← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మాయాతరణం māyātaraṇaṃ

Original — తెలుగు
  1. భగవంతుని మాయను దాటుట, తరించుట, మాయ యొక్క ప్రభావము తనమీద లేకుండ చేసుకొనుట,

  2. “దేవీహ్యేషా గుణమయీ మమ మాయా దరత్యయా |

మామేవ ఏ ప్రపద్యంతే మాయా మేతాం తరంతి ||

నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధిమాః |

మాయ యాపహృతజ్ఞానా ఆసురం భావమాశ్రితాః || (శ్రీమద్భగవద్గీత - 7 - 14,15)

“మామేవ సత్య సంకల్పం పరమ కారుణికం అనాలోచిత విశేషా శేష లోక శరణ్యం యే శరణం ప్రపద్యంతే తే ఏతాం మదీయాం గుణమయీం మాయాం తరంతి” (శ్రీరామానుజః)

(సత్యమైన సంకల్పము గలవాడను, మిక్కిలి దయగలవాడను, సమస్త లోకమునకు శరణము పొందదగినవాడను అయిన నన్ను - భగవంతుని - శరణు పొందినవాడు సత్వరజస్తమోమయమైన నా మాయను తరింతురు).

  1. “మహతః పరమవ్యక్తం అవ్యక్తాత్పురుషః పరః |

పరమేశ్వరా ధీనా త్వియమస్మాభిః ప్రాగవస్తా జగతో (అ)భ్యుపగమ్యతే; |

న స్వతంత్రా, న తయావినా పరమేశ్వరస్య సస్టృత్వం సిద్ధతి. శక్తి రహితస్య తస్య ప్రవృ ప్రవృత్యనుప పత్తేః కుతః? విద్యయా తస్యా బీజశక్తిర్దాహాత్ - అవిద్యాత్మి కాహి సా బీజశక్తి రవ్యక్త శబ్ద నిర్దేశ్యా పరమేశ్వరాశ్రయా మాయా మయీ మహా సుషిప్తిః యస్యాం స్వరూప ప్రతిబోధరహితాశ్శేరతే సంసారిణో జీవాః “. ( శ్రీశంకరః - బ్రహ్మసూత్రభాష్యే - 1 - 4 - 3)

(“మహత్తత్వముకంటె ఉత్కృష్టమైనది అవ్యక్తము. అవ్యక్తముకంటె పురుషుడు - పరమపురుషుడు, భగవంతుడు - ఉత్కృష్టమైనవాడు” అని చెప్పబడినది. మా అభిప్రాయములో జగత్తు పుట్టక ముందుండు జగత్తుయొక్క అవస్థయే అవ్యక్తము. ఇది స్వతంత్రమైనదికాదు. పరమేశ్వరుని ఆధీనములోనుండునది. ఈ అవ్యక్తము లేనిదే పరమేశ్వరునకు సృష్టిచేయు శక్తిలేదు - శక్తిలేని పరమేశ్వరుడు సృష్టించుట ఎట్లు? ముక్తులైనవారు తిరిగి పుట్టుట ఎట్లు? విద్యవలన అవ్యక్తము యొక్క బీజశక్తి - మరల జన్మ కలుగచేయు శక్తి - దహించుకొనిపోయినందున - నశించిపోయినందున - అవిద్య (లేక, అజ్ఞానము అను ఆ బీజ శక్తియే అవ్యక్తమను పేరుతో చెప్పబడుచు పరమేశ్వరునాశ్రయించియున్న మాయామయమైన సుషుప్తి. ఈ సుషుప్తిలో - మాయామయమైన అవ్యక్తములో బ్రహ్మజ్ఞానము కోలుపోయి జీవులు సంసారములో ఈదుకొనుచుందురు).

