(అభిప్రాయము - బాగుగా తెలుసుకొనినది, సమ్మతమైనది, ఇష్టమైనది).
భగవత్తత్త్వమును గుఱించి ఒక వ్యక్తికి కలిగిన నిర్ణయము, సిద్దాంతము, లేక నిశ్చయాభిప్రాయము -
వేదములు, ఉపనిషత్తులు, పురాణములు మొదలగు గ్రంధములవలన భగవంతుని తత్వము నిర్ణయించునది. ఈ గ్రంధముల రహస్యార్థములు వేరువేరుగా అన్వయించుటవలన కలిగెడి అనేకవిధములైన అభిప్రాయము).
“వైదికం, వైష్ణవం, శాక్తం, శైవం పాశుపతం తథా |
గణాపత్యంచ సౌరంచ బ్రహ్మాత్మ విజ్ఞానమేవహి ||”
ఇతి సిద్ధాంతితం - (స్కాందపురాణము)
(వైదికము, వైష్ణవము, శాక్తము, శైవము, పాశుపతము, గాణాపత్యము, సౌరము - వేదములో చెప్పినదే మతము అని నమ్మువారు, విష్ణువే పరబ్రహ్మ అని నమ్మకముగలవారు, శక్తి - కాళికాశక్తి, శ్రీదేవియే (Energy personified)పరబ్రహ్మ అని అభిప్రాయము గలవారు, శివుడే పరబ్రహ్మ అను వాదించువారు, పశుపతి - (జీవులందఱు పశువులు, అజ్ఞానలు. వారికి జ్ఞానోదయము కలుగ చేసి వారికి మోక్షము కలుగచేయు పతి అయినవాడు) పరబ్రహ్మ అను నమ్మకముగలవారు, గణపతి - విఘ్నేశ్వరుడు పరబ్రహ్మ యనువారు, సూర్యుడు - (ప్రకాశస్వరూపుడై తనకాంతిచే జీవరాసులకు చైతన్యము కలిగించువాడు) అందుచేత ప్రత్యక్షముగా (కంటికి) కనబడు పరబ్రహ్మ - సూర్యనారాయణమూర్తి - సూర్యుడే నారాయణుని రూపము - అని, సూర్యభగవానుడని వాడుకలో నుండుటచేత) పరబ్రహ్మ యని తలంచువారు - అని ఈ విధములుగా వేఱువేఱు అభిప్రాయములు గలిగియుండిట వేరువేరు మతములు - ఇవన్నియు, ఏ విధముగానైనను పరబ్రహ్మ జ్ఞానమును బోధించునవే)
“వైదికం, వైష్ణవం చైవ, శాక్తం, సౌరం, గజాననం |
విజ్ఞానంచ సమాలోచ్య యదే తత్ ప్రతి నిశ్చితం ||“. (ఇతిస్కాందే)
వైష్ణవ, మాధ్వ, స్మార్తములు అని మతములు మూడు విధములు - ఆచార్య భేదమువలన మతభేదము శ్రీమాన్ రామానుజులవారు విష్ణుప్రాధాన్యమైన వైష్ణవమతము, మధ్వాచార్యులవారు విశిష్టాద్వైతమును, శ్రీ శంకరాచార్యులవారు కేవల అధ్వైతమును, బోధించిరి - స్మృతులలో బోధించినది స్మార్తము -.
సాంఖ్య, బౌద్ధ, తార్కిక, మీమాంసక, చార్వాకాదులు వారివారి అభిప్రాయమును బట్టి, వారి వారి యుక్తులచేతను సమర్థించి బోధించి పరమాత్మ తత్వమును గుఱించి వారికి కలిగిన అభిప్రాయము.
“సర్వకర్తా, అస్వతంత్రాచ యచ్ఛక్త్యా నియతం జగత్ |
తం విష్ణు మాహుః కేచిత్ శివమన్యే గణే శ్వరం |
ఈశ్వరోహి జగజ్జాల ప్రళయోత్పాదకో భవేత్ |
సవిష్ణు స్సశివ ధాతా గణేశో శక్తి దేవహి |
స ఏవ సర్వదా సర్వః సర్వైరపి నిరూపితః ||” (స్కాందపురాణము)
(“సృష్టి కారణం సర్వకర్తారస్య, సర్వస్వతంత్రాత్మకశ్చ పరమాత్మానః యచ్ఛక్త్యా నియతం తం పరమాత్మానం కేచిత్ విష్ణుమాహుః, కేచిద్వై శివమన్యే గణేశ్వరం కర్మప్రథానరూప సూర్యం వై శక్తి మిత్యపి ఇతి తస్మాత్ సర్వం పరమాత్మానః శక్త్యాది కమేవేతి సిద్ధాంతః)”.
