(మోహము కలుగుచేయు శక్తి; విచిత్రమైన శల్తి; ప్రకృతి).
(చిత్ర విచిత్రమైన రూపముకలది కనుక మాయ, వికారములు, అనేక మార్పులుగలది కనుక మాయ).
(చిత్ర విచిత్రమైన - అనేకరూపములతో, అనేక స్వభావములతో - సృష్టిని చేయునది - ఎట్లు చేయునో తెలియబడనిది - కనుక మాయ యని చెప్పబడినది).
“లేని ప్రపంచమును కలుగచేస్తుంది కనుక మాయ” (బ్రహ్మవిద్యా సుధార్ణవము - 7)
(ఈ ప్రపంచములోని వస్తువులన్నియు భగవంతునిలోనుండి పుట్టినవికనుక భగవంతుని రూపములే, అందుచేత, ఆ రూపములతో నిండియున్న ప్రపంచము భగవంతుని రూపమే - అది అంతా భగవంతుడే, కాని అనుభవంలో, వ్యావహారికంగా అన్నీ వేరువేరుగా తోచుచున్నాయి - ఇట్లుకానిది అయినట్లు తోచుటయే మాయ).
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 9 - 253)
“అఘటిత ఘటనా పటీయసీ శక్తిః మాయా” అని కలదుకనుక మాయ ఘటించి తోచును - అంటే, ఆ మాయ అవిచారమందే (అలోచించనంతవఱకే) సత్యము. విచార పూర్వకంగా చూస్తే అసత్యము - మిథ్య అన్నమాట. అయితే, జగత్తు తోచినది అంటే ఘటమందు తోచినభావమెల్ల మృతికేకాని ఘతమనేదిలేదు - చిన్మాత్రమైన తనయందు ప్రపంచం లేదనేదే సత్యం. ఇందుకు శ్రుతి - “నామరూపేన్యాకరవాణి, వాహారంభణం వికారో నామధేయం మృత్తికా ఇత్యేవ సత్యం”- “ఏకం సత్యం బహథా కల్యంతి” అని ఛాందోగ్యము.
అనాదిరనంతవతీ యాన విద్యతే సామాయా, మాయాస్వరూపం అజ్ఞానం, తదేవ మూల ప్రకృతిః, గణ సామ్యం, అవిద్యా ఇత్యాద్యనేకాకారా, జగదాకారేణ పరిణతా.
(మొదలు తుది లేనటువంటిది మాయ. మాయస్వరూపము అజ్ఞానము - అదియే మూల ప్రకృతి - సత్వరజస్తమోగుణములు సమానముగా గలది, అవిద్యలను మొదలగు రూపములు గలది. అదియే జగత్తుగా మారినది, జగత్తునకు ఉపాదానకారణమైనది - మట్టియే కుండ, మూకుడుగా మారినట్లు. మాయ లేక ప్రకృతిలోనుండి ప్రపంచకము పుట్టి, విస్తరించుకొని పోయి ప్రళయకాలమందు కుదించుకొనిపోయి మాయగా అయి, మరల ప్రపంచముగా విస్తరించుటచేత ప్రవాహ రూపములో మొదలు, తుది లేనట్లుండునది).
(లేనిదేదియో అదియే మాయ - కుందేటి కొమ్మువలె - (కుందేటికి కొమ్ము ఉండదు) - భూతభవిష్యద్వర్తమానములను మూడుకాలములందును లేనిది, కనబడనది, తెలియనిది).
(పరమార్థ దృష్టిలో ఏది లేదో అదియే మాయ. ఈ ప్రపంచమంతయు భగ వంతుని లోనుండి పుట్టినదే యగుటచేత అందులోని వస్తువులన్నియు భగవంతుని రూపములే కాని అన్యములుకావు. అవి వేఱువేఱుగా కనబడుటయే మాయ. అజ్ఞానము వలన - భగవంతుని గుఱించి అయిన జ్ఞానము లేకపోవుటవలన, సృష్టి, సృష్టిలోనున్న రూపములన్నియు భగవంతుని రూపములే యను జ్ఞానము లేకపోవుటవలనవేఱువేఱు వస్తువులుగా కనబడుచున్నవి - ఇదియే మాయ).
తత్వ దృష్ట్యాతు నాస్త్యేవ తత్వమేవాస్తి కేవలం ||“.
(వ్యావహారిక దృష్టిలో విద్యాయనియు, మాయనియు, చెప్పుటగలదు, తత్వ దృష్టిలో - పరమార్థ దృష్టిలో లేనిదే, ఉన్నదాంతా ఒక్క భగవంతుడే, భగవత్తత్త్వమే, పరమాత్మ తత్వమే)
“ఆ మాయ గుణత్రయ సామాన్యం వల్ల ప్రకృతి అనిపించుకొనును. దుష్కర్మ విశేషం వల్ల తామస ప్రథానమై సాత్వికముమును మూసుకొని అవిద్య అనిపించుకొనును, - సత్కర్మ సామర్థ్యంవల్ల సాత్వికగుణప్రథానమై అవిద్యకు విరోధమై విద్య అనిపించుకొనును. అవి యెలాగంటే - స్వల్పోదకాలనయిన పంకిలానకు బహులోదకము విరోధియై యుండును.” (బ్రహ్మవిద్యాసుధార్ణవము - 3)
ఈ మాయ యనెడిది ప్రవృత్తి కాలమందు గుణత్రయానుషంగియై జీన జగదాకృతితోడను అతి స్థూలరూపమై, నివృత్తికాలమందు గుణత్రయాలను మీరి అతి సూక్ష్మరూపంతో చేపట్టు శుద్ధవిద్య అనే అభిమానంతో బ్రహ్మమందే లీనమాయె“.
