← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మనసా manasā

Original — తెలుగు
  1. “శ్లో||. నారాయణాం శో భగవాన్ జరత్కారుర్మునీశ్వరః |

తపసా తేజసా త్వాంచ మనసా స సృజేపితా |

అస్మాకం రక్షణా యైన తేన త్వం మనసాభిథా |

మనసా దేవి శక్త్యాత్వం స్వాత్మనా సిద్ధయోగినీ |

తేన త్వం మనసా దేవీ పూజితా వందితా భవ |

యే భక్త్యా మనసాం దేవాః పూజయత్యనిశం భృశం |

తేనత్వాం మనసా దేవీం ప్రవదంతి మనీషణః |

సత్వస్వరూపా దేవీ త్వం శశ్వత్ సత్య నిషేవణాత్ |

యోహిత్వాం భావయేన్నిత్యం సత్వాం ప్రాప్నోతి తత్పరః ||“. (దేవీభాగవతం)

(నారాయణుని అంశకు చెందిన భగవంతుడగు జరత్కారుడను ముని తపస్సు చేసి తేజస్సుతో మమ్ములను రక్షించుటకు మనసా (మనస్సులో(తో)) నిన్ను సౄష్టించెను. అందుచేత నీవు మనసా అను పేరు పొందితివి. మనసా శక్తిచేత నీయంతట నీవే యోగసిద్ధిని పొందితివి. అందుచేత నీవు ‘మనసా’ దేవి అని పూజింపబడుచున్నావు. దేవతలు నిన్ను ‘మనసా దేవి’ అని ఎల్లపుడు పూజించుచున్నారు. కనుక బుద్ధిమంతులు - జ్ఞానులు - నిన్ను ‘మనసా దేవి’ అని చెప్పుచున్నారు - నిత్యము సత్యమునే పాటించు దానవు కనుక నీవు సత్యస్వరూపివి. ఎవడు నిన్ను తాత్పర్యముతో తదేక ధ్యానముతో భావింతురో (భావన చేయునో) వాడు అన్ని విధములగు శక్తిని - లేక సత్వగుణమును పొందును.)

  1. “సా చ కన్యా భగవతీ కశ్యపస్య చ మానినీ |

తేనైవ మనసాదేవీ మనసా యా చ దీవ్యతి |

మనసా ధ్యాయతే యాచ పరమాత్మా నమీశ్వరం |

తేనసా మానసాదేవీ తేన యోగేన దీవ్యతి |

ఆత్మా రామాచ సా దేవీ వైష్ణవీ సిద్ధయోగినీ |“. (దేవీభాగవతం)

(కశ్యపుని కుమార్తె అయినటువంటిన్నీ, మానవంతురాలు అయిన ఆ దేవి మనస్సు చేతనే ప్రకాశించునది. అందుచేతనే ఆమె ‘మనసా దేవి’ అని చెప్పబడుచున్నది. పరమాత్మ అయిన ఈశ్వరుని మనసా (మనస్సుతో) ధ్యానించునదికనుక ‘మనసా దేవి’ అని చెప్పబడుచున్నది. ఈశ్వరునియందు మనసా యోగముచేత ధ్యానించునది కనుక ‘మనసా దేవి’ అని చెప్పబడినది. ఆ దేవియే ఆత్మారామము, వైష్ణవి, యోగ సిద్ధిని పొందినది).

  1. మనో జన్యత్వాన్మనసా దేవనాద్వా మనశ్శబ్దా దర్శ ఆద్య చ కృతే మనసా ఇతి సిద్ధం - మనఃకరణకధ్యానకర్తృత్వాద్వా ‘మనసా’ ఇతి సిద్ధం ఇత్యర్థః - అత్రాప్యాదర్శ ఆద్య జేవ జనకత్వేన దేవనధ్యాన సాధనత్వేన వా మనోస్తి యస్యా ఇతి వ్యుత్పత్తేః - తేన యోగేన పరమాత్మసమాధి, రూపేణ యతో దీవ్యతి తతః ఇత్యర్థః.

(మనసులో పుట్టినదగుటచేతను, మనసులో ప్రకాశించునదగుటచేతను మనశ్శబ్దమాదర్శమగుటచేతను మొదట పుట్టిన శక్తి మనసా అయినది; లేక, మనస్సు అను ఇంద్రియము ధ్యానము చేయునదికనుక ‘మనసా’ను పేరు సిద్ధించినది. ఋషివలన కలుగుటచేతను, ప్రకాశించుటచేతను, ధ్యానమునకు సాధనమగుటచేతను, మనస్సుకలది కనుక ’మనసా’ అని చెప్పబడినది).

