← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మహాత్ములు mahātmulu

Original — తెలుగు
  1. “మహా మనాః” (శ్రీరామానుజః)

(గొప్ప మనస్సు కలవారు).

  1. మహాన్ ఆత్మా యస్య సః, నిగ్రహానుగ్రహ సమర్థః -

(గొప్ప ఆత్మ గలవాడు, నిగ్రహించుటకు, అనుగ్రహించుటకు - (శిక్షుంచుటకు, రక్షించుటకు) సమర్థుడైనవాడు).

  1. మహా నాత్మా అస్యేతి మహాత్మా, మహాకాశీ స్థానీయ పరమాత్మ రూపత్వాత్ -

(గొప్ప ఆత్మ గలవాడు - మహాకాశస్థానములలోనుండు పరమాత్మ రూపమగుటచేత మహాత్మ).

  1. మహానికంపాయుక్త ఆత్మా మనో యస్య సః

(గొప్ప దయతో కూడిన మనస్సు గలవాడు).

  1. పరమ కారుణికః, కృపాలుః - (గొప్ప దయగలవాడు).

  2. కరుణ్యాది గుణగణానరః -

(కారుణ్యము - దయ - మొదలగు గుణములకు ఆకారమైనవాడు).

  1. ఉదార చిత్తః - (ఉదారమైన మనస్సు గలవాడు).

  2. అక్షుద్ర బుద్ధిః - అక్షుద్ర స్వచ్భావఃం అక్షుద్ర చిత్తః -

(క్షుద్రముకాని బుద్ధికలవాడు, క్షుద్రముకాని స్వభావము కలవాడు)

  1. “పూర్ణశ్చ అసౌ ఆత్మా చ ఇతి మహాత్మా –”. (శ్రీ ఆనందతీర్థః)

(పూర్ణుడైనవాడు - ప్రపంచములో పూర్తిగా నిండియుండువాడు, ఆత్మకూడ తానే అయినవాడు).

  1. మహాంశ్చా సౌ ఆత్మా మహాత్మా, సర్వవ్యాపీ ఇత్యర్థః, అపరిచ్ఛిన్న దృష్టిః - మహానుభావః -

(గొప్ప ఆత్మ అయినవాడు; అన్నింటిలోను, అనతాను వ్యాపించియుండువాడు - పరిమితిలేని దృష్టికలవాడు - సర్వసాక్షి – మహానుభావుడు).

  1. అపరిచ్ఛిన్న స్వరూపః, సర్వజ్ఞః -

(పరిమితిలేని - అంతులేని స్వరూపము కలవాడు - సర్వమును తెలిసినవాడు).

“అపరిచ్ఛిన్నత్వంబువలన మహాత్ముండవయ్యును -” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ. భా. - 682)

(అసంఖ్యాకమైన వస్తువులలో తాను - ఒక్కడే అయినను - ఆత్మగా యుండుటవలన మహాత్ముడు).

  1. మహాన్ పరం ఆత్మా - (ఉత్కృష్టమైన గొప్ప ఆత్మ).

  2. నన్య సామాన్య స్వభావః.

(ఇతరులకు సామాన్యముగానుండని స్వభావము గలవాడు).

  1. “శుద్ధ సత్వా మహాత్మానో జాత సమ్యగ్ధియో బుధాః” (గీతాభావప్రకాశము - 8 - 96)

(శుద్ధమైన సత్వగుణము గలవారు - సమ్యక్ జ్ఞానము కలవారు పండితులు, జ్ఞానులు).

  1. సత్య సంకల్పః

(తిరుగులేని సంకల్పము కలవాడు - సంకల్పించినది చేసి తీరువాడు - చేయకలుగువాడు - “స అకామయత -” అతను - ఆ భగవంతుడు - సంకల్పించెను - నేను ఒక్కడిని అయినను అనేక వస్తువులుగా అయ్యెదను - అనేక వస్తువులను సృష్టించెదను).

  1. “స్వకృతైః పుణ్య సంచయైః విద్వస్తసమస్త పాప బంధాః, దైవీం ప్రకృతిమాశ్రితాః, మహాత్మానః” (శ్రీమాన్ రామానుజః)

(తాము చేసిన అనేక పుణ్యకర్మలవలన సమస్తమైన పాపముల బంధమునుండి విముక్తులయిన వారు).

