ఋషి, ఛందస్సు, దేవతా, బీజం, శక్తిః, మంత్రః, కీలకం, అస్త్రం, నేత్రం, కవచం, యోనిః, దిగ్బంధనం, ధ్యానం,. వినియోగః - అనునవి మంత్రాంగములు.
“శ్లో||. ఋషిర్గురుత్వాత్ సిరసైవధార్యో ఛందో(అ)క్షరత్వాత్ రసనా గతం స్యాత్ |
ఋషి వర్ణాదికా ధాతూస్తో గత్యాం ప్రాపణేపి చ |
తాభ్యాం యద్యత్స్వరూపం స ఋషిః స్యాత్ గురువాచకః |
ఇచ్ఛా దానార్థకౌ ధాతూ సచ్చబ్దాద్యశ్ఛదాదికః |
తయోరిచ్చా దదాతీతి ఛందో మంత్రార్ణవాచకః |
ఆత్మనో దేవతా భావ ప్రదానాద్దేవ తేతిచ |
పదం సమస్త మంత్రేషు విద్వద్భిస్సముదీరిత మితి |
హృదయం బుద్ధి గమ్యత్వాత్ ప్రణమస్యాన్నమః పదం |
క్రియతే హృదయే నాతో బుద్ధిగమ్యా నమస్కృతిః |
తుంగార్థస్సిరసే చేతి విషయాహరణే ద్వితః |
శిరోమంత్రేణ చోత్తుంగ విషయా హృతి లక్షణా |
శిఖా తేజస్స ముద్ధిష్టా నషడిత్యంగ ముచ్యతే |
తత్తేజో స్య తనుః ప్రోక్తా శిఖామంత్రేణ మంత్రిభిః |
కచగ్రహణ ఇత్యస్మాద్ధాతోః కవచ సంభవః |
హుంతే జస్తేజసా దేహే గృహ్యతే కవచం తతః |
అసుత్రాసాదికా ధాతూ సంక్షేప చలనాదికా |
తేనారిష్టం సమాక్షిప్య చాలయే త్షట్పదాగ్నినా |
లేత్రం దృష్టి సమాదిష్టా వేషద్దర్శన ముచ్యతే |
దర్శనం దృగ్విషయే నస్యాత్ తత్తేజో నేత్రవాచకమితి |
ఏవం షడంగ విన్యాసం కృత్వా పునర్బీజ శక్త్యాదికం స్మరేత్ |”
“సర్వమంత్రాణామపి ప్రకృతిర్దేవతా, అధిష్టాత్రీ, దేవతా, అభిమానీదేవతా చేతి దేవతా త్త్రెధ్యమస్తి, సర్వ తంత్రేషు బ్రహ్మబీజం, మాయాశక్తిః; జీవో బీజం బుద్ధి శక్తిః; ఉదానో బీజం, సుషుమ్నా శక్తిః, తత్ర బ్రహ్మ మాయా శబ్దాభ్యాం ప్రణవ హృల్లేఖార్థ భూతే పరబ్రహ్మ, మూల ప్రకృతీ ఉచ్యతే. జీవ బుద్ధి శబ్దాభ్యాం సర్వకారణభూత బ్రహ్మమాయా యార్జ్ఞానభాగా ఉచ్యతే. ఉదాన సుషుమ్నా శబ్దాభ్యాం బ్రహ్మ మాయా యోః ప్రవర్తకా ప్రపంచ కారణత్వం, ప్రణవహృల్లేఖయోః సమస్త మంత్ర బీజ శక్తికారణత్వం చోక్తం భవతి. తస్మాత్ సమస్త మంత్రాను స్యూత బ్రహ్మాత్మక మాతృకా మంత్రావగాహి ప్రణవ హృల్లేఖావాచ్య మాయా శబలిత బ్రహ్మస్వరూప ప్రత్యగాత్మ భూతాఖండ సుఖ చిత్ప్రకాశాత్ సమస్తాంగసహిత సర్వ దేతా మంత్ర మూర్తయః సాధకస్య భాగ్య వశాత్ ప్రజ్వలితాగ్నేః విస్ఫులింగా ఇవ ప్రాదుర్భూతా ఇతి భావ యేత్. ఏవం సకలమంత్రాణాం ఋషి చ్ఛందో, దేవతా, బీజ, శక్తి, కీలకా ఇతి షడంగజ్ఞాన మావశ్యకం”
“తతః ప్రకాశ విమర్శ్యాంశ భూత హస్తద్వయాంగుళీషు పంచభూతాత్మకేషు - మూల మంత్ర పదైః వర్ణెర్వా న్యాసం కుర్యాత్, తేన తద్దేవతా మంత్రసాధకానాం తాదాత్మ్యం సిద్ధిః. అనంతరం తథా విధేష్ట దేవతామయం తేజస్స్వశరీరే అంతర్బహిర్వ్యాప్నోతి ఇతి భావయేత్ -”.
