← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మాయావి māyāvi

Original — తెలుగు
  1. మాయా అస్యాస్తీతి మాయవీం మాయావాన్. (మాయకలవాడు).

  2. మాయావేది (మాయను తెలిసినవాడు)

  3. కపట యుక్తః వంచకః - (కపటము కలవాడు, వంచన చేయువాడు).

  4. మాయా చిచ్ఛక్తిః, సా అయాస్తీతి మాయావీ -

(మాయ అనగా చిచ్ఛక్తి - చైతన్య శక్తి. చైతన్య శక్తి కలవాడు)

  1. ఈశత్వేన య ఉక్తః స మాయీ, మాయావచ్ఛిన్నః, మాయాధిష్ఠాతా మహేశ్వరః.

(ఈశుడు అని చెప్పబడువాడు - ప్రభువైనవాడు - మాయీ, మాయచేత కప్పబడినవాడు, మాయను అధిష్టించియుండువాడు - మహేశ్వరుడు).

  1. ప్రకృతిం స్వామనిర్వాచ్యాం మాయాం స్వస్మిన్ ప్రకల్పితాం |

స్వ సత్తాస్ఫూర్తిదానేన దృఢీకృత్యాహమీశ్వరః |

మాయాయాః ప్రకృతేస్తస్యాః ప్రభావదిఖిలం జగత్ |

స్వా విద్యాది పరాధీనం ప్రమాణైః సన్నిధాపి తం |

భూత భౌతిక సంఘంచ మాయావీవ పునః పునః |

వివిధం స్వప్న దృగ్వచ్చ సంకల్పేన సృజామ్యహం“. (గీతాభావప్రకాశము - 9 - 60, 61)

(అనిర్వచనీయమైనదిన్నీ, నా యందే కల్పించబడినదిన్నీ, ప్రకృతి అని చెప్పబడు మాయను నా సత్తాస్ఫూర్తిని దానిలోనుంచి, ఆ మాయా ప్రభావము వలన మాయవి వలె - ఇంద్రజాలికునివలె - అనేక విధములైన ఈ భూతములను, వాటినుండి సమస్తవస్తువులను, నేను, మరల మరల సృష్టించుచున్నాను - అందుచేత నేను మాయావి).

Transliteration
  1. māyā asyāstīti māyavīṃ māyāvān. (māyakalavāḍu).

  2. māyāvēdi (māyanu telisinavāḍu)

  3. kapaṭa yuktaḥ vaṃcakaḥ - (kapaṭamu kalavāḍu, vaṃcana cēyuvāḍu).

  4. māyā cicchaktiḥ, sā ayāstīti māyāvī -

(māya anagā cicchakti - caitanya śakti. caitanya śakti kalavāḍu)

  1. īśatvēna ya uktaḥ sa māyī, māyāvacchinnaḥ, māyādhiṣṭhātā mahēśvaraḥ.

(īśuḍu ani ceppabaḍuvāḍu - prabhuvainavāḍu - māyī, māyacēta kappabaḍinavāḍu, māyanu adhiṣṭiṃciyuṃḍuvāḍu - mahēśvaruḍu).

  1. prakṛtiṃ svāmanirvācyāṃ māyāṃ svasmin prakalpitāṃ |

sva sattāsphūrtidānēna dṛḍhīkṛtyāhamīśvaraḥ |

māyāyāḥ prakṛtēstasyāḥ prabhāvadikhilaṃ jagat |

svā vidyādi parādhīnaṃ pramāṇaiḥ sannidhāpi taṃ |

bhūta bhautika saṃghaṃca māyāvīva punaḥ punaḥ |

vividhaṃ svapna dṛgvacca saṃkalpēna sṛjāmyahaṃ”. (gītābhāvaprakāśamu - 9 - 60, 61)

(anirvacanīyamainadinnī, nā yaṃdē kalpiṃcabaḍinadinnī, prakṛti ani ceppabaḍu māyanu nā sattāsphūrtini dānilōnuṃci, ā māyā prabhāvamu valana māyavi vale - iṃdrajālikunivale - anēka vidhamulaina ī bhūtamulanu, vāṭinuṃḍi samastavastuvulanu, nēnu, marala marala sṛṣṭiṃcucunnānu - aṃducēta nēnu māyāvi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.