← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మాతరిశ్వం mātariśvaṃ

Original — తెలుగు
  1. మాతరి అంతరిక్షేశ్వయతీతి మాతరిశ్వా - వాయుః.

(ఆకాశములోనుండి అన్నియు పుట్టినవికనుక ఆకాశము మాత - తల్లి యని చెప్ప బడును. అట్టి ఆకాశమను మాతయందు సంచరించు చుండుటవలన వాయువు ‘మాతరిశ్వః’ అని చెప్పబడినది).

  1. మాతరి అంతరిక్షేశ్వసితి గచ్ఛతి ఇతి మాతరిశ్వా వాయుః, సర్చ ప్రాణభృత్, క్రియాత్మకః, యదాశ్రయాణి కార్య కారణ జాతాని యస్మిన్ ఓతాని ప్రోతానిచ యత్సూత్రసంజ్ఞికం, సర్వస్య జగతో విధారయిత్వ స మాతరిశ్వా“. (శ్రీశంకరః)

(మాత యని చెప్పబడు అంతరిక్షమందు - ఆకాశమందు – సంచరించును కనుక వాయువు ‘మాతరిశ్వః’ అని చెప్పబడినది - వాయువు సమస్త ప్రాణులను భరించునది, క్రియాత్మకము - పనులు చేయించు శక్తి అయినది. దానిని ఆశ్రయించియుండు కార్య వస్తువులు, కారణవస్తువులు దాని యందే - బట్టలోని అడ్డుదారము, నిలువుదారము వలె - ప్రోతమై యున్నవి. బట్టిలోని పొడుగు, పేకదారములే బట్ట అయినట్లు - ఈ జగత్తులోని అన్ని కారణవస్తువులును, కార్యవస్తువులును ఒకే దారముతో గ్రుచ్చి పట్టుకొనియున్నట్లు వాట్లలోనుండి వాటిని పట్టుకొనియుండు ఆత్మస్వరూపము కనుక సూత్రాత్మయని చెప్పబడినది. ఈ మాతరిశ్వుడగు వాయువే అన్ని వస్తువులకు వాటివాటి పనులు చేయుటకు సక్తినిచ్చి చేయించుచున్నది (ప్రాణవాయువు) (సూర్యుని ప్రాణశక్తితో కలిసియున్నది).

Transliteration
  1. mātari aṃtarikṣēśvayatīti mātariśvā - vāyuḥ.

(ākāśamulōnuṃḍi anniyu puṭṭinavikanuka ākāśamu māta - talli yani ceppa baḍunu. aṭṭi ākāśamanu mātayaṃdu saṃcariṃcu cuṃḍuṭavalana vāyuvu ‘mātariśvaḥ’ ani ceppabaḍinadi).

  1. mātari aṃtarikṣēśvasiti gacchati iti mātariśvā vāyuḥ, sarca prāṇabhṛt, kriyātmakaḥ, yadāśrayāṇi kārya kāraṇa jātāni yasmin ōtāni prōtānica yatsūtrasaṃjñikaṃ, sarvasya jagatō vidhārayitva sa mātariśvā”. (śrīśaṃkaraḥ)

(māta yani ceppabaḍu aṃtarikṣamaṃdu - ākāśamaṃdu – saṃcariṃcunu kanuka vāyuvu ‘mātariśvaḥ’ ani ceppabaḍinadi - vāyuvu samasta prāṇulanu bhariṃcunadi, kriyātmakamu - panulu cēyiṃcu śakti ayinadi. dānini āśrayiṃciyuṃḍu kārya vastuvulu, kāraṇavastuvulu dāni yaṃdē - baṭṭalōni aḍḍudāramu, niluvudāramu vale - prōtamai yunnavi. baṭṭilōni poḍugu, pēkadāramulē baṭṭa ayinaṭlu - ī jagattulōni anni kāraṇavastuvulunu, kāryavastuvulunu okē dāramutō grucci paṭṭukoniyunnaṭlu vāṭlalōnuṃḍi vāṭini paṭṭukoniyuṃḍu ātmasvarūpamu kanuka sūtrātmayani ceppabaḍinadi. ī mātariśvuḍagu vāyuvē anni vastuvulaku vāṭivāṭi panulu cēyuṭaku saktinicci cēyiṃcucunnadi (prāṇavāyuvu) (sūryuni prāṇaśaktitō kalisiyunnadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.