Transliteration
  1. “ślō||. nārāyaṇāṃ śō bhagavān jaratkārurmunīśvaraḥ |

tapasā tējasā tvāṃca manasā sa sṛjēpitā |

asmākaṃ rakṣaṇā yaina tēna tvaṃ manasābhithā |

manasā dēvi śaktyātvaṃ svātmanā siddhayōginī |

tēna tvaṃ manasā dēvī pūjitā vaṃditā bhava |

yē bhaktyā manasāṃ dēvāḥ pūjayatyaniśaṃ bhṛśaṃ |

tēnatvāṃ manasā dēvīṃ pravadaṃti manīṣaṇaḥ |

satvasvarūpā dēvī tvaṃ śaśvat satya niṣēvaṇāt |

yōhitvāṃ bhāvayēnnityaṃ satvāṃ prāpnōti tatparaḥ ||“. (dēvībhāgavataṃ)

(nārāyaṇuni aṃśaku ceṃdina bhagavaṃtuḍagu jaratkāruḍanu muni tapassu cēsi tējassutō mammulanu rakṣiṃcuṭaku manasā (manassulō(tō)) ninnu sṝṣṭiṃcenu. aṃducēta nīvu manasā anu pēru poṃditivi. manasā śakticēta nīyaṃtaṭa nīvē yōgasiddhini poṃditivi. aṃducēta nīvu ‘manasā’ dēvi ani pūjiṃpabaḍucunnāvu. dēvatalu ninnu ‘manasā dēvi’ ani ellapuḍu pūjiṃcucunnāru. kanuka buddhimaṃtulu - jñānulu - ninnu ‘manasā dēvi’ ani ceppucunnāru - nityamu satyamunē pāṭiṃcu dānavu kanuka nīvu satyasvarūpivi. evaḍu ninnu tātparyamutō tadēka dhyānamutō bhāviṃturō (bhāvana cēyunō) vāḍu anni vidhamulagu śaktini - lēka satvaguṇamunu poṃdunu.)

  1. “sā ca kanyā bhagavatī kaśyapasya ca māninī |

tēnaiva manasādēvī manasā yā ca dīvyati |

manasā dhyāyatē yāca paramātmā namīśvaraṃ |

tēnasā mānasādēvī tēna yōgēna dīvyati |

ātmā rāmāca sā dēvī vaiṣṇavī siddhayōginī |“. (dēvībhāgavataṃ)

(kaśyapuni kumārte ayinaṭuvaṃṭinnī, mānavaṃturālu ayina ā dēvi manassu cētanē prakāśiṃcunadi. aṃducētanē āme ‘manasā dēvi’ ani ceppabaḍucunnadi. paramātma ayina īśvaruni manasā (manassutō) dhyāniṃcunadikanuka ‘manasā dēvi’ ani ceppabaḍucunnadi. īśvaruniyaṃdu manasā yōgamucēta dhyāniṃcunadi kanuka ‘manasā dēvi’ ani ceppabaḍinadi. ā dēviyē ātmārāmamu, vaiṣṇavi, yōga siddhini poṃdinadi).

  1. manō janyatvānmanasā dēvanādvā manaśśabdā darśa ādya ca kṛtē manasā iti siddhaṃ - manaḥkaraṇakadhyānakartṛtvādvā ‘manasā’ iti siddhaṃ ityarthaḥ - atrāpyādarśa ādya jēva janakatvēna dēvanadhyāna sādhanatvēna vā manōsti yasyā iti vyutpattēḥ - tēna yōgēna paramātmasamādhi, rūpēṇa yatō dīvyati tataḥ ityarthaḥ.

(manasulō puṭṭinadaguṭacētanu, manasulō prakāśiṃcunadaguṭacētanu manaśśabdamādarśamaguṭacētanu modaṭa puṭṭina śakti manasā ayinadi; lēka, manassu anu iṃdriyamu dhyānamu cēyunadikanuka ‘manasā’nu pēru siddhiṃcinadi. ṛṣivalana kaluguṭacētanu, prakāśiṃcuṭacētanu, dhyānamunaku sādhanamaguṭacētanu, manassukaladi kanuka ’manasā’ ani ceppabaḍinadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.