(నేను, నాది యను భావమేకాదు, దీనికి నేను స్వామిని, ఇదినాది, నాయిష్టమువచ్చినట్లు అనుభవించెదను అను అభిమానము కలిగియుండుట మమత).
(ఇది నాది అని భావించుట - అభిప్రాయపడుట).
మమకారము - ఇది నాది యను అభిమానము -
జీవశరీరాదులందు అహంభావము - ఈ శరీరము నేనే అను భావము.
“తే. ఈ జగంబేలు తొల్లిటి రాజవరులు
కాలవశమున నాయువుల్ గోలుపోయి
నామమాత్రావశిష్టులైనారు; గాన
నుంపవలవదు మమతను బెంపుతోడ”.
“వ. - - - అన్యోన్య వైరానుబంధంబులం గలహంబు చేసి రణరంగంబుల దృణప్రాయంబులుగా దేహాదులు వర్జించి నిర్జరలోకప్రాప్తులైన పృథు, యయాతి గాథి,
- - - హిరణ్యకశిపు, వృత్ర రావణ
- - - తారకాదులైన రాజులును, దైత్యులును ధరణికి మమత్వంబు జేసికదా కాలవశంబున నాశంబునొంది రది యంతయు మిథ్యగాన సర్వంబునుం బరిత్యజించి, జనార్థన, వైకుంఠ, వాసుదేవ, నృసిమ్హ యని నిరంతర హరికథామృత పానంబుచేసి జరారోగ వికృతలంబాసి హరి పదంబు నొందుము” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 12 - 18 -)
(nēnu, nādi yanu bhāvamēkādu, dīniki nēnu svāmini, idinādi, nāyiṣṭamuvaccinaṭlu anubhaviṃcedanu anu abhimānamu kaligiyuṃḍuṭa mamata).
(idi nādi ani bhāviṃcuṭa - abhiprāyapaḍuṭa).
mamakāramu - idi nādi yanu abhimānamu -
jīvaśarīrādulaṃdu ahaṃbhāvamu - ī śarīramu nēnē anu bhāvamu.
“tē. ī jagaṃbēlu tolliṭi rājavarulu
kālavaśamuna nāyuvul gōlupōyi
nāmamātrāvaśiṣṭulaināru; gāna
nuṃpavalavadu mamatanu beṃputōḍa”.
“va. - - - anyōnya vairānubaṃdhaṃbulaṃ galahaṃbu cēsi raṇaraṃgaṃbula dṛṇaprāyaṃbulugā dēhādulu varjiṃci nirjaralōkaprāptulaina pṛthu, yayāti gāthi,
- - - hiraṇyakaśipu, vṛtra rāvaṇa
- - - tārakādulaina rājulunu, daityulunu dharaṇiki mamatvaṃbu jēsikadā kālavaśaṃbuna nāśaṃbunoṃdi radi yaṃtayu mithyagāna sarvaṃbunuṃ barityajiṃci, janārthana, vaikuṃṭha, vāsudēva, nṛsimha yani niraṃtara harikathāmṛta pānaṃbucēsi jarārōga vikṛtalaṃbāsi hari padaṃbu noṃdumu” (śrīmadāṃdhramahābhāgavatamu - 12 - 18 -)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.