(బ్రహ్మవిద్యాసుధార్ణవము -3)
తనుద్రయాలకు కారణం, అదే మహామాయ, ఆ మహామాయే పరాశక్తి, ఈశ్వరుని మూల ప్రకృతి - మాయ సత్యమో అసత్యమో, ఏక సత్యాసత్యమో, సత్యాసత్య విలక్షణమో, అంటే, అదేమీకాదు. మాయ సత్యమైతే ఏల చెప్పరాదంటే - నిత్యమైతే ఎప్పుడున్నూ చెడకయుండవలెను, అసత్యమైతే ఎప్పుడునూ కనిపించకయుండవలెను. కాబట్టి అది సత్తు అనరాదు. అయితే సదసదంటిమా కల్ల నిజములొక్క దిక్కున నుండవు. సత్తు అయింది అసత్తు కానేరదు -, అసత్తు అయింది సత్తు కానేరదు - ఇట్టి విరుద్ధ ధర్మాలు ఏవీ చెప్పరాదు - అయినా, లేనిది కలిగియున్నదికనుక మాయ. ఇలాగనీ అలాగనీ ఏమిన్నీ చెప్పరాదు - అనిర్వాచ్యమనుట - “అనాద్య విద్యా నిర్వాచ్యా” అని కలదు కనుక మృగి జలం ఎటువలె అనిర్వాజమో అటువలెనే ” (బ్రహ్మవిద్యాసుధార్ణవము - 6)
“ఆద్యా సైకా పరాశక్తిః చిన్మయీ శివ సంశ్రయా |
యామాహరీశస్య తైస్తైరును గుణైర్గుణైః |
సమాన ధర్మణీ చైవ శివస్య పరమాత్మనః |
స వైకాపి చ చిద్రూపా శక్తిః ప్రసవ ధర్మిణీ |
విభజ్య బహుథా విశ్వం విదధాతి శివేచ్చయా |
సామూల ప్రకృతిర్మాయా త్రిగుణాచ త్రిథా భవేత్ |
శివాద్యవని పర్యంతం యయా తతమిదం జగత్ ||“. (వాయువ్య సమ్హితాయాం)
(శివునియొక్క, ఆద్యా (మొదటినుండి యున్నది), ఒకే శక్తి చైతన్యముతో నిండి యుండునది, శివుని ఆశ్రయించి యుండునది. శివునితో సమాన ధర్మములు కలది చైతన్యరూపమైన శక్తి, ప్రపంచమును తనలోనుండి పుట్టింపచేయునది. శివుని ఇచ్చాప్రకారము ఈ ప్రపంచమును అనేక విధములుగా సృష్టించునది. అదియే మూల ప్రకృతి, మాయ, సత్వరజస్తమోగుణములు గలది - శివుడు మొదలు భూమివఱకు ఉన్న ప్రపంచమంతటిలోను వ్యాపుంచియున్నది).
(సర్వసారోపనిషత్)
(మాయ అనాత్మ మూలము, ఆకాశమందు మేఘమువలె పరబ్రహ్మమందుండు నది. మాయ మొదలు తుది లేనిది. సత్తుకాదు, అసత్తుకాదు - నిర్వచనము చేసి చెప్పుటకు వీలు కానిది; వాస్తవముగా కనబడనిది. మాయ యొక్క స్వరూపమే అజ్ఞానము, అదే మూల ప్రకృతి, త్రిగుణ సామ్యము కలది, అవిద్య యని అనేక విధములుగా చెప్పబడుచు, జగత్తు రూపముగా పరిణమించునది - మారునది).
(మాయ యనగా చిత్ర విచిత్రమైన సృష్టి చేయునది. విచిత్రమైన సృష్టి చేయునది కనుకనే ప్రకృతి మాయ యని చెప్పబడినది. మాయ గలవాడైన భగవంతుడే యీ ప్రపంచమంతటినీసృజించుచున్నాడు - అని చెప్పియుండుటను బట్టి - మాయ యను చెప్పబడు ప్రకృతియే యీ చిత్ర విచిత్రమైన సృష్టి చేయునది అని చెప్పబడినది. అట్టి మాయ కలవాడు కనుకనే పరమపురుషు డైన భగవంతుడు ‘మాయీ’ - “మాయావీ” అని చెప్పబడుచున్నాడు. అనాది యగు మాయలో తగుల్కొని నిదురపోవుచున్నవానివలె నుండు జీవుడు మేలుకొనును - తన నిజస్వరూపమును - తానే భగవంతుడనని నిద్రనుండి మేల్కొనినట్లు - తెలుసుకొనును. “నామాయ దాటరానిది - మీర రానిది” సత్వరజస్తమములను మూడు గుణములుగల ప్రకృతియే మాయయని చెప్పబడుచున్నది. ఇట్లు శ్రుతులు చెప్పుచున్నందున మాయ సత్ అనికాని అసత్ అని కాని చెప్పుటకు వీలుకానిది).
(స్వప్నము బుద్ధియొక్క వివర్తమే కాని వాస్తవముకానట్లు శోకము, మోహము, సుఖము, దుఃఖము దేహమునకు కలుగుట మాయవలననే అగుచున్నది. ఎందుచేతననగా వాటికి కారణమైన గుణములు మాయా మయములు, వాటివలన కలుగు సంసారము - జననమరణములు, సుఖ దుఃఖములు - మాయ).
సత్తా సత్తా వికల్పో యం తేన మాయేతి కథ్యతే ||. (యోగవాశిష్టము - 96 - 29)
(సత్యమును మిధ్యవలె, మిధ్యను - దేహాదులను - సత్యముగను తోచునట్లు చేయునది కనుక మాయయని చెప్పబడినది. సత్యాసత్య వికల్పమునకు హేతువగుటచేత చైతన్యమే మాయ యని చెప్పబడుచున్నది)
“మాయ విచారిస్తే దబ్బరై యున్నది. గనుక శూన్యమనరాదు”. (బ్రహ్మవిధ్యాసుధార్ణవము - 7)
“మాయా పరా ప్రకృతిః -”సంభవామ్యాత్మ మాయ యా” ఇత్యాది శ్రుతి స్మృతి సిద్ధా, విశ్వజననీ దేవాత్మ శక్తి రూపైకా స్వవికారభూత భోక్తృ భోగ భోగ్యార్థ ప్రయుక్తేశ్వర నికటవర్తినీ“.
(మాయ యనగా పరాప్రకృతి - నా మాయ చేతనే పుట్టుచున్నాను, అవతారములను ఎత్తుచున్నాను - అని శ్రుతిలోను, స్మృతులలోను ప్రసిద్ధి పొందియున్నది - ప్రపంచమునకు తల్లి అయినది - ప్రపంచము పుట్టుటకు కారణమైనది, ప్రపంచమునకు ఉపాదాన కారణమైనది, భగవంతుని శక్తియే అయినది. దాని వికారములే ప్రపంచములోని భోక్తృ, భోగ, భోగ్య వస్తువులు అయినది, నిరంతరము భగవంతుని సన్నిధిలో నుండునది - నిత్యనపాయిని).
