← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మహత్సంగము mahatsaṃgamu

Original — తెలుగు
  1. మహాపురుషాణాం సంగః దుర్లభః అగమ్యః అమోఘశ్చ.

(మహాపురుషుల సంగము దొరుకుట కష్టము - వారిని చేరుట కష్టము - వారి సంగమము అమోఘము. ఎందుచేతననగా : -

“సంసారే స్వధర్మపరాయణానాం సదాచారిణాం సాధిస్వ భావా నాం దైవసంపత్తిమతాం పురుషాణాం ప్రాప్తిరతి దిష్కరాస్తి సాధువేష ధారిణాం సమూహేషు ఉపదేశకేషు చ విపణిగత రత్నేషు సత్యా హిరకా ఇవ సత్యాః సాధవః స్వల్పా ఏవ భవంతి.పరంతు, అన్వేషణే కృతే సంసారే సదాచారః కర్మకాండరతాః తథా కతిపయే జ్ఞానినః పురుషాస్తు ప్రాస్తుమపిశక్యంతే. కింతు ఈదృశాః సత్యాః ప్రేమిణో మహాత్మానః స్వల్ప తరా ఏవ లభ్యంతే, ఏషాం కృపామాత్రేణ పరమ దుర్లభస్య యోగిజ్ఞాన జనవాంచితస్య భగవత్ప్రేమ్ణః ప్రాప్తిరవశ్యం భవేత్. అత ఏవ ఈదృశానాం మహాత్మానాం ప్రాప్తిః పరమదుష్కరా మతాయది కుత్రచిదీ దృశాః మహాపురుషా మిలితా అపి భవతి - తదా తేషాం పరిజ్ఞానం అతికఠినం భవతి - - - సౌభాగ్యవశాత్ కుత్రచిదీదృశాః మహాత్మానః పురుషాః మిలితాః భవంతి, తథా అజ్ఞాతమిలినమపి కదాపి వ్యర్థం న భవితుం శక్నోతి - యతః తదమోఘమస్తి” -

(ఈ సంసారమందు స్వధర్మపరులైనవారు, సదాచారులు, సాధుస్వభావ ముగలవారు, దైవ సంపత్తిగలవారు అగు పురుషులు దొరుకుట దుష్కరము – అంగ డిలో అమ్మకమునకు చూపబడు రత్నములలో నిజమైన వజ్రమువలె సాధువులవలె వేషము వేసుకొని తిరుగుచు ఉపదేశములు చెప్పువారిలో నిజమైన సాధువులు - సత్పురుషులు - చాల తక్కువమంది ఉండవచ్చును - అయినను, అన్వేషించిన యడల సంసారమందు సదాచారులును, కర్మకాండయందు రతిగలవారు, జ్ఞానులు అగు పురుషులు కొందఱు దొరక వచ్చును. కాని, ఇటువంటి మహాత్ములు వారి దయకలిగినంతమాత్రమున యోగులు జ్ఞానులు కోరు భగవత్కృపకలుగువారు తక్కువమందే ఉండవచ్చును. అందుచేత ఇటువంటి మహాత్ములు ప్రాప్తించుట దుష్కరమని తలచెదరు. ఒకవేళ ఇట్టి మహాత్ములున్నను వారిని - అటువంటి వారిని - తెలుసుకొనుట కష్టము. వారిని తెలుసుకోగలిగినయడల - అది వ్యర్థముకానేరదు. అందుచేత వారి సంగము అమోఘమని చెప్పబడినది).

  1. భగవతః కృప యైవ మహాపురుషాణాం సంగోపి లభ్యతే -

(భగవంతుని దయ కలిగిననే మహాపురుషుల సంగము దొరుకును).

  1. మహాపురుషాణాం సంగం వినా భగవత్కృపాయాః అనుభవో న భవతి, తథా, భగవత్కృపావిన ఏతాదృదాశః మహా పురుషాః న లభ్యంతే -(మహాపురుషుల సంగము - సాంగత్యము - లేనిదే భగవంతుని దయ యొక్క అనుభవము కలుగదు. ఆ ప్రకారముగానే భగవంతుని దయలేనిదే ఇట్వంటి మహాపురుషుల సంగము లభించదు.)
Transliteration
  1. mahāpuruṣāṇāṃ saṃgaḥ durlabhaḥ agamyaḥ amōghaśca.