(పరబ్రహ్మ తనతో కలిసియున్నపుడు సర్వశక్తులు గలిగి యీ ప్రపంచమునంతను పుట్టించ గలిగినది, పరబ్రహ్మ తనతో కలియకముందు అస్వతంత్రియునగు భగవంతుని శక్తినే అనేకమంది అనేక విధములుగా నిరూపించి పేర్లు పెట్టుచు వచ్చిరి. ఆ పరమాత్మ శక్తినే కొందఱు విష్ణువనియు, కొందఱు శివుడనియు, మరికొందఱు గణపతి అనియు చెప్పుదురు. ఏ పేరు పెట్టినను ఆ పరబ్రహ్మ ఒక్కడే, అతని శక్తియే, లేక, ఆ భగవంతుడే తన శక్తిరూపముతో ఇంతమంది దేవతులుగాను ఆవిర్భవించుచున్నాడు - ఈ దేవతా రూపములతోనే కాక సృష్టిలోనున్న సమస్త వస్తువులు - జీవులు, చరాచరములు, చిదచిద్వస్తువులన్నియు ఆ భగవంతుని రూపములే. భగవంతుడుకాని వస్తువు సౄష్టిలో లేదు - “హరిమయముగాని ద్రవ్యము, పరమాణువు లేదు -”. సమస్త మతములు ఈ విషయమునే నిరూపించుచున్నవి).
“నిన్ను పరమాణు కారణవాదులైన కణ్వ గౌతమాదులును, బ్రకృతి కారణవాదులైన సాంఖ్యులును, దేహాత్మవాదులైన బౌద్ధులును వివిధంబులైన కుతర్కంబులచేతం బరస్పర వ్యాహతంబులైన మతంబులు దమతమ తర్కవాదంబుల సమర్థించుచు నిన్నుం దెలియలేరు - మహాభాగ్యవంతులయిన యోగీంద్రులకు నీవు బ్రత్యక్షంబైన నివి యన్నియు నసత్యంబులని కానవచ్చు. వెండియు, గొందఱు స చరాచర వస్తుజాతంబులకు నంతర్యామివై సర్వంబును నీవయగుటం దెలియలేక నిత్యంబనియు ననిత్యంబనియు విపరీతబుద్ధిం దెలియుదురు, గాని భవదీయ దివ్యతత్వంబు నిక్కంబుగ దెలియజాలరు - కొందఱు జగచ్ఛరీరుండవుగాన జగద్రూపకుండవైన నిన్ను గటకమకుట కర్ణికాది వివిధ భూషణంబులం గనకంబు నిజస్వరూపంబు విడువక వర్తించు చందంబున జగద్వికారానుగతుండవయ్యును నిఖిల హేయ ప్రత్యనీక కల్యాణగుణాత్మకుండవై యుందువని యాత్మవిదులయినవారలు తెలియుదురు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - ఉ.భా. - 1220)
దండకము “- - - కొంద ఱంభోజగర్భాదులధ్యాత్మలందున్, నిశేషాది భూతంబులందున్, ననేకాది దేవంబులందున్ సదా సాక్షివై యుండుదంచుం, దదంతర్గత జ్యోతి వీశుండవంచున్, ద్రయీ పద్ధతిం గొందఱింద్రాది దేవాభిధానంబులన్ నిక్కుదొక్కండవంచున్, మఱింగొందఱారూఢ కర్మంబులంద్రుంచి సంసారముం ద్రెంచి సన్యస్తులై మంచి విజ్ఞాన చక్షుండవంచున్, మఱిం బాంచరాత్రానుసారంబుగ దన్మయత్వంబుతో గొందఱీవాత్మయంచున్, మఱింగొందఱా వాసుదేవాది భేదంబులన్ నల్వురై చెల్వు వాటించు వంచున్, మఱిన్నీవు నారాయణాఖ్యుండవంచున్, శివాఖ్యుండవంచున్ మఱిం బెక్కుమారగంబులన్ నిన్ను నగ్గింతురు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ.భా. 1237)
