← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మహానర్థము mahānarthamu

Original — తెలుగు

“సర్వప్రపంచకారిణీ భూతాజ్ఞానం తత్కార్య దృశ్యజాతం సర్వం ద్వైతంచ జననమరణ ప్రబంధరూపాఖిల నిదానత్వాత్ మహానర్థః ఇతి శ్రుతి స్మృతి పురాణేతిహాసానభవాది సకల ప్రమాణ సిద్ధం. ఈ దృశానర్థ నివృత్తిః పరమానందా వాప్తిశ్చ మోక్షః ఇత్యుచ్యతే”. (విచారసాగరము)

(సమస్త ప్రపంచమునకు కారణమైనది - ప్రపంచము పుట్టుటకు కారణమైనది) - అజ్ఞానము - దాని కార్యమే ఈ దృశ్యప్రపంచము - కనబడుచున్నదంతయు. ఇది ద్వైతము. భగవంతుడు వేఱు, ఈ కనబడుచున్న ప్రపంచము వేఱు అను ఈ ద్వైత భావము, జననమరణములు కలుగుచుండుట చూచి (ప్రతి వస్తువు పుట్టుచు, లేకుండపోవుట చూచి) ఇదియే మహానర్థము అనుట శ్రుతులలోను, స్మృతులలోను, ఇతిహాసములలోను, పురాణములలోను, చెప్పబ డియున్నది. కనుక దానికి అదియే ప్రమాణము - ఈ మహానర్థము నివృత్తియగుట - పరమానందము, (జననమరణములు లేకుండు స్థితి) కలుగుటయే మోక్షము).

Transliteration

“sarvaprapaṃcakāriṇī bhūtājñānaṃ tatkārya dṛśyajātaṃ sarvaṃ dvaitaṃca jananamaraṇa prabaṃdharūpākhila nidānatvāt mahānarthaḥ iti śruti smṛti purāṇētihāsānabhavādi sakala pramāṇa siddhaṃ. ī dṛśānartha nivṛttiḥ paramānaṃdā vāptiśca mōkṣaḥ ityucyatē”. (vicārasāgaramu)

(samasta prapaṃcamunaku kāraṇamainadi - prapaṃcamu puṭṭuṭaku kāraṇamainadi) - ajñānamu - dāni kāryamē ī dṛśyaprapaṃcamu - kanabaḍucunnadaṃtayu. idi dvaitamu. bhagavaṃtuḍu vēṟu, ī kanabaḍucunna prapaṃcamu vēṟu anu ī dvaita bhāvamu, jananamaraṇamulu kalugucuṃḍuṭa cūci (prati vastuvu puṭṭucu, lēkuṃḍapōvuṭa cūci) idiyē mahānarthamu anuṭa śrutulalōnu, smṛtulalōnu, itihāsamulalōnu, purāṇamulalōnu, ceppaba ḍiyunnadi. kanuka dāniki adiyē pramāṇamu - ī mahānarthamu nivṛttiyaguṭa - paramānaṃdamu, (jananamaraṇamulu lēkuṃḍu sthiti) kaluguṭayē mōkṣamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.