  1. మహా ధైర్యః - (గొప్ప ధైర్యము గలవాడు)

  2. “బహు జన్మార్జితైః పుణ్యై రేషాం ధీస్సంస్కృతా భవేత్ |

కామైరనభి భూతాస్తే మహాత్మానో గుణా కరాః ||“. (గీతాభావప్రకాశము - 8 - 96)

(అనేక జన్మలలో ఆర్జించిన పుణ్యములవలన సంస్కృతమైన బుద్ధి - జ్ఞానము - కలవారు).

  1. మహాత్మ శబ్దస్య గంభెర బుద్ధి విశేషవత్సు ప్రసిద్ధత్వాత్ -

(గంభీరమైన బుద్ధి విశేషము గలవారియందు మహాత్మ శబ్దము ప్రసిద్ధి పొందినది) (అందుచేత అటువంటి బుద్ధి విశేషము గలవారు మహాత్ములు).

  1. మహాత్మ శబ్దేన సర్వాశాయి పరమైశ్వర్యాదికం వివక్షితం - మహానాత్మా ఇతి పరమాత్మత్వం వా.

(మహాత్మ అనగా అన్నింటిని అతిశతించియుండు పరమైశ్వర్యము మొదలగు కలిగియుండుట - గొప్ప ఆత్మ అయి ఉండుట - పరమాత్మ, పరబ్రహ్మ అన్నమాట).

  1. “అహోమహత్వం మహతామ పూర్వం విపత్తి కాలేపి పరోపకారః |

యథాస్య మధ్యే పతితో హి రాహాః కళానిధిః పుణ్యచయం దదాతి||“.

(మహాత్ములయొక్క మహాత్మ్యము - గొప్పతనము - ఎంత గొప్పదో - వారికి ఆపత్కాలము సంభవించినను ఇతరులకుపకారమే చేయుదురు - రాహు గ్రస్తమైనను (చంద్రగ్రహణమైనను) చంద్రుడు ఆనాడు పుణ్యముల నిచ్చు చున్నాడు - చంద్రగ్రహణ దినము పుణ్యదినము - ఆనాడు చేసిన సత్కర్మలకు ఫలమెక్కువగా నుండును).

  1. “సూర్య ఇవ అనీచ జన మహాజన పర్యంతం సర్వత్ర పక్షపాతం వినా సమ బుద్ధిత్వం మహాత్మనాం మాహత్మ్యం.”

(సూర్యునివలె నీచజన్మకలవారు మొదలు మహాజనులవఱకుగల అందఱిలోను అంతట పక్షపాతములేక సమానమైన బుద్ధికలిగి యుండుటే మహాత్ములయొక్కమహాత్మ్యము).

  1. “మహాత్మాత్యంత శుద్ధాంతరాత్మనా బ్రహ్మత్వ తత్వదృక్” (గీతాభావప్రకాశము - 7 - 124)

(మిక్కిలి శుద్ధమైన అంతఃకరణము కలిగియుండుటవలన మహాత్ముడైన వాడు భగవత్తత్వమును దర్శించినవాడు - బ్రహ్మసాక్షాత్కారమును పొందినవాడు).

  1. సర్వేషాం ప్రత్యగాత్మా - (అందఱిలోనుండు ప్రత్యగాత్మ).

  2. “మహాత్ములైనవారి మహాత్మ్యమాత్మగర్వమునజేసి |

జడులు పొడగాన జాలరు, జలజ నేత్ర ||“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 4 - 69)

  1. “మహత్మానస్తు మాం పార్థ దేవీం ప్రకౄతిమాశ్రితాః |

భజంతనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం ||“. (శ్రీమద్భగవద్గీత - 9 -13)

“బహు జన్మార్జితైః పుణ్యై రేషాం ధీస్సంస్కృతా భవేత్ |

కామైరనభి భూతాస్తే మహాత్మానో గుణాకరాః |

అభయం సత్వ సంశుద్ధిరిత్యాది ప్రకృతిం స్థితాః |

అత ఏవ న చాన్యస్మిన్మనో యేషాం హి గోచరే |

తేమాం సర్వజగద్ధేతు మువినాశినమీశ్వరం |

జ్ఞాత్వా చార్యోపదిష్టేన సేవంతే వైదికాధ్వనా ||“.