  1. “సర్వ ధర్మాన్ పరిత్యజ్య మామేవ మాయావినం స్వాత్మభూతం సర్వాత్మనా యే ప్రపద్యంతే, తే మాయాం సర్వభూత మోహినీం తరంతి, అతి క్రామంతి - తే సంసార బంధనాత్ ముచ్యంతే ఇత్యర్థః”. (శ్రీశంకరః)

(సమస్తమైన ధర్మములను వదలివేసి మాయతో కూడినటువంటిన్నీ తన ఆత్మయే అయినటువంటిన్నీ నన్ను (భగవంతుని) ఎవరు భజింతురో (శరణు చొచ్చెదరో, వారు సర్వభూతములను మోహింపచేయునట్టి మాయను తరింతురు - దాటుదురు, అతిక్రమించుదురు - అనగా, సంసారబంధమునుండి ముక్తిని పొందుదురు).

  1. “స్వరూప జ్ఞానేనవినా మాయా నశామ్యతి, స్వరూప జ్ఞానే సతి తస్మిన్ విలీనా భవతి - ఇతి సర్వ వేదాంత నిశ్చయః”-

(స్వరూపజ్ఞానము లేనిదే - తానే భగవంతుడు అను జ్ఞానము కలుగ నంతవఱకు మాయ శిమించదు, నశించదు. స్వరూపజ్ఞానము కలుగగానే మాయ దానిలో విలీనమగును - అని ఉపనిషత్తులన్నియు బోధించు సారాంశము).

  1. కస్తరతి, కస్తరతి మాయాం? - యః సంగం త్యజతి, యో మహాను భావం సేవతే, యే లోక బంధమున్మూలయతి, నిస్త్రై గుణ్యో భవతి, యోగ క్షేమం త్యజతి, యః కర్మఫలం త్యజతి, కర్మాణి సన్యస్యతి, తతో నిర్ద్వంద్వో భవతి, యో వేదానపి సన్యస్యతి, కేవల మవిచ్ఛిన్నానురాగం లభతే, సతరతి, తరతి, సలోకాంస్తార యిష్యతి. (నారదభక్తిసూత్రములు - 46 to 50)

(మాయను ఎవరు తరించగలరు? ఎవడు దేనియందైనను ఆశ విడిచిపెట్టునో, ఎవడు మాహానుభావులను సేవించునో, ఎవనికి మమకారములేదో, ఎవడు నిర్జనప్రదేశములందుండునో, ఎవడు లోకముతో సంబంధము విడిచివేయునో, త్రిగుణముల స్వాధీనములో లేకుండునో, యోగ క్షేమమును విడిచి పెట్టునో, ఎవడు కర్మఫలమును విడిచిపెట్టునో (ఆశించకయుండునో), శీతోష్ణములు, కష్టసుఖములు మొదలగు ద్వంద్వములను లక్ష్యము చేయడో, ఎవడు వేదములను కూడ విడిచిపెట్టునో అట్టివాడు భగవంతుని మాయను తరించును, లోకములోని ప్రజలను కూడ తరింపచేయును -).

  1. “యథా తమో నాశయితుం నద్వితీయం తమః సమర్థం భవేత్, కింతు, భానుప్రభా, చంద్రప్రభా, విద్యుత్ప్రభా, వహ్ని ప్రభా ఏవ సమర్థా, తథా మాయాంధకారనాళే మాయాంధకారరూపా మాయా మయా హరిహరాదయః న మాయాం నాశయితుం సమర్థాః, కింతు స్వప్రకాశ సంవిద్రూపిణ్యేవ భగవతీ”.

(తమస్సును - అంధకారమును, చీకటిని - నశింపచేయుటకు మఱియొక తమస్సు సమర్థముకాదు, సూర్యకాంతికాని, చంద్రకాంతి కాని, మెరుపుకాంతి కాని లేక అగ్నికాంతికాని సమర్థమగును. అట్లే, మాయ యను అంధకారమును నశింపచేయుటకు మాయాంధకారరూపములు, మాయామయములు అయిన విష్ణువు, శివుడు మొదలగువారు సమర్థులుకారు - స్వయంప్రకాశరూపము - తనంతట తానే ప్రకాశించునది - అయిన సంవిద్రూపముగల శ్రీదేవియే సమర్థురాలు).

