← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మహేశ్వరః mahēśvaraḥ

Original — తెలుగు
  1. మహాంశ్చా సౌ ఈశ్వరశ్చ, మహేశ్వరః - పూజనార్థం మహత్వ విశేషణం, నాల్సేశ్వరత్వ నివృత్యర్థం.

(మాహాత్ముడు - గొప్పవాడు - మహత్తుగలవాడున్నూ, ఈశ్వరుడు కనుక మహేశ్వరుడు. అల్పమైన ఈశ్వరత్వముకాక పూజనీయుడగుటవలన మహత్వము గల ఈశ్వరుడు అని చెప్పబడుచున్నాడు)

  1. “సర్వాత్మత్వాత్ స్వతంత్రత్వాచ్ఛ మహాంశ్చాసౌ ఈశ్వరశ్చ ఇతి మహేశ్వరః” (శ్రీశంకరః)

(అన్నింటికి ఆత్మ అయి యుండుటవలనను, స్వతంత్రుడు అగుటవలనను గొప్ప మహత్తుగల ఈశ్వరుడు).

  1. “లోకేశ్వరాణామపి ఈశ్వరః -” (శ్రీమాన్ రామానుజః)

(లోకములకు ఈశ్వరులైన వారందఱికి ఈశ్వరుడైనవాడు).

“తమీశ్వరాణాం పరమం మహేశ్వరః” ఇతి శ్రుతిః -

(ఈశ్వరులకందఱికంటె ఉత్కృష్టమైనటువంటి మహత్తుగల ఈశ్వరుడు).

“విష్ణ్వా దీనా మీశ్వరాణాం పరమంతం మహేశ్వరం” - (విష్ణువు మొదలగు ఈశ్వరులందఱిలోను ఉత్కృష్టమైనవాడు కనుక మహేశ్వరుడు).

  1. “మహాంశ్చాసౌ నిష్ప్రతియోగిక బ్రహ్మ మాత్రతయా అవస్థాతుం ఈశ్వరశ్చ ఇతి మహేశ్వరః - యస్మాత్ మహతః ఈశః శబ్దధ్వన్యాచాత్మశక్త్యా సర్వం ఈశతే తస్మాదుచ్యతే మహేశ్వర ఇతి” (శాండిల్యోపనిషత్)

(తనతో సాటిలేని నిర్గుణపరబ్రహ్మ ఈశ్వరుడు కనుక మహేశ్వరుడు మహత్తత్వమునుకూడా శాసించువాడు. తన ఆత్మ శక్తిచే అన్నింటిని శాసించువాడు కనుక మహేశ్వరుడు).

  1. “మహానపరిచ్ఛిన్నశ్చా సా వీశ్వరశ్చ ఇతి మహేశ్వరః”

(పరిమితిలేని ఈశ్వరత్వము - శాసించు శక్తి - కలవాడు కనుక మహేశ్వరుడు).

  1. “యస్యాంత స్థితాని భూతాని యస్మాత్ సర్వం ప్రవర్తతే |

యమాహుస్తత్పరం తత్వం స దేవస్యా న్మహేశ్వరః ||“. (బ్రహ్మాండపురాణే)

(ఎవనియందు సమస్త భూతములున్నవో, ఎవనివలన ఈ జగత్తంతయు ప్రవర్తించుచున్నదో - నడుచుచున్నదో - పరమాత్మ తత్వమని ఎవరిని చెప్పుదురో అతనే మహేశ్వరుడు).

  1. “యజ్ఞకర్తాచ దేవేంద్ర స్సృష్టికర్తాచ వాక్పతిః |

అహమేవ (విష్ణుః) జగత్కర్తా మమకర్తాచ మహేశ్వరః |

తస్య దేవాది దేవస్య కర్తా కోపి న విద్యతే ||“. (స్కాందే)

(యజ్ఞకర్త దేవేంద్రుడు, సృష్టి చేయువాడు బ్రహ్మ - చతుర్ముఖబ్రహ్మ, నేను - విష్ణువును - జగత్క ర్తను, నా కర్త - నన్ను పుట్టించినవాడు మహేశ్వరుడు; దేవాది దేవుడైన మహేశ్వరుడైన మహేశ్వరునకు కర్త ఎవడూ లేడు).

