← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మహాపురుషః mahāpuruṣaḥ

Original — తెలుగు
  1. పంచోప నిషన్మయం బయిన భవదీయ దివ్య మంగళ మహావిగ్రహ పరిగ్రహంబు సేయునెడ, నాభియందాకాశంబును, ముఖంబునం గృశానుండును, శిరంబున స్వర్గంబును, శ్రోత్రంబుల దిశలును, నేత్రంబుల సూర్యుండును, మనంబున జంద్రుండును, బాదంబుల వసుంధరయు, నాత్మయందహంకారంబును, జఠరంబున జలధులును, రేతంబున నంబువులును, భుజంబుల నింద్రుండును, రోమంబుల మేఘమహారుహౌషధి వ్రాతంబులును, శిరోజంబుల బ్రహ్మలును, జ్ఞానంబున సృష్టియు నవాంతర ప్రజాపతులును, హృదయంబున ధర్మంబును గలిగి మహాపురుషుండవై లోక కల్పనంబుకొఱకు నీయ కుంఠిత తేజంబు గుప్తంబుసేసి జగదుద్భవంబు కొఱకు గైకొన్న భవదీయ దివ్యావతార వైభవం బెఱింగి నుతింప నెంతవారము. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - ఉ. భా. - 441)

  2. మహాజనస్య సంపర్కః కస్యనోన్నతి కారకః.

(మహాపురుషుల సంపర్కము ఎవని ఉన్నతికి - అభివృద్ధికి - కారణము కాదు ? -).

Transliteration
  1. paṃcōpa niṣanmayaṃ bayina bhavadīya divya maṃgaḷa mahāvigraha parigrahaṃbu sēyuneḍa, nābhiyaṃdākāśaṃbunu, mukhaṃbunaṃ gṛśānuṃḍunu, śiraṃbuna svargaṃbunu, śrōtraṃbula diśalunu, nētraṃbula sūryuṃḍunu, manaṃbuna jaṃdruṃḍunu, bādaṃbula vasuṃdharayu, nātmayaṃdahaṃkāraṃbunu, jaṭharaṃbuna jaladhulunu, rētaṃbuna naṃbuvulunu, bhujaṃbula niṃdruṃḍunu, rōmaṃbula mēghamahāruhauṣadhi vrātaṃbulunu, śirōjaṃbula brahmalunu, jñānaṃbuna sṛṣṭiyu navāṃtara prajāpatulunu, hṛdayaṃbuna dharmaṃbunu galigi mahāpuruṣuṃḍavai lōka kalpanaṃbukoṟaku nīya kuṃṭhita tējaṃbu guptaṃbusēsi jagadudbhavaṃbu koṟaku gaikonna bhavadīya divyāvatāra vaibhavaṃ beṟiṃgi nutiṃpa neṃtavāramu. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - u. bhā. - 441)

  2. mahājanasya saṃparkaḥ kasyanōnnati kārakaḥ.

(mahāpuruṣula saṃparkamu evani unnatiki - abhivṛddhiki - kāraṇamu kādu ? -).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.