  1. “యధా రజ్జు సర్పో హరిహరాది దేవతారాధనేన, తదనుగ్రహేణ, అశ్వమేథాది కర్మణా వా, న కదాచిదపి నశ్యతి. కింతు అధిష్టాన భూత రజ్జు జ్ఞానాదేవ, తథా రజ్జు సర్వవత్ భాసమానాయాః మాయాయా న హరిహరాద్యుపాసన యా నాశో, న, వాశ్వమేథాది కర్మభిర్నాశః, కింతు మాయాధిష్టాన భూత సందిద్రూప భగవత్తాధనాను భలేనా ఏవ”.

(చీకటిలో త్రాడు చూచి పాము అని భ్రాంతి - అజ్ఞానము - శ్రీ విష్ణువుని, శివుని ఆరాధించుటచేతగాని, వారి అనుగ్రహముచేతగాని, అశ్వమేధము మొదలగు యజ్ఞములచేతగాని నశించదు. ఆ భ్రాంతికి అసలు కారణమైన అజ్ఞానము - పోయి ఇది పాముకాదు, త్రాడే అను జ్ఞానము కలుగుటవలననే నశించును. ఆ ప్రకారముగానే త్రాడు పాము వలె కనబడినట్లే, మాయ విష్ణువు పరమేశ్వరుడు మొదలగువారిని ఉపాసించుటవలన నశించదు, అశ్వమేధము మొదలగు కర్మలవలనను నశించదు - కాని మాయకు అధిష్టానమైనదిన్నీ, సంవిద్రూపమైనదిన్నీ అయిన శ్రీమద్భగవతి - దేవీ - యొక్క ఆరాధనవలననే నశించును).

  1. “చ. ఇతరము మాని తన్ను మదినెంతయు నమ్మి భజించువారి నా

శ్రిత జనసేవితాంఘ్ర సరసీరుహుడైన సరోజనాభుడం

చిత దయతోడ నిష్కపట చిత్తమునం గరుణించు నట్టి వా

రతుల దురంతమై తనరు నవ్విభుమాయ తరింతు రెప్పుడున్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 7 - 202)

  1. “మాయాసాగరముత్తర్తుం శ్రీహరేశ్చరణాంబుజం |

పోతభూతం శరణ్యం యేశ్రితాస్తే మోక్షభాగినః |

సాధనం కర్మయోగాది హరిభక్తిమపేక్ష్యతత్ |

ముక్తేః కృష్ణాంఘ్రి భక్తిస్తు నిరుపేక్షక సాధనం |

హరి భక్తిం వినాయద్యత్సాధనం దుష్కరం నృభిః |

క్రియ తే తద్వృథా తస్మాద్ధరిం సర్వాత్మ నాశ్రయేత్ |

మహాపుణ్యఫలం కృష్ణభక్తౌ విశాస ఆదరాత్ |

తద్విహీనస్తు నింద్యంతే పాపినో హరిణా స్వయం |

మత్స్వరూపా పరిజ్ఞానాన్మూఢాః స్యుః భోగలంపటాః |

తతః పాప సమాచారే ప్రవృత్తాః స్యుర్నరాధమాః |

తతోమాయా హృత జ్ఞానాః శాస్త్రేప్యనదికారిణః |

తతస్తేహ్యాసురంభావం ప్రాప్తాః పశ్వాదిభిః సమాః |

మామీశ్వరం సఖాయం స్వం పాపోపహత బుద్ధయః |

శరణ్యం న ప్రపద్యంతే దేహద్యథ్యా సమాశ్రితాః |

న అధికారిణః కృష్ణ చరణాంబుజ సేవనే |

తద్విహీనా నరాకారాః నశుభ్యోప్యధమాః శిఠాః |

మాయయా బాధితం జ్ఞానం యేషాం విషయరాగిణాం |

హింసాది భావనాక్రాంతా గోవిందం నాశ్రయంతితే ||“. (గీతాభావప్రకాశము - 7 - 88 to 97)