(నిర్గుణుడు - సత్వరజస్తమోగుణములు లేనివాడు - కేవలుడు (ఉండువాడు తానొక్కడే అయినవాడు) (లేక, తనలో నింకేదియు కలిసియుండనివాడు), అయిన పరబ్రహ్మమందు ఆత్మస్వరూపము యొక్క విపర్యయ భావము కలిగియుండుట - ద్వైతమున్నది - బ్రహ్మ వేరు, ప్రపంచము వేరు అను అభిప్రాయము కలిగియుండుట - అనగా, పరబ్రహ్మ త్రిగుణములు కలవాడు, అందుచేత సాకారుడు - రూపము దాల్చువాడు అని అభిప్రాయము కలిగియుండుట - ఇవి దేనివలన కలుగుచున్నవో, అట్టి అభిప్రాయము కలుగుటకు ఏది కారణమో, అదియే మాయ. విభుడు, ఈశ్వరుడు అయిన పరబ్రహ్మ దేనిద్వారా ఈ ప్రపంచమును నిర్మించెనో అదియే మాయ).
“అవ్యక్త నిర్గుణ పరబ్రహ్మంబునందు దనకు విపర్యయంబుగా జననంబైన జ్ఞానంబె విష్ణు మాయ యనంబడు, బరమేశ్వరుండట్టి మాయ చేత జగంబు నిర్మించి నిశ్చింతుండై యుండు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 11 - 52)
బలాదా కృష్య మోహాత్ మహా మాయా ప్రయచ్చతి |
ఇయం సా పరమా శక్తిః |
మన్మయీ బ్రహ్మరూపిణీ |
మాయా మమప్రియా అనంతా యయేదం మోహితం జగత్ |
అనయైత జ్జగత్సర్వం స దేవాసుర మానుషం |
మోహయామి, ద్విజరేష్టాః, సృజామి, విసృజామిచ ||“. (కూర్మ పురాణము)
(జ్ఞానులైనవారియొక్క మనస్సునైనను మాయ యనునది బలవంతముగా నాకర్షించి మోహింపచేయును. బ్రహ్మ రూపమైన ఈ నా మాయ గొప్ప శక్తి కలది. నాకు ప్రియమైన ఈ నా మాయ అనంతము - నావలెనే, నా తోడనే, నేను ఉన్నంతకాలముండునది. ఈ మాయ జగత్తును మోహింపచేయుచున్నది. దేవతులు, రాక్షసులు, మనుష్యులు గల ఈ జగత్తును ఈ మాయద్వారా మోహింప చేయు చున్నాను).
(మాయ యనగా ప్రకృతి యని, మాయగలవాడు మహేశ్వరుడు - పరబ్రహ్మ - అని తెలుసుకొనవలెను).
పురుషః పరమేశానః ప్రకృతిః పరమేశ్వరీ||“.
(శివుడే మహేశ్వరుడని తెలుసుకొనవలెను - శివా (పార్వతియే) మాయయని చెప్పబడుచున్నది. పరమ పురుషుడు పరమేశ్వరుడు, ప్రకృతియే పరమేశ్వరి).
కార్యకారణరూపేణ తస్యాః పరిణతైర్గుణైః |
క్రియమాణాని కర్మాణి శ్రౌతాని లౌకికాని చ ||“. (గీతాభావప్రకాశము - 3 - 173)
(మాయ యనగా మిధ్యాజ్ఞానము - ప్రకృతి, పరమేశ్వరి, ఆ ప్రకృతియొక్క త్రిగుణములే కార్యములు, కారణములుగా మారి శ్రౌత కర్మలు, లౌకిక కర్మలు చేయబడుచున్నవి).
యదేతదైశ్వరం తేజ తన్మాం విద్ధి మహేశ్వరీం |
సర్వభూతాత్మన శ్శక్తిం విశ్వం యస్మిన్ ప్రతిష్టితం |
అహం సర్వాంతరా శక్తిర్మాయా, మాయీ మహేశ్వరః ||“. (ఆదిత్య పురాణే)
(వేదాంతములందలి యర్థమును - (ఉపనిషత్తులలో చెప్పిన యర్థమును) బాగుగా విచారించుటచేత మా యిద్దరి రూపము - పార్వతీ పరమేశ్వరుల రూపము - స్పష్టముగా అవగాహనమగును - ఈశ్వరుని యొక్క తేజస్సే మహేశ్వరి అయిన నేను సమస్త భూతములయొక్క ఆత్మ శక్తిని - నా యందే ప్రపంచమంతయు ప్రతిష్టింపబడియున్నది. అన్నింటిలోను, అందరిలోను ఉన్నటువంటి శక్తి మాయ యను నేనే. మాయ కలవాడు మహేశ్వరుడు - మాయీ. మహేశ్వరునియొక్క శక్తి మాహేశ్వరి - మాయ).
తయాసహ మహాదేవః సృజత్యేవ నిహంతిచ |
ఆచక్షతే తయోర్భేదమజ్ఞానాత్ పరమార్థతః |
అభేదశ్శివ యోర్భంధో వహ్నిదాహక యోరివ |
మాయాసా పరమాశక్తి రవ్యయా గిరిజా శివా |
మయీ విశాధికో రుద్రస్తం జ్ఞాత్వా సమునిర్భవేత్“. (ఆదిత్యపురాణే)
(మహాదేవుని యొక్క జ్ఞానమయమైన శక్తియే వ్యయ రహితమైన - నశింపని - పార్వతి - శివా. ఈ శక్తితో కూడినవాడైమహాదేవుడు ప్రపంచమును సృష్టించుచున్నాడు, సమ్హరించుచున్నాడు. అజ్ఞానమువలన మహాదేవు నికిని అతని శక్తికిని భేదమున్నదనుకొనుచున్నారు - పరమార్థ దృష్టిలో వారిద్దరికి భేదములేదు - అగ్నికిన్నీ, దాని దహించు శక్తికిన్నీ భేదము లేనట్లు. ఉత్కృష్టమైన ఆ శక్తి అవ్యయమైనది. అదియే పార్వతి, శివా, అదియే మాయ యని చెప్పబడుచున్నది. అట్టి మాయ కలవాడు మాయీ, విశ్వాధికుడు, రుద్రుడు).
మాయ యనగా ఈ క్రింద విధముగా కూడ చెప్పబడినది.
(మాయ యనగా భగవంతుని ఇచ్చ, భగవంతుని వశములో నున్న అవిద్య యని తెలియవచ్చుచున్నది, గ్రహించబడుచున్నది) - “సైక్షత”.
(భగవంతుఇని సంకల్పము - “బహుస్యాని” - (“నేనే అనేక వస్తువులుగా అయ్యెదను” అని సంకల్పించినంత మాత్రమున సృష్టిచేసెను).
(ప్రవాహ రూపముగా జనమరణములు మరల, మరల కలుగుచుండు సంసారమునకు కారణమైనది).
