(మహేశ్వరుల అభిప్రాయము ఈ క్రింద విధముగానున్నది - కార్యములు, కారణములు, యోగము, విధి, దుఃఖము అను అయిదు పదార్థములున్నవి. పశువులు అనగా బ్రహ్మజ్ఞానములేని జీవులు (ప్రాణులు). వీరు పాశములచేత - త్రాళ్ళవలెనుండువాటిచేత - సంసారమందు బద్ధులై యున్నారు - బంధింపబడియున్నారు - సంసారములో పడి చచ్చుచు పుట్టుచు బాధలు పడుచున్నారు - ఈ పశువులకు పతి అయిన ఈశ్వరుడు ఈ పాశములనుండి మోక్షముకొఱకు పంచ పదార్థములను ఉపదేశించెను - ఈశ్వరుడు నిమిత్తకారణము).
(మహేశ్వరులనువారు నాలుగు విధములుగ నున్నారు - శైవులు, పాశుపతులు, కారుణికసిద్ద్ధాంతులు, కాపాలికులు - ఈ నాలుగు విధములైనవారు మహేశ్వరునిచేత చెప్పబడిన ఆగమముల ననుసరించువారు కనుక మహేశ్వరులని చెప్పబడుచున్నారు - పైన చెప్పబడిన అయిదు పదార్థములలో కార్యమనగా మహత్తత్వము మొదలగునవి. కారణము అనగా ప్రథానము, ఈశ్వరుడు - యోగమనగా సమాధి. విధియనగా త్రివషణస్నానము మొదలగునవి. దుఃఖాంతమనగా మోక్షము - ఏ విధమైన దుఃఖము లేకుండ నుండునది).
(mahēśvarula abhiprāyamu ī kriṃda vidhamugānunnadi - kāryamulu, kāraṇamulu, yōgamu, vidhi, duḥkhamu anu ayidu padārthamulunnavi. paśuvulu anagā brahmajñānamulēni jīvulu (prāṇulu). vīru pāśamulacēta - trāḷḷavalenuṃḍuvāṭicēta - saṃsāramaṃdu baddhulai yunnāru - baṃdhiṃpabaḍiyunnāru - saṃsāramulō paḍi caccucu puṭṭucu bādhalu paḍucunnāru - ī paśuvulaku pati ayina īśvaruḍu ī pāśamulanuṃḍi mōkṣamukoṟaku paṃca padārthamulanu upadēśiṃcenu - īśvaruḍu nimittakāraṇamu).
(mahēśvarulanuvāru nālugu vidhamuluga nunnāru - śaivulu, pāśupatulu, kāruṇikasidddhāṃtulu, kāpālikulu - ī nālugu vidhamulainavāru mahēśvarunicēta ceppabaḍina āgamamula nanusariṃcuvāru kanuka mahēśvarulani ceppabaḍucunnāru - paina ceppabaḍina ayidu padārthamulalō kāryamanagā mahattatvamu modalagunavi. kāraṇamu anagā prathānamu, īśvaruḍu - yōgamanagā samādhi. vidhiyanagā trivaṣaṇasnānamu modalagunavi. duḥkhāṃtamanagā mōkṣamu - ē vidhamaina duḥkhamu lēkuṃḍa nuṃḍunadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.