(మాయయను సముద్రమును దాటించుటకు శ్రీహరి పాదకమలములు నావ వంటివి, అవియే శరణ్యము, వాటిని ఆశ్రయించినవారు మోక్షమును పొందుదురు. అనగా, మాయను దాటగలుగుదురు. కర్మ యోగము మొదలగు వాటిలో హరిభక్తి ఒక సాధనముగా నున్నది. కాని, ముక్తికి హరిపాదభక్తి ఇంక దేనిని అపేక్షించ కుండనుండు ఓకే సాధనము - హరిభక్తి కాక ముక్తికి ఇంకే సాధనమైనను, ఎంత కష్టముపైన దానిని చేసినను అదంతయు వ్యర్థమే. అంచేత హరిని ముక్తి కొఱకు ఆశ్రయించవలెను. నమ్మకముతోను, శ్రద్ధతోను చేసిన హరిభక్తి గొప్ప పుణ్యఫలము కలది. హరిభక్తి లేనివారు పాపులని శ్రీకృష్ణభగ వానుడు స్వయముగా చెప్పియున్నాడు - వారు భగవత్స్వరూపజ్ఞానము లేకపోవుటవలన మూఢులు, భోగములందు తగుల్కొనువారు, పాపపు పనులు చేయువారు, నరాధములు; అందుచేత మాయచేత జ్ఞానము లేకపోయినట్లు చేయబడినవారు, శాస్త్రములందు అధికారులు కానివారు, అందుచేత వారు ఆసుర భావమును పొందినవారు, పశువులతో సమానమైన వారు, పాపములచేత చెడిన బుద్ధి గలవారు - దేహమే ఆత్మయను అధ్యాస గలవారు - ఈశ్వరుడు సఖుడు అయిన నన్ను శరణు పొందరు - శ్రీకృష్ణుని పాదపద్మములందు భక్తిగలవారు అధికారులు - అది లేనివారు నరాకారముగ నున్నను పశువులకన్న అధములు, శఠులు. విషయములందాసక్తి గలవారి జ్ఞానము మాయచేత కప్పబడియుండును. వారు భగవంతుని ఆశ్రయింపరు - అందుచేత వారు మాయను తరింపలేరు).

Transliteration
  1. bhagavaṃtuni māyanu dāṭuṭa, tariṃcuṭa, māya yokka prabhāvamu tanamīda lēkuṃḍa cēsukonuṭa,

  2. “dēvīhyēṣā guṇamayī mama māyā daratyayā |

māmēva ē prapadyaṃtē māyā mētāṃ taraṃti ||

namāṃ duṣkṛtinō mūḍhāḥ prapadyaṃtē narādhimāḥ |

māya yāpahṛtajñānā āsuraṃ bhāvamāśritāḥ || (śrīmadbhagavadgīta - 7 - 14,15)

“māmēva satya saṃkalpaṃ parama kāruṇikaṃ anālōcita viśēṣā śēṣa lōka śaraṇyaṃ yē śaraṇaṃ prapadyaṃtē tē ētāṃ madīyāṃ guṇamayīṃ māyāṃ taraṃti” (śrīrāmānujaḥ)

(satyamaina saṃkalpamu galavāḍanu, mikkili dayagalavāḍanu, samasta lōkamunaku śaraṇamu poṃdadaginavāḍanu ayina nannu - bhagavaṃtuni - śaraṇu poṃdinavāḍu satvarajastamōmayamaina nā māyanu tariṃturu).

