(గొప్ప పరిమాణముగల పృధివి మొదలగునవి మహత్ - గొప్పవి, పెద్దవి - అని చెప్పబడుచున్నవి. వాటికంటె గొప్పది పెద్దది అగుటచేత భగవంతుడు మహతోమహీయాన్ అని చెప్పబడుచున్నాడు - “అణోరణీయాన్ మహతో మహీయాన్” అని కూడ “పృధివ్యా జాయాన్” అని శ్రుతి చెప్పుచున్నది. అన్నింటికంటె చిన్నదైన అణువుకంటె చిన్న, పెద్దదైన మహత్తు కంటె పెద్దది).
(గొప్ప పరిమాణముగల పృధివి మొదలగువాటికంటె పెద్దది) - ఎంత పెద్దవస్తువుకంటె పెద్దది - “బృహత్వాత్ బృమ్హణత్వాత్వా బ్రహ్మ” (పెద్దదిగా వృద్ధిపొందునది, వృద్ధి పొందించునది కనుక బ్రహ్మ అని చెప్పబడినది. ఎంత పెద్ద వస్తువున్నను దానికంటె పెద్దదిగా పెరుగు శక్తి, శీలము గలవాడు).
(నీతో - పరబ్రహ్మతో - సమానమైనదే లేదు, అతనికంటె అధికుడు, పెద్దవాడు - లేడు)
(ఆకాశము, దిక్కులు మొదలగునవి అధికప్రమాణము కలిగియుండుటచేత ‘మహత్’ అని లోకములో వాడుకగా చెప్పబడుచున్నది. వాటి కంటె ఈ ఆత్మ మిక్కిలి అధికమైనదగుటవలన ‘మహీయాన్’ అని (వాటికంటె గొప్పది అని) చెప్పబడుచున్నది. ఆకాశము దిక్కులు మొదలగునవి ఒక్క బ్రహ్మాండములోనే యుండుటచేత, ఇటువంటి లక్షకోటి బ్రహ్మాండముల నిధిష్ఠించియుండుటచేత ఆత్మ మహాయాన్ అని చెప్పబడినది).
(goppa parimāṇamugala pṛdhivi modalagunavi mahat - goppavi, peddavi - ani ceppabaḍucunnavi. vāṭikaṃṭe goppadi peddadi aguṭacēta bhagavaṃtuḍu mahatōmahīyān ani ceppabaḍucunnāḍu - “aṇōraṇīyān mahatō mahīyān” ani kūḍa “pṛdhivyā jāyān” ani śruti ceppucunnadi. anniṃṭikaṃṭe cinnadaina aṇuvukaṃṭe cinna, peddadaina mahattu kaṃṭe peddadi).
(goppa parimāṇamugala pṛdhivi modalaguvāṭikaṃṭe peddadi) - eṃta peddavastuvukaṃṭe peddadi - “bṛhatvāt bṛmhaṇatvātvā brahma” (peddadigā vṛddhipoṃdunadi, vṛddhi poṃdiṃcunadi kanuka brahma ani ceppabaḍinadi. eṃta pedda vastuvunnanu dānikaṃṭe peddadigā perugu śakti, śīlamu galavāḍu).
(nītō - parabrahmatō - samānamainadē lēdu, atanikaṃṭe adhikuḍu, peddavāḍu - lēḍu)
(ākāśamu, dikkulu modalagunavi adhikapramāṇamu kaligiyuṃḍuṭacēta ‘mahat’ ani lōkamulō vāḍukagā ceppabaḍucunnadi. vāṭi kaṃṭe ī ātma mikkili adhikamainadaguṭavalana ‘mahīyān’ ani (vāṭikaṃṭe goppadi ani) ceppabaḍucunnadi. ākāśamu dikkulu modalagunavi okka brahmāṃḍamulōnē yuṃḍuṭacēta, iṭuvaṃṭi lakṣakōṭi brahmāṃḍamula nidhiṣṭhiṃciyuṃḍuṭacēta ātma mahāyān ani ceppabaḍinadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.