(అనేక జన్మలందార్జించిన పుణ్యములచేత సంస్కృతమైన - సంస్కారము పొందిన - బుద్ధిచేత కామములను వదలినవారై, మంచి గుణములకు నెలవైనవారు మహాత్ములు. అభయము, శుద్ధసత్వగుణము మొదలగునవిగల దైవీ ప్రకృతిని అవలంభించినవారు. అందుచేత భగవంతుని కంటె ఇతరమైన దానియందు మనస్సును నిలపనివారు. అట్టివారు గురువుల ఉపదేశమువలన నిత్యుడు - నాశము లేనివాడు - జగత్తునకంతటికి కారణమైనవాడు, ఈశ్వరుడు అని నన్ను తెలుసుకొని వేదమార్గములో - వేదముచే నిర్ణయింపబడిన విధముగా - సేవించుచున్నారు).

  1. “మహాత్ములెవ్వరనిన శతృమిత్ర వివేకంబు లేక సమచిత్తులును, శాంతు లును, గ్రోధరహితులును, సకల భూతదయాపరులును, సాధువులును నగువారలు మహాత్ములనందగుదురు - అట్టి మహాత్ములు నాయందలి స్నేహంబె ప్రయో జనంబుగా గలిగియుండుటంజేసి, విషయవార్తా ప్రవృతులగు కుజనులందు దమదేహ గృహమిత్ర దారాత్మ జాతులందు బ్రీతి లేక యుండుదురు”

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 5 - 1 - 5 - 68)

  1. “రహ గణైతత్తపసా నయాతి న చే జ్యయా నిర్వణాత్ గృహాద్వా |

న ఛందసా నైవ జలాగ్ని సూర్యైర్వినా మహత్థాదర జో(అ)భిషేకం ||“. (శ్రీమద్భాగవతం - 5 - 1 - 12 - 12)

పై విషయము శ్రీమదాంధ్రమహాభాగవతంలో ఈ క్రింద విధముగా చెప్పబడినది : -

“సీ. ధరలోన బ్రహ్మంబు దపమున దానంబులను గృహధర్మంబులను, జలాగ్ని

సోమ సూర్యులచేత శ్రుతులచేనైనను బరమ భాగవతుల పాదసేవ

బొందిన మాడ్కిని బొందంగరాదని పలుకుదురార్యులు బరమ మునులు - - -” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 5 - 1 - 12 - 160)

  1. “మహాపాతక యుక్తావా బోపపాతకైః |

పరం పదం ప్రయాంత్యేవ మహద్భిరవలోకితాః |

కలేబరం హి తద్భస్మ తద్ధూమం వాపి సత్తమ |

యది పశ్యతి పుణ్యాత్మా స ప్రయాతి పరాం గతిం ||“. (నారద పురాణము - పూర్వ - 7 - 74, 75)

(పంచమహాపాతకములు చేసినవారైనను, ఉపపాతకములను చేసినవారైనను మహాత్ములు వారిని చూచినయడల, లేక. మహాత్ముల కళేబరముకాని, వారి భస్మముకాని, పొగగాని, వారు చూచినను, వారు పరమగతిని - పరమపదమును - వైకుంఠమును పొందుదురు).

  1. “మహాతామేవ సంపర్కాత్ పునర్దుఃఖం న బాధతే |

కోటి దీపశిఖ హస్త స్తమసా పరిభూయతే ||“. (యోగవాశిష్టము)

(మహాత్ముల సంపర్కమువలన జీవునకు దుఃఖమువలన బధ కలుగును - చేతిలో దీపమున్నవానికి చీకటివలన బాధలేదు).

  1. “మనస్యేకం వచస్యేకం కర్మణ్యకం మహాత్మనాం |

మనస్యన్యం వచస్యన్యం కర్మణ్యన్యం దురాత్మనాం ||”

(మహాత్ములు మనసులో తలచినట్లే మాటలాడుదురు, మాటలాడునట్లే కర్మలు చేయుదురు - వారి మనోవాక్కర్మములు ఒకే రీతిగ నుండును - దురాత్ములు (దుర్మార్గులు) తలచినదొకటి, పలికినదొకటి, చేసినదింకొకటి).

  1. “క. ఊరకరారు మహాత్ములు

వారధముల ఇండ్ల కడకు వచ్చుట లెల్లం

గారణము మంగళములకు

నీ రాక శుభంబు మాకు నిజము మహాత్మా“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10. పూ.భా. 284)

  1. “హీనసేవా నకర్తవ్యా కర్తవ్యో మహదాశ్రయః”

(హీనులనాశ్రయించరాదు - సేవించరాదు - మహాత్ముల నాశ్రయించవలెను).