(ఋషి గురువగుటచేత శిరస్సునందు ధరించవలెను, ఛందస్సు అక్షరములు కనుక రసనమునుండి వెలువడినవి. ఈ రెండింటి స్వరూపము గురువైన ఋషి. కోరినదిచ్చునది ‘ఛ’ కారము - అక్షరములతో కూడినది ఛందస్సు - మంత్రము యొక్క అర్థమును తెలుపునది. ఆత్మ దేవతా భావము కలుగచేయునది కనుక మంత్రదేవతయని చెప్పబడినది. హృదయము బుద్ధికి సంబంధించినది. ప్రణామము హృదయముతో చెప్పబడునది. అందుచేత హృదయము పదము - అన్నింటికంటె ముఖ్యమైనది శిరస్సు. ‘శిఖా’ యనగా తేజస్సు. వషట్ అనగా శరీరము - ‘కవచాయ హం’ ఆ తేజస్సును శరీరము గ్రహించును - అందువల్ల అది శరీరమునకు కవచమగును - గ్రహించునది కనుక కవచము - తేజస్సును శరీరములోనికి గ్రహించునది. నేత్రమనగా సమాధిలోనున్నప్పటి దృష్టి. ‘నౌషట్’ అనగా దర్శనము - దృర్శనమనగా దృగ్విషయముకాదు, ఆ తేజస్సే నేత్రము - ఇవి మంత్రముయొక్క షడంగములు - ఋషి, ఛందస్సు దేవత, హృదయము (పదము), శిరస్సు, శిఖా - మంత్రములు బీజము, శక్తికలవి. అన్ని మంత్రములకు ప్రకృతి దేవత, అధిష్టాన దేవత, అభిమాన దేవత అని దేవత మూడు విధములు - అన్ని మంత్రములందు బ్రహ్మబీజము, మాయశక్తి, జీవుడు బీజము, బుద్ధి శక్తి, ఉదానము బీజము, సుషుమ్నశక్తి అనగా ఓంకారమందుండు పరబ్రహ్మ (సత్). - మాయ యనగా మూల ప్రకృతి (ఇది పరబ్రహ్మయొక్క శక్తి); జీవుని శక్తి బుద్ధి (అనగా, అన్నింటికీ కారణమైన బ్రహ్మ మాయతో కలిసిన దాని జ్ఞానభాగము (‘అచిత్ తో కలిసిన చిత్’). ఉదానముయొక్క శక్తి సుషుమ్న - అనగా పరబ్రహ్మ మాయతో కలిసి ప్రపంచమునకు కారణమైన శక్తి. అందుచేత ప్రణవము (ఓంకారము) సమస్త మంత్రముల బీజము శక్తికి కారణము -. అందుచేత సమస్త మంత్రములలోను అనున్యూతమై బ్రహ్మాత్మకమైనది; మాతృకామంత్రము. ఇది మాయా శబల బ్రహ్మ స్వరూపము, చైతన్యరూపము, ప్రకాశరూపము (తేజోరూపము కలిగియుండుట వలన అన్ని అంగములతో కూడియున్న సమస్త దేవతా మంత్రముల దేవతులు సాధకుని భాగ్యవశమున, బాగుగా మండుచున్న అగ్నినుండి వెలువడు విస్ఫులింగములువలె, ఆవిర్భించిరి ఆని భావించవలెను. ఈ ప్రకారముగా అన్ని మంత్రములకు ఋషి, ఛందస్సు, దేవత, బీజము, శక్తి, కీలకము అను షడంగములు గలవను జ్ఞానము ఆవశ్యకము).
