(నీరు అని భ్రమకలిగించునవి. - సూర్య కిరణములు దూరముగానున్న వస్తువులమీదపడి జలమువలె భ్రమింపచేయును. వాటికొఱకు పశువులు భ్రమచేత పరుగెత్తును. ఎంతదూరము వెళ్ళినను అవి అట్లే కనబడును. నిజమైన జలముకాదుకనుక - భ్రమపెట్టునవి).
“మృగతృష్ణాం భనిస్నాతః, ఖపుష్పకృత శేఖరః |
ఏష వంధ్యాసుతో యాతి శశ శృంగ ధనుర్ధరః ||“.
(ఈ మృగతృష్ణికలు - మరుమరీచికలు - నీరులేనిచోట నీరువలె కనబడు సూర్యకిరణములు, శశవిషాణము, -కుందేటి కొమ్ము - గగనారవిందము (ఆకాశపుష్పము), వంధ్యాపుత్రుడు (గొడ్డురాలి కొడుకు) - ఇవి లేనివస్తువులగుఱించి చెప్పుటకు వాడుక చేయబడుచున్నవి - కుందేలునకు కొమ్ము ఉండదు, ఆకాశమునకు పుష్పముండదు, గొడ్డురాలుకు కొడుకు పుట్టడు).
(nīru ani bhramakaligiṃcunavi. - sūrya kiraṇamulu dūramugānunna vastuvulamīdapaḍi jalamuvale bhramiṃpacēyunu. vāṭikoṟaku paśuvulu bhramacēta parugettunu. eṃtadūramu veḷḷinanu avi aṭlē kanabaḍunu. nijamaina jalamukādukanuka - bhramapeṭṭunavi).
“mṛgatṛṣṇāṃ bhanisnātaḥ, khapuṣpakṛta śēkharaḥ |
ēṣa vaṃdhyāsutō yāti śaśa śṛṃga dhanurdharaḥ ||“.
(ī mṛgatṛṣṇikalu - marumarīcikalu - nīrulēnicōṭa nīruvale kanabaḍu sūryakiraṇamulu, śaśaviṣāṇamu, -kuṃdēṭi kommu - gaganāraviṃdamu (ākāśapuṣpamu), vaṃdhyāputruḍu (goḍḍurāli koḍuku) - ivi lēnivastuvulaguṟiṃci ceppuṭaku vāḍuka cēyabaḍucunnavi - kuṃdēlunaku kommu uṃḍadu, ākāśamunaku puṣpamuṃḍadu, goḍḍurāluku koḍuku puṭṭaḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.