← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మంగళచండీ maṃgaḷacaṃḍī

Original — తెలుగు
  1. మంగళా చాసౌ చండీచ మంగళచండీ.

(శాశ్వతమైనది. కోపము గలది కనుక మంగళచండి యని చెప్పబడినది).

  1. “ప్రకృతేర్ముఖ సంభూతా సర్వమంగళదా సదా |

సృష్టౌ మంగళరూపా చ సంహా రే కోపరూపిణీ |

తేన మంగళ చండీ సా పండితైః పరికీర్తితా |

ప్రతిమంగళ వారేషు ప్రతివిశ్వేషు పూజితా ||“. (దేవీభాగవతము)

“సృష్టిసమయే మంగళరూపత్వాత్ అతి శాంత రూపత్వాత్, సంహా రకాలే కోపనత్వాత్ మంగళచండీతి నామ - మంగళా చ అసౌ చండీచ మంగళచండీ”.

(సృష్టికాలమందు మంగళరూపము కలిగియుండునది, అనగా, శాంత రూపము కలిగియుండునది, సంహా రకాలమందు కోపనరూపము కలిగియుండునది కనుక మంగళచండి యని పండితులు చెప్పుదురు. శాంతరూపము (మంగళరూపము), కోపనరూపము కలదికనుక మంగళచండి యని చెప్పబడినది).

  1. “దక్షాయా వర్తతే చండీ కల్యాణేషు చ మంగళా |

మంగళేషు చ యా దక్షా సాచ మంగల చండికా |

పూజ్యా యావర్తతే చండీ మంగళోపి మహీ సుతః |

మంగళాభీష్ట దేవియా సావా మంగళ చండికా |

మంగళో మనువంశ్యశ్చ సప్త ద్వీప ధరా పతిః |

తస్య పూజ్యాభీష్ట దేవీ తేన మంగళచండికా |

మూర్తి భేదేన సాదుర్గా మూల ప్రకృతిరీశ్వరీ |

కృపారూపాతి ప్రత్యక్షా యోషితాం ఇష్టదేవతా ||“. (దేవీభాగవతం)

(కల్యాణేషు కల్యాణ కరణేషు యా దక్షయా చండీ ప్రతాపవతీ. తథా మంగళేషు, తేషాం మధ్యే యా మంగళా. తేన మంగళచండీతినామ - మంగళాచా చండీచ మంగళచండీతుత్పత్యా మంగళ చండీతి నామ సిద్ధం - మంగళో భూమి పుత్రః తస్య పూజ్యా తదభీష్టదాత్రీచ యా చండీ సా మంగళ చండీత్యర్థః.

(కల్యాణమును - శుభమును - చేయువారిలో ప్రతాపవంతురాలు, శక్తిమంతురాలు, అట్లే మంగళములలో మంగళమైనదియు కనుక మంగళచండి యను పేరుకలిగినది. మంగళా, చండీ కూడా కనుక మంగళచండి యను పేరు కలిగినది. మంగళా, చండీ కూడ కనుక మంగళచండి యను వ్యుత్పత్యర్థము. మంగళుడు అనగా భూపుత్రుడు. అతని చేత పూజింపబడునది, అతని అభీష్టమును - కోరికను చేకూర్చునది. అందుచేత కూడ మంగళ చండి యని చెప్పబడుచున్నది. మన వంశమునకు చెందినవాడున్నూ సప్తద్వీపములకు అధిపతి అయిన మంగళునకు పూజ్యురాలు. అతనిచేత పూజింపబడి యతని కోరికల నెరవేర్చునది, కనుక మంగళచెండి యని చెప్పబడుచున్నది - దుర్గా; దేవి).

  1. “క. మ్రింగెడివాడు విభుండని

మ్రింగెడిదియు గరళమనియు మేలని ప్రజలకున్

మ్రింగమనె సర్వమంగళ

మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 8 - 7 - 241)

Transliteration
  1. maṃgaḷā cāsau caṃḍīca maṃgaḷacaṃḍī.

(śāśvatamainadi. kōpamu galadi kanuka maṃgaḷacaṃḍi yani ceppabaḍinadi).