ṛṣi, chaṃdassu, dēvatā, bījaṃ, śaktiḥ, maṃtraḥ, kīlakaṃ, astraṃ, nētraṃ, kavacaṃ, yōniḥ, digbaṃdhanaṃ, dhyānaṃ,. viniyōgaḥ - anunavi maṃtrāṃgamulu.
“ślō||. ṛṣirgurutvāt sirasaivadhāryō chaṃdō(a)kṣaratvāt rasanā gataṃ syāt |
ṛṣi varṇādikā dhātūstō gatyāṃ prāpaṇēpi ca |
tābhyāṃ yadyatsvarūpaṃ sa ṛṣiḥ syāt guruvācakaḥ |
icchā dānārthakau dhātū saccabdādyaśchadādikaḥ |
tayōriccā dadātīti chaṃdō maṃtrārṇavācakaḥ |
ātmanō dēvatā bhāva pradānāddēva tētica |
padaṃ samasta maṃtrēṣu vidvadbhissamudīrita miti |
hṛdayaṃ buddhi gamyatvāt praṇamasyānnamaḥ padaṃ |
kriyatē hṛdayē nātō buddhigamyā namaskṛtiḥ |
tuṃgārthassirasē cēti viṣayāharaṇē dvitaḥ |
śirōmaṃtrēṇa cōttuṃga viṣayā hṛti lakṣaṇā |
śikhā tējassa muddhiṣṭā naṣaḍityaṃga mucyatē |
tattējō sya tanuḥ prōktā śikhāmaṃtrēṇa maṃtribhiḥ |
kacagrahaṇa ityasmāddhātōḥ kavaca saṃbhavaḥ |
huṃtē jastējasā dēhē gṛhyatē kavacaṃ tataḥ |
asutrāsādikā dhātū saṃkṣēpa calanādikā |
tēnāriṣṭaṃ samākṣipya cālayē tṣaṭpadāgninā |
lētraṃ dṛṣṭi samādiṣṭā vēṣaddarśana mucyatē |
darśanaṃ dṛgviṣayē nasyāt tattējō nētravācakamiti |
ēvaṃ ṣaḍaṃga vinyāsaṃ kṛtvā punarbīja śaktyādikaṃ smarēt |”
“sarvamaṃtrāṇāmapi prakṛtirdēvatā, adhiṣṭātrī, dēvatā, abhimānīdēvatā cēti dēvatā ttredhyamasti, sarva taṃtrēṣu brahmabījaṃ, māyāśaktiḥ; jīvō bījaṃ buddhi śaktiḥ; udānō bījaṃ, suṣumnā śaktiḥ, tatra brahma māyā śabdābhyāṃ praṇava hṛllēkhārtha bhūtē parabrahma, mūla prakṛtī ucyatē. jīva buddhi śabdābhyāṃ sarvakāraṇabhūta brahmamāyā yārjñānabhāgā ucyatē. udāna suṣumnā śabdābhyāṃ brahma māyā yōḥ pravartakā prapaṃca kāraṇatvaṃ, praṇavahṛllēkhayōḥ samasta maṃtra bīja śaktikāraṇatvaṃ cōktaṃ bhavati. tasmāt samasta maṃtrānu syūta brahmātmaka mātṛkā maṃtrāvagāhi praṇava hṛllēkhāvācya māyā śabalita brahmasvarūpa pratyagātma bhūtākhaṃḍa sukha citprakāśāt samastāṃgasahita sarva dētā maṃtra mūrtayaḥ sādhakasya bhāgya vaśāt prajvalitāgnēḥ visphuliṃgā iva prādurbhūtā iti bhāva yēt. ēvaṃ sakalamaṃtrāṇāṃ ṛṣi cchaṃdō, dēvatā, bīja, śakti, kīlakā iti ṣaḍaṃgajñāna māvaśyakaṃ”
“tataḥ prakāśa vimarśyāṃśa bhūta hastadvayāṃguḷīṣu paṃcabhūtātmakēṣu - mūla maṃtra padaiḥ varṇervā nyāsaṃ kuryāt, tēna taddēvatā maṃtrasādhakānāṃ tādātmyaṃ siddhiḥ. anaṃtaraṃ tathā vidhēṣṭa dēvatāmayaṃ tējassvaśarīrē aṃtarbahirvyāpnōti iti bhāvayēt -”.