  1. “యం సర్వాన్ లోకాన్ సంభక్షయతి, అజస్రం సృజతి, విసృజతి, వాసయతీత్తృక్తార్థం, ఏవం యః స్వమాత్ర మవశిచ్యతే స ఏవ చ మహేశ్వరః ఇత్యర్థః -”

(లోకములన్నింటిని భక్షించువాడు - నాశము చేయువాడు, తిరిగి వాటిని సృజించువాడు, తనలఓ నుండి వాటిని పైకి విడిచిపెట్టువాడు - ఇట్లు చయుచున్నను తాను మాత్రము మొదటివలనే - ఎప్పుడూ తన స్వస్వరూపముతోనే ఉండువాడు).

  1. “సర్వజ్ఞతా తృప్తి రనాధబోధః స్వతంత్రతా నిత్యమలుప్తశక్తిః |

అనంత శక్తిశ్చ విభోర్విధిజ్ఞాః షడాహురంగాని మహేశ్వరస్య ||“.

(సర్వజ్ఞత్వము, భోగములందిచ్ఛలేకుండుట, నిత్యజ్ఞానము, స్వాతంత్ర్యము, నిత్య ప్రయత్నము, నాశరహితమైన శక్తియు ఈ ఆరు అంగములతోను - అనగా, ధర్మములతోను కూడి యుండువాడు మహేశ్వరుడు).

  1. “యద్వేదౌ స్వరం ప్రోక్తో వేదాంతేచ ప్రతిష్టితః |

తస్య ప్రక్తి లీనస్య యః పరః సమహేశ్వరః ||“. (నారాయణోపనిషత్)

(“వేదాద్యంతే చ ప్రతిష్టితః స్వరః ప్రణవః తస్య ప్రకృతిః అకారః సమస్త శబ్ద మూలత్వా దకారస్య, తత్ర లీనత్వం తద్రూపతాం ఆపన్నత్వం, తస్య యః పరః ప్రతిపాద్యః అకారవాచ్యో విష్ణుః, స ఏవ మహేశ్వరః”) (శ్రీరంగరామానుజః)

(వేదము మొదటను, అంతమున చెప్పబడు స్వరము - శబ్దము లేక అక్షరము - ఓంకారము; ప్రణవము - అన్ని శబ్దములకు మూలము ‘అ’ కారము - (అకారము యొక్క - వికారములే మిగిలిన అక్షరములు) - దానిలో లీనమైనవాడు - అనగా ‘అ’ కారరూపమైనవాడు –

(అక్షరాణాం ’అ’కారోస్మి) (శ్రీమద్భగవద్గీత - 10 - 33)

“‘అ’ ఇతి బ్రహ్మ” అందుచేత దాని కన్న పరముడు, ఉత్కృష్టమైనవాడు (“అకారో వై విష్ణుః”) అని చెప్పబడినవాడు విష్ణువు - ఆ విష్ణువే మహేశ్వరుడు - వేదారంభమందును అంతమందును ‘ఓం’ - ప్రణవమును ఉచ్చరించవలెను - అని చెప్పబడినది. ఇది ప్రకృతిరూపమైన పరానందమందు లీనమగుచున్నది. ఆ పరానందస్వరూపుడు, ప్రకృతి కంటె ఉత్కృష్టమైనవాడు పరతత్వమే మహేశ్వరుడు.