  1. “వాసుదేవః సర్వమితి మహాత్మా సుదుర్లభః |”.

(సమస్త భూతములందు నివసించియున్న శ్రీమహావిష్ణువే - వాసుదేవుడే ఈ సృష్టిలోని సమస్త వస్తువులు అని నమ్మియుండు మహాత్ముడు లభించుటకష్టము).

Transliteration
  1. “mahā manāḥ” (śrīrāmānujaḥ)

(goppa manassu kalavāru).

  1. mahān ātmā yasya saḥ, nigrahānugraha samarthaḥ -

(goppa ātma galavāḍu, nigrahiṃcuṭaku, anugrahiṃcuṭaku - (śikṣuṃcuṭaku, rakṣiṃcuṭaku) samarthuḍainavāḍu).

  1. mahā nātmā asyēti mahātmā, mahākāśī sthānīya paramātma rūpatvāt -

(goppa ātma galavāḍu - mahākāśasthānamulalōnuṃḍu paramātma rūpamaguṭacēta mahātma).

  1. mahānikaṃpāyukta ātmā manō yasya saḥ

(goppa dayatō kūḍina manassu galavāḍu).

  1. parama kāruṇikaḥ, kṛpāluḥ - (goppa dayagalavāḍu).

  2. karuṇyādi guṇagaṇānaraḥ -

(kāruṇyamu - daya - modalagu guṇamulaku ākāramainavāḍu).

  1. udāra cittaḥ - (udāramaina manassu galavāḍu).

  2. akṣudra buddhiḥ - akṣudra svacbhāvaḥṃ akṣudra cittaḥ -

(kṣudramukāni buddhikalavāḍu, kṣudramukāni svabhāvamu kalavāḍu)

  1. “pūrṇaśca asau ātmā ca iti mahātmā –”. (śrī ānaṃdatīrthaḥ)

(pūrṇuḍainavāḍu - prapaṃcamulō pūrtigā niṃḍiyuṃḍuvāḍu, ātmakūḍa tānē ayinavāḍu).

  1. mahāṃścā sau ātmā mahātmā, sarvavyāpī ityarthaḥ, aparicchinna dṛṣṭiḥ - mahānubhāvaḥ -

(goppa ātma ayinavāḍu; anniṃṭilōnu, anatānu vyāpiṃciyuṃḍuvāḍu - parimitilēni dṛṣṭikalavāḍu - sarvasākṣi – mahānubhāvuḍu).

  1. aparicchinna svarūpaḥ, sarvajñaḥ -

(parimitilēni - aṃtulēni svarūpamu kalavāḍu - sarvamunu telisinavāḍu).

“aparicchinnatvaṃbuvalana mahātmuṃḍavayyunu -” (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū. bhā. - 682)

(asaṃkhyākamaina vastuvulalō tānu - okkaḍē ayinanu - ātmagā yuṃḍuṭavalana mahātmuḍu).

  1. mahān paraṃ ātmā - (utkṛṣṭamaina goppa ātma).

  2. nanya sāmānya svabhāvaḥ.

(itarulaku sāmānyamugānuṃḍani svabhāvamu galavāḍu).

  1. “śuddha satvā mahātmānō jāta samyagdhiyō budhāḥ” (gītābhāvaprakāśamu - 8 - 96)

(śuddhamaina satvaguṇamu galavāru - samyak jñānamu kalavāru paṃḍitulu, jñānulu).

  1. satya saṃkalpaḥ

(tirugulēni saṃkalpamu kalavāḍu - saṃkalpiṃcinadi cēsi tīruvāḍu - cēyakaluguvāḍu - “sa akāmayata -” atanu - ā bhagavaṃtuḍu - saṃkalpiṃcenu - nēnu okkaḍini ayinanu anēka vastuvulugā ayyedanu - anēka vastuvulanu sṛṣṭiṃcedanu).

  1. “svakṛtaiḥ puṇya saṃcayaiḥ vidvastasamasta pāpa baṃdhāḥ, daivīṃ prakṛtimāśritāḥ, mahātmānaḥ” (śrīmān rāmānujaḥ)

(tāmu cēsina anēka puṇyakarmalavalana samastamaina pāpamula baṃdhamunuṃḍi vimuktulayina vāru).