  1. “mahataḥ paramavyaktaṃ avyaktātpuruṣaḥ paraḥ |

paramēśvarā dhīnā tviyamasmābhiḥ prāgavastā jagatō (a)bhyupagamyatē; |

na svataṃtrā, na tayāvinā paramēśvarasya sasṭṛtvaṃ siddhati. śakti rahitasya tasya pravṛ pravṛtyanupa pattēḥ kutaḥ? vidyayā tasyā bījaśaktirdāhāt - avidyātmi kāhi sā bījaśakti ravyakta śabda nirdēśyā paramēśvarāśrayā māyā mayī mahā suṣiptiḥ yasyāṃ svarūpa pratibōdharahitāśśēratē saṃsāriṇō jīvāḥ “. ( śrīśaṃkaraḥ - brahmasūtrabhāṣyē - 1 - 4 - 3)

(“mahattatvamukaṃṭe utkṛṣṭamainadi avyaktamu. avyaktamukaṃṭe puruṣuḍu - paramapuruṣuḍu, bhagavaṃtuḍu - utkṛṣṭamainavāḍu” ani ceppabaḍinadi. mā abhiprāyamulō jagattu puṭṭaka muṃduṃḍu jagattuyokka avasthayē avyaktamu. idi svataṃtramainadikādu. paramēśvaruni ādhīnamulōnuṃḍunadi. ī avyaktamu lēnidē paramēśvarunaku sṛṣṭicēyu śaktilēdu - śaktilēni paramēśvaruḍu sṛṣṭiṃcuṭa eṭlu? muktulainavāru tirigi puṭṭuṭa eṭlu? vidyavalana avyaktamu yokka bījaśakti - marala janma kalugacēyu śakti - dahiṃcukonipōyinaṃduna - naśiṃcipōyinaṃduna - avidya (lēka, ajñānamu anu ā bīja śaktiyē avyaktamanu pērutō ceppabaḍucu paramēśvarunāśrayiṃciyunna māyāmayamaina suṣupti. ī suṣuptilō - māyāmayamaina avyaktamulō brahmajñānamu kōlupōyi jīvulu saṃsāramulō īdukonucuṃduru).

  1. “sarva dharmān parityajya māmēva māyāvinaṃ svātmabhūtaṃ sarvātmanā yē prapadyaṃtē, tē māyāṃ sarvabhūta mōhinīṃ taraṃti, ati krāmaṃti - tē saṃsāra baṃdhanāt mucyaṃtē ityarthaḥ”. (śrīśaṃkaraḥ)

(samastamaina dharmamulanu vadalivēsi māyatō kūḍinaṭuvaṃṭinnī tana ātmayē ayinaṭuvaṃṭinnī nannu (bhagavaṃtuni) evaru bhajiṃturō (śaraṇu coccedarō, vāru sarvabhūtamulanu mōhiṃpacēyunaṭṭi māyanu tariṃturu - dāṭuduru, atikramiṃcuduru - anagā, saṃsārabaṃdhamunuṃḍi muktini poṃduduru).

  1. “svarūpa jñānēnavinā māyā naśāmyati, svarūpa jñānē sati tasmin vilīnā bhavati - iti sarva vēdāṃta niścayaḥ”-

(svarūpajñānamu lēnidē - tānē bhagavaṃtuḍu anu jñānamu kaluga naṃtavaṟaku māya śimiṃcadu, naśiṃcadu. svarūpajñānamu kalugagānē māya dānilō vilīnamagunu - ani upaniṣattulanniyu bōdhiṃcu sārāṃśamu).

  1. kastarati, kastarati māyāṃ? - yaḥ saṃgaṃ tyajati, yō mahānu bhāvaṃ sēvatē, yē lōka baṃdhamunmūlayati, nistrai guṇyō bhavati, yōga kṣēmaṃ tyajati, yaḥ karmaphalaṃ tyajati, karmāṇi sanyasyati, tatō nirdvaṃdvō bhavati, yō vēdānapi sanyasyati, kēvala mavicchinnānurāgaṃ labhatē, satarati, tarati, salōkāṃstāra yiṣyati. (nāradabhaktisūtramulu - 46 to 50)

