← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మాయాశక్తిః māyāśaktiḥ

Original — తెలుగు
  1. “యథా గజశరీరే ప్రవిష్టస్య గజ ఇతి వ్యవహారః తథా ప్రథమతః మాయాశరీరే ప్రవిష్టస్య చైతన్యస్య మాయా శక్తిరితి వ్యవహారః, తదనంతరం గుణోత్పాదాత్ ఏకైక గుణవిశిష్ట మాయాశబల బ్రహ్మణః ఏవ బ్రహ్మ విష్ణు రుద్రాః ఇత్యాది వ్యవహారః - తథాచ సర్వకారణం బ్రహ్మమాయాశక్తి సహితమేవ భవతి. ఇతి మాయాశక్తిః దేవీ భగవతి ఇత్యాది ముఖ్య శబ్దైరేవ ఉపాస్యా.”

(ఏనుగు శరీరములో ప్రవేశించియుండు శక్తిని ఏనుగ అని వ్యవహరింతురు - వ్యవహారములో చెప్పుకొనెదరు. ఆ ప్రకారముగానేమాయా శరీరమందున్న చైతన్యమును - చిచ్ఛక్తిని - మాయా శక్తి యని వ్యవహరింతురు - అటు తర్వాత మాయలో సత్వరజస్తమములను త్రిగుణములు పుట్టుటవలన ఒక్కొక్క గుణములోని శక్తిని మాయా శబల బ్రహ్మముయొక్క - మాయతో కూడిన పరబ్రహ్మయొక్క రూపములయిన బ్రహ్మ, విష్ణు,రుద్రులు అని వ్యవహరించుచున్నారు - అందుచేత అన్నింటికి కారణమైనది మాయా శక్తితో కూడిన పరబ్రహ్మమే. ఇట్లు మాయా శక్తియే దేవియని, భగవతి యని ఉపాసన చేయవలెను).

  1. మాయా యాః శక్తిద్వయమస్తి - ఏక ఆవరణశక్తిః, అపరా విక్షేపరూపా. తత్ర జ్ఞానే సతి ఆవరణరూప శక్తేః అనాశే అపి విక్షేప శక్తిః ప్రారబ్ధకర్మ కర్మ క్షయ పర్యంతం తథైవ తిష్ఠతి.

(మాయకు రెండు శక్తులు గలవు - ఆవరణశక్తి, విక్షేపశక్తి. బ్రహ్మజ్ఞానము కలిగిన పిమ్మట ఆవరణ శక్తి నశించును - కాని విక్షేపశక్తి ప్రారబ్ధకర్మ క్షీణించువరకు ఉండును. జ్ఞానోదయమైనను ఫలమునిచ్చుటకు ఆరంభించిన కర్మ ఫలము అనుభవించవలసినదే - ఆ అనుభవాంతమందే విక్షేపశక్తి ప్రభావము లేకుండపోవును - అంతవరకు మోక్షమురాదు).

Transliteration
  1. “yathā gajaśarīrē praviṣṭasya gaja iti vyavahāraḥ tathā prathamataḥ māyāśarīrē praviṣṭasya caitanyasya māyā śaktiriti vyavahāraḥ, tadanaṃtaraṃ guṇōtpādāt ēkaika guṇaviśiṣṭa māyāśabala brahmaṇaḥ ēva brahma viṣṇu rudrāḥ ityādi vyavahāraḥ - tathāca sarvakāraṇaṃ brahmamāyāśakti sahitamēva bhavati. iti māyāśaktiḥ dēvī bhagavati ityādi mukhya śabdairēva upāsyā.”

(ēnugu śarīramulō pravēśiṃciyuṃḍu śaktini ēnuga ani vyavahariṃturu - vyavahāramulō ceppukonedaru. ā prakāramugānēmāyā śarīramaṃdunna caitanyamunu - cicchaktini - māyā śakti yani vyavahariṃturu - aṭu tarvāta māyalō satvarajastamamulanu triguṇamulu puṭṭuṭavalana okkokka guṇamulōni śaktini māyā śabala brahmamuyokka - māyatō kūḍina parabrahmayokka rūpamulayina brahma, viṣṇu,rudrulu ani vyavahariṃcucunnāru - aṃducēta anniṃṭiki kāraṇamainadi māyā śaktitō kūḍina parabrahmamē. iṭlu māyā śaktiyē dēviyani, bhagavati yani upāsana cēyavalenu).

  1. māyā yāḥ śaktidvayamasti - ēka āvaraṇaśaktiḥ, aparā vikṣēparūpā. tatra jñānē sati āvaraṇarūpa śaktēḥ anāśē api vikṣēpa śaktiḥ prārabdhakarma karma kṣaya paryaṃtaṃ tathaiva tiṣṭhati.

(māyaku reṃḍu śaktulu galavu - āvaraṇaśakti, vikṣēpaśakti. brahmajñānamu kaligina pimmaṭa āvaraṇa śakti naśiṃcunu - kāni vikṣēpaśakti prārabdhakarma kṣīṇiṃcuvaraku uṃḍunu. jñānōdayamainanu phalamuniccuṭaku āraṃbhiṃcina karma phalamu anubhaviṃcavalasinadē - ā anubhavāṃtamaṃdē vikṣēpaśakti prabhāvamu lēkuṃḍapōvunu - aṃtavaraku mōkṣamurādu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.