(పరమార్థ దృష్టిలో లేనిదే మాయ. తనకు బ్రహ్మజ్ఞానము లేకపోవుటవలన - తానే పరబ్రహ్మ “అహంబ్రహ్మస్మి” అను జ్ఙానము లేకపోవుటవలన పేకృతి అని చెప్పబడినదే మాయ) (చూడుము - 9).
(ప్రపంచ సృష్టి స్థితిలయకాలములందు ప్రపంచమునకు, దానిలో వస్తువులన్నింటికీ ఉపాదానమైయుండు ప్రకృతి తత్వమే మాయ).
(మాయ యను చెప్పబడు ప్రకృతి జడము కనుక తమస్సు - అజ్ఞానము - తో సమానమైనది).
“అనిర్వాచ్యమైన మాయ యొక్కటే షడ్విధాలై తదుపాధినల్ల బ్రహ్మమే సదాశివ, ఈశ్వర, రుద్ర, విష్ణు, విధాత, ఆత్మ తత్వాలనెడి షడ్విధాలయందున్నూ తోస్తుండును - అదెలాగంటే - జలమొక్కటే మధురామ్లాద్యుపాధి వల్ల షడ్విధాలై తోచును. పరమాత్మ మాయోపాధివల్ల జీవ జగదాకృతియై తోచుననెడిదే ప్రసిద్ధం,”
“తన అవ్యక్త స్వరూపమునుండి జగత్తునంతను నిర్మించునట్టి పరమేశ్వరుని యొక్క అచింత్య శక్తియే మాయ”.
“మనః ఆదిభిః - మనసా, వాచా, చక్షుభ్యాం, శ్రవణాదిభిః - గృహ్యమాణం మనో మయ్త్వాత్ మాయా” –
“యదిదం మనసా వాచా చక్షుర్భ్యాం శ్రవణాదిభిః |
నశ్వరం గృహ్యమాణంచ విద్ధి మాయా మనోమయం“. (శ్రీమద్భాగవతం - 11)
(మనస్సు మొదలగువాటిచేత - అనగా, మనస్సుచేత, వాక్కుచేత, కండ్లచేత, చెవులచేత - మొదలగువాటిచేత గ్రహించబడునదంతయు మనోమయమగుటవలన మాయ యని చెప్పబడినది).
జ్ఞాయా మాయా త్రిభిర్బోధై శ్రౌతమోక్తిక లేకికైః |
(మాయ జడస్వరూపము - ప్రాణులను మోహింపచేయునది, కనుక శ్రుతులలో తుచ్ఛమని - లేనిదనియు, అజ్ఞులకు ఉన్నట్లుగనే ప్రకాశించుటచేత వారి దృష్టిలో వాస్తవమైనది - ఉన్నది - గనే అనిపించునది. యుక్తిచేత నిర్వచించుటకు వీలుకానిదగుటచేత అనిర్వచనీయము; నిర్వచించుటకు వీలు లేకపోయినను కనబడకుండ నుండుటచేత లేనిదని చెప్పబడినను కార్యరూపములో తెలియవచ్చుటచేత ఉండునదియని చెప్పవచ్చును - ఇట్లు లేనిది, ఉన్నది అను విరుద్ధభావములు కలిగియున్నదికనుక మాయ యని చెప్ప్బడినది. సమష్టిరూపములో పరబ్రహ్మనాదరించియుండునది మాయ యనియును, వ్యష్టిరూపములో జీవుని ఆశ్రయించి యుండునదియే అవిద్య యనబడును).
“మాయా యాః రూపద్వయం - మాయా విద్యాత్మకం అస్తి” - “మాయా చ విద్యా చ స్వయమేవ భవతి” ఇతి శ్రుతేః - తత్ప్రథమాయా మాయా శక్తిః తస్యాః స్వాశ్రయ వ్యామోహ కారిత్వా భావేపి జీవాశ్రితా విద్యా రూపస్య ద్వితీయ మాయా స్వరూపస్య స్వాశ్రయవా - మోహ కారిత్వం అస్తి ఏవ “.
(మాయ రెండు విధములుఇగా నున్నది - మాయ, అవిద్య - ఒకటే అయిన మాయ ఈ రెండు విధములుగా నున్నదని శ్రుతి చెప్పుచున్నది. రజస్తమోగుణములులేని శుద్ధ సత్వగుణముకలది మాయ. ఇది భగవంతుని ఆశ్రయించియున్నది. కాని భగవతుడు దానిని తన వశములో నుంచుకొనినాడు - తజస్తమోగుణములతో కలిసిన మలిన సత్వగుణము ప్రధానముగా గలది అవిద్య. అవిద్య జీవుని ఆవరించి తనవశములో నుంచుకొనునది.)
మాయయే అవిద్య, అవ్యక్తము, తమస్సు, సుషుప్తి, ప్రకృతి, ప్రళయము, ప్రథానము, అజ్ఞానము అని చెప్పబడుచున్నది. బ్రహ్మజ్ఞానము కలుగ గానే నశించునది కనుక అవిద్యయని చెప్పబడుచున్నది. తాను ప్రతివస్తువులో నుండియు వ్యక్తము కాకుండుటవలన - ఉన్నట్లు కనబడనందున - అవ్యక్తమని చెప్పబడుచున్నది. ప్రళయకాలమందు సృష్టిలోని వస్తువులన్నియు తనలో లీనము చేసుకొని తటస్థముగా నుండునది. సృష్టి క్రమములో ఉపాదానముగా మొట్టమొదటసృష్టింపబడినదికనుక ప్రకృతి - “ప్రథమం కృతం” - అని చెప్పబడినది. తను బ్రహ్మమే యను తనస్వరూపము నాచ్ఛాదించుటచేత అజ్ఞానమని చెప్పబడినది. ప్రపంచములోని అనేక విధములైనవస్తువులను ఏ విధమైన సామగ్రి - పనిముట్లు ఇతర సహాయములేక ఇంద్రజాలమువలె తానే సృష్టించునది కనుక మాయ యని చెప్పబడినది.