(māyanu evaru tariṃcagalaru? evaḍu dēniyaṃdainanu āśa viḍicipeṭṭunō, evaḍu māhānubhāvulanu sēviṃcunō, evaniki mamakāramulēdō, evaḍu nirjanapradēśamulaṃduṃḍunō, evaḍu lōkamutō saṃbaṃdhamu viḍicivēyunō, triguṇamula svādhīnamulō lēkuṃḍunō, yōga kṣēmamunu viḍici peṭṭunō, evaḍu karmaphalamunu viḍicipeṭṭunō (āśiṃcakayuṃḍunō), śītōṣṇamulu, kaṣṭasukhamulu modalagu dvaṃdvamulanu lakṣyamu cēyaḍō, evaḍu vēdamulanu kūḍa viḍicipeṭṭunō aṭṭivāḍu bhagavaṃtuni māyanu tariṃcunu, lōkamulōni prajalanu kūḍa tariṃpacēyunu -).

  1. “yathā tamō nāśayituṃ nadvitīyaṃ tamaḥ samarthaṃ bhavēt, kiṃtu, bhānuprabhā, caṃdraprabhā, vidyutprabhā, vahni prabhā ēva samarthā, tathā māyāṃdhakāranāḷē māyāṃdhakārarūpā māyā mayā hariharādayaḥ na māyāṃ nāśayituṃ samarthāḥ, kiṃtu svaprakāśa saṃvidrūpiṇyēva bhagavatī”.

(tamassunu - aṃdhakāramunu, cīkaṭini - naśiṃpacēyuṭaku maṟiyoka tamassu samarthamukādu, sūryakāṃtikāni, caṃdrakāṃti kāni, merupukāṃti kāni lēka agnikāṃtikāni samarthamagunu. aṭlē, māya yanu aṃdhakāramunu naśiṃpacēyuṭaku māyāṃdhakārarūpamulu, māyāmayamulu ayina viṣṇuvu, śivuḍu modalaguvāru samarthulukāru - svayaṃprakāśarūpamu - tanaṃtaṭa tānē prakāśiṃcunadi - ayina saṃvidrūpamugala śrīdēviyē samarthurālu).

  1. “yadhā rajju sarpō hariharādi dēvatārādhanēna, tadanugrahēṇa, aśvamēthādi karmaṇā vā, na kadācidapi naśyati. kiṃtu adhiṣṭāna bhūta rajju jñānādēva, tathā rajju sarvavat bhāsamānāyāḥ māyāyā na hariharādyupāsana yā nāśō, na, vāśvamēthādi karmabhirnāśaḥ, kiṃtu māyādhiṣṭāna bhūta saṃdidrūpa bhagavattādhanānu bhalēnā ēva”.

(cīkaṭilō trāḍu cūci pāmu ani bhrāṃti - ajñānamu - śrī viṣṇuvuni, śivuni ārādhiṃcuṭacētagāni, vāri anugrahamucētagāni, aśvamēdhamu modalagu yajñamulacētagāni naśiṃcadu. ā bhrāṃtiki asalu kāraṇamaina ajñānamu - pōyi idi pāmukādu, trāḍē anu jñānamu kaluguṭavalananē naśiṃcunu. ā prakāramugānē trāḍu pāmu vale kanabaḍinaṭlē, māya viṣṇuvu paramēśvaruḍu modalaguvārini upāsiṃcuṭavalana naśiṃcadu, aśvamēdhamu modalagu karmalavalananu naśiṃcadu - kāni māyaku adhiṣṭānamainadinnī, saṃvidrūpamainadinnī ayina śrīmadbhagavati - dēvī - yokka ārādhanavalananē naśiṃcunu).

