కోరిక, అభిలాష, ఇచ్ఛా - విషయములందభిలాష.
“మృష్టాన్నపాన భోజన విచిత్రాంబర భూషణ షోడశ వార్షిక కామినీ సంభోగాది గోచర మానస వ్యాపారాః మనోరధాః -”.
(మృష్టాన్నము, పానము, భోజనము, చిత్త విచిత్రమైన ఆభరణములు, వస్త్రములు, పదియారేండ్ల వయస్సుగల స్త్రీసంభోగము మొదలగు మనోవ్యాపారములు మనోరధములు - ఇవి కావలెనను కోరికలు)
విషయాభిలాషాః - (విషయములయడల కలుగు అభిలాష).
మనోరథానాం స సమాప్తిరస్తి వర్షాయుతైరప్యధవాపి లక్షైః |
పూర్ణేషు పూర్ణేషు పునర్మివానాముత్పత్త యస్సంతి మనోరథాః ||.
(పదివేల సంవత్సరములకైనను లక్ష సంవత్సరములకైననుమనోరథములు ముగియవు. మొదట పుట్టినవి నెఱవేఱగా మరల మరల మనోరధములు పుట్టుచునే యుండును - మనోరధములను తగ్గించియుంచిన చిత్త భ్రమణకు కారణము తగ్గును).
kōrika, abhilāṣa, icchā - viṣayamulaṃdabhilāṣa.
“mṛṣṭānnapāna bhōjana vicitrāṃbara bhūṣaṇa ṣōḍaśa vārṣika kāminī saṃbhōgādi gōcara mānasa vyāpārāḥ manōradhāḥ -”.
(mṛṣṭānnamu, pānamu, bhōjanamu, citta vicitramaina ābharaṇamulu, vastramulu, padiyārēṃḍla vayassugala strīsaṃbhōgamu modalagu manōvyāpāramulu manōradhamulu - ivi kāvalenanu kōrikalu)
viṣayābhilāṣāḥ - (viṣayamulayaḍala kalugu abhilāṣa).
manōrathānāṃ sa samāptirasti varṣāyutairapyadhavāpi lakṣaiḥ |
pūrṇēṣu pūrṇēṣu punarmivānāmutpatta yassaṃti manōrathāḥ ||.
(padivēla saṃvatsaramulakainanu lakṣa saṃvatsaramulakainanumanōrathamulu mugiyavu. modaṭa puṭṭinavi neṟavēṟagā marala marala manōradhamulu puṭṭucunē yuṃḍunu - manōradhamulanu taggiṃciyuṃcina citta bhramaṇaku kāraṇamu taggunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.