మాయ శుద్ధ చైతన్య్త మైన పరబ్రహ్మను ఆశ్రయించియుండునది. పరబ్రహ్మ ఎప్పటినుండి ఉండునో అప్పటినుండి యున్నది. ఎప్పుడు ప్రారంభమైనదో తెలియదు కనుక అనాది. ఇది లేనిదైనను బ్రహ్మజ్ఞానము కలుగగనే నశించునది కనుక అంతము కలది. ఈ మాయ బ్రహ్మజ్ఞానము కలుగగనే లేకుండపోవును కనుక సత్తుకాదు - మూడుకాలములందుండునది కాదు. కాని కార్యరూపములో దీని ప్రభావము మూడుకాలములందు కనుపించుచున్నది. అందుచేత అసత్తుకాదు - అసత్తు అనగా కుందేటి కొమ్ము, గొడ్రాలి కొడుకువలె - లేని వస్తువుకాదు. అందుచేత సదసద్విలక్షణము - ఉన్న వస్తువు లేనిదిగను, లేని వస్తువు ఉన్నదిగను చేయు శల్తి కలది. చేతనమున చేతనముగను, అచేతనమును చేతనముగను, సుఖమును దుఃఖముగను, దుఃఖమును సుఖముగను, సత్యమునసత్యముగను, అసత్యమును సత్యముగను భ్రమ కలుగచేయునది కనుక మాయ యని చెప్పబడినది.
“మ. జనకుండెవ్వడు, జాతుడెవ్వడు జనిస్థానంబు లెచ్చోటు, సం
జననం బెయ్యది, మేనులేకొలది, సంసారంబులేరూపముల్
వినుమా యింతయు విష్ణుమాయ దలపన్ వేఱేమియున్ లేదు, మో
హ నిబంధంబు నిధానమింతటికి; జాయా, విన్నచో నేటికిన్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 8 - 16 - 475)
(mōhamu kalugucēyu śakti; vicitramaina śalti; prakṛti).
(citra vicitramaina rūpamukaladi kanuka māya, vikāramulu, anēka mārpulugaladi kanuka māya).
(citra vicitramaina - anēkarūpamulatō, anēka svabhāvamulatō - sṛṣṭini cēyunadi - eṭlu cēyunō teliyabaḍanidi - kanuka māya yani ceppabaḍinadi).
“lēni prapaṃcamunu kalugacēstuṃdi kanuka māya” (brahmavidyā sudhārṇavamu - 7)
(ī prapaṃcamulōni vastuvulanniyu bhagavaṃtunilōnuṃḍi puṭṭinavikanuka bhagavaṃtuni rūpamulē, aṃducēta, ā rūpamulatō niṃḍiyunna prapaṃcamu bhagavaṃtuni rūpamē - adi aṃtā bhagavaṃtuḍē, kāni anubhavaṃlō, vyāvahārikaṃgā annī vēruvērugā tōcucunnāyi - iṭlukānidi ayinaṭlu tōcuṭayē māya).
(śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 9 - 253)
“aghaṭita ghaṭanā paṭīyasī śaktiḥ māyā” ani kaladukanuka māya ghaṭiṃci tōcunu - aṃṭē, ā māya avicāramaṃdē (alōciṃcanaṃtavaṟakē) satyamu. vicāra pūrvakaṃgā cūstē asatyamu - mithya annamāṭa. ayitē, jagattu tōcinadi aṃṭē ghaṭamaṃdu tōcinabhāvamella mṛtikēkāni ghatamanēdilēdu - cinmātramaina tanayaṃdu prapaṃcaṃ lēdanēdē satyaṃ. iṃduku śruti - “nāmarūpēnyākaravāṇi, vāhāraṃbhaṇaṃ vikārō nāmadhēyaṃ mṛttikā ityēva satyaṃ”- “ēkaṃ satyaṃ bahathā kalyaṃti” ani chāṃdōgyamu.
anādiranaṃtavatī yāna vidyatē sāmāyā, māyāsvarūpaṃ ajñānaṃ, tadēva mūla prakṛtiḥ, gaṇa sāmyaṃ, avidyā ityādyanēkākārā, jagadākārēṇa pariṇatā.
(modalu tudi lēnaṭuvaṃṭidi māya. māyasvarūpamu ajñānamu - adiyē mūla prakṛti - satvarajastamōguṇamulu samānamugā galadi, avidyalanu modalagu rūpamulu galadi. adiyē jagattugā mārinadi, jagattunaku upādānakāraṇamainadi - maṭṭiyē kuṃḍa, mūkuḍugā mārinaṭlu. māya lēka prakṛtilōnuṃḍi prapaṃcakamu puṭṭi, vistariṃcukoni pōyi praḷayakālamaṃdu kudiṃcukonipōyi māyagā ayi, marala prapaṃcamugā vistariṃcuṭacēta pravāha rūpamulō modalu, tudi lēnaṭluṃḍunadi).
(lēnidēdiyō adiyē māya - kuṃdēṭi kommuvale - (kuṃdēṭiki kommu uṃḍadu) - bhūtabhaviṣyadvartamānamulanu mūḍukālamulaṃdunu lēnidi, kanabaḍanadi, teliyanidi).
(paramārtha dṛṣṭilō ēdi lēdō adiyē māya. ī prapaṃcamaṃtayu bhaga vaṃtuni lōnuṃḍi puṭṭinadē yaguṭacēta aṃdulōni vastuvulanniyu bhagavaṃtuni rūpamulē kāni anyamulukāvu. avi vēṟuvēṟugā kanabaḍuṭayē māya. ajñānamu valana - bhagavaṃtuni guṟiṃci ayina jñānamu lēkapōvuṭavalana, sṛṣṭi, sṛṣṭilōnunna rūpamulanniyu bhagavaṃtuni rūpamulē yanu jñānamu lēkapōvuṭavalanavēṟuvēṟu vastuvulugā kanabaḍucunnavi - idiyē māya).
tatva dṛṣṭyātu nāstyēva tatvamēvāsti kēvalaṃ ||“.
(vyāvahārika dṛṣṭilō vidyāyaniyu, māyaniyu, ceppuṭagaladu, tatva dṛṣṭilō - paramārtha dṛṣṭilō lēnidē, unnadāṃtā okka bhagavaṃtuḍē, bhagavattattvamē, paramātma tatvamē)
“ā māya guṇatraya sāmānyaṃ valla prakṛti anipiṃcukonunu. duṣkarma viśēṣaṃ valla tāmasa prathānamai sātvikamumunu mūsukoni avidya anipiṃcukonunu, - satkarma sāmarthyaṃvalla sātvikaguṇaprathānamai avidyaku virōdhamai vidya anipiṃcukonunu. avi yelāgaṃṭē - svalpōdakālanayina paṃkilānaku bahulōdakamu virōdhiyai yuṃḍunu.” (brahmavidyāsudhārṇavamu - 3)
ī māya yaneḍidi pravṛtti kālamaṃdu guṇatrayānuṣaṃgiyai jīna jagadākṛtitōḍanu ati sthūlarūpamai, nivṛttikālamaṃdu guṇatrayālanu mīri ati sūkṣmarūpaṃtō cēpaṭṭu śuddhavidya anē abhimānaṃtō brahmamaṃdē līnamāye”.