  1. “యో సావాకార వాచ్యోదై విష్ణుర్నారాయణో హరిః |

స ఏవ పురుషో నిత్యః పరమాత్మా మహేశ్వరః |

తస్యాంశ భూతమైశ్వర్యం యస్మిన్ కస్మిన్ హి వర్తతే |

తస్మిన్ ఈశ్వర శబ్దాదిః ప్రోచ్యతే మునిభిః తథా |

నిరూపాధీశ్వరత్వం తం వాసుదేవే ప్రతిష్టితం |

ఆత్మేశ్వర ఇతి ప్రోక్తో వేదవాదైః సనాతనైః |

తస్మాత్ మహేశ్వరత్వంతు వాసుదేవే ప్రతిష్టి తం |

అసౌ త్రిపాద్విభూతేస్తు లీలాయా (అ)పి చేశ్వరః |

విభూత ద్వయ మైశ్వర్యం తస్యైవ సకలాత్మనః |

శ్రీ భూనీలాపతిర్యోసౌ ఈశ్వరః సముదాహృతః |

తస్మాత్ మహేశ్వరత్వంతు వాసుదేవే ప్రతిష్టితం ||“.

(‘అ’ కార వాచ్యుడు - “అకారో వై విష్ణుః -” అని చెప్పబడుచుండు విష్ణువు నారాయణుడు హరియనువాడే పరమాత్మ. నిత్యుడు, పురుషుడు అయినవాడే మహేశ్వరుడు. ఆ విష్ణునియొక్క అంశ అయిన ఐశ్వర్యము - ఈశ్వరత్వము - అందఱిని, అన్నింటినీ శాసించు శక్తి కలిగియుండుట - ఎక్కడయుండునో, ఏ వస్తువులో యుండునో - దానిని ఈశ్వరుడు అని మునులు చెప్పియున్నారు. ఏ విధమైన ఉపాధిలేని ఈశ్వరత్వము వాసుదేవుని యందే ప్రతిష్టింపబడియున్నది. సనాతనులైన వేదవాదులు ఆత్మేరుడు అని విష్ణువని చెప్పియున్నారు. అందుచేత మహేశ్వర త్వము వాసుదేవునియందే ప్రతిష్టింపబడియున్నది. త్రిపాద్విభూతికి విష్ణువే ఈశ్వరుడు - శ్రీదేవికి, భూదేవికి, నీలాదేవికి భర్త అయినవాడు. అందుచేత ఈశ్వరుడని చెప్పబడుచున్నాడు. మహేశ్వరత్వ్ము వాసుదేవునియందే ప్రతిష్టింపబడియున్నది - అనగా, వాసుదేవుడే - (విష్ణువే) మహేశ్వరుడు).

  1. “దేవో గుణత్రయాతీతః చతుర్వ్యూహో మహేశ్వరః |

సకలస్సకలా ధార శ్శక్తే రుత్పన్న కారణం |

సోయమాత్మ త్రయస్యాస్య ప్రకృతేః పురుషస్యచ |

లీలాకృత జగత్సృష్టిరీశ్వరత్వే వ్యవస్థితః |

యస్సర్వస్మాత్ పరో నిత్యో నిష్కలః పరమేశ్వరః |

స ఏవాయం తదాధార స్తదాత్మా తదధిష్టితః |

తస్మాన్మహేశ్వరశ్చైవ ప్రకృతిః పురుషస్తథా |

సదా శివో భవో విష్ణుర్బ్రహ్మ సర్వం శివాత్మకం ||” (వాయువీయ సమ్హితాయాం)

(త్రిగుణములకతీతుడు, చతుర్వ్యూహములు తానే అయినవాడు అగు దేవుడే మహేశ్వరుడు, కళలతో కూడియుండువాడు, అన్నింటికి ఆధారమైనవాడు, శక్తి పుట్టుటకు కారణమైనవాడు, ఆత్మ త్రయమునకు, పురుషునకు, ప్రకృతికి ఆధారమైనవాడు, ఈ జగత్తుయొక్క సృష్టి ఈశ్వరత్వము కలిగియుండుట చేతనే జరుగుచున్నది. అన్నింటికంటె ఉత్కృష్టమైనవాడు, నిత్యుడు, నిష్కలుడు అయినవాడే పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడే ఈ జగత్తునకు ఆధార మైనవాడు, జగత్తును అధిష్టించియుండుటచేత దానికి ఆత్మ అయినవాడు,అందుచేతమహేశ్వరుడే ప్రకృతి, పురుషుడు, సదాశివుడు, భవుడు, విష్ణువు. బ్రహ్మ - అన్నియు శివాత్మకమే.)

