← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మనువులు manuvulu

Original — తెలుగు
  1. “మననాత్ మనుః”. శ్రీశంకరః

- ప్రజాపతిర్వామనుః

(మననము చేయువాడు కనుక మనువు - లేక, ప్రజాపతి)

  1. “సీ. - - - ధాతనిద్రవో జగములడంగు; మేల్కని చూడ మరల లోకములు పుట్టు

దద్దినమున జతుర్దశ మను లగుదురందొక్కక్క మనువునకు నర దివ్య

తే. యుగములోలిని డెబ్బదియొక్క మాఱు

సనిన మనుకాలమయ్యె, నమ్మనుకులంబు

సురలు, మునులును, సప్తర్షులరయ భగవ

దంశమున బుట్టి పాలింతురఖిల జగము ||“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 11 - 352)

  1. “మహర్షయః సప్తపూర్వే చత్వారో మనవస్తధా |

మద్భావా మానసా జాతాః యేషాం లోక ఇమాః ప్రజాః ||” (శ్రీమద్భగవద్గీత -10 - 6)

(పూర్వము సృష్టిప్రారంభములో - సప్తమహా ఋషులు బ్రహ్మమానస పుత్రులయిన సనకసనంద నాదులు నలుగురు, పదు నాలుగురు మనువులు నా మనస్సునుండి - నా సంకల్ప మాత్రమున - పుట్టిరి. అందుచేత వారు నా భావములు - ఆ మనువుల వలననే లోకమందు ప్రజలు పుట్టిరి. మనువుల సంతతివారు కనుక మానవులు అని చెప్పబడిరి).

  1. “క. - - -

దగ బడు నలుగురు మనువులు

తెగ యుగములు వేయు నడవ దినమజునకగున్.” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 8 - 13 - 429)

  1. “సీ. - - -

యాజ్ఞాదులందఱు హరి పౌరుషాకృతులా మానవులు దత్సహాయ శక్తి

జగముల నడుపుదురు - - - ||“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 8 - 14 - 433)

  1. మనువులు పదునలుగురు : -
  1. స్వాయంబహవుడు

  2. స్వారోచిషమనువు

  3. ఉత్తముడు

  4. తామసుడు

  5. దైవతుడు

  6. చాక్షుషుడు

  7. వైవస్వతమనువు - వర్తమాన మనువు

  8. సావర్ణి (సూర్యసావర్ణి)

  9. దక్ష సావర్ణి

  10. బ్రహ్మ సావర్ణి

  11. ధర్మసావర్ణి

  12. భద్ర సావర్ణి

  13. దేవ సావర్ణి

  14. ఇంద్ర సావర్ణి.

ఈ పదునాలుగు మనువుల కాలము (మన్వంతరములు) వేయి యుగములు - అది బ్రహ్మకు దినము అగును

Transliteration
  1. “mananāt manuḥ”. śrīśaṃkaraḥ

- prajāpatirvāmanuḥ

(mananamu cēyuvāḍu kanuka manuvu - lēka, prajāpati)

  1. “sī. - - - dhātanidravō jagamulaḍaṃgu; mēlkani cūḍa marala lōkamulu puṭṭu

daddinamuna jaturdaśa manu laguduraṃdokkakka manuvunaku nara divya

tē. yugamulōlini ḍebbadiyokka māṟu

sanina manukālamayye, nammanukulaṃbu

suralu, munulunu, saptarṣularaya bhagava

daṃśamuna buṭṭi pāliṃturakhila jagamu ||“. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 11 - 352)

  1. “maharṣayaḥ saptapūrvē catvārō manavastadhā |

madbhāvā mānasā jātāḥ yēṣāṃ lōka imāḥ prajāḥ ||” (śrīmadbhagavadgīta -10 - 6)

(pūrvamu sṛṣṭiprāraṃbhamulō - saptamahā ṛṣulu brahmamānasa putrulayina sanakasanaṃda nādulu naluguru, padu nāluguru manuvulu nā manassunuṃḍi - nā saṃkalpa mātramuna - puṭṭiri. aṃducēta vāru nā bhāvamulu - ā manuvula valananē lōkamaṃdu prajalu puṭṭiri. manuvula saṃtativāru kanuka mānavulu ani ceppabaḍiri).

  1. “ka. - - -

daga baḍu naluguru manuvulu

tega yugamulu vēyu naḍava dinamajunakagun.” (śrīmadāṃdhramahābhāgavatamu - 8 - 13 - 429)

  1. “sī. - - -

yājñādulaṃdaṟu hari pauruṣākṛtulā mānavulu datsahāya śakti

jagamula naḍupuduru - - - ||“. (śrīmadāṃdhramahābhāgavatamu - 8 - 14 - 433)

  1. manuvulu padunaluguru : -
  1. svāyaṃbahavuḍu

  2. svārōciṣamanuvu

  3. uttamuḍu

  4. tāmasuḍu

  5. daivatuḍu

  6. cākṣuṣuḍu

  7. vaivasvatamanuvu - vartamāna manuvu

  8. sāvarṇi (sūryasāvarṇi)

  9. dakṣa sāvarṇi

  10. brahma sāvarṇi

  11. dharmasāvarṇi

  12. bhadra sāvarṇi

  13. dēva sāvarṇi

  14. iṃdra sāvarṇi.

ī padunālugu manuvula kālamu (manvaṃtaramulu) vēyi yugamulu - adi brahmaku dinamu agunu

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.