“వాది వాక్య భేదంబుల (యోగీశ్వరులు) గొందఱు మోహితులై భేదంబునాచ్ఛాదించి తమకు నాత్మ సుఖదుఃఖంబులనిచ్చు ప్రభువని చెప్పుదురు. కొందఱు (దైవజ్ఞులు) గ్రహ దేవతాదులకు బ్రభుత్వంబు సంపాదింతురు - కొందఱు (మీమాంసకులు) గర్మంబునకుం బ్రాభవంబు ప్రకటింతురు. కొందఱు (లోకాయతికులు) స్వభావంబు ప్రభువని పల్కుదురు - ఇందెవ్వరికి సుఖప్రదానంబుసేయ బ్రభుత్వంబులేదు. పరులవలన దుఃఖంబువచ్చిన ధర్మపరుల ధర్మంబు చేసిరని విచారింపవలవదు - తర్కింపను నిర్దేశింపను రాని పరమేశ్వరునివలన సర్వంబు నగుచుండు” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 15 - 390)
బ్రహ్మభావన యీ క్రిందని విధముగానున్నది: -
“అన్నం బ్రహ్మేతి వ్యజానాత్” (అన్నము బ్రహ్మము. “అన్నం పరబ్రహ్మ స్వరూపం”); “ప్రాణో బ్రహ్మేతి వ్యజానాత్” (ప్రాణమే బ్రహ్మ); “మనో బ్రహ్మేతి వ్యజానాత్” (మనస్సు బ్రహ్మ); “విజ్ఞానం బ్రహ్మేతి వ్యజానాత్” (విజ్ఞానమే బ్రహ్మ); “ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్” - ఆనందమే బ్రహ్మము); “ఆకాశశరీరం బ్రహ్మ” (ఆకాశమే శరీరముగాగలవాడు బ్రహ్మ): “ఓమిత్యేకాక్షరం బ్రహ్మ” (ఓంకారమను ఒకే అక్షరము బ్రహ్మ); “అసద్బ్రహ్మేతి” (అసత్తే బ్రహ్మ), “సర్వం తత్ప్రజ్ఞానేత్రం” (అంతా బ్రహ్మమే). సృష్టిలోని వస్తువులన్నియు పరబ్రహ్మలోనుండి పుట్టినవే కనుక అవన్నియు బ్రహ్మరూపములే - అందుచేత ఏ వస్తువునైనను పరబ్రహ్మగా భావనచేసి పూజించిన దోషములేదు).
(abhiprāyamu - bāgugā telusukoninadi, sammatamainadi, iṣṭamainadi).
bhagavattattvamunu guṟiṃci oka vyaktiki kaligina nirṇayamu, siddāṃtamu, lēka niścayābhiprāyamu -
vēdamulu, upaniṣattulu, purāṇamulu modalagu graṃdhamulavalana bhagavaṃtuni tatvamu nirṇayiṃcunadi. ī graṃdhamula rahasyārthamulu vēruvērugā anvayiṃcuṭavalana kaligeḍi anēkavidhamulaina abhiprāyamu).