  1. “సర్వజ్ఞ స్సర్వేశ్వరేశ్వరో జగతః ఉత్పత్తికారణం, మృత్స వర్ణాదివత్ ఘట రుచకాదీనం, ఉత్పన్నస్య జగతః నియతృత్వేన స్థితి కారణం మాయావీ ఇవ మాయాయాః ప్రసారితస్య జగతః పునః స్వాత్మన్యేవ ఉపసమ్హారణమవనిరివ చతుర్విధ భూతగ్రామస్య”.

(మట్టి కుండకు కారణమైనట్లు, బంగారము ఆభరణములకు కారణమినట్లు సర్వజ్ఞుడైన ఈశ్వరుడు జగత్తు పుట్టిటకు కారణము. అట్లు పుట్టిన జగత్తుమకు, మాయకు మాయావి (మాయకలవాడు) కారణమైనట్లు, జగన్నియంతయగుటవలన జగత్తుయొక్క స్థితికి కారణము. తనచేత ప్రసరింపబడిన జగత్తునకు - వ్యాపింపచేయబడిన జగత్తునకు తనలోనే ఉపసమ్హారమగుటకు కారణము - అండజములు మొదలగు నాలుగు విధముల భూతములు భూమిలోనుండి పుట్టి, భూమిమీద పెరిగి - భూమిమీద పండిన ఆహారము తిని పెరిగి - భూమిలోనే లీనమైనట్లు-).

  1. “యో మామజమనాదించ వేత్తి లోకమహేశ్వరః”; “మయాం తు ప్రకృతిం విద్యాత్ మాయినంతు మహేశ్వరః”. (శ్వేతాశ్వరోపనిషత్)

“ఇతి వచనాత్ ప్రపంచకారణ కారణః, సృష్టి సమష్టి సర్వకారణ మయాధిష్ఠాతా మహనీశ్వరః”..

(నన్ను జన్మ లేనివానిగా, మహేశ్వరుడుగానున్నూ ఎవడు తెలుసుకొనునో” అనిన్నీ, ” ప్రకృతి మాయ యని ఆ మాయకలవాడు - ఆ మాయద్వారా పనులు చేయించువాడు - మహేశ్వరుడు ” అనిన్నీ చెప్పియుండుటచేత ప్రపంచమంతటికి కారణమైన దానికి కూడ కారణమైనవాడు, మాయను అధిష్టించియుండుటచేత - తనవశములో నుంచుకొనుటచేత అన్ని కారనqవస్తువులకు కారణమైనవాడు - మహేశ్వరుడే).

  1. “సిద్ధమేవావయో రూపం వేదాంతార్థ విచరణాత్ |

యథే తదైశ్వరం తేజస్త్తన్మాం విద్ధి మహేశ్వరం |

సర్వ భూతాత్మనః శక్తిం విశ్వం యస్మిన్ ప్రతిష్టితం |

అహం సర్వాంతరాశక్తిర్మాయా, మయీ మహేశ్వరః |

నావయోర్విద్యతే రాజన్ భేదోవై పరమార్థతః ||” (ఆదిత్యపురాణే)