(ṛṣi guruvaguṭacēta śirassunaṃdu dhariṃcavalenu, chaṃdassu akṣaramulu kanuka rasanamunuṃḍi veluvaḍinavi. ī reṃḍiṃṭi svarūpamu guruvaina ṛṣi. kōrinadiccunadi ‘cha’ kāramu - akṣaramulatō kūḍinadi chaṃdassu - maṃtramu yokka arthamunu telupunadi. ātma dēvatā bhāvamu kalugacēyunadi kanuka maṃtradēvatayani ceppabaḍinadi. hṛdayamu buddhiki saṃbaṃdhiṃcinadi. praṇāmamu hṛdayamutō ceppabaḍunadi. aṃducēta hṛdayamu padamu - anniṃṭikaṃṭe mukhyamainadi śirassu. ‘śikhā’ yanagā tējassu. vaṣaṭ anagā śarīramu - ‘kavacāya haṃ’ ā tējassunu śarīramu grahiṃcunu - aṃduvalla adi śarīramunaku kavacamagunu - grahiṃcunadi kanuka kavacamu - tējassunu śarīramulōniki grahiṃcunadi. nētramanagā samādhilōnunnappaṭi dṛṣṭi. ‘nauṣaṭ’ anagā darśanamu - dṛrśanamanagā dṛgviṣayamukādu, ā tējassē nētramu - ivi maṃtramuyokka ṣaḍaṃgamulu - ṛṣi, chaṃdassu dēvata, hṛdayamu (padamu), śirassu, śikhā - maṃtramulu bījamu, śaktikalavi. anni maṃtramulaku prakṛti dēvata, adhiṣṭāna dēvata, abhimāna dēvata ani dēvata mūḍu vidhamulu - anni maṃtramulaṃdu brahmabījamu, māyaśakti, jīvuḍu bījamu, buddhi śakti, udānamu bījamu, suṣumnaśakti anagā ōṃkāramaṃduṃḍu parabrahma (sat). - māya yanagā mūla prakṛti (idi parabrahmayokka śakti); jīvuni śakti buddhi (anagā, anniṃṭikī kāraṇamaina brahma māyatō kalisina dāni jñānabhāgamu (‘acit tō kalisina cit’). udānamuyokka śakti suṣumna - anagā parabrahma māyatō kalisi prapaṃcamunaku kāraṇamaina śakti. aṃducēta praṇavamu (ōṃkāramu) samasta maṃtramula bījamu śaktiki kāraṇamu -. aṃducēta samasta maṃtramulalōnu anunyūtamai brahmātmakamainadi; mātṛkāmaṃtramu. idi māyā śabala brahma svarūpamu, caitanyarūpamu, prakāśarūpamu (tējōrūpamu kaligiyuṃḍuṭa valana anni aṃgamulatō kūḍiyunna samasta dēvatā maṃtramula dēvatulu sādhakuni bhāgyavaśamuna, bāgugā maṃḍucunna agninuṃḍi veluvaḍu visphuliṃgamuluvale, āvirbhiṃciri āni bhāviṃcavalenu. ī prakāramugā anni maṃtramulaku ṛṣi, chaṃdassu, dēvata, bījamu, śakti, kīlakamu anu ṣaḍaṃgamulu galavanu jñānamu āvaśyakamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.