  1. “prakṛtērmukha saṃbhūtā sarvamaṃgaḷadā sadā |

sṛṣṭau maṃgaḷarūpā ca saṃhā rē kōparūpiṇī |

tēna maṃgaḷa caṃḍī sā paṃḍitaiḥ parikīrtitā |

pratimaṃgaḷa vārēṣu prativiśvēṣu pūjitā ||“. (dēvībhāgavatamu)

“sṛṣṭisamayē maṃgaḷarūpatvāt ati śāṃta rūpatvāt, saṃhā rakālē kōpanatvāt maṃgaḷacaṃḍīti nāma - maṃgaḷā ca asau caṃḍīca maṃgaḷacaṃḍī”.

(sṛṣṭikālamaṃdu maṃgaḷarūpamu kaligiyuṃḍunadi, anagā, śāṃta rūpamu kaligiyuṃḍunadi, saṃhā rakālamaṃdu kōpanarūpamu kaligiyuṃḍunadi kanuka maṃgaḷacaṃḍi yani paṃḍitulu ceppuduru. śāṃtarūpamu (maṃgaḷarūpamu), kōpanarūpamu kaladikanuka maṃgaḷacaṃḍi yani ceppabaḍinadi).

  1. “dakṣāyā vartatē caṃḍī kalyāṇēṣu ca maṃgaḷā |

maṃgaḷēṣu ca yā dakṣā sāca maṃgala caṃḍikā |

pūjyā yāvartatē caṃḍī maṃgaḷōpi mahī sutaḥ |

maṃgaḷābhīṣṭa dēviyā sāvā maṃgaḷa caṃḍikā |

maṃgaḷō manuvaṃśyaśca sapta dvīpa dharā patiḥ |

tasya pūjyābhīṣṭa dēvī tēna maṃgaḷacaṃḍikā |

mūrti bhēdēna sādurgā mūla prakṛtirīśvarī |

kṛpārūpāti pratyakṣā yōṣitāṃ iṣṭadēvatā ||“. (dēvībhāgavataṃ)

(kalyāṇēṣu kalyāṇa karaṇēṣu yā dakṣayā caṃḍī pratāpavatī. tathā maṃgaḷēṣu, tēṣāṃ madhyē yā maṃgaḷā. tēna maṃgaḷacaṃḍītināma - maṃgaḷācā caṃḍīca maṃgaḷacaṃḍītutpatyā maṃgaḷa caṃḍīti nāma siddhaṃ - maṃgaḷō bhūmi putraḥ tasya pūjyā tadabhīṣṭadātrīca yā caṃḍī sā maṃgaḷa caṃḍītyarthaḥ.

(kalyāṇamunu - śubhamunu - cēyuvārilō pratāpavaṃturālu, śaktimaṃturālu, aṭlē maṃgaḷamulalō maṃgaḷamainadiyu kanuka maṃgaḷacaṃḍi yanu pērukaliginadi. maṃgaḷā, caṃḍī kūḍā kanuka maṃgaḷacaṃḍi yanu pēru kaliginadi. maṃgaḷā, caṃḍī kūḍa kanuka maṃgaḷacaṃḍi yanu vyutpatyarthamu. maṃgaḷuḍu anagā bhūputruḍu. atani cēta pūjiṃpabaḍunadi, atani abhīṣṭamunu - kōrikanu cēkūrcunadi. aṃducēta kūḍa maṃgaḷa caṃḍi yani ceppabaḍucunnadi. mana vaṃśamunaku ceṃdinavāḍunnū saptadvīpamulaku adhipati ayina maṃgaḷunaku pūjyurālu. atanicēta pūjiṃpabaḍi yatani kōrikala neravērcunadi, kanuka maṃgaḷaceṃḍi yani ceppabaḍucunnadi - durgā; dēvi).

  1. “ka. mriṃgeḍivāḍu vibhuṃḍani

mriṃgeḍidiyu garaḷamaniyu mēlani prajalakun

mriṃgamane sarvamaṃgaḷa

maṃgaḷasūtraṃbu neṃta madi namminadō”. (śrīmadāṃdhramahābhāgavatamu - 8 - 7 - 241)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.