(మా ఇద్దరి రూపములు - శివ, పార్వతుల రూపములు ఉపషత్తులను బాగుగా అర్థము చేసుకొనిన తెలియనగును. ఈశ్వరుని తేజస్సేమహేశ్వరినైన నేను - ఉన్న భూతముల శక్తియే అయిన యీ ప్రపంచము నాలో ప్రతిష్టింపబడియున్నది. అన్నింటిలోను అంతర్వర్తియై యుండు మాయయను శక్తి నేనే. మాయ (అను నేను) కలవాడుకనుక మహేశ్వరుడు ‘మాయీ’ (మాయావి) అని చెప్పబడుచున్నాడు. పరమార్థ దృష్టిలో మా యిద్దరిమధ్యను - మాయ, మాయావిల మధ్యను - భేదములేదు. మహేశ్వరుడే మాయ మాయయే మహేశ్వరుడు - మహేశ్వరునికి అతని శక్తికి భేదము లేదు).

Transliteration
  1. mahāṃścā sau īśvaraśca, mahēśvaraḥ - pūjanārthaṃ mahatva viśēṣaṇaṃ, nālsēśvaratva nivṛtyarthaṃ.

(māhātmuḍu - goppavāḍu - mahattugalavāḍunnū, īśvaruḍu kanuka mahēśvaruḍu. alpamaina īśvaratvamukāka pūjanīyuḍaguṭavalana mahatvamu gala īśvaruḍu ani ceppabaḍucunnāḍu)

  1. “sarvātmatvāt svataṃtratvāccha mahāṃścāsau īśvaraśca iti mahēśvaraḥ” (śrīśaṃkaraḥ)

(anniṃṭiki ātma ayi yuṃḍuṭavalananu, svataṃtruḍu aguṭavalananu goppa mahattugala īśvaruḍu).

  1. “lōkēśvarāṇāmapi īśvaraḥ -” (śrīmān rāmānujaḥ)

(lōkamulaku īśvarulaina vāraṃdaṟiki īśvaruḍainavāḍu).

“tamīśvarāṇāṃ paramaṃ mahēśvaraḥ” iti śrutiḥ -

(īśvarulakaṃdaṟikaṃṭe utkṛṣṭamainaṭuvaṃṭi mahattugala īśvaruḍu).

“viṣṇvā dīnā mīśvarāṇāṃ paramaṃtaṃ mahēśvaraṃ” - (viṣṇuvu modalagu īśvarulaṃdaṟilōnu utkṛṣṭamainavāḍu kanuka mahēśvaruḍu).

  1. “mahāṃścāsau niṣpratiyōgika brahma mātratayā avasthātuṃ īśvaraśca iti mahēśvaraḥ - yasmāt mahataḥ īśaḥ śabdadhvanyācātmaśaktyā sarvaṃ īśatē tasmāducyatē mahēśvara iti” (śāṃḍilyōpaniṣat)

(tanatō sāṭilēni nirguṇaparabrahma īśvaruḍu kanuka mahēśvaruḍu mahattatvamunukūḍā śāsiṃcuvāḍu. tana ātma śakticē anniṃṭini śāsiṃcuvāḍu kanuka mahēśvaruḍu).

  1. “mahānaparicchinnaścā sā vīśvaraśca iti mahēśvaraḥ”

(parimitilēni īśvaratvamu - śāsiṃcu śakti - kalavāḍu kanuka mahēśvaruḍu).

  1. “yasyāṃta sthitāni bhūtāni yasmāt sarvaṃ pravartatē |

yamāhustatparaṃ tatvaṃ sa dēvasyā nmahēśvaraḥ ||“. (brahmāṃḍapurāṇē)

(evaniyaṃdu samasta bhūtamulunnavō, evanivalana ī jagattaṃtayu pravartiṃcucunnadō - naḍucucunnadō - paramātma tatvamani evarini ceppudurō atanē mahēśvaruḍu).

