహృతులు - భూః, భువః, సువః - పాదములు మొదలగు అవయవములని కల్పన చేయబడినది - అనగా, ప్రధమ వ్యాహృతి పాదము, రెండవ వ్యాహృతి బాహువులు, మూడవ వ్యాహృతి శిరస్సు అని యర్థము).
(నిరతిశయ మహాత్మ్యముగల పురుషుడు - పరబ్రహ్మ)
(pūjiṃpabaḍunadi; pūjiṃpataginadi; tējassu, lēka tējōrūpamu. anniṃṭikaṃṭe atiśayiṃci uṃḍunadi - anniṃṭikaṃṭe goppadi, peddadi - “matirēva balādgarī yasī yada bhāvēnamahiṃ mahīyatē”. (balamukaṃṭe buddhiyē goppadi - buddhilēnicō bhūmimīda goppavāḍavalēḍu) (pūjyuḍu kālēḍu).
(viṣṇuvuku saṃbaṃdhiṃcina tējassu - bhagavaṃtuḍu tējōrūpuḍu - tējōrūpuḍaguṭacēta caitanyamu kalugacēyuvāḍu - tējaḥ tējasvi nāmahaṃ (tējassugalavāṭilōni tējassu nēnē).
(caitanyarūpamu, tējōrūpamu - cidghanaṃ; atanilō unnadaṃtayu tējassē yaguṭacēta ī kanabaḍu prapaṃcamulōni ē vastuvainanu atanilō lēdu)
(mahaḥ anagā pūjiṃpataginadani arthamu - anniṃṭikaṃṭe utkṛṣṭamaina vāḍaguṭacēta pūjiṃpabaḍuvāḍu aguṭacēta bhagavaṃtuḍu pūjiṃpataginavāḍu).
(bhagavaṃtuḍu pūjiṃpabaḍucunnāḍu kanuka ‘mahaḥ’ ani mahacchabda munaku vyutpatyarthamu).
(“ōṃbhūḥ, ōṃ bhuvaḥ ōṃ suvaḥ” anu vyāhṛtulumūḍiṃṭi tarvāta nālugava vyāhṛti “ōṃ mahaḥ” anudānini camanuḍanu mahā ṛṣi ceppenu. niratiśaya mahatvamu kaligiyuṃḍuṭacēta ‘mahaḥ’ ani ceppabaḍinadi. mahaḥ anu māṭacēta paramātmayē, parabrahmayē ceppabaḍinadi).
(‘mahaḥ’ anunadi vyāhṛtulalō nālugavadi. (ōṃ bhūḥ, ōṃ bhuvaḥ, ōṃ suvaḥ, ōṃ mahaḥ anunavi nālugu vyāhṛtulu). ī nālugava vyāhṛti ayina ‘mahaḥ’ nu mahācamassuḍu kanipeṭṭenu - mahat anagā brahma, ‘maha’ anu vyāhṛti ātma).
(mahaḥ anuvyāhṛtiyaṃdu aṃgamulu (aṃgamulu) gala brahmayani bhāviṃca valenu - pādamulu modalagunavi aṃgamulani ceppabaḍinavi, madhyabhāgamu ‘aṃgi’ (aṃgamulu kaladi - avayavamulu kaladi) ātmayani ceppabaḍinaṭlu - ā prakāramugānē mahaḥ anu vyāhṛti hiraṇyagarbhuniyokka madhyabhāgamu, ātma, yani kalpiṃcabaḍinadi - ūhiṃcabaḍinadi. migilina vyāhṛtulu - bhūḥ, bhuvaḥ, suvaḥ - pādamulu modalagu avayavamulani kalpana cēyabaḍinadi - anagā, pradhama vyāhṛti pādamu, reṃḍava vyāhṛti bāhuvulu, mūḍava vyāhṛti śirassu ani yarthamu).
(niratiśaya mahātmyamugala puruṣuḍu - parabrahma)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.