← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మహర్షులు maharṣulu

Original — తెలుగు
  1. మహా ఋషులు -

  2. “మహాంశ్చాసౌ ఋషిశ్చ ఇతి మహర్షిః - సర్వజ్ఞః ఇత్యర్థః; కృత్స్నస్య వేదస్య దర్శనాత్, అన్యేతు వేదైక దేశదర్శనాత్ ఋషయః” (శ్రీశంకరః).

(పూజనీయుడైన ఋషి - ఋషులలో పూజనీయుడు, లేక ఉత్కృష్టుడైనవాడు కనుక మహా ఋషి. సర్వమును, అంతను తెలిసినవాడు. ఋషి యనగా ఏదో ఒక వేదభాగమును - (మంత్రమును) దర్శించినవాడు - మంత్రద్రష్టా. వేదమంతయును దర్శించినవాడు - మహా ఋషి - అందుచేత సర్వజ్ఞుడు)

  1. మహాంశ్చాసౌ ఋషిశ్చ మహర్షిః - నిరతిశయ మహత్వేన, సర్వజ్ఞాత్వాత్.

(మహత్తుగలవాడు, లేక, ఉత్కృష్టుడు, మఱియు ఋషి అయినవాడు - గొప్ప మహత్వము కలిగియుండుటచేతను, సర్వజ్ఞుడగుటవలనను మహా ఋషి)

  1. మహాద్రష్టా - సర్వార్థ సాధన దృష్టిః - సర్వజ్ఞః ఇత్యర్థః -

(సర్వార్థసాధనుంలందును దృష్టికలవాడు - త్రికాలవేది).

  1. “వేద వేదార్థ ద్రష్టారః సర్వజ్ఞః యే మహర్షయః” (గీతాభావప్రకాశము - 10 - 26)

(వేదములను, వేదములోనీర్థములను గ్రహించినవారు - సర్వజ్ఞులు - మంత్ర ద్రష్టలు)

  1. “అహమాదిర్షి దేవానాం మహర్షీణాం చ సర్వశః”-

(దేవతులకు మహర్షులకు ముందునుండియున్నవాడను నేను - వారు పుట్టుటకు కారణమైనవాడను నేను - (శ్రీమద్భగవద్గీత - 10 - 2)

  1. “మహర్షయ స్సప్తపూర్వే - - - |మద్భావా, మానసా జాతాః ఏషాం లో ఇమాః ప్రజాః”. (శ్రీమద్భగవద్గీత - 10 - 6)

(సృష్టి ప్రారంభములో సప్తమహా ఋషులు - - - నా భావములు - భగవంతుని భావములు - (అంశలు, కళలు) బ్రహ్మమానస పుత్రులు - అనగా బ్రహ్మ మనసులో తలచినంతమాత్రమున పుట్టినవారు).

Transliteration
  1. mahā ṛṣulu -

  2. “mahāṃścāsau ṛṣiśca iti maharṣiḥ - sarvajñaḥ ityarthaḥ; kṛtsnasya vēdasya darśanāt, anyētu vēdaika dēśadarśanāt ṛṣayaḥ” (śrīśaṃkaraḥ).

(pūjanīyuḍaina ṛṣi - ṛṣulalō pūjanīyuḍu, lēka utkṛṣṭuḍainavāḍu kanuka mahā ṛṣi. sarvamunu, aṃtanu telisinavāḍu. ṛṣi yanagā ēdō oka vēdabhāgamunu - (maṃtramunu) darśiṃcinavāḍu - maṃtradraṣṭā. vēdamaṃtayunu darśiṃcinavāḍu - mahā ṛṣi - aṃducēta sarvajñuḍu)

  1. mahāṃścāsau ṛṣiśca maharṣiḥ - niratiśaya mahatvēna, sarvajñātvāt.

(mahattugalavāḍu, lēka, utkṛṣṭuḍu, maṟiyu ṛṣi ayinavāḍu - goppa mahatvamu kaligiyuṃḍuṭacētanu, sarvajñuḍaguṭavalananu mahā ṛṣi)

  1. mahādraṣṭā - sarvārtha sādhana dṛṣṭiḥ - sarvajñaḥ ityarthaḥ -

(sarvārthasādhanuṃlaṃdunu dṛṣṭikalavāḍu - trikālavēdi).

  1. “vēda vēdārtha draṣṭāraḥ sarvajñaḥ yē maharṣayaḥ” (gītābhāvaprakāśamu - 10 - 26)

(vēdamulanu, vēdamulōnīrthamulanu grahiṃcinavāru - sarvajñulu - maṃtra draṣṭalu)

  1. “ahamādirṣi dēvānāṃ maharṣīṇāṃ ca sarvaśaḥ”-

(dēvatulaku maharṣulaku muṃdunuṃḍiyunnavāḍanu nēnu - vāru puṭṭuṭaku kāraṇamainavāḍanu nēnu - (śrīmadbhagavadgīta - 10 - 2)

  1. “maharṣaya ssaptapūrvē - - - |madbhāvā, mānasā jātāḥ ēṣāṃ lō imāḥ prajāḥ”. (śrīmadbhagavadgīta - 10 - 6)

(sṛṣṭi prāraṃbhamulō saptamahā ṛṣulu - - - nā bhāvamulu - bhagavaṃtuni bhāvamulu - (aṃśalu, kaḷalu) brahmamānasa putrulu - anagā brahma manasulō talacinaṃtamātramuna puṭṭinavāru).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.