(brahmavidyāsudhārṇavamu -3)
tanudrayālaku kāraṇaṃ, adē mahāmāya, ā mahāmāyē parāśakti, īśvaruni mūla prakṛti - māya satyamō asatyamō, ēka satyāsatyamō, satyāsatya vilakṣaṇamō, aṃṭē, adēmīkādu. māya satyamaitē ēla cepparādaṃṭē - nityamaitē eppuḍunnū ceḍakayuṃḍavalenu, asatyamaitē eppuḍunū kanipiṃcakayuṃḍavalenu. kābaṭṭi adi sattu anarādu. ayitē sadasadaṃṭimā kalla nijamulokka dikkuna nuṃḍavu. sattu ayiṃdi asattu kānēradu -, asattu ayiṃdi sattu kānēradu - iṭṭi viruddha dharmālu ēvī cepparādu - ayinā, lēnidi kaligiyunnadikanuka māya. ilāganī alāganī ēminnī cepparādu - anirvācyamanuṭa - “anādya vidyā nirvācyā” ani kaladu kanuka mṛgi jalaṃ eṭuvale anirvājamō aṭuvalenē ” (brahmavidyāsudhārṇavamu - 6)
“ādyā saikā parāśaktiḥ cinmayī śiva saṃśrayā |
yāmāharīśasya taistairunu guṇairguṇaiḥ |
samāna dharmaṇī caiva śivasya paramātmanaḥ |
sa vaikāpi ca cidrūpā śaktiḥ prasava dharmiṇī |
vibhajya bahuthā viśvaṃ vidadhāti śivēccayā |
sāmūla prakṛtirmāyā triguṇāca trithā bhavēt |
śivādyavani paryaṃtaṃ yayā tatamidaṃ jagat ||“. (vāyuvya samhitāyāṃ)
(śivuniyokka, ādyā (modaṭinuṃḍi yunnadi), okē śakti caitanyamutō niṃḍi yuṃḍunadi, śivuni āśrayiṃci yuṃḍunadi. śivunitō samāna dharmamulu kaladi caitanyarūpamaina śakti, prapaṃcamunu tanalōnuṃḍi puṭṭiṃpacēyunadi. śivuni iccāprakāramu ī prapaṃcamunu anēka vidhamulugā sṛṣṭiṃcunadi. adiyē mūla prakṛti, māya, satvarajastamōguṇamulu galadi - śivuḍu modalu bhūmivaṟaku unna prapaṃcamaṃtaṭilōnu vyāpuṃciyunnadi).
(sarvasārōpaniṣat)
(māya anātma mūlamu, ākāśamaṃdu mēghamuvale parabrahmamaṃduṃḍu nadi. māya modalu tudi lēnidi. sattukādu, asattukādu - nirvacanamu cēsi ceppuṭaku vīlu kānidi; vāstavamugā kanabaḍanidi. māya yokka svarūpamē ajñānamu, adē mūla prakṛti, triguṇa sāmyamu kaladi, avidya yani anēka vidhamulugā ceppabaḍucu, jagattu rūpamugā pariṇamiṃcunadi - mārunadi).
(māya yanagā citra vicitramaina sṛṣṭi cēyunadi. vicitramaina sṛṣṭi cēyunadi kanukanē prakṛti māya yani ceppabaḍinadi. māya galavāḍaina bhagavaṃtuḍē yī prapaṃcamaṃtaṭinīsṛjiṃcucunnāḍu - ani ceppiyuṃḍuṭanu baṭṭi - māya yanu ceppabaḍu prakṛtiyē yī citra vicitramaina sṛṣṭi cēyunadi ani ceppabaḍinadi. aṭṭi māya kalavāḍu kanukanē paramapuruṣu ḍaina bhagavaṃtuḍu ‘māyī’ - “māyāvī” ani ceppabaḍucunnāḍu. anādi yagu māyalō tagulkoni nidurapōvucunnavānivale nuṃḍu jīvuḍu mēlukonunu - tana nijasvarūpamunu - tānē bhagavaṃtuḍanani nidranuṃḍi mēlkoninaṭlu - telusukonunu. “nāmāya dāṭarānidi - mīra rānidi” satvarajastamamulanu mūḍu guṇamulugala prakṛtiyē māyayani ceppabaḍucunnadi. iṭlu śrutulu ceppucunnaṃduna māya sat anikāni asat ani kāni ceppuṭaku vīlukānidi).
(svapnamu buddhiyokka vivartamē kāni vāstavamukānaṭlu śōkamu, mōhamu, sukhamu, duḥkhamu dēhamunaku kaluguṭa māyavalananē agucunnadi. eṃducētananagā vāṭiki kāraṇamaina guṇamulu māyā mayamulu, vāṭivalana kalugu saṃsāramu - jananamaraṇamulu, sukha duḥkhamulu - māya).
sattā sattā vikalpō yaṃ tēna māyēti kathyatē ||. (yōgavāśiṣṭamu - 96 - 29)
(satyamunu midhyavale, midhyanu - dēhādulanu - satyamuganu tōcunaṭlu cēyunadi kanuka māyayani ceppabaḍinadi. satyāsatya vikalpamunaku hētuvaguṭacēta caitanyamē māya yani ceppabaḍucunnadi)
“māya vicāristē dabbarai yunnadi. ganuka śūnyamanarādu”. (brahmavidhyāsudhārṇavamu - 7)
“māyā parā prakṛtiḥ -”saṃbhavāmyātma māya yā” ityādi śruti smṛti siddhā, viśvajananī dēvātma śakti rūpaikā svavikārabhūta bhōktṛ bhōga bhōgyārtha prayuktēśvara nikaṭavartinī”.
(māya yanagā parāprakṛti - nā māya cētanē puṭṭucunnānu, avatāramulanu ettucunnānu - ani śrutilōnu, smṛtulalōnu prasiddhi poṃdiyunnadi - prapaṃcamunaku talli ayinadi - prapaṃcamu puṭṭuṭaku kāraṇamainadi, prapaṃcamunaku upādāna kāraṇamainadi, bhagavaṃtuni śaktiyē ayinadi. dāni vikāramulē prapaṃcamulōni bhōktṛ, bhōga, bhōgya vastuvulu ayinadi, niraṃtaramu bhagavaṃtuni sannidhilō nuṃḍunadi - nityanapāyini).