  1. “ca. itaramu māni tannu madineṃtayu nammi bhajiṃcuvāri nā

śrita janasēvitāṃghra sarasīruhuḍaina sarōjanābhuḍaṃ

cita dayatōḍa niṣkapaṭa cittamunaṃ garuṇiṃcu naṭṭi vā

ratula duraṃtamai tanaru navvibhumāya tariṃtu reppuḍun”. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 7 - 202)

  1. “māyāsāgaramuttartuṃ śrīharēścaraṇāṃbujaṃ |

pōtabhūtaṃ śaraṇyaṃ yēśritāstē mōkṣabhāginaḥ |

sādhanaṃ karmayōgādi haribhaktimapēkṣyatat |

muktēḥ kṛṣṇāṃghri bhaktistu nirupēkṣaka sādhanaṃ |

hari bhaktiṃ vināyadyatsādhanaṃ duṣkaraṃ nṛbhiḥ |

kriya tē tadvṛthā tasmāddhariṃ sarvātma nāśrayēt |

mahāpuṇyaphalaṃ kṛṣṇabhaktau viśāsa ādarāt |

tadvihīnastu niṃdyaṃtē pāpinō hariṇā svayaṃ |

matsvarūpā parijñānānmūḍhāḥ syuḥ bhōgalaṃpaṭāḥ |

tataḥ pāpa samācārē pravṛttāḥ syurnarādhamāḥ |

tatōmāyā hṛta jñānāḥ śāstrēpyanadikāriṇaḥ |

tatastēhyāsuraṃbhāvaṃ prāptāḥ paśvādibhiḥ samāḥ |

māmīśvaraṃ sakhāyaṃ svaṃ pāpōpahata buddhayaḥ |

śaraṇyaṃ na prapadyaṃtē dēhadyathyā samāśritāḥ |

na adhikāriṇaḥ kṛṣṇa caraṇāṃbuja sēvanē |

tadvihīnā narākārāḥ naśubhyōpyadhamāḥ śiṭhāḥ |

māyayā bādhitaṃ jñānaṃ yēṣāṃ viṣayarāgiṇāṃ |

hiṃsādi bhāvanākrāṃtā gōviṃdaṃ nāśrayaṃtitē ||“. (gītābhāvaprakāśamu - 7 - 88 to 97)

(māyayanu samudramunu dāṭiṃcuṭaku śrīhari pādakamalamulu nāva vaṃṭivi, aviyē śaraṇyamu, vāṭini āśrayiṃcinavāru mōkṣamunu poṃduduru. anagā, māyanu dāṭagaluguduru. karma yōgamu modalagu vāṭilō haribhakti oka sādhanamugā nunnadi. kāni, muktiki haripādabhakti iṃka dēnini apēkṣiṃca kuṃḍanuṃḍu ōkē sādhanamu - haribhakti kāka muktiki iṃkē sādhanamainanu, eṃta kaṣṭamupaina dānini cēsinanu adaṃtayu vyarthamē. aṃcēta harini mukti koṟaku āśrayiṃcavalenu. nammakamutōnu, śraddhatōnu cēsina haribhakti goppa puṇyaphalamu kaladi. haribhakti lēnivāru pāpulani śrīkṛṣṇabhaga vānuḍu svayamugā ceppiyunnāḍu - vāru bhagavatsvarūpajñānamu lēkapōvuṭavalana mūḍhulu, bhōgamulaṃdu tagulkonuvāru, pāpapu panulu cēyuvāru, narādhamulu; aṃducēta māyacēta jñānamu lēkapōyinaṭlu cēyabaḍinavāru, śāstramulaṃdu adhikārulu kānivāru, aṃducēta vāru āsura bhāvamunu poṃdinavāru, paśuvulatō samānamaina vāru, pāpamulacēta ceḍina buddhi galavāru - dēhamē ātmayanu adhyāsa galavāru - īśvaruḍu sakhuḍu ayina nannu śaraṇu poṃdaru - śrīkṛṣṇuni pādapadmamulaṃdu bhaktigalavāru adhikārulu - adi lēnivāru narākāramuga nunnanu paśuvulakanna adhamulu, śaṭhulu. viṣayamulaṃdāsakti galavāri jñānamu māyacēta kappabaḍiyuṃḍunu. vāru bhagavaṃtuni āśrayiṃparu - aṃducēta vāru māyanu tariṃpalēru).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.