  1. “yajñakartāca dēvēṃdra ssṛṣṭikartāca vākpatiḥ |

ahamēva (viṣṇuḥ) jagatkartā mamakartāca mahēśvaraḥ |

tasya dēvādi dēvasya kartā kōpi na vidyatē ||“. (skāṃdē)

(yajñakarta dēvēṃdruḍu, sṛṣṭi cēyuvāḍu brahma - caturmukhabrahma, nēnu - viṣṇuvunu - jagatka rtanu, nā karta - nannu puṭṭiṃcinavāḍu mahēśvaruḍu; dēvādi dēvuḍaina mahēśvaruḍaina mahēśvarunaku karta evaḍū lēḍu).

  1. “yaṃ sarvān lōkān saṃbhakṣayati, ajasraṃ sṛjati, visṛjati, vāsayatīttṛktārthaṃ, ēvaṃ yaḥ svamātra mavaśicyatē sa ēva ca mahēśvaraḥ ityarthaḥ -”

(lōkamulanniṃṭini bhakṣiṃcuvāḍu - nāśamu cēyuvāḍu, tirigi vāṭini sṛjiṃcuvāḍu, tanalaō nuṃḍi vāṭini paiki viḍicipeṭṭuvāḍu - iṭlu cayucunnanu tānu mātramu modaṭivalanē - eppuḍū tana svasvarūpamutōnē uṃḍuvāḍu).

  1. “sarvajñatā tṛpti ranādhabōdhaḥ svataṃtratā nityamaluptaśaktiḥ |

anaṃta śaktiśca vibhōrvidhijñāḥ ṣaḍāhuraṃgāni mahēśvarasya ||“.

(sarvajñatvamu, bhōgamulaṃdicchalēkuṃḍuṭa, nityajñānamu, svātaṃtryamu, nitya prayatnamu, nāśarahitamaina śaktiyu ī āru aṃgamulatōnu - anagā, dharmamulatōnu kūḍi yuṃḍuvāḍu mahēśvaruḍu).

  1. “yadvēdau svaraṃ prōktō vēdāṃtēca pratiṣṭitaḥ |

tasya prakti līnasya yaḥ paraḥ samahēśvaraḥ ||“. (nārāyaṇōpaniṣat)

(“vēdādyaṃtē ca pratiṣṭitaḥ svaraḥ praṇavaḥ tasya prakṛtiḥ akāraḥ samasta śabda mūlatvā dakārasya, tatra līnatvaṃ tadrūpatāṃ āpannatvaṃ, tasya yaḥ paraḥ pratipādyaḥ akāravācyō viṣṇuḥ, sa ēva mahēśvaraḥ”) (śrīraṃgarāmānujaḥ)

(vēdamu modaṭanu, aṃtamuna ceppabaḍu svaramu - śabdamu lēka akṣaramu - ōṃkāramu; praṇavamu - anni śabdamulaku mūlamu ‘a’ kāramu - (akāramu yokka - vikāramulē migilina akṣaramulu) - dānilō līnamainavāḍu - anagā ‘a’ kārarūpamainavāḍu –

(akṣarāṇāṃ ’a’kārōsmi) (śrīmadbhagavadgīta - 10 - 33)

“‘a’ iti brahma” aṃducēta dāni kanna paramuḍu, utkṛṣṭamainavāḍu (“akārō vai viṣṇuḥ”) ani ceppabaḍinavāḍu viṣṇuvu - ā viṣṇuvē mahēśvaruḍu - vēdāraṃbhamaṃdunu aṃtamaṃdunu ‘ōṃ’ - praṇavamunu uccariṃcavalenu - ani ceppabaḍinadi. idi prakṛtirūpamaina parānaṃdamaṃdu līnamagucunnadi. ā parānaṃdasvarūpuḍu, prakṛti kaṃṭe utkṛṣṭamainavāḍu paratatvamē mahēśvaruḍu.