“vaidikaṃ, vaiṣṇavaṃ, śāktaṃ, śaivaṃ pāśupataṃ tathā |
gaṇāpatyaṃca sauraṃca brahmātma vijñānamēvahi ||”
iti siddhāṃtitaṃ - (skāṃdapurāṇamu)
(vaidikamu, vaiṣṇavamu, śāktamu, śaivamu, pāśupatamu, gāṇāpatyamu, sauramu - vēdamulō ceppinadē matamu ani nammuvāru, viṣṇuvē parabrahma ani nammakamugalavāru, śakti - kāḷikāśakti, śrīdēviyē (Energy personified)parabrahma ani abhiprāyamu galavāru, śivuḍē parabrahma anu vādiṃcuvāru, paśupati - (jīvulaṃdaṟu paśuvulu, ajñānalu. vāriki jñānōdayamu kaluga cēsi vāriki mōkṣamu kalugacēyu pati ayinavāḍu) parabrahma anu nammakamugalavāru, gaṇapati - vighnēśvaruḍu parabrahma yanuvāru, sūryuḍu - (prakāśasvarūpuḍai tanakāṃticē jīvarāsulaku caitanyamu kaligiṃcuvāḍu) aṃducēta pratyakṣamugā (kaṃṭiki) kanabaḍu parabrahma - sūryanārāyaṇamūrti - sūryuḍē nārāyaṇuni rūpamu - ani, sūryabhagavānuḍani vāḍukalō nuṃḍuṭacēta) parabrahma yani talaṃcuvāru - ani ī vidhamulugā vēṟuvēṟu abhiprāyamulu galigiyuṃḍiṭa vēruvēru matamulu - ivanniyu, ē vidhamugānainanu parabrahma jñānamunu bōdhiṃcunavē)
“vaidikaṃ, vaiṣṇavaṃ caiva, śāktaṃ, sauraṃ, gajānanaṃ |
vijñānaṃca samālōcya yadē tat prati niścitaṃ ||“. (itiskāṃdē)
vaiṣṇava, mādhva, smārtamulu ani matamulu mūḍu vidhamulu - ācārya bhēdamuvalana matabhēdamu śrīmān rāmānujulavāru viṣṇuprādhānyamaina vaiṣṇavamatamu, madhvācāryulavāru viśiṣṭādvaitamunu, śrī śaṃkarācāryulavāru kēvala adhvaitamunu, bōdhiṃciri - smṛtulalō bōdhiṃcinadi smārtamu -.
sāṃkhya, bauddha, tārkika, mīmāṃsaka, cārvākādulu vārivāri abhiprāyamunu baṭṭi, vāri vāri yuktulacētanu samarthiṃci bōdhiṃci paramātma tatvamunu guṟiṃci vāriki kaligina abhiprāyamu.
“sarvakartā, asvataṃtrāca yacchaktyā niyataṃ jagat |
taṃ viṣṇu māhuḥ kēcit śivamanyē gaṇē śvaraṃ |
īśvarōhi jagajjāla praḷayōtpādakō bhavēt |
saviṣṇu ssaśiva dhātā gaṇēśō śakti dēvahi |
sa ēva sarvadā sarvaḥ sarvairapi nirūpitaḥ ||” (skāṃdapurāṇamu)
(“sṛṣṭi kāraṇaṃ sarvakartārasya, sarvasvataṃtrātmakaśca paramātmānaḥ yacchaktyā niyataṃ taṃ paramātmānaṃ kēcit viṣṇumāhuḥ, kēcidvai śivamanyē gaṇēśvaraṃ karmaprathānarūpa sūryaṃ vai śakti mityapi iti tasmāt sarvaṃ paramātmānaḥ śaktyādi kamēvēti siddhāṃtaḥ)”.
(parabrahma tanatō kalisiyunnapuḍu sarvaśaktulu galigi yī prapaṃcamunaṃtanu puṭṭiṃca galiginadi, parabrahma tanatō kaliyakamuṃdu asvataṃtriyunagu bhagavaṃtuni śaktinē anēkamaṃdi anēka vidhamulugā nirūpiṃci pērlu peṭṭucu vacciri. ā paramātma śaktinē koṃdaṟu viṣṇuvaniyu, koṃdaṟu śivuḍaniyu, marikoṃdaṟu gaṇapati aniyu ceppuduru. ē pēru peṭṭinanu ā parabrahma okkaḍē, atani śaktiyē, lēka, ā bhagavaṃtuḍē tana śaktirūpamutō iṃtamaṃdi dēvatulugānu āvirbhaviṃcucunnāḍu - ī dēvatā rūpamulatōnē kāka sṛṣṭilōnunna samasta vastuvulu - jīvulu, carācaramulu, cidacidvastuvulanniyu ā bhagavaṃtuni rūpamulē. bhagavaṃtuḍukāni vastuvu sṝṣṭilō lēdu - “harimayamugāni dravyamu, paramāṇuvu lēdu -”. samasta matamulu ī viṣayamunē nirūpiṃcucunnavi).
