← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మహేశః mahēśaḥ

Original — తెలుగు
  1. మహదాది ప్రపంచేశితత్వాత్ మహేశః; యద్వా, నిష్ప్రతి యోగికతయా మహాన్ పరమాత్మా అహమేవ ఇత్యవస్థాతు మీశ్వరత్వాత్ మహేశః.

(మహాన్ అనగా అపరిచ్ఛేద్యుడు, ఈశః అనగా సర్వ నియంతృత్వాది ధర్మములు గలవాడు - నిరాటంకముగా, పరిమితిలేకుండునట్లు అన్నింటిని నియమించుట మొదలగు శక్తులుగలవాడు).

(మహత్తత్తము మొదలుకొని, దానిలోనుండి ఒకదానిలోనుండి ఒకటిగా పుట్టిన సమస్త వస్తువులుగల ప్రపంచమును అధికారముతో ప్రవర్తింపచేయువాడు; లేక “నాకంటే గొప్పవాడు ప్రకృష్టమైనవాడు, అగు పరమాత్మ లేడు, కనుకనే నేనే ఇట్లు అన్నింటికంటెను గొప్పవాడను; అన్నింటిని శాసించువాడను కనుక మహేశుడను”).

  1. మహాంశ్చాసౌ ఈశః మహేశః -

(మహత్తత్తము ఇతడే, ఈశన శాలి, పాలించువాడు, శాసించువాడు ఇతడే కనుక మహేశుడు).

Transliteration
  1. mahadādi prapaṃcēśitatvāt mahēśaḥ; yadvā, niṣprati yōgikatayā mahān paramātmā ahamēva ityavasthātu mīśvaratvāt mahēśaḥ.

(mahān anagā aparicchēdyuḍu, īśaḥ anagā sarva niyaṃtṛtvādi dharmamulu galavāḍu - nirāṭaṃkamugā, parimitilēkuṃḍunaṭlu anniṃṭini niyamiṃcuṭa modalagu śaktulugalavāḍu).

(mahattattamu modalukoni, dānilōnuṃḍi okadānilōnuṃḍi okaṭigā puṭṭina samasta vastuvulugala prapaṃcamunu adhikāramutō pravartiṃpacēyuvāḍu; lēka “nākaṃṭē goppavāḍu prakṛṣṭamainavāḍu, agu paramātma lēḍu, kanukanē nēnē iṭlu anniṃṭikaṃṭenu goppavāḍanu; anniṃṭini śāsiṃcuvāḍanu kanuka mahēśuḍanu”).

  1. mahāṃścāsau īśaḥ mahēśaḥ -

(mahattattamu itaḍē, īśana śāli, pāliṃcuvāḍu, śāsiṃcuvāḍu itaḍē kanuka mahēśuḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.