  1. “yō sāvākāra vācyōdai viṣṇurnārāyaṇō hariḥ |

sa ēva puruṣō nityaḥ paramātmā mahēśvaraḥ |

tasyāṃśa bhūtamaiśvaryaṃ yasmin kasmin hi vartatē |

tasmin īśvara śabdādiḥ prōcyatē munibhiḥ tathā |

nirūpādhīśvaratvaṃ taṃ vāsudēvē pratiṣṭitaṃ |

ātmēśvara iti prōktō vēdavādaiḥ sanātanaiḥ |

tasmāt mahēśvaratvaṃtu vāsudēvē pratiṣṭi taṃ |

asau tripādvibhūtēstu līlāyā (a)pi cēśvaraḥ |

vibhūta dvaya maiśvaryaṃ tasyaiva sakalātmanaḥ |

śrī bhūnīlāpatiryōsau īśvaraḥ samudāhṛtaḥ |

tasmāt mahēśvaratvaṃtu vāsudēvē pratiṣṭitaṃ ||“.

(‘a’ kāra vācyuḍu - “akārō vai viṣṇuḥ -” ani ceppabaḍucuṃḍu viṣṇuvu nārāyaṇuḍu hariyanuvāḍē paramātma. nityuḍu, puruṣuḍu ayinavāḍē mahēśvaruḍu. ā viṣṇuniyokka aṃśa ayina aiśvaryamu - īśvaratvamu - aṃdaṟini, anniṃṭinī śāsiṃcu śakti kaligiyuṃḍuṭa - ekkaḍayuṃḍunō, ē vastuvulō yuṃḍunō - dānini īśvaruḍu ani munulu ceppiyunnāru. ē vidhamaina upādhilēni īśvaratvamu vāsudēvuni yaṃdē pratiṣṭiṃpabaḍiyunnadi. sanātanulaina vēdavādulu ātmēruḍu ani viṣṇuvani ceppiyunnāru. aṃducēta mahēśvara tvamu vāsudēvuniyaṃdē pratiṣṭiṃpabaḍiyunnadi. tripādvibhūtiki viṣṇuvē īśvaruḍu - śrīdēviki, bhūdēviki, nīlādēviki bharta ayinavāḍu. aṃducēta īśvaruḍani ceppabaḍucunnāḍu. mahēśvaratvmu vāsudēvuniyaṃdē pratiṣṭiṃpabaḍiyunnadi - anagā, vāsudēvuḍē - (viṣṇuvē) mahēśvaruḍu).

  1. “dēvō guṇatrayātītaḥ caturvyūhō mahēśvaraḥ |

sakalassakalā dhāra śśaktē rutpanna kāraṇaṃ |

sōyamātma trayasyāsya prakṛtēḥ puruṣasyaca |

līlākṛta jagatsṛṣṭirīśvaratvē vyavasthitaḥ |

yassarvasmāt parō nityō niṣkalaḥ paramēśvaraḥ |

sa ēvāyaṃ tadādhāra stadātmā tadadhiṣṭitaḥ |

tasmānmahēśvaraścaiva prakṛtiḥ puruṣastathā |

sadā śivō bhavō viṣṇurbrahma sarvaṃ śivātmakaṃ ||” (vāyuvīya samhitāyāṃ)

(triguṇamulakatītuḍu, caturvyūhamulu tānē ayinavāḍu agu dēvuḍē mahēśvaruḍu, kaḷalatō kūḍiyuṃḍuvāḍu, anniṃṭiki ādhāramainavāḍu, śakti puṭṭuṭaku kāraṇamainavāḍu, ātma trayamunaku, puruṣunaku, prakṛtiki ādhāramainavāḍu, ī jagattuyokka sṛṣṭi īśvaratvamu kaligiyuṃḍuṭa cētanē jarugucunnadi. anniṃṭikaṃṭe utkṛṣṭamainavāḍu, nityuḍu, niṣkaluḍu ayinavāḍē paramēśvaruḍu. ā paramēśvaruḍē ī jagattunaku ādhāra mainavāḍu, jagattunu adhiṣṭiṃciyuṃḍuṭacēta dāniki ātma ayinavāḍu,aṃducētamahēśvaruḍē prakṛti, puruṣuḍu, sadāśivuḍu, bhavuḍu, viṣṇuvu. brahma - anniyu śivātmakamē.)