(nirguṇuḍu - satvarajastamōguṇamulu lēnivāḍu - kēvaluḍu (uṃḍuvāḍu tānokkaḍē ayinavāḍu) (lēka, tanalō niṃkēdiyu kalisiyuṃḍanivāḍu), ayina parabrahmamaṃdu ātmasvarūpamu yokka viparyaya bhāvamu kaligiyuṃḍuṭa - dvaitamunnadi - brahma vēru, prapaṃcamu vēru anu abhiprāyamu kaligiyuṃḍuṭa - anagā, parabrahma triguṇamulu kalavāḍu, aṃducēta sākāruḍu - rūpamu dālcuvāḍu ani abhiprāyamu kaligiyuṃḍuṭa - ivi dēnivalana kalugucunnavō, aṭṭi abhiprāyamu kaluguṭaku ēdi kāraṇamō, adiyē māya. vibhuḍu, īśvaruḍu ayina parabrahma dēnidvārā ī prapaṃcamunu nirmiṃcenō adiyē māya).
“avyakta nirguṇa parabrahmaṃbunaṃdu danaku viparyayaṃbugā jananaṃbaina jñānaṃbe viṣṇu māya yanaṃbaḍu, baramēśvaruṃḍaṭṭi māya cēta jagaṃbu nirmiṃci niściṃtuṃḍai yuṃḍu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 11 - 52)
balādā kṛṣya mōhāt mahā māyā prayaccati |
iyaṃ sā paramā śaktiḥ |
manmayī brahmarūpiṇī |
māyā mamapriyā anaṃtā yayēdaṃ mōhitaṃ jagat |
anayaita jjagatsarvaṃ sa dēvāsura mānuṣaṃ |
mōhayāmi, dvijarēṣṭāḥ, sṛjāmi, visṛjāmica ||“. (kūrma purāṇamu)
(jñānulainavāriyokka manassunainanu māya yanunadi balavaṃtamugā nākarṣiṃci mōhiṃpacēyunu. brahma rūpamaina ī nā māya goppa śakti kaladi. nāku priyamaina ī nā māya anaṃtamu - nāvalenē, nā tōḍanē, nēnu unnaṃtakālamuṃḍunadi. ī māya jagattunu mōhiṃpacēyucunnadi. dēvatulu, rākṣasulu, manuṣyulu gala ī jagattunu ī māyadvārā mōhiṃpa cēyu cunnānu).
(māya yanagā prakṛti yani, māyagalavāḍu mahēśvaruḍu - parabrahma - ani telusukonavalenu).
puruṣaḥ paramēśānaḥ prakṛtiḥ paramēśvarī||“.
(śivuḍē mahēśvaruḍani telusukonavalenu - śivā (pārvatiyē) māyayani ceppabaḍucunnadi. parama puruṣuḍu paramēśvaruḍu, prakṛtiyē paramēśvari).
kāryakāraṇarūpēṇa tasyāḥ pariṇatairguṇaiḥ |
kriyamāṇāni karmāṇi śrautāni laukikāni ca ||“. (gītābhāvaprakāśamu - 3 - 173)
(māya yanagā midhyājñānamu - prakṛti, paramēśvari, ā prakṛtiyokka triguṇamulē kāryamulu, kāraṇamulugā māri śrauta karmalu, laukika karmalu cēyabaḍucunnavi).
yadētadaiśvaraṃ tēja tanmāṃ viddhi mahēśvarīṃ |
sarvabhūtātmana śśaktiṃ viśvaṃ yasmin pratiṣṭitaṃ |
ahaṃ sarvāṃtarā śaktirmāyā, māyī mahēśvaraḥ ||“. (āditya purāṇē)
(vēdāṃtamulaṃdali yarthamunu - (upaniṣattulalō ceppina yarthamunu) bāgugā vicāriṃcuṭacēta mā yiddari rūpamu - pārvatī paramēśvarula rūpamu - spaṣṭamugā avagāhanamagunu - īśvaruni yokka tējassē mahēśvari ayina nēnu samasta bhūtamulayokka ātma śaktini - nā yaṃdē prapaṃcamaṃtayu pratiṣṭiṃpabaḍiyunnadi. anniṃṭilōnu, aṃdarilōnu unnaṭuvaṃṭi śakti māya yanu nēnē. māya kalavāḍu mahēśvaruḍu - māyī. mahēśvaruniyokka śakti māhēśvari - māya).
tayāsaha mahādēvaḥ sṛjatyēva nihaṃtica |
ācakṣatē tayōrbhēdamajñānāt paramārthataḥ |
abhēdaśśiva yōrbhaṃdhō vahnidāhaka yōriva |
māyāsā paramāśakti ravyayā girijā śivā |
mayī viśādhikō rudrastaṃ jñātvā samunirbhavēt”. (ādityapurāṇē)
(mahādēvuni yokka jñānamayamaina śaktiyē vyaya rahitamaina - naśiṃpani - pārvati - śivā. ī śaktitō kūḍinavāḍaimahādēvuḍu prapaṃcamunu sṛṣṭiṃcucunnāḍu, samhariṃcucunnāḍu. ajñānamuvalana mahādēvu nikini atani śaktikini bhēdamunnadanukonucunnāru - paramārtha dṛṣṭilō vāriddariki bhēdamulēdu - agnikinnī, dāni dahiṃcu śaktikinnī bhēdamu lēnaṭlu. utkṛṣṭamaina ā śakti avyayamainadi. adiyē pārvati, śivā, adiyē māya yani ceppabaḍucunnadi. aṭṭi māya kalavāḍu māyī, viśvādhikuḍu, rudruḍu).
māya yanagā ī kriṃda vidhamugā kūḍa ceppabaḍinadi.
(māya yanagā bhagavaṃtuni icca, bhagavaṃtuni vaśamulō nunna avidya yani teliyavaccucunnadi, grahiṃcabaḍucunnadi) - “saikṣata”.
(bhagavaṃtuini saṃkalpamu - “bahusyāni” - (“nēnē anēka vastuvulugā ayyedanu” ani saṃkalpiṃcinaṃta mātramuna sṛṣṭicēsenu).
(pravāha rūpamugā janamaraṇamulu marala, marala kalugucuṃḍu saṃsāramunaku kāraṇamainadi).
(paramārtha dṛṣṭilō lēnidē māya. tanaku brahmajñānamu lēkapōvuṭavalana - tānē parabrahma “ahaṃbrahmasmi” anu jṅānamu lēkapōvuṭavalana pēkṛti ani ceppabaḍinadē māya) (cūḍumu - 9).
(prapaṃca sṛṣṭi sthitilayakālamulaṃdu prapaṃcamunaku, dānilō vastuvulanniṃṭikī upādānamaiyuṃḍu prakṛti tatvamē māya).
(māya yanu ceppabaḍu prakṛti jaḍamu kanuka tamassu - ajñānamu - tō samānamainadi).
