← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మాత māta

Original — తెలుగు
  1. “గురుపత్నీ, రాజపత్నీ, జ్యేష్టపత్నీ, తధైవచ |

పత్నీమాతా, స్వమాతాచ పంచైతా మాతరః స్మృతాః ||“.

(చదువు చెప్పిన గురువుయొక్క భార్య, అన్నభార్య రాజుయొక్క భార్య, భార్య తల్లి - అత్తగారు- కన్నతల్లి - ఈ అయిదుగురు తల్లులని పరిగణింపబడుచున్నారు - కన్న తల్లివలనే మిగిలిన నలుగురును గౌరవించవలెను).

  1. “త్వమేవ మాతా చ పితా త్వమేవ”

(జీవులందఱకు భగవంతుడే తల్లి తండ్రి).

  1. “పితా హమస్య జగతో మాతా ధాతా పితామహః”

(ఈ జగత్తునకు తల్లి, తండ్రి, ధాత, పితామహుడు నేనే - (భగవంతుడే) (శ్రీమద్భగవద్గీత - 9 - 17)

  1. “న మాతుర్దైవతం పరం”

(తల్లికన్న ఉత్కృష్టమైన దైవము లేదు - “తల్లికన్న వేరు దైవంబు లేదయా” - సృష్టిలోనున్న జీవులన్నియు భగవంతుని రూపములే అయునప్పుడు, నవమాసములు మోసి, కని, కంటికి రెప్పవలె కనిపెట్టుచు పెంచి పెద్దచేసి, యోగక్షేమములనొక కంట కనిపెట్టుచుండు మాతృమూర్తి భగవన్మూర్తియే, అట్లే పూజనీయురాలు).

Transliteration
  1. “gurupatnī, rājapatnī, jyēṣṭapatnī, tadhaivaca |

patnīmātā, svamātāca paṃcaitā mātaraḥ smṛtāḥ ||“.

(caduvu ceppina guruvuyokka bhārya, annabhārya rājuyokka bhārya, bhārya talli - attagāru- kannatalli - ī ayiduguru tallulani parigaṇiṃpabaḍucunnāru - kanna tallivalanē migilina nalugurunu gauraviṃcavalenu).

  1. “tvamēva mātā ca pitā tvamēva”

(jīvulaṃdaṟaku bhagavaṃtuḍē talli taṃḍri).

  1. “pitā hamasya jagatō mātā dhātā pitāmahaḥ”

(ī jagattunaku talli, taṃḍri, dhāta, pitāmahuḍu nēnē - (bhagavaṃtuḍē) (śrīmadbhagavadgīta - 9 - 17)

  1. “na māturdaivataṃ paraṃ”

(tallikanna utkṛṣṭamaina daivamu lēdu - “tallikanna vēru daivaṃbu lēdayā” - sṛṣṭilōnunna jīvulanniyu bhagavaṃtuni rūpamulē ayunappuḍu, navamāsamulu mōsi, kani, kaṃṭiki reppavale kanipeṭṭucu peṃci peddacēsi, yōgakṣēmamulanoka kaṃṭa kanipeṭṭucuṃḍu mātṛmūrti bhagavanmūrtiyē, aṭlē pūjanīyurālu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.