  1. “sarvajña ssarvēśvarēśvarō jagataḥ utpattikāraṇaṃ, mṛtsa varṇādivat ghaṭa rucakādīnaṃ, utpannasya jagataḥ niyatṛtvēna sthiti kāraṇaṃ māyāvī iva māyāyāḥ prasāritasya jagataḥ punaḥ svātmanyēva upasamhāraṇamavaniriva caturvidha bhūtagrāmasya”.

(maṭṭi kuṃḍaku kāraṇamainaṭlu, baṃgāramu ābharaṇamulaku kāraṇaminaṭlu sarvajñuḍaina īśvaruḍu jagattu puṭṭiṭaku kāraṇamu. aṭlu puṭṭina jagattumaku, māyaku māyāvi (māyakalavāḍu) kāraṇamainaṭlu, jaganniyaṃtayaguṭavalana jagattuyokka sthitiki kāraṇamu. tanacēta prasariṃpabaḍina jagattunaku - vyāpiṃpacēyabaḍina jagattunaku tanalōnē upasamhāramaguṭaku kāraṇamu - aṃḍajamulu modalagu nālugu vidhamula bhūtamulu bhūmilōnuṃḍi puṭṭi, bhūmimīda perigi - bhūmimīda paṃḍina āhāramu tini perigi - bhūmilōnē līnamainaṭlu-).

  1. “yō māmajamanādiṃca vētti lōkamahēśvaraḥ”; “mayāṃ tu prakṛtiṃ vidyāt māyinaṃtu mahēśvaraḥ”. (śvētāśvarōpaniṣat)

“iti vacanāt prapaṃcakāraṇa kāraṇaḥ, sṛṣṭi samaṣṭi sarvakāraṇa mayādhiṣṭhātā mahanīśvaraḥ”..

(nannu janma lēnivānigā, mahēśvaruḍugānunnū evaḍu telusukonunō” aninnī, ” prakṛti māya yani ā māyakalavāḍu - ā māyadvārā panulu cēyiṃcuvāḍu - mahēśvaruḍu ” aninnī ceppiyuṃḍuṭacēta prapaṃcamaṃtaṭiki kāraṇamaina dāniki kūḍa kāraṇamainavāḍu, māyanu adhiṣṭiṃciyuṃḍuṭacēta - tanavaśamulō nuṃcukonuṭacēta anni kāranaqvastuvulaku kāraṇamainavāḍu - mahēśvaruḍē).

  1. “siddhamēvāvayō rūpaṃ vēdāṃtārtha vicaraṇāt |

yathē tadaiśvaraṃ tējasttanmāṃ viddhi mahēśvaraṃ |

sarva bhūtātmanaḥ śaktiṃ viśvaṃ yasmin pratiṣṭitaṃ |

ahaṃ sarvāṃtarāśaktirmāyā, mayī mahēśvaraḥ |

nāvayōrvidyatē rājan bhēdōvai paramārthataḥ ||” (ādityapurāṇē)

(mā iddari rūpamulu - śiva, pārvatula rūpamulu upaṣattulanu bāgugā arthamu cēsukonina teliyanagunu. īśvaruni tējassēmahēśvarinaina nēnu - unna bhūtamula śaktiyē ayina yī prapaṃcamu nālō pratiṣṭiṃpabaḍiyunnadi. anniṃṭilōnu aṃtarvartiyai yuṃḍu māyayanu śakti nēnē. māya (anu nēnu) kalavāḍukanuka mahēśvaruḍu ‘māyī’ (māyāvi) ani ceppabaḍucunnāḍu. paramārtha dṛṣṭilō mā yiddarimadhyanu - māya, māyāvila madhyanu - bhēdamulēdu. mahēśvaruḍē māya māyayē mahēśvaruḍu - mahēśvaruniki atani śaktiki bhēdamu lēdu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.