  1. mahā dhairyaḥ - (goppa dhairyamu galavāḍu)

  2. “bahu janmārjitaiḥ puṇyai rēṣāṃ dhīssaṃskṛtā bhavēt |

kāmairanabhi bhūtāstē mahātmānō guṇā karāḥ ||“. (gītābhāvaprakāśamu - 8 - 96)

(anēka janmalalō ārjiṃcina puṇyamulavalana saṃskṛtamaina buddhi - jñānamu - kalavāru).

  1. mahātma śabdasya gaṃbhera buddhi viśēṣavatsu prasiddhatvāt -

(gaṃbhīramaina buddhi viśēṣamu galavāriyaṃdu mahātma śabdamu prasiddhi poṃdinadi) (aṃducēta aṭuvaṃṭi buddhi viśēṣamu galavāru mahātmulu).

  1. mahātma śabdēna sarvāśāyi paramaiśvaryādikaṃ vivakṣitaṃ - mahānātmā iti paramātmatvaṃ vā.

(mahātma anagā anniṃṭini atiśatiṃciyuṃḍu paramaiśvaryamu modalagu kaligiyuṃḍuṭa - goppa ātma ayi uṃḍuṭa - paramātma, parabrahma annamāṭa).

  1. “ahōmahatvaṃ mahatāma pūrvaṃ vipatti kālēpi parōpakāraḥ |

yathāsya madhyē patitō hi rāhāḥ kaḷānidhiḥ puṇyacayaṃ dadāti||“.

(mahātmulayokka mahātmyamu - goppatanamu - eṃta goppadō - vāriki āpatkālamu saṃbhaviṃcinanu itarulakupakāramē cēyuduru - rāhu grastamainanu (caṃdragrahaṇamainanu) caṃdruḍu ānāḍu puṇyamula niccu cunnāḍu - caṃdragrahaṇa dinamu puṇyadinamu - ānāḍu cēsina satkarmalaku phalamekkuvagā nuṃḍunu).

  1. “sūrya iva anīca jana mahājana paryaṃtaṃ sarvatra pakṣapātaṃ vinā sama buddhitvaṃ mahātmanāṃ māhatmyaṃ.”

(sūryunivale nīcajanmakalavāru modalu mahājanulavaṟakugala aṃdaṟilōnu aṃtaṭa pakṣapātamulēka samānamaina buddhikaligi yuṃḍuṭē mahātmulayokkamahātmyamu).

  1. “mahātmātyaṃta śuddhāṃtarātmanā brahmatva tatvadṛk” (gītābhāvaprakāśamu - 7 - 124)

(mikkili śuddhamaina aṃtaḥkaraṇamu kaligiyuṃḍuṭavalana mahātmuḍaina vāḍu bhagavattatvamunu darśiṃcinavāḍu - brahmasākṣātkāramunu poṃdinavāḍu).

  1. sarvēṣāṃ pratyagātmā - (aṃdaṟilōnuṃḍu pratyagātma).

  2. “mahātmulainavāri mahātmyamātmagarvamunajēsi |

jaḍulu poḍagāna jālaru, jalaja nētra ||“. (śrīmadāṃdhramahābhāgavatamu - 4 - 69)

  1. “mahatmānastu māṃ pārtha dēvīṃ prakṝtimāśritāḥ |

bhajaṃtananya manasō jñātvā bhūtādimavyayaṃ ||“. (śrīmadbhagavadgīta - 9 -13)

“bahu janmārjitaiḥ puṇyai rēṣāṃ dhīssaṃskṛtā bhavēt |

kāmairanabhi bhūtāstē mahātmānō guṇākarāḥ |

abhayaṃ satva saṃśuddhirityādi prakṛtiṃ sthitāḥ |

ata ēva na cānyasminmanō yēṣāṃ hi gōcarē |

tēmāṃ sarvajagaddhētu muvināśinamīśvaraṃ |

jñātvā cāryōpadiṣṭēna sēvaṃtē vaidikādhvanā ||“.

(anēka janmalaṃdārjiṃcina puṇyamulacēta saṃskṛtamaina - saṃskāramu poṃdina - buddhicēta kāmamulanu vadalinavārai, maṃci guṇamulaku nelavainavāru mahātmulu. abhayamu, śuddhasatvaguṇamu modalagunavigala daivī prakṛtini avalaṃbhiṃcinavāru. aṃducēta bhagavaṃtuni kaṃṭe itaramaina dāniyaṃdu manassunu nilapanivāru. aṭṭivāru guruvula upadēśamuvalana nityuḍu - nāśamu lēnivāḍu - jagattunakaṃtaṭiki kāraṇamainavāḍu, īśvaruḍu ani nannu telusukoni vēdamārgamulō - vēdamucē nirṇayiṃpabaḍina vidhamugā - sēviṃcucunnāru).

