← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మనోన్మని manōnmani

Original — తెలుగు
  1. “విధివత్ ప్రాణ సం యామైర్నాడీ చక్రే విశోధితే |

సుషుమ్నా వదనం భిత్వా సుఖాద్విశతి మారుతః |

మారుతే మధ్య సంచారే మనస్థైర్యం ప్రజాయతే |

యా మనస్సు స్థిరీభావః స్తైవా వస్థా మనోన్మని ||“. (శాండిల్యోపనిషత్)

(శాస్త్రప్రకారము ప్రాణాయామము చేసినయడల నాడీ చక్రము - నాడులు - శుధ్ధిచేయబడిన వగును. అప్పుడు ప్రాణవాయువు సుషుమ్నానాడి వదనమును - ముఖమును - చీల్చుకొని దానిలో ప్రవేశించును. సుషుమ్నానాడిలో వాయువు సంచరించినపుడు మనస్థైర్యము కలుగును. (మనస్సు స్థిరముగానుండును). మనస్సు స్థిరముగానుండు అవస్థయే (condition) మనోన్మని - మనస్సు యొక్క ఉన్మనీ అవస్థ).

  1. “ధ్యానధ్యాతృ ధ్యేయ భావో యథా భవతి నిర్భరం |

తధోన్మనత్వం భవతి జ్ఞానామృత నిషేవణాత్ ||“.

(ధ్యానము, ధ్యానముచేయువాడు, ధ్యేయవస్తువు - ఈ మూడు (త్రిపుటి) ఎప్పుడు నశించునో, అప్పుడు జ్ఞానము - భగవత్ జ్ఞానము కలుగుటచేత ఉన్మనీ అవస్థ కలుగును).

  1. “యథా నజాయతే పుత్రః పితరం మాతరం వినా |

తదా భవం భవానీంచ వినా నైత చ్ఛరాచరం |

స్త్రీ పుంస ప్రభవం విశ్వం స్త్రీపుంసాత్మకమేవ చ |

స్త్రీ పుంస యోర్విభూతిశ్చ స్త్రీపుంసా మథిష్ఠతం |

పరమాత్మా శివః ప్రోక్తః శివాచ శివా చ పరికీర్తితా |

శివస్సదాశివః ప్రోక్తశ్శివా సా చ మనోన్మనీ |“. (వాయవ్య సమ్హితాయాం)

(తల్లి తండ్రి లేనిదే పుత్రుడు పుట్టనట్లే భవాని (దేవి), భవుడు (శివుడు) - ఈ ఇద్దరు లేనిదే చరాచరరూపములుగల ఈ జగత్తు పుట్టదు. స్త్రీ పురుష సం యోగమువలన కలిగిన ఈ జగత్తు అంతయు స్త్రీ పురుషాత్మకమే - ఆ మొదటి స్త్రీ పురుషులే ఈ జగత్తులోని స్త్రీ పురుషులందరు - ఇట్లు జగత్తులో స్త్రీలుగాను, పురుషులు గాను పుట్టినవన్నియు ఆ శివ పార్వతుల విభూతులే. వాటి అన్నింటిలోను ఆ శివ పార్వతులు అధిష్టించియున్నారు - పరమాత్మయే - పరబ్రహ్మయే శివుడని, శివా యని పార్వతియే చెప్పబడుచున్నది. ఆ శివుడే సదాశివుడు, ఆ శివా యే మనోన్మని - శివుని శక్తి - మనసులో అధిష్టించియుండి మనోవృత్తులనునడిపించునది).

  1. మనః మంతా జీవః - చైతన్యో ద్దీపకః -

(మనస్సును చైతన్యవంతముగా చేయునది - జీవుడు)

  1. మనోలయస్థానం –

“నిరస్త విషయా సంగం సం నిరుద్ధం మనోహృది |

యదా యత్యున్మనీ భావం తదా తత్పరమం పదం ||“. ఇతి శ్రుతిః.