“ninnu paramāṇu kāraṇavādulaina kaṇva gautamādulunu, brakṛti kāraṇavādulaina sāṃkhyulunu, dēhātmavādulaina bauddhulunu vividhaṃbulaina kutarkaṃbulacētaṃ baraspara vyāhataṃbulaina mataṃbulu damatama tarkavādaṃbula samarthiṃcucu ninnuṃ deliyalēru - mahābhāgyavaṃtulayina yōgīṃdrulaku nīvu bratyakṣaṃbaina nivi yanniyu nasatyaṃbulani kānavaccu. veṃḍiyu, goṃdaṟu sa carācara vastujātaṃbulaku naṃtaryāmivai sarvaṃbunu nīvayaguṭaṃ deliyalēka nityaṃbaniyu nanityaṃbaniyu viparītabuddhiṃ deliyuduru, gāni bhavadīya divyatatvaṃbu nikkaṃbuga deliyajālaru - koṃdaṟu jagaccharīruṃḍavugāna jagadrūpakuṃḍavaina ninnu gaṭakamakuṭa karṇikādi vividha bhūṣaṇaṃbulaṃ ganakaṃbu nijasvarūpaṃbu viḍuvaka vartiṃcu caṃdaṃbuna jagadvikārānugatuṃḍavayyunu nikhila hēya pratyanīka kalyāṇaguṇātmakuṃḍavai yuṃduvani yātmavidulayinavāralu teliyuduru”. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - u.bhā. - 1220)
daṃḍakamu “- - - koṃda ṟaṃbhōjagarbhāduladhyātmalaṃdun, niśēṣādi bhūtaṃbulaṃdun, nanēkādi dēvaṃbulaṃdun sadā sākṣivai yuṃḍudaṃcuṃ, dadaṃtargata jyōti vīśuṃḍavaṃcun, drayī paddhatiṃ goṃdaṟiṃdrādi dēvābhidhānaṃbulan nikkudokkaṃḍavaṃcun, maṟiṃgoṃdaṟārūḍha karmaṃbulaṃdruṃci saṃsāramuṃ dreṃci sanyastulai maṃci vijñāna cakṣuṃḍavaṃcun, maṟiṃ bāṃcarātrānusāraṃbuga danmayatvaṃbutō goṃdaṟīvātmayaṃcun, maṟiṃgoṃdaṟā vāsudēvādi bhēdaṃbulan nalvurai celvu vāṭiṃcu vaṃcun, maṟinnīvu nārāyaṇākhyuṃḍavaṃcun, śivākhyuṃḍavaṃcun maṟiṃ bekkumāragaṃbulan ninnu naggiṃturu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū.bhā. 1237)
“vādi vākya bhēdaṃbula (yōgīśvarulu) goṃdaṟu mōhitulai bhēdaṃbunācchādiṃci tamaku nātma sukhaduḥkhaṃbulaniccu prabhuvani ceppuduru. koṃdaṟu (daivajñulu) graha dēvatādulaku brabhutvaṃbu saṃpādiṃturu - koṃdaṟu (mīmāṃsakulu) garmaṃbunakuṃ brābhavaṃbu prakaṭiṃturu. koṃdaṟu (lōkāyatikulu) svabhāvaṃbu prabhuvani palkuduru - iṃdevvariki sukhapradānaṃbusēya brabhutvaṃbulēdu. parulavalana duḥkhaṃbuvaccina dharmaparula dharmaṃbu cēsirani vicāriṃpavalavadu - tarkiṃpanu nirdēśiṃpanu rāni paramēśvarunivalana sarvaṃbu nagucuṃḍu” (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 15 - 390)
brahmabhāvana yī kriṃdani vidhamugānunnadi: -
“annaṃ brahmēti vyajānāt” (annamu brahmamu. “annaṃ parabrahma svarūpaṃ”); “prāṇō brahmēti vyajānāt” (prāṇamē brahma); “manō brahmēti vyajānāt” (manassu brahma); “vijñānaṃ brahmēti vyajānāt” (vijñānamē brahma); “ānaṃdō brahmēti vyajānāt” - ānaṃdamē brahmamu); “ākāśaśarīraṃ brahma” (ākāśamē śarīramugāgalavāḍu brahma): “ōmityēkākṣaraṃ brahma” (ōṃkāramanu okē akṣaramu brahma); “asadbrahmēti” (asattē brahma), “sarvaṃ tatprajñānētraṃ” (aṃtā brahmamē). sṛṣṭilōni vastuvulanniyu parabrahmalōnuṃḍi puṭṭinavē kanuka avanniyu brahmarūpamulē - aṃducēta ē vastuvunainanu parabrahmagā bhāvanacēsi pūjiṃcina dōṣamulēdu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.