“anirvācyamaina māya yokkaṭē ṣaḍvidhālai tadupādhinalla brahmamē sadāśiva, īśvara, rudra, viṣṇu, vidhāta, ātma tatvālaneḍi ṣaḍvidhālayaṃdunnū tōstuṃḍunu - adelāgaṃṭē - jalamokkaṭē madhurāmlādyupādhi valla ṣaḍvidhālai tōcunu. paramātma māyōpādhivalla jīva jagadākṛtiyai tōcunaneḍidē prasiddhaṃ,”
“tana avyakta svarūpamunuṃḍi jagattunaṃtanu nirmiṃcunaṭṭi paramēśvaruni yokka aciṃtya śaktiyē māya”.
“manaḥ ādibhiḥ - manasā, vācā, cakṣubhyāṃ, śravaṇādibhiḥ - gṛhyamāṇaṃ manō maytvāt māyā” –
“yadidaṃ manasā vācā cakṣurbhyāṃ śravaṇādibhiḥ |
naśvaraṃ gṛhyamāṇaṃca viddhi māyā manōmayaṃ”. (śrīmadbhāgavataṃ - 11)
(manassu modalaguvāṭicēta - anagā, manassucēta, vākkucēta, kaṃḍlacēta, cevulacēta - modalaguvāṭicēta grahiṃcabaḍunadaṃtayu manōmayamaguṭavalana māya yani ceppabaḍinadi).
jñāyā māyā tribhirbōdhai śrautamōktika lēkikaiḥ |
(māya jaḍasvarūpamu - prāṇulanu mōhiṃpacēyunadi, kanuka śrutulalō tucchamani - lēnidaniyu, ajñulaku unnaṭluganē prakāśiṃcuṭacēta vāri dṛṣṭilō vāstavamainadi - unnadi - ganē anipiṃcunadi. yukticēta nirvaciṃcuṭaku vīlukānidaguṭacēta anirvacanīyamu; nirvaciṃcuṭaku vīlu lēkapōyinanu kanabaḍakuṃḍa nuṃḍuṭacēta lēnidani ceppabaḍinanu kāryarūpamulō teliyavaccuṭacēta uṃḍunadiyani ceppavaccunu - iṭlu lēnidi, unnadi anu viruddhabhāvamulu kaligiyunnadikanuka māya yani ceppbaḍinadi. samaṣṭirūpamulō parabrahmanādariṃciyuṃḍunadi māya yaniyunu, vyaṣṭirūpamulō jīvuni āśrayiṃci yuṃḍunadiyē avidya yanabaḍunu).
“māyā yāḥ rūpadvayaṃ - māyā vidyātmakaṃ asti” - “māyā ca vidyā ca svayamēva bhavati” iti śrutēḥ - tatprathamāyā māyā śaktiḥ tasyāḥ svāśraya vyāmōha kāritvā bhāvēpi jīvāśritā vidyā rūpasya dvitīya māyā svarūpasya svāśrayavā - mōha kāritvaṃ asti ēva “.
(māya reṃḍu vidhamuluigā nunnadi - māya, avidya - okaṭē ayina māya ī reṃḍu vidhamulugā nunnadani śruti ceppucunnadi. rajastamōguṇamululēni śuddha satvaguṇamukaladi māya. idi bhagavaṃtuni āśrayiṃciyunnadi. kāni bhagavatuḍu dānini tana vaśamulō nuṃcukonināḍu - tajastamōguṇamulatō kalisina malina satvaguṇamu pradhānamugā galadi avidya. avidya jīvuni āvariṃci tanavaśamulō nuṃcukonunadi.)
māyayē avidya, avyaktamu, tamassu, suṣupti, prakṛti, praḷayamu, prathānamu, ajñānamu ani ceppabaḍucunnadi. brahmajñānamu kaluga gānē naśiṃcunadi kanuka avidyayani ceppabaḍucunnadi. tānu prativastuvulō nuṃḍiyu vyaktamu kākuṃḍuṭavalana - unnaṭlu kanabaḍanaṃduna - avyaktamani ceppabaḍucunnadi. praḷayakālamaṃdu sṛṣṭilōni vastuvulanniyu tanalō līnamu cēsukoni taṭasthamugā nuṃḍunadi. sṛṣṭi kramamulō upādānamugā moṭṭamodaṭasṛṣṭiṃpabaḍinadikanuka prakṛti - “prathamaṃ kṛtaṃ” - ani ceppabaḍinadi. tanu brahmamē yanu tanasvarūpamu nācchādiṃcuṭacēta ajñānamani ceppabaḍinadi. prapaṃcamulōni anēka vidhamulainavastuvulanu ē vidhamaina sāmagri - panimuṭlu itara sahāyamulēka iṃdrajālamuvale tānē sṛṣṭiṃcunadi kanuka māya yani ceppabaḍinadi.
māya śuddha caitanyta maina parabrahmanu āśrayiṃciyuṃḍunadi. parabrahma eppaṭinuṃḍi uṃḍunō appaṭinuṃḍi yunnadi. eppuḍu prāraṃbhamainadō teliyadu kanuka anādi. idi lēnidainanu brahmajñānamu kalugaganē naśiṃcunadi kanuka aṃtamu kaladi. ī māya brahmajñānamu kalugaganē lēkuṃḍapōvunu kanuka sattukādu - mūḍukālamulaṃduṃḍunadi kādu. kāni kāryarūpamulō dīni prabhāvamu mūḍukālamulaṃdu kanupiṃcucunnadi. aṃducēta asattukādu - asattu anagā kuṃdēṭi kommu, goḍrāli koḍukuvale - lēni vastuvukādu. aṃducēta sadasadvilakṣaṇamu - unna vastuvu lēnidiganu, lēni vastuvu unnadiganu cēyu śalti kaladi. cētanamuna cētanamuganu, acētanamunu cētanamuganu, sukhamunu duḥkhamuganu, duḥkhamunu sukhamuganu, satyamunasatyamuganu, asatyamunu satyamuganu bhrama kalugacēyunadi kanuka māya yani ceppabaḍinadi.
“ma. janakuṃḍevvaḍu, jātuḍevvaḍu janisthānaṃbu leccōṭu, saṃ
jananaṃ beyyadi, mēnulēkoladi, saṃsāraṃbulērūpamul
vinumā yiṃtayu viṣṇumāya dalapan vēṟēmiyun lēdu, mō
ha nibaṃdhaṃbu nidhānamiṃtaṭiki; jāyā, vinnacō nēṭikin”. (śrīmadāṃdhramahābhāgavatamu - 8 - 16 - 475)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.