(విషయధ్యానము విడిచి మనస్సు హృదయములో ఎప్పుడుండునో అది ఉన్మనీ భావము - అదే పరమపదము - విష్ణుస్థానము - వైకుంఠము) (ముక్తి).

Transliteration
  1. “vidhivat prāṇa saṃ yāmairnāḍī cakrē viśōdhitē |

suṣumnā vadanaṃ bhitvā sukhādviśati mārutaḥ |

mārutē madhya saṃcārē manasthairyaṃ prajāyatē |

yā manassu sthirībhāvaḥ staivā vasthā manōnmani ||“. (śāṃḍilyōpaniṣat)

(śāstraprakāramu prāṇāyāmamu cēsinayaḍala nāḍī cakramu - nāḍulu - śudhdhicēyabaḍina vagunu. appuḍu prāṇavāyuvu suṣumnānāḍi vadanamunu - mukhamunu - cīlcukoni dānilō pravēśiṃcunu. suṣumnānāḍilō vāyuvu saṃcariṃcinapuḍu manasthairyamu kalugunu. (manassu sthiramugānuṃḍunu). manassu sthiramugānuṃḍu avasthayē (condition) manōnmani - manassu yokka unmanī avastha).

  1. “dhyānadhyātṛ dhyēya bhāvō yathā bhavati nirbharaṃ |

tadhōnmanatvaṃ bhavati jñānāmṛta niṣēvaṇāt ||“.

(dhyānamu, dhyānamucēyuvāḍu, dhyēyavastuvu - ī mūḍu (tripuṭi) eppuḍu naśiṃcunō, appuḍu jñānamu - bhagavat jñānamu kaluguṭacēta unmanī avastha kalugunu).

  1. “yathā najāyatē putraḥ pitaraṃ mātaraṃ vinā |

tadā bhavaṃ bhavānīṃca vinā naita ccharācaraṃ |

strī puṃsa prabhavaṃ viśvaṃ strīpuṃsātmakamēva ca |

strī puṃsa yōrvibhūtiśca strīpuṃsā mathiṣṭhataṃ |

paramātmā śivaḥ prōktaḥ śivāca śivā ca parikīrtitā |

śivassadāśivaḥ prōktaśśivā sā ca manōnmanī |“. (vāyavya samhitāyāṃ)

(talli taṃḍri lēnidē putruḍu puṭṭanaṭlē bhavāni (dēvi), bhavuḍu (śivuḍu) - ī iddaru lēnidē carācararūpamulugala ī jagattu puṭṭadu. strī puruṣa saṃ yōgamuvalana kaligina ī jagattu aṃtayu strī puruṣātmakamē - ā modaṭi strī puruṣulē ī jagattulōni strī puruṣulaṃdaru - iṭlu jagattulō strīlugānu, puruṣulu gānu puṭṭinavanniyu ā śiva pārvatula vibhūtulē. vāṭi anniṃṭilōnu ā śiva pārvatulu adhiṣṭiṃciyunnāru - paramātmayē - parabrahmayē śivuḍani, śivā yani pārvatiyē ceppabaḍucunnadi. ā śivuḍē sadāśivuḍu, ā śivā yē manōnmani - śivuni śakti - manasulō adhiṣṭiṃciyuṃḍi manōvṛttulanunaḍipiṃcunadi).

  1. manaḥ maṃtā jīvaḥ - caitanyō ddīpakaḥ -

(manassunu caitanyavaṃtamugā cēyunadi - jīvuḍu)

  1. manōlayasthānaṃ –

“nirasta viṣayā saṃgaṃ saṃ niruddhaṃ manōhṛdi |

yadā yatyunmanī bhāvaṃ tadā tatparamaṃ padaṃ ||“. iti śrutiḥ.

(viṣayadhyānamu viḍici manassu hṛdayamulō eppuḍuṃḍunō adi unmanī bhāvamu - adē paramapadamu - viṣṇusthānamu - vaikuṃṭhamu) (mukti).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.