(mahāpuruṣula saṃgamu dorukuṭa kaṣṭamu - vārini cēruṭa kaṣṭamu - vāri saṃgamamu amōghamu. eṃducētananagā : -

“saṃsārē svadharmaparāyaṇānāṃ sadācāriṇāṃ sādhisva bhāvā nāṃ daivasaṃpattimatāṃ puruṣāṇāṃ prāptirati diṣkarāsti sādhuvēṣa dhāriṇāṃ samūhēṣu upadēśakēṣu ca vipaṇigata ratnēṣu satyā hirakā iva satyāḥ sādhavaḥ svalpā ēva bhavaṃti.paraṃtu, anvēṣaṇē kṛtē saṃsārē sadācāraḥ karmakāṃḍaratāḥ tathā katipayē jñāninaḥ puruṣāstu prāstumapiśakyaṃtē. kiṃtu īdṛśāḥ satyāḥ prēmiṇō mahātmānaḥ svalpa tarā ēva labhyaṃtē, ēṣāṃ kṛpāmātrēṇa parama durlabhasya yōgijñāna janavāṃcitasya bhagavatprēmṇaḥ prāptiravaśyaṃ bhavēt. ata ēva īdṛśānāṃ mahātmānāṃ prāptiḥ paramaduṣkarā matāyadi kutracidī dṛśāḥ mahāpuruṣā militā api bhavati - tadā tēṣāṃ parijñānaṃ atikaṭhinaṃ bhavati - - - saubhāgyavaśāt kutracidīdṛśāḥ mahātmānaḥ puruṣāḥ militāḥ bhavaṃti, tathā ajñātamilinamapi kadāpi vyarthaṃ na bhavituṃ śaknōti - yataḥ tadamōghamasti” -

(ī saṃsāramaṃdu svadharmaparulainavāru, sadācārulu, sādhusvabhāva mugalavāru, daiva saṃpattigalavāru agu puruṣulu dorukuṭa duṣkaramu – aṃga ḍilō ammakamunaku cūpabaḍu ratnamulalō nijamaina vajramuvale sādhuvulavale vēṣamu vēsukoni tirugucu upadēśamulu ceppuvārilō nijamaina sādhuvulu - satpuruṣulu - cāla takkuvamaṃdi uṃḍavaccunu - ayinanu, anvēṣiṃcina yaḍala saṃsāramaṃdu sadācārulunu, karmakāṃḍayaṃdu ratigalavāru, jñānulu agu puruṣulu koṃdaṟu doraka vaccunu. kāni, iṭuvaṃṭi mahātmulu vāri dayakaliginaṃtamātramuna yōgulu jñānulu kōru bhagavatkṛpakaluguvāru takkuvamaṃdē uṃḍavaccunu. aṃducēta iṭuvaṃṭi mahātmulu prāptiṃcuṭa duṣkaramani talacedaru. okavēḷa iṭṭi mahātmulunnanu vārini - aṭuvaṃṭi vārini - telusukonuṭa kaṣṭamu. vārini telusukōgaliginayaḍala - adi vyarthamukānēradu. aṃducēta vāri saṃgamu amōghamani ceppabaḍinadi).

  1. bhagavataḥ kṛpa yaiva mahāpuruṣāṇāṃ saṃgōpi labhyatē -

(bhagavaṃtuni daya kaliginanē mahāpuruṣula saṃgamu dorukunu).

  1. mahāpuruṣāṇāṃ saṃgaṃ vinā bhagavatkṛpāyāḥ anubhavō na bhavati, tathā, bhagavatkṛpāvina ētādṛdāśaḥ mahā puruṣāḥ na labhyaṃtē -(mahāpuruṣula saṃgamu - sāṃgatyamu - lēnidē bhagavaṃtuni daya yokka anubhavamu kalugadu. ā prakāramugānē bhagavaṃtuni dayalēnidē iṭvaṃṭi mahāpuruṣula saṃgamu labhiṃcadu.)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.