  1. “mahātmulevvaranina śatṛmitra vivēkaṃbu lēka samacittulunu, śāṃtu lunu, grōdharahitulunu, sakala bhūtadayāparulunu, sādhuvulunu naguvāralu mahātmulanaṃdaguduru - aṭṭi mahātmulu nāyaṃdali snēhaṃbe prayō janaṃbugā galigiyuṃḍuṭaṃjēsi, viṣayavārtā pravṛtulagu kujanulaṃdu damadēha gṛhamitra dārātma jātulaṃdu brīti lēka yuṃḍuduru”

(śrīmadāṃdhramahābhāgavatamu - 5 - 1 - 5 - 68)

  1. “raha gaṇaitattapasā nayāti na cē jyayā nirvaṇāt gṛhādvā |

na chaṃdasā naiva jalāgni sūryairvinā mahatthādara jō(a)bhiṣēkaṃ ||“. (śrīmadbhāgavataṃ - 5 - 1 - 12 - 12)

pai viṣayamu śrīmadāṃdhramahābhāgavataṃlō ī kriṃda vidhamugā ceppabaḍinadi : -

“sī. dharalōna brahmaṃbu dapamuna dānaṃbulanu gṛhadharmaṃbulanu, jalāgni

sōma sūryulacēta śrutulacēnainanu barama bhāgavatula pādasēva

boṃdina māḍkini boṃdaṃgarādani palukudurāryulu barama munulu - - -” (śrīmadāṃdhramahābhāgavatamu - 5 - 1 - 12 - 160)

  1. “mahāpātaka yuktāvā bōpapātakaiḥ |

paraṃ padaṃ prayāṃtyēva mahadbhiravalōkitāḥ |

kalēbaraṃ hi tadbhasma taddhūmaṃ vāpi sattama |

yadi paśyati puṇyātmā sa prayāti parāṃ gatiṃ ||“. (nārada purāṇamu - pūrva - 7 - 74, 75)

(paṃcamahāpātakamulu cēsinavārainanu, upapātakamulanu cēsinavārainanu mahātmulu vārini cūcinayaḍala, lēka. mahātmula kaḷēbaramukāni, vāri bhasmamukāni, pogagāni, vāru cūcinanu, vāru paramagatini - paramapadamunu - vaikuṃṭhamunu poṃduduru).

  1. “mahātāmēva saṃparkāt punarduḥkhaṃ na bādhatē |

kōṭi dīpaśikha hasta stamasā paribhūyatē ||“. (yōgavāśiṣṭamu)

(mahātmula saṃparkamuvalana jīvunaku duḥkhamuvalana badha kalugunu - cētilō dīpamunnavāniki cīkaṭivalana bādhalēdu).

  1. “manasyēkaṃ vacasyēkaṃ karmaṇyakaṃ mahātmanāṃ |

manasyanyaṃ vacasyanyaṃ karmaṇyanyaṃ durātmanāṃ ||”

(mahātmulu manasulō talacinaṭlē māṭalāḍuduru, māṭalāḍunaṭlē karmalu cēyuduru - vāri manōvākkarmamulu okē rītiga nuṃḍunu - durātmulu (durmārgulu) talacinadokaṭi, palikinadokaṭi, cēsinadiṃkokaṭi).

  1. “ka. ūrakarāru mahātmulu

vāradhamula iṃḍla kaḍaku vaccuṭa lellaṃ

gāraṇamu maṃgaḷamulaku

nī rāka śubhaṃbu māku nijamu mahātmā”. (śrīmadāṃdhramahābhāgavatamu - 10. pū.bhā. 284)

  1. “hīnasēvā nakartavyā kartavyō mahadāśrayaḥ”

(hīnulanāśrayiṃcarādu - sēviṃcarādu - mahātmula nāśrayiṃcavalenu).

  1. “vāsudēvaḥ sarvamiti mahātmā sudurlabhaḥ |”.

(samasta bhūtamulaṃdu nivasiṃciyunna śrīmahāviṣṇuvē - vāsudēvuḍē ī sṛṣṭilōni samasta vastuvulu ani nammiyuṃḍu mahātmuḍu labhiṃcuṭakaṣṭamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.