← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మలము malamu

Original — తెలుగు
  1. దోషము, ముఱికి, కల్మషము, పాపము.

  2. దేహములోని వసా, శుక్లము మొదలగు పన్నెండు మలములు - చెమట, మూత్రము, పురీషము మొదలగునవి.

  3. సప్తదూష్యాః మలమూత్ర శ్వకృత్స్వేదా దయః.

(శరీరములోని ఏడు దోషములు - మలము, మూత్రము, స్వేదము (చెమట) మొదలగునవి).

  1. మలం నామ పాపం, తచ్చ సంస్కారాత్మనాతి సూక్ష్మత్వాత్ న ప్రత్యక్షీ క్రియతే, కింతు, నిషిద్ధ కర్మానుష్ఠానేనవిషయా సక్త్యా చిత్తగతాశుభవాసనాభిశ్చ అనుమీయతే. అతః తన్నివృత్త్యర్థం నిష్కామ కర్మాణి భూతదయాది, ఈశ్వరనామోచ్చారణాదీని చ సాధనాని విహితాని.

(మలమనగా పాపము సంస్కారరూపమైనది. (అనేక జన్మములలో చేసిన పాపకర్మల సూక్ష్మఫలరూపము) కనుక మిక్కిలి సూక్ష్మమైనది – ప్రత్యక్షముగా కనబడదు - కాని శాస్త్రములో చేయకూడదని నిషేధించిన కర్మలను చేయుట వలనను, విషయములందాసక్తి కలిగియుండుటవలనను, మనసులో నుండు అశుభవాసనల వలనను అనుమానించుటకు వీలగుచున్నది. అందుచేత అట్టి పాపముల నివృత్తికొఱకు నిష్కామకర్మలు - ఫలము కోరక చేయుకర్మలు - భూతములందు దయకలిగి యుండుట, భగవన్నామముల నుచ్చరించుట అను మొదలగు సాధనములు శాస్త్రములో చెప్పబడినవి).

  1. “తండులస్య యథా చర్మ యథా తాద్రుస్య కాలిమా |

నశ్యతి క్రియయా, పుత్ర, పురషస్య తథా మలం ||“.

(బియ్యము పైనున్న పొట్టు దంచిన పోవును, రాగికి చిలుము పట్టిన అది తోమిన పోవును - ఆ ప్రకారముగానే పాపరూపమైన మలము కర్మయోగము, భక్తి యోగము జ్ఞానయోగము వలన ప్రయత్నము చేసీన పోవును).

  1. ధాతుమలములు : -

“కఫ పిత్తమలా స్వేద, నఖ రోమ తధైవ చ |

స్నేవో(అ)క్షి త్వగ్వివిశామోజో ధాతునాం క్రమశో మలాః ||“.

(కఫము, పిత్తము (పైత్యము), చెమట, గోళ్ళు, రోమములు, స్నేహము, అక్షి. త్వక్ (చర్మము), ఇవి ధాతు మలములు).

Transliteration
  1. dōṣamu, muṟiki, kalmaṣamu, pāpamu.

  2. dēhamulōni vasā, śuklamu modalagu panneṃḍu malamulu - cemaṭa, mūtramu, purīṣamu modalagunavi.

  3. saptadūṣyāḥ malamūtra śvakṛtsvēdā dayaḥ.

(śarīramulōni ēḍu dōṣamulu - malamu, mūtramu, svēdamu (cemaṭa) modalagunavi).

  1. malaṃ nāma pāpaṃ, tacca saṃskārātmanāti sūkṣmatvāt na pratyakṣī kriyatē, kiṃtu, niṣiddha karmānuṣṭhānēnaviṣayā saktyā cittagatāśubhavāsanābhiśca anumīyatē. ataḥ tannivṛttyarthaṃ niṣkāma karmāṇi bhūtadayādi, īśvaranāmōccāraṇādīni ca sādhanāni vihitāni.

(malamanagā pāpamu saṃskārarūpamainadi. (anēka janmamulalō cēsina pāpakarmala sūkṣmaphalarūpamu) kanuka mikkili sūkṣmamainadi – pratyakṣamugā kanabaḍadu - kāni śāstramulō cēyakūḍadani niṣēdhiṃcina karmalanu cēyuṭa valananu, viṣayamulaṃdāsakti kaligiyuṃḍuṭavalananu, manasulō nuṃḍu aśubhavāsanala valananu anumāniṃcuṭaku vīlagucunnadi. aṃducēta aṭṭi pāpamula nivṛttikoṟaku niṣkāmakarmalu - phalamu kōraka cēyukarmalu - bhūtamulaṃdu dayakaligi yuṃḍuṭa, bhagavannāmamula nuccariṃcuṭa anu modalagu sādhanamulu śāstramulō ceppabaḍinavi).

  1. “taṃḍulasya yathā carma yathā tādrusya kālimā |

naśyati kriyayā, putra, puraṣasya tathā malaṃ ||“.

(biyyamu painunna poṭṭu daṃcina pōvunu, rāgiki cilumu paṭṭina adi tōmina pōvunu - ā prakāramugānē pāparūpamaina malamu karmayōgamu, bhakti yōgamu jñānayōgamu valana prayatnamu cēsīna pōvunu).

  1. dhātumalamulu : -

“kapha pittamalā svēda, nakha rōma tadhaiva ca |

snēvō(a)kṣi tvagviviśāmōjō dhātunāṃ kramaśō malāḥ ||“.

(kaphamu, pittamu (paityamu), cemaṭa, gōḷḷu, rōmamulu, snēhamu, akṣi. tvak (carmamu), ivi dhātu malamulu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.