← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మంత్రద్రష్టలు maṃtradraṣṭalu

Original — తెలుగు

“మంత్రకృతో వృణీతౌ” ఇత్యాదిభిః వేదశబ్దైః తత్తత్కాండసూక్త మంత్ర కృతాం ఋషీణాం ఆకృతి శక్త్యాదికం పరామృశ్య తత్తదాకారాన్ తత్తచ్ఛక్తి యుక్తాంశ్చ సృష్ట్వా ప్రజాపతిః తానేవ తత్తన్మంత్రాది కరణే నియుంక్తే. తేపి ప్రజాపతినా ఆహిత శక్తయః తత్తదనుగుణం తపస్తస్త్వా నిత్యసిద్ధాన్ పూర్వ పూర్వ వసిష్టాది దృష్టాన్ తానేవ మంత్రాదీన్ అనధీత్యైవ స్వరతః వర్ణతశ్చ అస్ఖలితాన్ పశ్యంతి. అతశ్చ వేదానాం నిత్యత్వం ఏషాంచ మంత్రకృత్వముపపద్యతే.

(ఒక కల్పమున ఏ ఋషులు ఒక కల్పములో మంత్రములను కనుగొనిరో ఆ ఋషులయొక్క ఆకృతి శక్తులను పరామర్శించి ఆయా ఆకారములతో, ఆయా శక్తులతో ఆయా ఋషులను ప్రజాపతి (చతుర్ముఖ బ్రహ్మ) సృష్టించి ఆ ఋషులనే ఆ మంత్రములగుఱించి నియమించుచున్నాడు - ఆ ఋషులు ప్రజాపతివలన కలిగిన శక్తులుగలవారై వారికనుగుణమగు తపస్సును చేసి నిత్యసిద్ధమై పూర్వ కల్పములలో వశిష్టుడు మొదలగు ఋషులకు గోచరమైన మంత్రములను అధ్యయనము చేయకుండగనే స్వరముతోను, అక్షరములతోను దోషము లేకుండునట్లు కనుగొనిరి. అందుచేతనే ఈ మంత్రములుగల వేదములు నిత్యమైనవి అని, మంత్రకృతములని చెప్పబడినవి)

Transliteration

“maṃtrakṛtō vṛṇītau” ityādibhiḥ vēdaśabdaiḥ tattatkāṃḍasūkta maṃtra kṛtāṃ ṛṣīṇāṃ ākṛti śaktyādikaṃ parāmṛśya tattadākārān tattacchakti yuktāṃśca sṛṣṭvā prajāpatiḥ tānēva tattanmaṃtrādi karaṇē niyuṃktē. tēpi prajāpatinā āhita śaktayaḥ tattadanuguṇaṃ tapastastvā nityasiddhān pūrva pūrva vasiṣṭādi dṛṣṭān tānēva maṃtrādīn anadhītyaiva svarataḥ varṇataśca askhalitān paśyaṃti. ataśca vēdānāṃ nityatvaṃ ēṣāṃca maṃtrakṛtvamupapadyatē.

(oka kalpamuna ē ṛṣulu oka kalpamulō maṃtramulanu kanugonirō ā ṛṣulayokka ākṛti śaktulanu parāmarśiṃci āyā ākāramulatō, āyā śaktulatō āyā ṛṣulanu prajāpati (caturmukha brahma) sṛṣṭiṃci ā ṛṣulanē ā maṃtramulaguṟiṃci niyamiṃcucunnāḍu - ā ṛṣulu prajāpativalana kaligina śaktulugalavārai vārikanuguṇamagu tapassunu cēsi nityasiddhamai pūrva kalpamulalō vaśiṣṭuḍu modalagu ṛṣulaku gōcaramaina maṃtramulanu adhyayanamu cēyakuṃḍaganē svaramutōnu, akṣaramulatōnu dōṣamu lēkuṃḍunaṭlu kanugoniri. aṃducētanē ī maṃtramulugala vēdamulu nityamainavi ani, maṃtrakṛtamulani ceppabaḍinavi)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.